Search
  • Follow NativePlanet
Share
» »భక్తుల కోరికలు తీర్చే కామధేను మరియు కల్పవృక్షం మంత్రాలయ రాఘవేంద్ర స్వామి

భక్తుల కోరికలు తీర్చే కామధేను మరియు కల్పవృక్షం మంత్రాలయ రాఘవేంద్ర స్వామి

మంత్రాలయము ఆంధ్రప్రదేశ్ లో తుంగభద్రా నదీతీరంలో కలదు. కర్నూలు నుండి 100కి.మీ దూరంలో ఉంది. హైదరాబాద్ నుండి అయితే 232.6 కిలో మీటర్ల దూరంలో ఉంది. దక్షిణ భారత దేశంలోనే అత్యంత ప్రసిద్దిచెందిన పుణ్యక్షేత్రం.

By Venkata Karunasri Nalluru

మంత్రాలయము ఆంధ్రప్రదేశ్ లో తుంగభద్రా నదీతీరంలో కలదు. మంత్రాలయము అతి ప్రసిద్దమైన పుణ్యక్షేత్రం. ఇది కర్నూలు నుండి 100కి.మీ దూరంలో ఉంది. హైదరాబాద్ నుండి అయితే 232.6 కిలో మీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ దగ్గరలో పంచముఖి ఆంజనేయుని ఆలయం ఉంది. ఇక్కడ ప్రతిరోజు ఉచిత అన్నదానం జరుగుతుంది. ఇక్కడ గురువారం ప్రత్యేకత. ఇక్కడ సాయంత్రం స్వామివారి ఏనుగు అందరిని దీవిస్తూ సందడి చేస్తుంది.

రాఘవేంద్ర స్వామికి మరొక పేరు వేంకటనాథుడు. తిమ్మన్న భట్టు, గోపికాంబల రెండవ సంతానం గా వేంకట నాథుడు జన్మించాడు. హిందూ మతములో ఓ ప్రముఖమైన గురువు శ్రీ గురు రాఘవేంద్ర స్వామి (1595-1671), శ్రీ గురు రాఘవేంద్ర స్వామి16వ శతాబ్దంలో జీవించాడు. ఇతను వైష్ణవ మతాన్ని అనునయించాడు. అంతేకాకుండా మధ్వాచార్యులు బోధించిన ద్వైతాన్ని అవలంబించాడు.

రాఘవేంద్ర స్వామిని ప్రహ్లాదుని మరో అవతారంగా భావిస్తారు. రాఘవేంద్ర స్వామి శ్రీరాముని మరియు పంచముఖ హనుమంతుడు యొక్క పరమ భక్తులు. ఇతను పంచముఖిలో తపస్సు చేసాడు. ఇచ్చట హనుమంతుణ్ణి దర్శించాడు. మంత్రాలయంలో తన మఠాన్ని స్థాపించాడు, మరియు ఇక్కడే సజీవ సమాధి అయ్యాడు. 1671 లో మంత్రాలయంలో స్వామి జీవ సమాధి చెందారు. వేలకొలదీ భక్తులు తరచూ మంత్రాలయ దర్శనానికి వస్తుంటారు.

భక్తుల కోరికలు తీర్చే కామధేను మరియు కల్పవృక్షం మంత్రాలయ రాఘవేంద్ర స్వామి

pc: Vedamurthy J

ఆలయ వేళలు

ఉదయం 6గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు అలాగే సాయంత్రం 4-30 నుండి రాత్రి 8-00 గంటల వరకు ఈ ఆలయం తెరిచి ఉంటుంది.

పేదల ఊటీ ఎక్కడుందో మీకు తెలుసా?పేదల ఊటీ ఎక్కడుందో మీకు తెలుసా?

రాఘవేంద్ర స్వామి బృందావనం

రాఘవేంద్ర స్వామి సమాధి ఉన్న ప్రాంతాన్ని బృందావనంగా పిలుస్తారు. కర్నూల్ జిల్లాలో ఉన్న ఒక చిన్న గ్రామంలో తుంగభద్ర నది ఒడ్డున రాఘవేంద్ర స్వామి బృందావనం ఉంది. వేల మంది భక్తులు ఈ సమాధిని సందర్శించి శ్రీ రాఘవేంద్రస్వామి ఆశీస్సులు అందుకోవడానికి ఇక్కడికి వస్తారు.

స్వామి 1671 లో జీవ సమాధి చెందారు. స్వామి ఏంతో మంది భక్తుల సమస్యలను ఎన్నో అధ్బుతాలు చేసి పరిష్కరించారు. రాఘవేంద్ర స్వామి భక్తులకి కలలో కనిపించి సమస్యలు పరిష్కరిస్తారని ఎన్నో గాధలు ఉన్నాయి. భక్తుల కోరికలు తీర్చే స్వామిని కామధేను మరియు కల్పవృక్షంగా భక్తులు పిలుచుకుంటారు.

భక్తుల కోరికలు తీర్చే కామధేను మరియు కల్పవృక్షం మంత్రాలయ రాఘవేంద్ర స్వామి

pc:(WT-shared) Ravikiran

మాంచాలమ్మ ఆలయం

మంత్రాలయం గ్రామ దేవతగా మాంచాలమ్మని కొలుస్తారు. శ్రీ రాఘవేంద్ర స్వామి బృందావనాన్ని దర్శించుకునే ముందు భక్తులు మాంచాలమ్మ వారి ఆలయాన్ని దర్శించుకుంటారు. రాఘవేంద్ర స్వామి వారు ఈ మాంచాలమ్మ వారిని ప్రతి రోజు పూజించే వారని అంటారు. మాంచాలమ్మ దర్శనం పొందిన రాఘవేంద్ర స్వామి అమ్మ వారి అనుగ్రహంతోనే ఇక్కడ కొలువున్నారని గాధలు చెబుతున్నాయి. ఈ ప్రాంతాన్ని సందర్శించే వారు మూల బృందావనంలోని శ్రీ రాఘవేంద్రస్వామిని దర్శించుకునే ముందు మాంచాలమ్మ ఆలయాన్ని సందర్శించాలని రాఘవేంద్రస్వామి సూచించారు. ఇప్పటికీ ఈ ఆచారాన్ని భక్తులు పాటిస్తున్నారు.

భక్తుల కోరికలు తీర్చే కామధేను మరియు కల్పవృక్షం మంత్రాలయ రాఘవేంద్ర స్వామి

pc:(WT-shared) Ravikiran

పంచముఖి ఆంజనేయ

అయిదు ముఖాలతో ఇక్కడ కనిపించే ఆంజనేయ స్వామి విగ్రహం ప్రత్యేకమైనది. మంత్రాలయం నుండి ఈ ఆలయం చేరుకోవడానికి 45 నిముషాలు పడుతుంది. అందమైన పరిసరాల మధ్య ఒక చిన్న కొండపై ఈ ఆలయం ఉంది.

చరిత్ర

ఈ విగ్రహం ఒక గుహలో వుంది. ఒక బ్రాహ్మణుడికి కల ప్రకారం ఈ గుహకి వచ్చి ఆ విగ్రహాన్ని కనిపెట్టారని అంటారు. ఈ మందిరానికి చేరే దారి ఇరుకుగా ఉంటుంది. అందుచేత భక్తులు ఒకే లైన్ లో ఒకరి వెనుక ఒకరు దర్శనానికి చేరుకోవాలి.

భక్తుల కోరికలు తీర్చే కామధేను మరియు కల్పవృక్షం మంత్రాలయ రాఘవేంద్ర స్వామి

pc:Nsmohan at en.wikipedia

వేద పాఠశాల

ఇక్కడ ఉన్న వేద పాఠశాల వేదాల అధ్యయనానికి ప్రసిద్ది. వేల మంది వేద పండితులు ఈ పాఠశాలలో నే వేదాలు నేర్చుకున్నారు.

రవాణా సౌకర్యాలు

భక్తుల కోరికలు తీర్చే కామధేను మరియు కల్పవృక్షం మంత్రాలయ రాఘవేంద్ర స్వామి

pc:Nsmohan at en.wikipedia

వాయు మార్గం

సమీపం విమానాశ్రయం: మంత్రాలయం నుండి 232.6 కిలోమీటర్ల దూరంలో ఉన్న హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం. ఈ విమానాశ్రయం నుండి మంత్రాలయానికి టాక్సీలు అందుబాటులో వున్నాయి.

రైలు మార్గం

మంత్రాలయం రైల్వే స్టేషన్ కేవలం 15 కిలోమీటర్ల దూరం లో నే ఉంది. చెన్నై మరియు రాయచూర్ రైల్ రూట్ లో ఈ రైల్వే స్టేషన్ ఉంది. ఈ స్టేషన్ లో సమీప నగరాలకు రెగ్యులర్ రైల్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి.

భక్తుల కోరికలు తీర్చే కామధేను మరియు కల్పవృక్షం మంత్రాలయ రాఘవేంద్ర స్వామి

pc:Jpullokaran

బస్సు మార్గం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా కార్పొరేషన్ బస్సుల ద్వారా మంత్రాలయం చక్కగా అనుసంధానమై ఉంది. మంత్రాలయం నుండి కర్నూల్ మరియు హైదరాబాద్ ల కు బస్సు సర్వీసులు తరచూ అందుబాటులో ఉంటాయి.

మంత్రాలయం దర్శించుటకు అనువైన సమయం

అక్టోబర్ నుండి మార్చ్ వరకు ఈ ప్రాంతం సందర్శనకు అనువుగా ఉంటుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X