Search
  • Follow NativePlanet
Share
» »భారత దేశంలో కొన్ని అందమైన సరస్సులు !!

భారత దేశంలో కొన్ని అందమైన సరస్సులు !!

కేవలం నదులే కాదు, సరస్సులు కూడా నీటితో నిండి మానవ జాతి అవసరాలకు ఎంతో ఉపయోగ పడుతున్నాయి. అసలు ఈ సరస్సులు ఏర్పడటానికి మూలం కొన్ని భూములు పల్లపు ప్రాంతాలు గా వుండి, కాలక్రమేనా, ఎత్తు ప్రదేశాల నీరు లేదా నదీ ప్రవాహాల నీరు వచ్చి అక్కడ చేరటం. లేదా పూర్వ కాలంలో ప్రజల బాగోగులు చూసే రాజులు వారి నీటి అవసరాలకు గాను సరస్సులు తవ్వించి పర్యావరణ సమ తుల్యతలను కూడా కాపాడేవారు. ఇప్పటికి కొన్ని పట్టణాలు, గ్రామాలలో సరస్సుల నీటి ఆధారంగానే జీవనం సాగించే ప్రజలు లేక పోలేదు. భారత దేశంలో లెక్కకు మించిన సంఖ్యలో సరస్సులు కలవు. ఈ సరస్సులు సమాచారం అంతా చిత్రాల ద్వారా సేకరించటం కొంచెం కష్టమే. కనుక మేము కొన్ని ప్రధాన సరస్సుల గురించి చిత్ర సహిత సమాచారాన్ని అందిస్తున్నాం. ప్రియమైన పాటకులారా, ఈ సరస్సుల గురించి మీకు అధికంగా సమాచారం ఉన్నట్లయితే, దయచేసి, సరైన చిత్రాలతో పాటు సంబంధిత సరస్సు వివరణను క్లుప్తంగా వ్రాసి పంప గలరు.

 దాల్ సరోవర్

దాల్ సరోవర్

దాల్ సరోవర్ జమ్మూ మరియు కాశ్మీర్ రాష్ట్రానికి రాజధానిగా పేరుపడ్డ శ్రీనగర్ లో కలదు. అతి సుందరమైన ఈ దాల్ సరస్సు, ఈ రాష్ట్రంలో రెండవ అతి పెద్ద సరస్సు. 'దీనికి 'శ్రీనగర రత్నం', లేదా కాశ్మీర్ కిరీటంలో కలికి తురాయి. అనే బిరుదులతో సన్మానించవచ్చు. రాష్ట్రంలో పర్యాటక రంగంలో ప్రధాన పాత్ర వహిస్తుంది. దీని విస్తీర్ణం 22 చ. కి. మీ. లు. సుమారు 20 అడుగుల లోతు. ఫోటో క్రెడిట్ Vineetmbbs

 సోమారిరి / మారిరి సరసు

సోమారిరి / మారిరి సరసు

అద్భుతమైన ఈ సరస్సు కూడా జమ్మూ మరియు కాశ్మీర్ రాష్ట్రంలోని చాన గాతాంగ్ అంటే (ఉత్తర దిక్కు ప్రదేశం) లో కలదు. భారత దేశంలో అత్యతంత అధిక ఎత్తులో కల ఈ సరస్సు విస్తీర్ణం సుమారు 15,075 చ. అడుగులు ఈ సరస్సు కు హిమాలయాల నీరు, ఇంకా ప్రాంతంలోని చుట్టుపక్కల నీరు వచ్చి ఇందులో చేరుతుంది. ఒకప్పుడు ఈ సరస్సు నీరు దక్షినాదికి కూడా పారేది. ప్రస్తుతం ఆ మార్గం మూసుకు పోయి దీనిలో అనేక లవణాలు ఏర్పడుతున్నాయి.ఫోటో క్రెడిట్ : Jochen Westermann

 పోలార్ సరస్సు

పోలార్ సరస్సు

జమ్మూ మరియు కాశ్మీర్ రాష్ట్రం లోని బండి పూర జిల్లాలో ఆసియా ఖండంలోనే పెద్దదైన సరస్సులలో ఇది ఒకటి. ఇది ఒక స్వచ్చమైన నీటి సరస్సు. ఈ సరస్సు కు జీలం నది నుండి నీరు వచ్చి చేరుతుంది. వర్షాకాల సమయంలో దీని నీటి మట్టం మరింత అధికమవుతుంది. ఈ సరస్సు లోతు 30 అడుగులు కాగా, విస్తీర్ణం 260 చ. కి. మీ. లు గా వుంటుంది. ఇండియా టూరిజం శాఖ, మరియు కాశ్మీర, మరియు కేరళ రాష్ట్ర పర్యాటక శాఖలు ఇక్కడ కొన్ని అడ్వెంచర్ క్రీడలు నిర్వహిస్తున్నాయి. ఫోటో క్రెడిట్ : Maxx786

పంగోంగ్ సరస్సు

పంగోంగ్ సరస్సు

హిమాలయ పర్వతాలలో కల ఈ సరస్సు ఎప్పటికి నీరు కలిగి వుంటుంది. ఈ నీటిలో ఔషధ గుణాలు కూడా ఉంటాయని చెపుతారు. చలికాలం వచ్చిందంటే చాలు, ఈ సరసు నీరు ఘనీభవిస్తుంది. ఫోటో క్రెడిట్ : Amareshwara Sainadh

 శేష నాగ సరస్సు

శేష నాగ సరస్సు

శేష నాగ సరస్సు కాశ్మీర్ రాష్ట్రం లోని అనంత నాగ జిల్లాలో పహల్గాం టవున్ కు 23 కి. మి. ల దూరంలో అమరనాథ్ గుహలకు వెళ్ళే మార్గంలో వుంటుంది. సుమారు 0 .7 కి. మి. లు వెడల్పు 1 .1 కి. మీ.లు పొడవుగల ఈ సరస్సుకు నీరు అనేక ప్రదేశాలనుండి వచ్చి చేరుతుంది. దీనిలో అధిక స్థాయి లో ఆమ్ల గుణాలు వుండి , తాగేందుకు సౌకర్యంగా వుంటుంది. ఫోటో క్రెడిట్ : Akhilesh Dasgupta

 సూరజ్ తాలాబ్ లేదా సూర్యుడి సరస్సు.

సూరజ్ తాలాబ్ లేదా సూర్యుడి సరస్సు.

సూర్య దేముడి పేరు కల ఈ సరస్సు హిమాచల్ ప్రదేశ్ లోని లాహౌల్ మరియు స్పితి ప్రదేశంలో కలదు. ఇక్కడి ప్రజలు దీనిని ఒక పవిత్ర నదిగా భావిస్తారు. ఈ సరస్సుకు నీరు భాగా నది నుండి వచ్చి చేరుతుంది. ఇందులోని నీరు చంద్రా నది లో కలసి, చంద్ర భాగ నది అనే పేరుతో ప్రవహిస్తుంది. శిఖరాలనుంది వచ్చి చేరే మంచు గడ్డల నీరు కూడా దీనికి మూలాధారంగా వుంటుంది. భారత దేశంలో అతి ఎత్తులో కల మూడవ సరస్సు ఇది. ఫోటో క్రెడిట్ :
Ankit Solanki

 దుర్గం చెరువు

దుర్గం చెరువు

దుర్గం చెరువు ఆంధ్ర ప్రదేశ్ లోని రంగా రెడ్డి జిల్లాలో కలదు. హైదరాబాద్ నగరానికి అతి చేరువలో వుంటుంది. ఈ దుర్గం చెరువు హై టెక్ నగర వాసులకు ఒక పర్యాటక ప్రదేశం గా వుంటుంది. కొత్త సంవత్సర వేడుకలు, వీక్ ఎండ్ విహారాలు ఇక్కడ అతి వైభవంగా జరుగుతాయి. ఫోటో క్రెడిట్ : Nishantshah

 చాంద్ బి సరస్సు

చాంద్ బి సరస్సు

చాంద్ బి సరస్సు అస్సాం లో కలదు. గౌహతి నగరానికి ఈ సరస్సు 64 కి. మీ. ల దూరంలో కలదు. స్టేట్ హై వే 37 ద్వారా ప్రయాణించి ఇక్కడకు చేరవచ్చు. ఇక్కడకు వచ్చే అనేక రకాల పక్షి జాతులను చూడవచ్చు. ఇక్కడి వాతావరణం, పరిసరాలు మనసుకి ఉల్లాసం కలిగిస్తాయి. ఫోటో క్రెడిట్ : Saptarshi Chowdhury

 రేణుకా సరస్సు

రేణుకా సరస్సు

రేణుకా సరస్సు హిమాచల ప్రదేశ్ లోని ఒక పెద్ద సరస్సు. సముద్రమట్టానికి సుమారు 672 అడుగుల ఎత్తున కలదు. ఇది సింహౌర్ జిల్లాలో కలదు. ఇక్కడ రేణుకా దేవి టెంపుల్ ఉండటంతో ఈ సరస్సుకు రేణుకా సరస్సు అనే పేరు వచ్చింది. ఇది ఒక ఆకర్షణీయ పర్యాటక ప్రదేశం ఫోటో క్రెడిట్ CC-BY

 మానసబాల సరోవరం

మానసబాల సరోవరం

మానసబాల సరోవర, జమ్మూ మరియు కాశ్మీర్ రాష్ట్రంలోని గందేర్బాల్ జిల్లాలోని సఫాపూరా ప్రదేశంలో కలదు. వృత్తాకారంగా వుండే మూడు గ్రామాలను చుట్టుముట్టి పారుతుంది. గాన్దేర్బాల్ సమీపం లో వుండే సరస్సు ప్రదేశం సుమారు 43 అడుగుల లోతు గా వుంటుంది. ఇక్కడ మీరు నీలగిరి చెట్లు ఇంకనూ కొన్ని ఆకర్షణలు చూడవచ్చు. ఇది ఒక మంచి మీటి సరస్సు. ఫోటో క్రెడిట్ : Mehrajmir13

వెంబనాడ్ సరస్సు

వెంబనాడ్ సరస్సు

కేరళ రాష్ట్రంలోని వెంబనాడ్ సరస్సు భారత దేశంలోని పొడవైన సరస్సులలో ఒకటి. కొన్ని జిల్లాలకు వ్యాపించిన ఈ సరస్సు, ఈ జిల్లాలలో వివిధ పేర్లు కలిగి వుంది. ఈ సరస్సులో ప్రసిద్ధి చెందిన నెహ్రు బోటు రేస్ లు జరుగుతాయి. ఫోటో క్రెడిట్

 ఫతే సాగర్ సరస్సు

ఫతే సాగర్ సరస్సు

రాజస్థాన్ లో కల ఈ సరస్సు, ఉదయపూర్ నగరంలో కలదు. ఉదయపూర్ లో కల నాలుగు సరస్సులలో ఇది ఒకటి. ఈ సరస్సులోని నాలుగు చిన్న ద్వీపాలను కూడా చూడవచ్చు. నగరం లోని వివిధ ఉపయోగాలకు ఈ సరస్సు నీరు వాడతారు. ఫోటో క్రెడిట్

 నైనిటాల్ సరస్సు

నైనిటాల్ సరస్సు

ఇది ఒక మంచి నీటి సరస్సు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని నైనిటాల్ పట్టణంలో ఈ సరస్సు కలదు. ఈ సరస్సు చుట్టుపక్కల అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు కలవు. ఈ సరస్సులో బోటు విహారాలను పర్యాటకులు చేస్తూ వుంటారు.

కోడై కెనాల్ సరస్సు

కోడై కెనాల్ సరస్సు

తమిళ్ నాడు లోని కోడై కెనాల్ లో కల ఈ సరస్సు దిండి గర్ జిల్లా లోని కోడై కెనాల్ పట్టణంలో కలదు. పూర్తి కొండ ప్రాంతం కల ఈ ప్రదేశం భారత దేశంలో ప్రసిద్ధి గాంచిన పర్యాటక ప్రదేశం. ఈ కోడై కెనాల్ సరస్సులో చక్కని బోటు విహారం కూడా చేయవచ్చు.

హుస్సేన్ సాగర్ సరస్సు

హుస్సేన్ సాగర్ సరస్సు

హుస్సేన్ సాగర్ సరస్సు, ఆంధ్ర ప్రదేశ్ లోని హైదరాబాద్ లో కలదు. పురాతనమైన ఈ సరస్సు 5.7 చ.కి. మీ.లలో విస్తరించి వుంటుంది. నిరంతరం నీరు కల ఈ సరసు కు మూసి నది మూలాధారం. ఈ సరస్సు ప్రత్యేక ఆకర్షణ అంటే దాని నడుమ భాగంలో కల 32 అడుగులు ఎత్తుకల బుద్ధుడి విగ్రహం. ఫోటో క్రెడిట్ : aloshbennett

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X