Search
  • Follow NativePlanet
Share
» »కూర్మావతార దివ్య క్షేత్రం - శ్రీకూర్మం !

కూర్మావతార దివ్య క్షేత్రం - శ్రీకూర్మం !

By Mohammad

మత్స్య అవతారంలో శ్రీ మహావిష్ణువుకు భారత దేశంలో గల ఏకైక దేవాలయం శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకూర్మం. అందుకే దీనికి అంతటి విశిష్టత. శ్రీ కాకుళం నుండి 15 కి.మీ. దూరాన శ్రీకూర్మం గ్రామంలో "కూర్మనాధ స్వామి" మందిరం ఉంది. శ్రీమహావిష్ణువు కూర్మావతారం రూపంలో ఇక్కడ పూజింపబడుతాడు.

భారతదేశంలో ఈ మాదిరిగా కల కూర్మావతారం మందిరం ఇదొక్కటే. ఈ మందిరం శిల్పకళాశైలి విశిష్టమైనది. మరొక విశేషం ఈ ఆలయంలో రెండు ధ్వజ స్తంభాలు గలవు. ఇక్కడ భక్తులు వరుణ దేవుని కరుణాకటాక్షం కోసం తప్పెటగుళ్ళు అనే నాట్య ప్రక్రియతో దేవుడిని పూజిస్తారు. 11వ శతాబ్దం కాలం నాటి శాసనాలు ఇక్కడ లభించాయి. దీనితో పాటు శ్రీరామానుజాచార్యుల, శ్రీ వరదరాజస్వామి, శ్రీ మధ్వాచార్యుల, కోదండరామస్వామి వారల ఆలయాలు గలవు.

ఇది కూడా చదవండి : అంతర్వేది - గోదావరి నది సంగమ ప్రదేశం !

స్థల పురాణం

స్థల పురాణం

శ్రీకూర్మం ఆలయాన్ని క్రీ. శ. 2 వ శతాబ్దానికి ముందు నిర్మించినట్లు చాలా మంది నమ్ముతారు. నిజానికి ఆలయము నిర్మించిన వారు ఇప్పటికీ తెలియదు. అయితే, ఈ ఆలయం ఎక్కువగా కళింగ, ఆంధ్ర, చోళుల రాజవంశం పాలనలో ఉంది.

చిత్ర కృప : Adityamadhav83

శ్రీకూర్మ పర్వతం

శ్రీకూర్మ పర్వతం

శ్రీకూర్మక్షేత్రమునకు వంశధారానదీ తీరములో శ్రీకూర్మశైలమను పర్వతము ఉంది. ఇది శ్రీకూర్మనాథుని విరాడ్రూపమని నమ్మకము. క్షేత్రమునకు దక్షిణమున ప్రేతశిల అను పర్వతముంది.ఇక్కడ ఉన్న అష్టతీర్థములందు స్నానముచేసి, శ్రీకూర్మనాథుని కొలుచుట ఒక ఆచారముగా వస్తున్నది.

చిత్ర కృప : Adityamadhav83

శ్రీకూర్మ క్షేత్రం

శ్రీకూర్మ క్షేత్రం

శ్రీకూర్మక్షేత్రము పంచలింగారాధ్యక్షేత్రము. కర్పూరేశ్వరుడు, హాటకేశ్వరుడు, కోటీశ్వరుడు, సుందరేశ్వరుడు మరియు సిద్దేశ్వరుడు క్షేత్రపాలకులుగా ఉన్న క్షేత్రం ఇది. శ్రీకూర్మక్షేత్ర ముఖద్వారమున భైరవుడు, మరియు ఆలయ ప్రాకారమున అష్టదిక్పాలురును క్షేత్రపాలకులై స్వామిని సేవిస్తున్నారు.

చిత్ర కృప : Seshagirirao

శ్రీకూర్మం ప్రధాన ఆకర్షణలు

శ్రీకూర్మం ప్రధాన ఆకర్షణలు

కూర్మ, విష్ణు, పద్మ, బ్రహ్మాండ పురాణాలలో మూలాలు, మహావిష్ణువు కూర్మావతారము రూపంలో పూజ్యమైన ప్రపంచంలో ఏకైక స్వయంభు ఆలయం (తాబేలు) అవతారం చూడదగ్గవి.

చిత్ర కృప : srikurma temple

శ్రీకూర్మం ప్రధాన ఆకర్షణలు

శ్రీకూర్మం ప్రధాన ఆకర్షణలు

అజంతా ఎల్లోరా గుహలు మాదిరిగా శతాబ్దాల అరుదైన కుడ్య చిత్రాలు తో ఉన్న దేవాలయాలులో ఒకటి.ఇక్కడ సుమారు 108 వరకు రాతి స్తంభాలు ఉన్నాయి. ఇవి ఒకదానితో ఒకటి పోలిఉండవు. కూర్మావతారానికి నిజరూపమైన తాబేళ్లు కనిపించడం ఇక్కడి ప్రత్యేకత.

చిత్ర కృప : Seshagirirao

శ్రీకూర్మం ప్రధాన ఆకర్షణలు

శ్రీకూర్మం ప్రధాన ఆకర్షణలు

రోజువారీ అభిషేకం నిర్వహించే ప్రపంచంలో కొన్ని విష్ణు దేవాలయాలులో శ్రీకూర్మం దేవాలయం ఒకటి. వారణాసి (కాశి) వెల్లడానికి సొర్ంగ మార్గం ఉంది ,ప్రస్థుతం దీన్ని మూసివేసారు. వారణాసి / పూరీ (ఒడిషా) ల వలె, మరణించినవారి అంతిమ కర్మలు,మోక్ష స్థానం ఇక్కడ నిర్వహిస్తారు.

చిత్ర కృప : Seshagirirao

సందర్శించే సమయం

సందర్శించే సమయం

ఆలయాన్ని ఉదయం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు తెరిచే ఉంచుతారు. అభిషేకం, అఖండ దీపారాధన, నైవేద్యం, కళ్యాణం వంటి ఆర్జిత సేవలను దేవాలయం భక్తుల కొరకు అందిస్తున్నది.

చిత్ర కృప : Palagiri

శ్రీకూర్మం చేరుకోవటం ఎలా ?

శ్రీకూర్మం చేరుకోవటం ఎలా ?

బస్సు లేదా రోడ్డు మార్గం

శ్రీకాకుళం పట్టణం పాత బస్ స్టాండు నుండి ప్రతి 15 నిమిషాలకు అరసవిల్లి మీదుగా ఆర్టిసి వారి బస్సులు కలవు. ఉదయం 6.00 గంటలనుండి - రాత్రి 8.00 గంటల వరకు నడుస్తాయి.అంతేకాక ఆటోలు,టాక్సిలు వున్నాయి.వసతి మాత్రం శ్రీకాకుళం పట్టణం లోనే.

రైలు మార్గం

ఆముదాలవలస రైల్వే స్టేషన్ (20 km), శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్ (12 km) లు శ్రీకూర్మం సమీప రైల్వే స్టేషన్ లు.

విమాన మార్గం

విశాఖపట్టణం విమానాశ్రయం 115 km ల దూరంలో కలదు. క్యాబ్ లేదా టాక్సీ అద్దెకు తీసుకొని శ్రీకూర్మం ఆలయానికి చేరుకోవచ్చు.

చిత్ర కృప : విశ్వనాధ్.బి.కె.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X