Search
  • Follow NativePlanet
Share
» »ఈరోడ్ లో చూడవలసిన పర్యాటక ప్రదేశాలు !!

ఈరోడ్ లో చూడవలసిన పర్యాటక ప్రదేశాలు !!

ఆరుద్ర కబలీశ్వర గుడి ఐదు వందల సంవత్సరాల క్రితం నాటిది. ఈ గుడి ఒకే రాయిపై చెక్కబడిన 108 శివలింగాలు తప్పక చూడదగినది. ఇక్కడ దేవత ముఖంపై సూర్యకిరణాలు పడతాయని స్థానికుల నమ్మకం.

By Mohammad

తమిళనాడు లోని ఈరోడ్ ఒక జిల్లాగా ఉన్నది. ఇది చెన్నై మహానగరానికి 400 కి. మీ. ల దూరంలో, కోయంబత్తూర్ కు 100 కిలోమీటర్ల దూరంలో కావేరి నది ఒడ్డున ఉన్నది. చల్లని వాతావరణం తో ప్రశాంతంగా ఉండే ఈ పర్యాటక స్థలాన్ని చూడటానికి తమిళనాడు ప్రజలే కాదు ... కేరళ, కర్నాటక, ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు కూడా ఆసక్తిని కనబరుస్తుంటారు.

ఈరోడ్ అంటే - 'తడి పుర్రెలు' అని అర్థం. మీకు దక్షప్రజాపతి యజ్ఞం గుర్తుందా ! శివుడు అనుమతితో సంబంధంలేకుండా పార్వతి తన తాద్రి చేస్తున్న యాగానికి వెళ్ళ, అక్కడి అవమానాలను భరించలేక అగ్నిలో దూకుతుంది. ఇది గ్రహించిన శివుడు యాగ స్థలానికి వెళ్ళి బ్రహ్మ తో సహ అక్కడ ఉన్నవారిని దండించాడు. ఈ సంఘంటన తరువాత చనిపోయిన ఎముకలను,పుర్రెలను కావేరి నదిలో పడవేశారు. దీంతో అవి ఇప్పటికీ తడిగానే ఉన్నాయని, అందుకే ఈరోడ్ అని పేరుపెట్టారని తెలుస్తోంది.

ఈరోడ్ లో పర్యాటకులు చూసిరావలసిన ప్రదేశాలు కొన్ని ఉన్నాయి. వాటి విషయానికి వస్తే ...

ఆరుద్ర కబలీశ్వర ఆలయం

ఆరుద్ర కబలీశ్వర ఆలయం

ఆరుద్ర కబలీశ్వర గుడి ఐదు వందల సంవత్సరాల క్రితం నాటిది. ఈ గుడి ఒకే రాయిపై చెక్కబడిన 108 శివలింగాలు తప్పక చూడదగినది. ఇక్కడ దేవత ముఖంపై సూర్యకిరణాలు పడతాయని స్థానికుల నమ్మకం. శివరాత్రి ఘనంగా నిర్వహిస్తారు.

చిత్రకృప : Ssriram mt

నటద్రీశ్వర ఆలయం

నటద్రీశ్వర ఆలయం

నటదీశ్వర ఆలయం తమిళనాడు లోని ప్రసిద్ధ ఈరోడ్ పట్టణంలో ఉంది. ఈ ఆలయం కావేరి నది ఒడ్డున ఉండటం వలన హిందువులు దీనిని ఎంతో పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఈ ఆలయం శివునికి చెందినది.

చిత్రకృప : JayakanthanG

మొహమూదియా మసీదు

మొహమూదియా మసీదు

మొహమూదియ మసీదు భారతదేశంలోని ప్రసిద్ధ మసీదులలో ఒకటిగా భావిస్తారు. ఈ మసీదుకి సంబంధించి పెద్ద చరిత్ర ఉంది. ఈ మసీదు నిర్మాణశైలి చాలా నైపుణ్యంతో ఉంటుంది, దాని నాణ్యతా నిర్మాణశైలి ముగల్ నిర్మాణశైలిని ప్రతిబింబిస్తుంది.

చిత్రకృప : RAJUKHAN SR RAJESH

మహిమలిశ్వర్ ఆలయం

మహిమలిశ్వర్ ఆలయం

మహిమలిశ్వర్ ఆలయం ఈరోడ్ టెంపుల్ టౌన్ కి దగ్గరలో ఉంది. ఇది ఈ పట్టణంలోని సెంట్రల్ బస్ స్టాండ్ నుండి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. శివుని విగ్రహం ఉన్న ఈ ఆలయం గొప్ప చారిత్రిక విలువ కలిగినది. శివుడు ఉన్న మాలివరార్ శుభప్రదమైన వాటిలో ఒకటిగా భావిస్తారు.

చిత్రకృప : Ssriram mt

కోడుమూడి

కోడుమూడి

ఈ పట్టణ సగటు ఎత్తు నూట నలభైనాలుగు మీటర్లు. ఈ పట్టణం కైలాస పర్వతాలలో ఒకటని రాష్ట్ర ప్రజలు నమ్ముతారు. ఈ స్థలం కావేరీ నది ఒడ్డున ఉంది.

చిత్రకృప : Ssriram mt

కొడివేరి డాం

కొడివేరి డాం

కొడివేరి డాం తమిళనాడు లోని అతి పెద్ద డాములలో ఒకటి. ఇది ఈరోడ్ జిల్లలో గోపిచేట్టిపాలయంలో ఉంది. దీనిని భవాని నది పై కట్టారు. ఆలయాలకు ప్రసిద్ధి చెందిన ఈరోడ్ పట్టణం నుండి ఇది కేవలం నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది.

చిత్రకృప : Magentic Manifestations

కస్తూరి అరంగనాధార్ ఆలయం

కస్తూరి అరంగనాధార్ ఆలయం

కస్తూరి అరంగనాధార్ ఆలయానికి సంబంధించి పెద్ద చరిత్ర ఉంది. ఈ ఆలయాన్ని ఈరోడ్ పట్టణ ఆలయాల్లో అద్భుతమైన, అత్యంత పవిత్ర ఆలయాలలో ఒకటిగా భావిస్తారు. ఈ ఆలయానికి అనేక ప్రత్యెక లక్షణాలు ఉన్నాయి. ఈ ఆలయంలో కస్తూరి ప్రధాన దేవత.

చిత్రకృప : JayakanthanG

కరదియూర్ వ్యూ పాయింట్

కరదియూర్ వ్యూ పాయింట్

కరదియూర్ వ్యూ పాయింట్ ఈరోడ్ పురపాలక పట్టణంలో ఎనభై మూడు కిలోమీటర్లు ఈశాన్యం వైపు ఉంది. ఇది ప్రకృతి అందాన్ని ఆస్వాదించే వారికి అద్భుతమైన ప్రదేశం. ఈ స్థల సహజ అందం అపారమైనది, ఈ స్థలం అద్భుతంగా, అతను లేదా ఆమె స్వర్గంలో ఉన్నట్లు భావన కలుగుతుంది.

చిత్రకృప : Jai Kumara Yesappa

బన్నారి

బన్నారి

తమిళనాడు లోని ప్రసిద్ధ ఈరోడ్ జిల్లాలో ఉన్న ఒక చిన్న గ్రామం బన్నారి. ఇది సత్యమంగళం పట్టణం నుండి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది కళాత్మక సహజ సౌందర్యం కల్గిన ఒక అందమైన గ్రామ౦. ప్రతి ఏటా రాష్ట్రం నలుమూలల నుండి, ప్రక్క రాష్ట్రాల నుండి కూడా ఈ దేవతను సందర్శించడానికి భక్తులు వస్తారు.

చిత్రకృప : JayakanthanG

భవాని

భవాని

తమిళనాడు లోని ఈరోడ్ జిల్లలో ఉన్న భవాని జిల్లా మొత్తం మీద రెండవ అతి పెద్ద మునిసిపల్ పట్టణ౦. ఇది భవాని, కావేరి నదులు సంగమించే చోట ఉన్నందున స్థానికులు దీనిని ఎంతో పవిత్రమైనదిగా పరిగణిస్తారు. చాలామంది ఈ ప్రాంతాన్ని దక్షిణాది త్రివేణి సంగమంగా పిలుస్తారు.

చిత్రకృప : JayakanthanG

బ్రౌ చర్చ్

బ్రౌ చర్చ్

బ్రౌ చర్చ్ తమిళనాడు రాష్ట్రంలోని పురాతన, ప్రసిద్ధ చర్చ్ లలో ఒకటి. ఈ చర్చ్ నిర్మాణం ఇండో-సరసేనిక్ శైలిని ప్రతిబింబిస్తుంది. ఇది క్రైస్తవులతోపాటు ముస్లిం యాత్రికులను కూడా ఆకర్షిస్తుంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి ప్రతిరోజూ వేలమంది యాత్రీకులు ఈ చర్చ్ ని సందర్శిస్తారు.

చిత్రకృప : Aruna

ప్రభుత్వ మ్యూజియం

ప్రభుత్వ మ్యూజియం

ఈరోడ్ లోని ప్రభుత్వ మ్యూజియంలో, 1987 లో స్థాపించిన ఈ మ్యూజియంలో తమిళనాడు వస్తువులకు సంబంధించిన కళలు, మానవశాస్త్రం, పురవస్తుశాస్త్రంకు సంబంధించినవి ప్రదర్శించబడతాయి, ఈ మ్యూజియం బహుళ ప్రయోజనలలో ఒకటి. ఇది రాష్ట్రం మొత్తం మీద కళలు, సంస్కృతికి అతిపెద్ద నిలయాలలో ఒకటి.

చిత్రకృప : Sameer.udt

ఈరోడ్ ఎలా చేరుకోవాలి ?

ఈరోడ్ ఎలా చేరుకోవాలి ?

రోడ్డు మార్గం : బెంగళూరు, కోయంబత్తూర్, కొచ్చి, చెన్నై, త్రివేండ్రం లాంటి నగరాల నుండి ఈరోడ్ కు ప్రతిరోజూ ప్రభుత్వ/ ప్రవేట్ బస్సులు నడుస్తాయి.

రైలు మార్గం : ఈరోడ్ లో రైల్వే స్టేషన్ ఉన్నది. ఇక్కడ అన్ని సూపర్ ఫాస్ట్ రైళ్లు, ఎక్స్ ప్రెస్ రైళ్లు ఆగుతాయి. చెన్నై, కోయంబత్తూర్ నుండి రైలు సౌకర్యం ఉన్నది.

వాయు మార్గం : కోయంబత్తూర్ సమీప విమానాశ్రయం. ఇది 100 కిలోమీటర్ల దూరంలో కలదు. క్యాబ్ లేదా టాక్సీ లలో ప్రయాణించి ఈరోడ్ సులభంగా చేరుకోవచ్చు.

చిత్రకృప : Rsrikanth05

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X