అనంతపద్మనాభ స్వామి ఆరవ గది తెరిస్తే మొత్తం ప్రపంచాన్ని ముంచేస్తుందా?
వెతకండి
 
వెతకండి
 

భారతదేశంలో మనస్సుకు ఉల్లాసం కలిగించే హిల్ స్టేషన్లు

Written by: Venkata Karunasri Nalluru
Updated: Wednesday, May 31, 2017, 18:02 [IST]
Share this on your social network:
   Facebook Twitter Google+ Pin it  Comments

LATEST : ఈ గ్రామంలో ఒకే ప్రదేశంలో 54 దేవాలయాలా !

ప్రస్తుత బిజీ ప్రపంచంలో పర్యాటకులు చూడాలనుకునేది హిల్ స్టేషన్లు. ఈ కొండల అందాలు చూస్తే ఎంతో ప్రశాంతత మరియు మనసుకు ఆహ్లాదం కలుగుతుంది. మన దేశంలో హిల్ స్టేషన్ లకు పెట్టింది పేరు. భారతదేశం అనేక ఆకర్షణీయమైన హిల్ స్టేషన్లు కలిగి ఒక గొప్ప స్థానంలో వుంది.

ప్రకృతి అంటే ప్రేమ వున్నవారికి భారత దేశంలో చూడదగిన ప్రదేశాలలో హిల్ స్టేషన్స్ ప్రధానమైనవి. హిల్ స్టేషన్ లు హనీమూన్ స్పాట్ లుగానే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా వుంటాయి. స్నేహితులు ఎంతో హుషారుగా హిల్ స్టేషన్లకు ట్రెక్కింగ్ కూడా చేస్తారు.

అందమైన జలపాతాలతోనూ, పచ్చదనంతో అలరారుతూ, కనువిందు చేసే హిల్ స్టేషన్ లు ఇక్కడ చాలా ఉన్నప్పటికీ అందులో కొన్ని మాత్రమే ప్రఖ్యాతి గాంచినవి. భూలోక స్వర్గాలను తలపించే ఆ టాప్ టెన్ సౌత్ ఇండియా హిల్ స్టేషన్లు ఎక్కడెక్కడ ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాం.

ఇటువంటి వాటిలో ధర్మశాల, గుల్మార్గ్, కూర్గ్, అరకు లోయ, పచ్‌మర్హి, లోనవల, మౌంట్ అబూ, కాలింపోంగ్, చంబ, డార్జిలింగ్ ముఖ్యమైనవి.

ధర్మశాల

రాక్ క్లైంబింగ్ మరియు ట్రెక్కింగ్ కోసం, సహజ నివాసం కోసం, సాహసవీరుల కోసం ధర్మశాల చాలా అనువైన ప్రదేశం. ధర్మశాల దలైలామా నిలయంగానే కాకుండా శీతాకాలంలో దట్టమైన శంఖాకార అడవులు మరియు మంచుతో కప్పబడిన శిఖరాలతో కూడిన దృశ్యాలు అద్భుతంగా వుంటుంది. దలైలామా మెక్లియోడ్ గంజ్ అని పిలువబడే నిలయం కొండకు 3 కిలోమీటర్ల దూరంలో ఉంది.

గుల్మార్గ్

గుల్మార్గ్ అంటే "మేడో ఆఫ్ ఫ్లవర్స్" అని అర్థం. ఇది సందర్శకులకు ఒక సాహసగాథ కథ అనే ఒక అభిప్రాయాన్ని సూటిగా అందిస్తుంది. ఇక్కడ వసంత మరియు వేసవి కాలంలో విరబూసే పూలతో ఆకర్షించే లోయ ఉంది. హిల్ స్టేషన్ గా అలరించే పూల లోయ శీతాకాలం రాగానే శీతాకాలపు క్రీడాకేంద్రంగా మార్పుచెందుతుంది. ఇక్కడి కేబుల్ కార్ విహారం మంచి అనుభూతినిస్తుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉండే గోల్ఫ్ క్రీడా మైదానం ఇక్కడే ఉండటం విశేషం. అలాగే స్కైయింగ్ క్రీడకు గుల్మార్గ్‌ని ప్రత్యేక విడిదిగా చెప్పుకోవచ్చు. చలికాలపు ఆటల విడిదిగా కూడా గుల్మార్గ్‌కి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది.

కూర్గ్

కూర్గ్ ను భారతదేశం స్కాట్లాండ్ అని పిలుస్తారు. కూర్గ్ పశ్చిమ కనుమలుగా పిలువబడే సహ్యాద్రి శ్రేణులు నడుమన వుంది. ఇక్కడ పొగమంచుతో కప్పబడిన కొండలు, లష్ సతతహరిత అడవులు, టీ మరియు కాఫీ తోటలు, నారింజ తోటలు, సున్నితంగా ప్రవహించే ప్రవాహాలు మరియు అందమైన జలపాతాలు ఇవన్నీ చూపరులకు ఒక మరపురాని మెమరీగా మిగులుస్తుంది.

అరకు లోయ

విశాఖపట్నం నుండి రైలులో ప్రయాణం సాగిస్తుంటే ఈ ప్రదేశం అందమైన ఆకుపచ్చని రంగుల భూభాగాలతో చిత్రీకరించినట్లు చూచుటకు ఎంతో ముగ్ధ మనోహరంగా వుంటుంది. తూర్పు కనుమలలో నెలకొన్న ఈ హిల్ స్టేషన్ హైదరాబాద్, విజయవాడ నగరాల నుండి ఒక మంచి గెట్ అవేస్ గా వున్నాయి. లోయని చూడగానే బంగారం పాచెస్ కలిగిన ఆకుపచ్చ రంగుతో కూడిన భారీ పెయింటింగ్ ను పోలి వుంటుంది.

పచ్‌మర్హి

ఈ పురాతనమైన పట్టణం దేశవ్యాప్తంగా పర్యాటకులను ఎల్లప్పుడూ ఆకర్షిస్తుంది. ఎత్తైన ఆకుపచ్చని కొండలు అనేక ప్రదేశాల్లో మనం చూడవచ్చు. కానీ మధ్యప్రదేశ్ లో గల పురాతనమైన మరియు రహస్యమైన హిల్ స్టేషన్ ని సందర్శించకుండా వుండలేరు.

లోనవల

లోనవల కొండలు ముంబైలో ప్రధానంగా వేసవి పర్యటన కేంద్రాలుగా ఉన్నాయి. ఇక్కడ గల ఆకుపచ్చని షేడ్స్ కలిగిన రంగురంగుల దృశ్యం మీకు ఒక సంతోషకరమైన అనుభవం అందిస్తుంది. చుట్టూ కొండలు మరియు లోయలు గల ఈ ప్రకృతి తల్లి ఒడిలో అవిరామ విశ్రాంతిని పొందవచ్చును.

మౌంట్ అబూ

మౌంట్ అబూ ఆరావళి పర్వతాల్లో గల రాజస్థాన్కి చెందిన ఏకైక పర్వత ప్రాంతం. ఇది ఎడారిలో గల వేడిమికి సేదతీర్చే ఒక ఆటవిడుపు. మౌంట్ అబూ థార్ ఎడారి నడుమ ఆకుపచ్చగా పరచబడిన హిల్ స్టేషన్. ఇది జైనులచే నిర్మాణం గావించబడిన ముఖ్యమైన తీర్థయాత్రా కేంద్రాలలో ఒకటి.

అందమైన దెల్వారా దేవాలయాలు మౌంట్ అబూకు ఆకర్షణలుగా నిలుస్తున్నాయి.

 

కాలింపోంగ్

ఒక వారం లేదా రెండు వారాలు కోసం అలా హాయిగా బయటవెళ్లి తిరగాలనుకునేవారికి ఉత్తర బెంగాల్ లో గల కాలింపాంగ్ ఒక పర్యాటక ఆకర్షణ కేంద్రంగా వుంది. వాతావరణం ఏడాది పొడవునా నిరంతరం చల్లగా వుంటుంది. ఈ శక్తివంతమైన పర్వతం చూడటానికి చాలా అద్భుతంగా వుంటుంది.

మార్కెట్ ఎల్లప్పుడూ అంగళ్లు స్థానికంగా విక్రయించే వస్తువులతో నిండి వుంటుంది. ఇక్కడ ఎండు మిరపకాయలు, చింతపండు పొడి, నేపాలి ఆలు దమ్, సెల్ రోటీ మరియు పైపింగ్ వేడి మోమోస్ కూడా వుంటాయి.

 

డార్జిలింగ్

చుట్టూ హిమాలయాలు మరియు టీ తోటలతో గల డార్జిలింగ్ ను 'తూర్పు డ్రీమ్ల్యాండ్' అంటారు. ఇక్కడ గల జలపాతాలు మరియు పర్వతాలు కలిగిన ఒక అందమైన మైదానంతో అద్భుతంగా వుంటుంది. డార్జిలింగ్ లో భోజన ప్రియులకు స్వర్గం అని పిలువబడే ప్రదేశాలు గ్లెన్నరిస్ మరియు కేవెంటేర్స్.

చంబ

హిమాచల్ లోని చంబా లోయ మహావిష్ణువు యొక్క అనేక దేవాలయాలు వున్నాయి. ఇది ప్రకృతి ప్రేమికులకు స్వర్గం అనిపించే ఒక రహస్య స్థలం. చంబా లోయలో చుట్టూ గల అనేక పర్వతాలు అద్భుతమైన వీక్షణ అందిస్తుంది. అఖండ్ చండి ప్యాలెస్, రంగ్ మహల్ మరియు చాముండి దేవి, చంపావతి ఆలయాలు ఇక్కడ సందర్శించవలసిన దేవాలయాలు.

English summary

Soul-Soothing Hill Stations In India

Take a look at some of the best hill stations in India!
Please Wait while comments are loading...