Search
  • Follow NativePlanet
Share
» »శ్రీపెరుంబుదూర్ - స్మారకాలు, రేసులు !

శ్రీపెరుంబుదూర్ - స్మారకాలు, రేసులు !

By Mohammad

శ్రిపెరంబుదూర్ తమిళ్ నాడు లోని కాంచీపురం జిల్లాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఒక పర్యాటక పట్టణం. శ్రీ పెరంబుదూర్ కు పురాతన పేరు బూధపురి. శ్రీ పెరంబుదూర్ లో మరణించిన వారికి నెరుగా స్వర్గపు ద్వారాలు తెరచి ఉంటాయని చెపుతారు. ఇటీవలి కాలంలో శ్రీ పెరంబుదూర్ అనేక అంతర్జాతీయ సంస్థలకు నిలయంగా మారింది. బెంగుళూరు - చెన్నై హైవే లో చెన్నై కి 40 కి.మీ.ల దూరంలో కలదు.

ఇది కూడా చదవండి : 60 km ల దూరంలోని వేదాంతంగల్ పురాతన అభయారణ్యం !

శ్రీపెరుంబుదూర్ లో మరియు చుట్టుపక్కల గల ఆకర్షణలు

శ్రీపెరుంబుదూర్ లో మరియు చుట్టుపక్కల రాజీవ్ గాంధి మెమోరియల్, మద్రాస్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్, మురుగన్ ఆలయం, బ్రహాకుమారి మ్యూజియం, విజయనగర రాజులు నిర్మించిన చెంగల్పట్టు కోట, థీమ్ పార్క్ మొదలైనవి చూడవచ్చు. శ్రీపెరుంబుదూర్ లో వసతికై హోటళ్లు కలవు. తమిళనాడు సంప్రదాయ వంటకాలను వడ్డిస్తారు.

ఇది కూడా చదవండి : మంత్రముగ్ధులను చేసే తమిళనాడు ప్యాలెస్ లు !

రాజీవ్ గాంధి మెమోరియల్

రాజీవ్ గాంధి మెమోరియల్

శ్రీ పెరంబుదూర్ లో పర్యాటకులు తప్పక చూడవలసిన స్మారక కట్టడం రాజీవ్ గాంధి మెమోరియల్. రాజీవ్ గాంధి హత్యానంతరం తమిళనాడు ప్రభుత్వం దీనిని 1991 వ సంవత్సరంలో ఏర్పాటు చేసింది. భారతరత్న, దివంగత మాజీ రాష్ట్రపతి డా. అబ్దుల్ కలాం మెమోరియల్ ను జాతికి అంకితం చేసాడు.

చిత్ర కృప : Prashant Solomon

వళ్ళకొట్టై మురుగన్ ఆలయం

వళ్ళకొట్టై మురుగన్ ఆలయం

వళ్ళకొట్టై మురుగన్ ఆలయం శ్రీపెరుంబుదూర్ నుండి కేవలం 9 కిలోమీటర్ల దూరంలో కలదు. ఈ ఆలయం 1200 సంవత్సరాల క్రితం నాటిది. గుడిలో 7 అడుగుల ఎత్తుగల మురుగన్ విగ్రహం ఉంటుంది. ఆలయంలో ఆలయం లో కొలను కలదు. దీనిని ఇంద్రుడు తన వజ్రాయుధంతో నిర్మించాడని, అందుకే దీనికి వజ్ర తీర్థం అని పేరు.

చిత్ర కృప : chandrasekaran arumugam

చెంగల్పట్టు

చెంగల్పట్టు

చెంగల్పట్టు ప్రాంతంలో పూవులు అధికంగా పూస్తాయి. చెంగల్పట్టు అనేది ఒక లిల్లి పూవు పేరు. తమిళనాడు పర్యాటక సంస్థ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరిచి సందర్శకుల కొరకు బోట్ విహారాన్ని ఏర్పాటు చేసింది. విజయనగర రాజులు కట్టించిన కోట కూడా సమీపంలో కలదు.

చిత్ర కృప : satpoorani

బ్రహ్మకుమారీ మ్యూజియం

బ్రహ్మకుమారీ మ్యూజియం

బ్రహ్మకుమారీ మ్యూజియం పెరుంబుదూర్ లో బెంగళూరు బైపాస్ లో కలదు. బ్రహ్మకుమారీల కేంద్రాలు దేశ విదేశాలలో సేవలను అందిస్తున్నాయి. వీరు ఆధ్యాత్మికతను స్టడీ చేస్తారు. భగవంతుడు, ఆత్మ వంటివి భోధిస్తుంటారు.

చిత్ర కృప : WCities

మద్రాస్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్

మద్రాస్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్

మద్రాస్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్ ను మద్రాస్ స్పోర్ట్స్ క్లబ్ సొసైటీ వారు స్పాన్సర్ చేస్తున్నారు. ఇందులో మోటార్ బైకుల రేసులు నిర్వహిస్తుంటారు. దీనిని 1953 లో క్రీడాభిమానులు కోసం, బైకు రేసర్ల కోసం ఏర్పాటుచేశారు.

చిత్ర కృప : telugu native planet

ఇతర ఆకర్షణలు

ఇతర ఆకర్షణలు

శ్రీపెరుంబుదూర్ మరో ఆకర్షణ తాంబరం థీమ్ పార్క్. ఇది పెరుంబుదూర్ నుండి 25 km ల దూరంలో కలదు. మద్రాస్ అటామిక్ పవర్ స్టేషన్ కూడా వీలుంటే చూడవలసినదే.

చిత్ర కృప : vgpuniversalkingdom

శ్రీపెరుంబుదూర్ ఎలా చేరుకోవాలి ?

శ్రీపెరుంబుదూర్ ఎలా చేరుకోవాలి ?

సమీప విమానాశ్రయం : చెన్నై లోని అంతర్జాతీయ విమానాశ్రయం. ఇది 40 km ల దూరంలో కలదు.

సమీప రైల్వే స్టేషన్ : తిరువళ్లూరు రైల్వే స్టేషన్. ఇది 17 km ల దూరంలో కలదు. చెన్నై ప్రధాన రైల్వే స్టేషన్ గా కలదు.

బస్సు లేదా రోడ్డు మార్గం : చెన్నై, కాంచీపురం నుండి శ్రీపెరుంబుదూర్ కు ప్రభుత్వ / ప్రవేట్ బస్సులు కలవు.

చిత్ర కృప : Arun Sha Masood

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X