Search
  • Follow NativePlanet
Share
» »కష్టాలు తొలగించే అయినవిల్లి గణపతి !!

కష్టాలు తొలగించే అయినవిల్లి గణపతి !!

అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థానంను ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 1 వరకు మరియు సాయంత్రం 3 : 30 నుండి 8 గంటల వరకు భక్తులు దర్శించవచ్చు.

By Mohammad

క్షేత్రం : అయినవిల్లి (కోనసీమ)
జిల్లా : తూర్పు గోదావరి
ప్రధాన ఆకర్షణ : శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థానం

ఆలయం తెరుచు సమయం : ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 1 వరకు మరియు సాయంత్రం 3 : 30 నుండి 8 గంటల వరకు భక్తులు గుడిని దర్శించవచ్చు. ప్రతి రోజూ ఉదయం 7 గంటల నుండి ఉదయం 11 గంటల వరకు అభిషేకాలు నిర్వహిస్తారు.

అయినవిల్లి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక గ్రామము. కోనసీమగా ప్రసిధ్ది చెందినది. ఈ గ్రామం పరిసర ప్రాంతాలు చాలా అందం ఉంటాయి. కోబ్బరి తోటలు, గోదావరి నది ఒడ్డు, పచ్చని పోలాలు, కాలువలు ఇంకా ఎన్నో ఉన్నాయి.

స్థలపురాణం

ఇతిహాసం ప్రకారం రెండు కథలు ఉన్నాయి. మొదటి కథ ప్రకారం దక్ష ప్రజాపతి దక్ష యజ్ఞాన్ని ప్రారంభించడానికి ముందు ఇక్కడ పూజలు జరిపాడని చెబుతారు. స్వయంభువ వినాయకక్షేత్రాలలో ఇది మొదటిదని విశ్వసించబడుతుంది. ఇది కృతయుగానికి చెందినదిగా భావిస్తున్నారు.మరొక కథనం అనుసరించి వ్యాసమహర్షి దక్షిణ భారత దేశ యాత్ర ప్రారంభసమయంలో ఇక్కడ పార్వతి తనయుడైన వినాయకుని ప్రతిష్ఠించాడని ఈ వినాయకుడే భక్తుల కోరికలు తీర్చే సిద్ధి వినాయకుడు అయ్యాడని చెబుతారు.

దేవాలయం గోపురం, అయినవిల్లి

దేవాలయం గోపురం, అయినవిల్లి

చిత్రకృప : కాసుబాబు

సువిశాలమైన ఆవరణలో ఎత్తైన ప్రాకారంతో విరాజిల్లుతున్న ఈ దేవాల యంలో శ్రీవిఘ్నేశ్వరస్వామి దక్షిణాభిముఖుడై ఉంటాడు. సాధారణంగా ప్రతీ దేవాలయాలు తూర్పుముఖంగా ఉంటాయి. అయి తే అయినవిల్లిలో సిద్ధివినాయకుని ఆలయం మాత్రం దక్షిణముఖంగా ఉండడం విశేషం. అంతేగాక ఈ గ్రామంలో దక్షిణ సింహాద్వారంతో నిర్మించిన గృహాలకు ఎటువంటి విఘ్నాలు కలుగవని, గృహాలు సంవృద్ధికరంగా ఉంటాయని స్థానికుల ప్రగాఢవిశ్వాసం. రెండు గోపురాలతోచూపరులను ఆకట్టుకునే సింహద్వారాలతో విఘ్నేశ్వర దేవాలయ సౌందర్యం సందర్శకులను సమ్మోహనపరుస్తూ ఉంది.

ఆలయ ప్రాంగణంలో క్షేత్రపాలకుడైన కాలభైరవుని ఆలయంతోపాటు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీకేశవునికి, శివునికి, శ్రీఅన్నపూర్ణాదేవికి, శ్రీకాలభైరవస్వామికి ఉపాయాలు ఉన్నాయి. శివకేశవులకు తారతమ్యాలు లేకుండా ఈ ఆలయాన్ని నిర్మించారని విశ్వసిస్తున్నారు.ఆలయానికి రెండు గోపురాలు ఉన్నాయి. దక్షిణ గోపురం ద్వారా ఆలయానికి చేరితే వినాయకుడిని దర్శనం చెసుకోవచ్చు. ఇక్కడ స్వామి దక్షిణ ముఖుడై ఉన్నాడు.

శ్రీ సిద్ధి వినాయకుడు

శ్రీ సిద్ధి వినాయకుడు

ప్రధాన ఆలయంలోని విశ్వేశ్వరుని దర్శనం చేసుకోవడానికి తూర్పు గోపురం నుండి ప్రవేశించవచ్చు. ఈ ఆలయానికి అనుసంధానంగా ఉన్న ఆలయం లోనే శ్రీదేవి, భూదేవి సమేతుడైన కేశవ స్వామి ఉన్నారు. అన్నపూర్ణా దేవి ఆలయం కూడా ఈ ఆలయ సన్నిధిలో ఉన్నది. ఆలయానికి క్షేత్ర పాలకుడైన కాలభైరవుడు గుడి కూడా ప్రధానాలయ ప్రాంగణం లోనే ఉంది. ఈ ఆలయానికి వివిధ ప్రదేశాలనుండి భక్తులు వచ్చి వారి మొక్కులు తీర్చుకొంటారు. ఇక్కడి ఆలయంలో పూజలు శైవ ఆగమశాస్త్రానుసారంగా జరుగుతాయి.

ఇది కూడా చదవండి : తలుపులమ్మ తల్లి దేవాలయం, తుని !!

ప్రత్యేక పూజలు

ప్రతినిత్యం స్వామివారికి శైవాగమన ప్రకారం కొబ్బరికాయలు, పండ్లరసాలతో అభిషేకాలు నిర్వహించడం ఇక్కడి ప్రత్యేకత. భక్తులు ఇక్కడకు వచ్చి కోరిన కోర్కెలు తీరిన వెంటనే మరలా మొక్కుబడులు తీర్చుకొ నడం విశేషం. దేశం నలుమూలల నుండి వేలాది మంది భక్తులు, ప్రముఖులు నిత్యం స్వామివారిని సందర్శిస్తారు. అయినవిల్లి సిద్ధివినాయకుని భక్తిశ్రద్ధలతో అర్చిస్తే కోర్కెలతోపాటు బుద్ధి వికసిస్తుందని విశ్వసిస్తున్నారు.

గోదావరి నది, అమలాపురం

గోదావరి నది, అమలాపురం

చిత్రకృప : BSSKrishnaS

పండుగలు

ఇక్కడ వినాయక చవితి, దసరా, ఉగాది, శివరాత్రి, కార్తీక మాసం రోజులలో ప్రత్యేక పూజలు జరుగుతాయి. సంక్రాంతి రోజు ప్రభల ఉత్సవం ఇక్కడ ప్రత్యేకం.

వసతి సౌకర్యం : సమీపంలోని అమలాపురం, రావులపాలెం, రాజమండ్రి, కాకినాడ లో వసతి పొందవచ్చు.

ఎక్కడి నుండి ఎంత దూరం ??

ఐనవల్లి కాకినాడకు 72 కి.మీ. (వయా యానాం, అమలాపురం, ముక్తేశ్వరం),రాజమండ్రికి 55 కి.మీ. (వయా రావులపాలెం,కొత్తపేట,వనపల్లి), అమలాపురానికి 12 కి.మీ. (వయా ముక్తేశ్వరం) దూరం లో ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X