Search
  • Follow NativePlanet
Share
» »పాలక్కాడ్ - పర్యాటకులకు స్వర్గం !!

పాలక్కాడ్ - పర్యాటకులకు స్వర్గం !!

పాలక్కాడ్ కోటలు, దేవాలయాలు, ఆనకట్టలు, అభయారణ్యాలు, జలపాతాలు, పార్కులు మరియు సుందరమైన ప్రకృతి దృశ్యాలు పర్యాటకుల సందర్శనకు చాలా ఉన్నాయి.

By Mohammad

పర్యాటకులకు ఒక స్వర్గం పాలక్కాడ్. ఇది పశ్చిమ కనుమలలో ప్రవహించే పొన్నా నదికి చేరువలో ఉన్నది. పూర్వం పాలక్కాడ్ ను 'పాలఘాట్' అని పిలిచేవారు. ఇక్కడ వారి అధికంగా పండిస్తారు. కనుకనే పాలక్కాడ్ ను 'కేరళ ధాన్యాగారం' లేదా 'కేరళ రైస్ బౌల్' అని పిలుస్తారు. కేరళలోని మిగితా ప్రదేశాలకన్నా పాలక్కాడ్ ప్రదేశాలు కాస్త బిన్నంగా ఉంటాయి. అవేంటో తెలుసుకొనేముందు పాలక్కాడ్ సంప్రదాయాలు, వాతావరణం ఎలా ఉంటుందో తెలుసుకుందాం !!

అరుదైన సంప్రదాయాలు, ప్రకృతి దృశ్యాలు, అరుదైన సందర్శనా స్థలాలు, ఫెస్టివల్స్ ఉండుటవల్ల దక్షిణ భారతదేశంలో ప్రయాణానికి పాలక్కాడ్ గమ్యస్థానంగా ఉన్నది. దీని సాంస్కృతిక చరిత్రకు రెండు ప్రత్యేకతలు ఉన్నాయి. అవి దేవాలయ ఉత్సవములు మరియు కర్ణాటక సంగీతం లను బాగా సంరక్షించటం. పాలక్కాడ్ దేశవ్యాప్తంగా సంగీత ప్రియులను ఆకర్షిస్తుంది.

పాలక్కాడ్ సమీపంలో మలంపుజ్హ తప్పక చూడదగినది. ఇది పాలక్కాడ్ కు 14 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. మలంపుజ్హ లో పర్యాటక ఆకర్షణల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

పాలక్కాడ్ కోటలు, దేవాలయాలు, ఆనకట్టలు, అభయారణ్యాలు, జలపాతాలు, పార్కులు మరియు సుందరమైన ప్రకృతి దృశ్యాలు పర్యాటకుల సందర్శనకు చాలా ఉన్నాయి. పాలక్కాడ్ ఫోర్ట్ మరియు జైన దేవాలయం ప్రముఖ చారిత్రక ఆసక్తి ఉన్నవారు మరియు సంవత్సరం పొడవునా పర్యాటకులు వస్తారు.

కలపతి ఆలయం, పాలక్కాడ్

కలపతి ఆలయం, పాలక్కాడ్

పాలక్కాడ్ పట్టణ శివార్లలోని కలపతి గ్రామంలో గల కలపతి ఆలయంలో విశ్వనాథ స్వామి కొలువైఉన్నాడు. క్రీ. శ. 1425 వ సంవత్సరం లో నిర్మించిన కలపతి ఆలయం కేరళ రాష్ట్రంలో ఉన్న పురాతన ఆలయాలలో ఒకటిగా చెప్పుకోవచ్చు.

చిత్ర కృప : Nabeelktd

కలపతి ఆలయం

కలపతి ఆలయం

కేరళ ప్రఖ్యాత ఉత్సవాలలో కలపతి రథోత్సవం ఒకటి. నవంబర్ - డిసెంబర్ మాసాల మధ్యలో జరిగే ఈ రథోత్సవానికి దేశ, విదేశాల నుండి భక్తులు, పర్యాటకులు తరలివస్తుంటారు.

చిత్ర కృప : Krish9

జైన దేవాలయం

జైన దేవాలయం

పాలక్కాడ్ సమీపంలోని జైన్మేడు అనే సుందర ప్రదేశంలో జైన దేవాలయం ఉన్నది. దేశంలో ఉన్న అన్ని జైన దేవాలయాలలో కెల్లా పురాతనమైనదిగా, జైన సంస్కృతిని, సంప్రదాయాలను మరియు ప్రాముఖ్యతను తెలియజేసేదిగా ఈ దేవాలయం ప్రసిద్ధి చెందినది.

చిత్ర కృప : Shijualex

జైన దేవాలయం

జైన దేవాలయం

జైన దేవాలయాన్ని 500 సంవత్సరాల క్రితం గ్రానైట్ రాళ్లతో నిర్మించినారు. 32 అడుగుల పొడవు, 20 అడుగుల వెడల్పు కలిగిన ఈ ఆలయం జైన సంస్కృతికి నిదర్శనం. చంద్రనాథన్, పద్మావతి , విజయలక్ష్మినాథన్, రషిభ విగ్రహాలతో పాటుగా జైన తీర్థాంకుల విగ్రహాలు ఇక్కడ చూడవచ్చు.

చిత్ర కృప : Shijualex

పాలక్కాడ్ కోట

పాలక్కాడ్ కోట

పాలక్కాడ్ లో ప్రసిద్ధ వారసత్వ భవనంగా ఉన్న పాలక్కాడ్ కోటని టిప్పూసుల్తాన్ కోట అని కూడా పిలుస్తారు. దీనిని అప్పటి మైసూర్ రాజు హైదర్ అలీ పట్టణం నది మధ్యలో కట్టించినాడు. పాలక్కాడ్ కోట ని పట్టణంలోని ఏ ప్రదేశం నుండైనా సులభంగా చేరుకోవచ్చు.

చిత్ర కృప : Ranjithsiji

పాలక్కాడ్ కోట పరిసరాలు

పాలక్కాడ్ కోట పరిసరాలు

పాలక్కాడ్ కోట చుట్టుప్రక్కల పరిసరాలను పరిశీలిస్తే టిప్పూసుల్తాన్ సైన్యం యొక్క జంతువుల పెంపకం కోసం వాడే కోట మైదానం, ఓపెన్ ఆడిటోరియం, ఆలయం లు ఉన్నాయి. ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు తెరిచి ఉండే ఈ కోట కు ఎటువంటి ప్రవేశ రుసుం లేదు కానీ స్టిల్ కెమరాకి రూ. 20 గా, వీడియో కెమరాకి రూ.50 గా ఛార్జీలను వసూలు చేస్తారు.

చిత్ర కృప : Me haridas

కన్జిరపుజ్హ

కన్జిరపుజ్హ

పాలక్కాడ్ లో ఉన్న మరో ప్రధాన ఆకర్షణ కన్జిరపుజ్హ ఆనకట్ట. ఇది వేట్టిలచోల అనే గ్రీన్ ఫారెస్ట్ కి దగ్గరలో ఉన్నది. అన్నట్టు ఈ రిజర్వాయర్ లో అనేక రకాల చేప జాతులు ఉన్నాయి. కన్జిరపుజ్హ ఆనకట్ట పరిసరాలు ఒకరోజు పిక్నిక్ కు, పర్యటన కు అనుకూలమైనవి.

చిత్ర కృప : Lallji

పరంబిక్కులమ్ వన్య ప్రాణుల అభయారణ్యం

పరంబిక్కులమ్ వన్య ప్రాణుల అభయారణ్యం

వన్య ప్రాణుల ఔత్సాహికులకు, ప్రకృతి ప్రేమికులకి ఒక సైట్ సీయింగ్ ప్రదేశం గా పాలక్కాడ్ పరం బిక్కులమ్ వన్యప్రాణుల అభయారణ్యం ఉన్నది. ఇక్కడ రకరకాల వన్య ప్రాణులు చూడవచ్చు. సందర్శకులు క్రూర మృగాలతో పాటుగా సలీమ్ అలీ గ్యాలరీ సందర్శించవచ్చు.

చిత్ర కృప : PP Yoonus

పరంబిక్కులమ్ వన్య ప్రాణుల అభయారణ్యం

పరంబిక్కులమ్ వన్య ప్రాణుల అభయారణ్యం

పరం బిక్కులమ్ వన్య ప్రాణుల అభయారణ్యం లో సాహసాలకు కొదువలేదు. అధికారుల అనుమతితో యాత్రికులు కాలినడకన ట్రెక్కింగ్ చేయవచ్చు. అభయారణ్యంలో బస కోరుకునే పర్యాటకులకు అడవి శిబిరాలు, నైట్ ప్యాకేజీలు, పడవ క్రూయిసెస్ మరియు ట్రీ ఇళ్ళులు అందుబాటులో ఉన్నాయి.

చిత్ర కృప : Ashaanandr

ధోనీ జలపాతాలు

ధోనీ జలపాతాలు

ప్రకృతి అద్భుతాలను అనుభవించాలనుకొనే వారికి ధోనీ జలపాతాలు చాల బాగుంటాయి. ధోనీ జలపాతాలు పాలక్కాడ్ పట్టణానికి 15 కి. మీ. దూరంలో దట్టమైన అభయారణ్యం లో ఉండి చాలా అందంగా ఉన్నాయి. దూరంగా ఉన్న కొండలపైకి ట్రెక్కింగ్ చేసి, జలపాతాలను తాడు మార్గం ద్వారా దాటవచ్చు.

చిత్ర కృప : Abhishek Jacob

ధోనీ జలపాతాలు

ధోనీ జలపాతాలు

ధోనీ జలపాతాలను మరియు దాని పరిసరాలను సందర్శించడానికి రుతుపవనాలు తర్వాత వచ్చే వర్షకాలం, శీతాకాలం అనువైన సమయాలు.ఇక్కడ ఆహరం దొరకటం కష్టం కనుక ప్రయాణీకులకు కావలసిన ఆహారం, నీరు మరియు స్నాక్స్ వెంట తీసుకువెళ్ళటం మంచిది.

ఒట్టపలం

ఒట్టపలం

ఒట్టపలం భారతపుజ్హ నది ఒడ్డున ఉంది. ఈ పట్టణంలో ఒట్టపలం ఒక విశిష్టమైన సంస్కృతి మరియు పూర్వ సంస్కృతి యొక్క ఒక లాంగ్ ట్రయల్ ఉంటుంది.

ఒట్టపలం పట్టణం నుండి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న కిల్లిక్కురుస్సిమంగళం చుట్టూ ప్రక్కల ప్రాంతాలలో ఉన్న ప్రధాన ఆకర్షణల్లో ఒకటి.

చూడవలసినవి : కేరళ కాలమండలం, చినకతూర్ కవు ఆలయం, పరియనంపట్ట ఆలయం కలిగి ఉన్న ఒక ఆలయం మొదలగునవి చుట్టుప్రక్కల చూడవచ్చు.

చిత్రకృప : Sreekanthv

పాలక్కాడ్ ఎలా చేరుకోవాలి ??

పాలక్కాడ్ ఎలా చేరుకోవాలి ??

వాయు మార్గం

పాలక్కాడ్ కు 60 కి.మీ. ల దూరంలో కోయంబత్తూర్ విమానాశ్రయం ఉన్నది. ఇక్కడి నుండి టాక్సీలు పట్టుకొని పాలక్కాడ్ చేరుకోవచ్చు. సమీపంలో కొచ్చి, కాలికట్ అంతర్జాతీయ విమానాశ్రయాలు కూడా ఉన్నాయి.

రైలు మార్గం

పాలక్కాడ్ లో రైల్వే స్టేషన్ ఉన్నది. కేరళ యొక్క ఆన్ని నగరాలతో పాటు ఢిల్లీ, ముంబై, గోవా, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు మరియు కలకత్తా వంటి ప్రధాన నగరాల నుండి పాలక్కాడ్ కు రైళ్ళ సదుపాయం ఉన్నది.

రోడ్డు మార్గం

తమిళనాడు, కేరళ, కర్నాటక రాష్ట్రాలతో పాలక్కాడ్ చక్కని రోడ్డు మార్గాన్ని కలిగి ఉన్నది. తిరువనంతపురం, చెన్నై మరియు బెంగళూరు నగరాల నుండి లగ్జరీ మరియు వోల్వా బస్సు సదుపాయాలు కూడా ఉన్నాయి.

చిత్రకృప : Vu3voc

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X