Search
  • Follow NativePlanet
Share
» »అంబాలా - ట్విన్ సిటీ అందాలు !!

అంబాలా - ట్విన్ సిటీ అందాలు !!

అంబాలా హర్యానా పర్యాటక రంగంలో గుర్తింపు తెచ్చుకున్న ఒక ప్రదేశం. ఇది హర్యానా రాష్ట్రంలో ఒక జిల్లాగా ఉన్నది. ఇక్కడ ప్రవహించే నదులలో ప్రముఖంగా చెప్పుకోవలసినవి గంగా మరియు సింధూ నదులు.

By Mohammad

అంబాలా హర్యానా పర్యాటక రంగంలో గుర్తింపు తెచ్చుకున్న ఒక చక్కటి ప్రదేశం. ఇది హర్యానా రాష్ట్రంలో ఒక జిల్లాగా, కంటోల్మెంట్ గా ఉన్నది. ఇక్కడ ప్రవహించే నదులలో ప్రముఖంగా చెప్పుకోవలసినవి గంగా మరియు సింధూ నదులు. ఇవి రెండూ జీవనదులే. ఈ ప్రదేశం పంజాబ్ మరియు హర్యానా సరిహద్దు ప్రాంతం కాబట్టి ఇక్కడ పర్యటన సాహసమే అనే చెప్పుకోవాలి. అలా అని ఇక్కడ చీటికీ మాటికీ గొడవలు ఉంటాయా ? అంటే ఉండదనే చెప్పాలి. అంబాలా పట్టణము చాలా ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. అన్ని మతాల వారు వారి వారి రోజువారీ దినచర్యలను ఎటువంటి ఆటంకం లేకుండా ముగించుకుంటారు.

ఇక్కడ పర్యాటక ప్రదేశాలు చూడాలంటే మీరేం మిలిటరీ అనుమతి తీసుకోవలసిన అవసరం లేదు. ఈ ప్రదేశంలో ప్రధాన ఆకర్షణ భవానీ అంబా దేవాలయం. ఆమె పేరు మీదనే ఈ నగరానికి ఆపేరు పెట్టారు. ఈ నగరంలో చూడవలసినవి కొన్నే అయినప్పటికీ సందర్శనకు విలువ ఉండే ప్రదేశాలలో ఒకటిగా చెప్పుకోవచ్చు. అంబాలా కంటోన్మెంట్ నుండి కేవలం 3 km దూరంలో ఉన్నది.

అంబాలా నగరంలోని ఆలయం

అంబాలా నగరంలోని ఆలయం

చిత్రకృప : Manojkhurana

నగరంలో ఇతర ఆకర్షణలుగా బాద్షా బాగ్ గురుద్వారా, సిస్ గంజ్ గురుద్వారా, లాఖీ షా & తక్వాల్ షా, సెయింట్ పాల్ చర్చి మరియు మాతా మందిర్ కాళి ఉన్నాయి.

భవానీ అంబా ఆలయం

అంబాలాలో భవానీ అంబా ఆలయం ప్రధాన ఆకర్షణలలో ఒకటిగా ఉంది. నగరంనకు ఈ ఆలయంలో ఉన్న అంబా దేవత నుండి పేరు వచ్చిందని నమ్ముతారు. ఈ పురాతన ఆలయంను నగరంలో ఒక ప్రధాన యాత్రా కేంద్రంగా పరిగణిస్తారు. అంబాలాలో ఇతర ఆకర్షణలుగా మాతా మందిర్ కాళి,గురుద్వారా శ్రీ మంజీ సాహిబ్,సెయింట్ పాల్ చర్చి మరియు బాద్షాహీ బాగ్ గురుద్వారా ఉన్నాయి.

గురుద్వారా

గురుద్వారా

చిత్రకృప : Abhi abhinav bakshi

బాద్షాహీ బాగ్ గురుద్వారా

బాద్షాహీ బాగ్ గురుద్వారా అంబాలా జిల్లా కోర్ట్ వెనుక ఉన్నది. ఈ నిర్మాణం 10 వ గురువు గురు గోబింద్ జీ సందర్శన జ్ఞాపకార్ధం నిర్మించారు. గురువు లఖ్నూర్ విహారయాత్ర సందర్భంగా ఈ నగరంను సందర్శించారు.

అంబాలాలో మార్కెట్లు

అంబాలా లో అన్వేషించటానికి విలువైన మరో ప్రాంతం క్లాత్ మార్కెట్. ఇక్కడ అన్ని రకాల వస్త్రాలను టోకు ధరకే విక్రయిస్తుంటారు. చేనేత వస్త్రాలు మరియు పట్టు నుండి సూట్లను మరియు ఇతర మెటీరియల్ తో చేసిన వస్త్రాలు విక్రయించే మార్కెట్ లు సుమారు 1000 వరకు ఉన్నాయి. అంబాలాలో కూడా అన్ని రకాల శాస్త్రీయ మరియు శస్త్రచికిత్సా పరికరాలు అందుబాటులో ఉన్న ఒక సైన్స్ మార్కెట్ ఉంది. అందువల్ల ఈ నగరంను 'సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ నగరం' అని కూడా అంటారు. అంతేకాక అంబాలా నగరం నేత వస్త్రాలు మరియు బంగారు నగల కోసం కూడా ప్రాచుర్యం పొందింది.

అంబాలా సరస్సు

అంబాలా సరస్సు

చిత్రకృప : Kailash Mohankar

అంబాలా ప్రాంత సందర్శనకు ఉత్తమ సమయం : అంబాలా నగరంను అక్టోబర్ మరియు మర్చి మాసాలలో సందర్శించవచ్చు. ఆ సమయంలో ఈ ప్రాంత సందర్శన ఆహ్లాదకరంగా ఉంటుంది. పర్యాటకులు ఆనందించవచ్చు.

ఇది కూడా చదవండి : పంచకుల - పర్యాటకులకు విశ్రాంతి కేంద్రం !!

అంబాలా ఎలా చేరుకోవాలి ?

రోడ్డు మార్గం

అంబాలా ఢిల్లీ, చండీఘర్,అమృత్సర్ మరియు సిమ్లా వంటి పొరుగున ఉన్నఅన్ని ప్రధాన నగరాల నుండి సులభంగా చేరుకోవచ్చు. ప్రైవేట్ బస్సులు కూడా రాష్ట్రంలో సమీపంలోని నగరాలు నుండి అంబాలాకు అందుబాటులో ఉన్నాయి.

రైలు మార్గం

అంబాలా నగరం ఉత్తర రైల్వే జోన్ యొక్క ప్రధాన విభాగం అందువలన రాష్ట్రంలో ఒక ప్రధాన జంక్షన్ గా ఉంది. అంబాలా కంటోల్మెట్ రైల్వే హెడ్ భారతదేశం యొక్క పురాతన శిబిరాల్లో ఒకటి. దాని భౌగోళిక స్థానం వల్ల పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ & కాశ్మీర్ రాష్ట్రాల్లో నుండి మరియు చండీగఢ్ కేంద్ర పాలిత ప్రాంతం నుండి సులభంగా చేరవచ్చు.

విమాన మార్గం

అంబాలాలో విమానాశ్రయం లేదు. నగరానికి 40 km దూరంలో సమీప విమానాశ్రయం చండీగఢ్ వద్ద ఉన్నది. చండీగఢ్ విమానాశ్రయం భారతదేశంలో అన్ని ప్రధాన నగరాలకు అనుసందానము కలిగి ఉంటుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X