Search
  • Follow NativePlanet
Share
» »షిరిడిలో వి ఐ పి దర్శనం కావాలంటే ఈ ఒక్క పని చేయండి చాలు

షిరిడిలో వి ఐ పి దర్శనం కావాలంటే ఈ ఒక్క పని చేయండి చాలు

షిర్డీ అనే చిన్న పట్టణం ప్రపంచ వ్యాప్తంగా వున్నా సాయి భక్తుల భక్తి తత్పరతతో గుబాళిస్తుంది. ప్రపంచ ఆధ్యాత్మిక పటంలో ఈ పల్లెకు అగ్ర తాంబూలం వుంది.

By Venkatakarunasri

గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన అవసరం లేకుండా నేరుగా బాబా చెంతకు చేరుకోవాలని వుందా?భక్తులకు ఇంతకంటే ఆనందం ఏముంటుంది?దీనికి అదనపు రుసుము వసూలు చేసారేమో అనుకుంటున్నారా? కాని అలాంటివి ఏమీ లేవు.ఒక వైపు సమాజసేవ మరోవైపు దైవాన్ని సేవించే భాగ్యం షిరిడీలో సాయిబాబా ఆలయం కల్పిస్తుంది. షిరిడీలోని రక్తనిధికి ఒకసారి రక్తదానం చేస్తే ఏడాదిపాటు వి ఐ పి హోదా లభిస్తుంది.

దీనివలన రక్తదానాన్ని ప్రోత్సహించటంతో పాటు దైవ దర్శనం భక్తులకు సులువవుతుంది. షిర్డీ లేదా షిరిడీ మహారాష్ట్రలో అహ్మద్ నగర్ జిల్లాలోని నగర పంచాయితీ మరియు శ్రీ షిర్డీ సాయిబాబా పుణ్యక్షేత్రం. ఇది అహ్మద్ నగర్ నుండి మన్మాడ్ మధ్య రాష్ట్ర ప్రధాన రహదారి మీద అహ్మద్ నగర్ నుండి 83 కి.మీ. మరియు మోపర్గాం నుండి 15 కి.మీ. దూరంలో ఉంది.

షిరిడిలో వి ఐ పి దర్శనం కావాలంటే ఈ ఒక్క పని చేయండి చాలు

అత్యంత ప్రసిద్ధమైన ఆలయం

అత్యంత ప్రసిద్ధమైన ఆలయం

తిరుపతి దేవుని తర్వాత భారత దేశంలో అత్యంత ప్రసిద్ధమైన ఆలయం ఇది. సాధారణ దినాల్లో రోజూ ముప్పై వేల మందికి పైగా భక్తులు వస్తుంటారు.

pc:youtube

బంగారు, వెండి ఆభరణాలు

బంగారు, వెండి ఆభరణాలు

అదే పర్వ దినాలలో అయితే వీరి సంఖ్య లక్షకు దాటుతుంది. షిర్డీ సాయిబాబా సాయి నాథుని ఆలయానికి ఉన్న బంగారు, వెండి ఆభరణాల విలువ ముప్పైరెండు కోట్ల రూపాయలు ఉంటుంది.

pc:youtube

బాంకుల్లో డిపాజిట్లు

బాంకుల్లో డిపాజిట్లు

బాంకుల్లో డిపాజిట్లు నాలుగు వందల ఇరవై ఏడు కోట్ల రూపాయలుంటాయి. షిర్డి సాయిబాబా స్వామి వారికి, వడ్డీరూపంలోను, విరాళాల రూపంలోను ఏడాదికి మూడు వందల కోట్ల పైగా వస్తుంది.

pc:youtube

షిరిడీలోని సాయి మందిరంలో నిత్య పూజలు

షిరిడీలోని సాయి మందిరంలో నిత్య పూజలు

ఇక్కడికి దేశం నలుమూలల నుండి భక్తులు వస్తుంటారు. షిరిడీలోని సాయి మందిరంలో నిత్య పూజలు జరుగుతున్నాయి.

pc:youtube

బాబా దర్శనం

బాబా దర్శనం

అనుదినం వేల సంఖ్యలో వివిధ ప్రాంతాలనుండి భక్తులు షిరిడీకి వచ్చి, బాబా దర్శనం చేసుకొంటారు. శ్రీ సాయిబాబా సంస్థాన్ అనే సంస్థ షిరిడీ కేంద్రంగా వివిధ కార్యక్రమాలు, ఆలయ నిర్వహణ కొనసాగిస్తున్నది.

pc:youtube

తీర్థ క్షేత్రం

తీర్థ క్షేత్రం

షిర్డీ అనే చిన్న పట్టణం ప్రపంచ వ్యాప్తంగా వున్నా సాయి భక్తుల భక్తి తత్పరతతో గుబాళిస్తుంది. ప్రపంచ ఆధ్యాత్మిక పటంలో ఈ పల్లెకు అగ్ర తాంబూలం వుంది.

pc:youtube

తప్పకుండా చూడాల్సిన దేవాలయాలు

తప్పకుండా చూడాల్సిన దేవాలయాలు

తప్పకుండా చూడాల్సిన ఇతర దేవాలయాల్లో శని, గణపతి, శివాలయాలు వున్నాయి. ఈ పవిత్ర క్షేత్రాన్ని ఏడాదిలో ఎప్పుడైనా చూడవచ్చు, కాని వర్షాకాలంలో ఇక్కడ వాతావరణం హాయి గోల్పేదిగా వుంటుంది కనుక వర్షాకాలంలో దర్శించడం మంచిది.

pc:youtube

షిర్డిలో జరిగే ప్రధాన పండుగలు

షిర్డిలో జరిగే ప్రధాన పండుగలు

గురు పూర్ణిమ, దసరా, శ్రీరామనవమి అప్పుడు కూడా ఈ క్షేత్రాన్ని దర్శించవచ్చు. ఈ పండుగలప్పుడు భక్తుల రద్దీ ఎక్కువగా వుంటుంది.

pc:youtube

షిర్డీ లోని సమాధి మందిరం

షిర్డీ లోని సమాధి మందిరం

వాతావరణం అంతా సాయి భజనలతో మార్మోగి పోతుంది, అప్పుడు జరిగే రథ యాత్రలో కూడా పాల్గొన వచ్చు. ఈ రోజుల్లో మాత్రమే షిర్డీ లోని సమాధి మందిరం రాత్రంతా తెరిచి వుంటుంది.

pc:youtube

పవిత్ర నివాసం

పవిత్ర నివాసం

సాయి బాబా యొక్క ఈ పవిత్ర నివాసానికి రోడ్డు, రైలు, వాయు మార్గాల ద్వారా తేలిగ్గానే చేరుకోవచ్చు. ఊరు బాగా అభివృద్ది చెందింది. నాశిక్, పూణే, ముంబై ల నుంచి బస్సుల ద్వారా అనుసంధానం చేయబడింది.

pc:youtube

యాత్రికుల సౌకర్యం

యాత్రికుల సౌకర్యం

దగ్గరలోనే విమానాశ్రయం నిర్మిస్తున్నారు, దీని వల్ల ప్రపంచం నలు మూలల నుంచీ వచ్చే యాత్రికుల సౌకర్యం పెరుగుతుంది. రోడ్డు ద్వారా ఐతే, అహ్మద్ నగర - మన్మాడ్ రాష్ట్ర రహదారి నెంబర్ 10 మీదుగా రావచ్చు. అహ్మద్ నగర జిల్లాలోని కోపర్గావ్ నుంచి కేవలం 15 కిలోమీటర్ల దూరంలో వుంది.

pc:youtube

12. షిర్డీ వెళ్తున్నారా ?

12. షిర్డీ వెళ్తున్నారా ?

షిర్డీ వెళ్తున్నారా ? అయితే ఈ ప్రదేశాలను చూసిరండి !

తిరుపతిలో స్వామివారికి తల నీలాలు సమర్పించటం మాదిరిగానే షిరిడికి వచ్చే భక్తులు కూడా రక్తదానం చేస్తే సమాజానికి మేలు జరుగుతుందని షిరిడీ సంస్థాన ట్రస్ట్ మేనేజర్ సురేష్ అవారే తెలిపారు.ఆలయ పరిసరాలలో షిరిడి సంస్థ రక్తనిధి కేంద్రం ద్వారా రోజువారీ రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

pc:youtube

13. లక్షలాది సాయిభక్తులు

13. లక్షలాది సాయిభక్తులు

రక్తనిధి కేంద్రాల ఆవశ్యకత పెరుగుతుంటే దాతలు మాత్రం తగ్గుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా వున్న లక్షలాది సాయిభక్తులు షిరిడీకి వస్తుంటారు.

pc:youtube

14. షిరిడీలోని బాబా మ్యూజియం

14. షిరిడీలోని బాబా మ్యూజియం

తిరుపతిలో తలనీలాలు సమర్పించినట్లే ఇక్కడ రక్తదానం చేసి సమాజసేవకు తమ వంతు సహాయం చేయాలని అర్ధించారు. దీని కోసం షిరిడీలోని బాబా మ్యూజియం సమీపంలో రక్తదాన కేంద్రాన్ని ప్రారంభిస్తామని సురేష్ హవారీ పేర్కొన్నారు.

pc:youtube

15. ఉచితంగా రక్తం సరఫరా

15. ఉచితంగా రక్తం సరఫరా

అలాగే మహారాష్ట్రాలోని ఇతర బ్లడ్ బ్యాంకులలో దీన్ని అనుసంధానం చేస్తామని అవసరమైతే వారికి ఉచితంగా రక్తం సరఫరా చేస్తామని అన్నారు.

pc:youtube

16. ఎలా చేరాలి

16. ఎలా చేరాలి

పాత రోజులలో షిర్డీ వెళ్ళడం చాలా కష్టంతో కూడుకున్నది. కానీ ఈ రోజుల్లో షిర్డీ చేరుకోటానికి అనేక మార్గాలు వున్నాయి. షిర్డీకి డైరెక్ట్ గా ట్రైన్స్ వున్నాయి. లేకపోతే పూనేకి విమానంలో వెళ్లి అక్కడ్నుంచి టాక్సీ లేదా సొంత కార్లలో ప్రయాణించవచ్చు.

pc:youtube

17. ఎలా చేరాలి

17. ఎలా చేరాలి

అలాగే షిర్డీ నాసిక్ కు చాలా దగ్గరగా వుంది. నాసిక్ నుండి చాలా సిటీబస్సులు షిర్డీకి అందుబాటులో ఉన్నాయి. షిర్డీ లోపల ప్రయాణించటానికి రిక్షా లేదా టాంగాలో వెళ్ళవచ్చును. పూణే నుండి షిర్డీ దూరం: 199.9 కి.మీ నాశిక్ నుండి షిర్డీ దూరం: 87.5 కి.మీ.

pc:youtube

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X