Search
  • Follow NativePlanet
Share
» »సింహాచలం - పవిత్ర పుణ్య క్షేత్రం !!

సింహాచలం - పవిత్ర పుణ్య క్షేత్రం !!

సింహాచలం, దక్షిణ భారత దేశంలోని ఆంధ్ర ప్రదేశ్ లో కల విశాఖపట్నం నగర గ్రామీణ ప్రాంత పట్టణం. నగరానికి సుమారు 40 కి. మీ. ల దూరం లో ఈ పుణ్య క్షేత్రం కలదు.

ఇక్కడ కల సింహాచలం దేవాలయం హిందువులకు ఒక ప్రసిద్ధ పుణ్య క్షేత్రం. దీనినే సింహాద్రి అని కూడా అంటారు. ఈ దేవాలయంలోని ప్రధాన దైవం శ్రీ మహా విష్ణువు అవతారం అయిన నరసింహ (సగం మనిషి మరియు సగం సింహం). వరాహ లక్ష్మి నరసింహ అవతారంగా కొలుస్తారు.

సింహాచలం

సింహాచలం

ఈ దేవాలయం శిల్ప శైలి ప్రవేశ భాగం ద్రావిడ శైలి కలిగి ఉన్నప్పటికీ ప్రధాన దేవాలయం అంతా కళింగుల శిల్పశైలి కలిగి వుంది. సింహ అంటే సింహం అని ఆద్రి లేదా అచల అంటే కొండ అని తెలుగు భాషలో అర్ధం చెపుతారు.

Photo courtesy :Sureshiras

ప్రహ్లాద రక్షణ

ప్రహ్లాద రక్షణ

ఈ దేవాలయం ఒక కొండ పై భాగంలో వుంటుంది కనుక దీనికి సింహా చలం అనే పేరు వచ్చింది. సింహాచలం దేవాలయాన్ని నరసింహ స్వామి ఎక్కడైతే నిలబడి తన భక్తుడైన ప్రహ్లాదుడిని,రక్షించాడో, ఎక్కడైతే ప్రహ్లాదుడి తండ్రి అయిన హిరణ్య కషిపుడిని సంహరించాడో ఆ ప్రదేశంలో నిర్మించబడిందని చెపుతారు.

photo courtesy: Bornav Raychaudhury

గంధపు పూత

గంధపు పూత

ఈ టెంపుల్ దేశంలో కల పదునెనిమిది నరసింహ క్షేత్రాలలో ఒకటి. ఉగ్ర అవతారమైన ఈ దేవుడిని సంవత్సరం అంతా గంధపు పూతతో అలంకరిస్తారు. అయితే సంవత్సరంలో ఒక రోజు అయిన అక్షయ త్రితీయ నాడు మాత్రం ఒక పన్నెండు గంటల పాటు ఆయన నిజ రూపం దర్శనం గంధపు పూత లేకుండా ప్రదర్శిస్తారు.

Photo courtesy: Adityamadhav83

చందన యాత్ర

చందన యాత్ర

ఇక్కడ 'చందన యాత్ర' లేదా ' చందనోత్సవం' అనే ఉత్సవాన్ని ప్రతి సంవత్సరం వైశాఖ మాశం (మే) లో జరుపుతారు. ఈ దేవాలయం క్రీ. శ. 1098 నాటిదిగా చోళ రాజుల శాసనాలు కలవు.

Photo courtesy: Adityamadhav83

దేవాలయ నిర్వహణ

దేవాలయ నిర్వహణ

సుమారు మూడు శతాబ్దాల నుండి విజయనగరం రాజ వంశీకులైన పూసపాటి గజపతు లు ఈ పవిత్ర దేవాలయానికి ట్రస్టీ లు గా కొనసాగుతున్నారు. వీరు ఈ దేవాలయానికి కొన్ని లక్షల ఎకరాల భూమి కానుకగా ఇచ్చినట్లు చరిత్ర చెపుతోంది.
Photo courtesy: Anirudh Emani

పుష్కరిణి

పుష్కరిణి

దేవాలయ సమీపంలో ఒక పవిత్ర పుష్కరిణి కలదు. భక్తులు దీనిలో పవిత్ర స్నానాలు చేసి స్వామిని దర్శిస్తారు.

Photo courtesy: Anirudh Emani

చుట్టుపక్కలు

చుట్టుపక్కలు

దేవాలయం విజయ సంకేతంగా పడమటి ముఖంలో వుంటుంది. చుట్టూ అనేక జీడి పప్పు తోటలు, మామిడి తోటలు, ఇతర వృక్షాలు కలవు. చాలా మంది భక్తులు పవిత్ర దినాలలో ఇక్కడ గిరి ప్రదక్షిణ కూడా చేస్తారు.

Photo courtesy: Adityamadhav83

ఎలా చేరాలి ?

ఎలా చేరాలి ?

దేశంలోని వివిధ ప్రాంతాల నుండి విమాన, రైలు, బస్సు సౌకర్యాలు విశాఖపట్నం వరకు కలవు. విశాఖపట్నం నుండి బస్సు లు లేదా టాక్సీ లలో సింహాచలం క్షేత్రానికి చేరవచ్చు.

Photo courtesy: Anirudh Emani

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X