Search
  • Follow NativePlanet
Share
» »గుజరాత్‌లోని చారిత్రక ఏడు భూగర్భ అంతస్తుల బావి రాణి కి వావ్

గుజరాత్‌లోని చారిత్రక ఏడు భూగర్భ అంతస్తుల బావి రాణి కి వావ్

ఒకప్పుడు మధ్యయుగ కాలంలో గుజరాత్ రాజధాని అయిన పటాన్ నేడు ఆ పురాతన కాలమునకు సాక్ష్యంగా నిలచింది.

By Venkatakarunasri

ఒకప్పుడు మధ్యయుగ కాలంలో గుజరాత్ రాజధాని అయిన పటాన్ నేడు ఆ పురాతన కాలమునకు సాక్ష్యంగా నిలచింది. పటాన్ 8వ శతాబ్దంలో చాళుక్య రాజపుత్రుల చావడ కింగ్డమ్ అయిన వనరాజ్ చావడ అనే రాజు నిర్మించిన కందంకం,దుర్గములు మొదలైన వాటిచే శక్తివంతంగా నిర్మించిన నగరం.

ఈ నగరమునకు రాజు వనరాజ్ యొక్క గొర్రెల కాపరి స్నేహితుడు అయిన అనహిల్ పేరును పెట్టారు. నగరమును అన్హిల్వాడ్ పటాన్ అని పిలుస్తారు. ప్రస్తుత నగరంలో ఒకప్పుడు ఢిల్లీ సుల్తాన్ అయిన కుతుబ్-ఉద్ దిన్ అయ్బాక్ వల్ల నాశనం అయిపోయిన రాజ్యం యొక్క శిధిలాలు ఉన్నాయి. ముస్లిం మతం దూకుడు వ్యాప్తి ఫలితంగా, పటాన్ లో అహ్మదాబాద్ వంటి వాటి కంటే కూడా పురాతనమైన కొన్నిముస్లింమత నిర్మాణాలు ఉన్నాయి.

పర్యాటకులు ఆకర్షించే రాణి కి వావ్,త్రికం బరోట్ ని వావ్, కాల్కా సమీపంలో ఓల్డ్ ఫోర్ట్, సహస్రలింగ సరోవర్ మొదలైనవి మరియు చాళుక్య లేదా సోలంకి కాలంనకు చెందిన నిర్మాణ అవశేషాలు పూర్తిగా చూడవచ్చు. జైనమతం యొక్క ప్రసిద్ధ కేంద్రాలలో పటాన్ ఒకటి. జైన దేవాలయాలు సోలంకి కాలంలో నిర్మించబడ్డాయి. ప్రస్తుతం పటాన్లో పటోల చీరలకు కూడా ప్రసిద్ధి చెందింది.

రాణి కి వావ్ చారిత్రక ఏడు భూగర్భ అంతస్తుల బావి

దీని లోపల 28 కి.మీల సొరంగం వుంటుందంట. మరి ఆ విషయాలు మనం తెలుసుకుందాం.

ఎక్కడ వుంది?

ఎక్కడ వుంది?

గుజరాత్ లోని పఠాన్ పట్టణంలో వుంది.

PC: Santanu Sen

టెక్నాలజీ

టెక్నాలజీ

రాణి కి వావ్ అప్పటి టెక్నాలజీకి నిదర్శనం. క్రీ.శ.1022 మరియు 1063 మధ్య రాణి ఉదయమతి బావిని కట్టించారు.

PC:Miteshnathani

1 వ భీందేవ్

1 వ భీందేవ్

సోలంకిని పాలించిన తన భర్త ఒకటవ భీందేవ్ గుర్తుగా ఈ బావిని నిర్మించారు.

PC:Nagarjun Kandukuru

ఏడు భూగర్భ అంతస్తుల బావిలో ఏముంది?

ఏడు భూగర్భ అంతస్తుల బావిలో ఏముంది?

ఏడు భూగర్భ అంతస్తుల బావిలో గంగాదేవి ఆలయం కూడా నిర్మించారు. ఇది అప్పటి సాంకేతికతకు నిదర్శనం.

PC:Archiraul88

ఆశ్చర్యపరిచే సాంకేతికత

ఆశ్చర్యపరిచే సాంకేతికత

అంత అద్భుతంగా సాంకేతికతతో ఈ బావి నిర్మాణం ఇప్పటి వాళ్ళను ఆశ్చర్యపరుస్తుంది.

అత్యద్భుతమైన సాంకేతికత

అత్యద్భుతమైన సాంకేతికత

ఒకే నిర్మాణం కింద భూగర్భ నీటి వనరులను వాడుకోవడం అప్పటి సాంకేతికత అభివృద్ది రాణి కి వావ్ అత్యద్భుతంగా నిలిచింది.

భూగర్భ ప్రత్యేక కళాత్మకతకు ఇది ఒక ఉదాహరణ

భూగర్భ ప్రత్యేక కళాత్మకతకు ఇది ఒక ఉదాహరణ

భారతదేశంలో అప్పటి భూగర్భ ప్రత్యేక కళాత్మకతకు ఇది ఒక ఉదాహరణ అని యునెస్కో గొప్పగా చెప్పింది. అంతే కాదు ఖతార్‌లోని దోహాలో జరిగిన వరల్డ్ హెరిటేజ్ కమిటీ సమావేశంలో యునెస్కో ఈ బావిని ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చేర్చినట్లు ఘనంగా ప్రకటించింది.

బావి పొడవు, వెడల్పులు

బావి పొడవు, వెడల్పులు

ఈ బావి 209 అడుగుల పొడవు, 65 అడుగుల వెడల్పు, 88 అడుగుల లోతుతో చూడ్డానికి ఓ భూగర్భ కోటలా ఉంటుంది. పూర్తిగా రాతితో నిర్మించిన దీంట్లో ఎటుచూసినా స్తంభాలపై శిల్ప సంపద ఉట్టి పడుతుంది.

శిల్పకళ

శిల్పకళ

రాణి కీ వావ్ బావి నిర్మాణంలో శిల్పకళకు అత్యంత ప్రాధాన్యమిచ్చారు. ఈ శిల్పాలలో విష్ణువు యొక్క దశవతారాలైన కల్కి, రామ, నరసింహ, వామన, వారాహి శిల్పాలు, మహిషాసురమర్ధిని మాత శిల్పాలు, నాగకన్య, యోగిని వంటి అందమైన స్త్రీల శిల్పాలు, సోలా శృంగారం అని పిలవబడే 16 రకాల శైలులగా ఆకర్షణీయంగా కనిపించే అప్సర శిల్పాలు ఉన్నాయి.

PC:Harsh Patel

సొరంగం

సొరంగం

ఈ బావి అడుగున ఓ సొరంగం ఉందని, అది 28 కిలోమీటర్ల పొడవు ఉండేదని ఇప్పుడు మట్టితో నిండిందని చెబుతారు. ఇప్పుడు బావి అడుగున కొన్ని నీళ్లు మాత్రమే ఉన్నాయి. దీన్ని రోజూ వేలాది సంఖ్యలో దేశవిదేశీ పర్యాటకులు సందర్శిస్తుంటారు.

PC:Anvesh Jadav

భారత పురావస్తుశాఖ

భారత పురావస్తుశాఖ

దాదాపు ఏడు శతాబ్దాలపాటు వరదలకు మట్టిలో కూరుకుపోయిన ఈ బావిని 1980ల్లో భారత పురావస్తుశాఖ వారు గుర్తించి అది పాడవకుండా తగిన చర్యలు చేపట్టారు.

PC:Kinjalps

వేలకొలది పర్యాటకులు

వేలకొలది పర్యాటకులు

రాణి కి వావ్ బావిని చూడటానికి రోజుకి వేల సంఖ్యలో దేశవిదేశాల నుంచి పర్యాటకులు వస్తూ వుంటారు.

ఇక్కడికి దగ్గరలో చూడదగిన పర్యాటక కేంద్రాలు

ఇక్కడికి దగ్గరలో చూడదగిన పర్యాటక కేంద్రాలు

జైన్ టెంపుల్స్, పటాన్

సోలంకి కాలంలో ఈ పటాన్ జైన మతానికి ప్రధాన కేంద్రంగా విరాజిల్లిందని భావన. ఇక్కడ వందల కొలది జైన్ ఆలయాలు ఉన్నాయి. పంచసార పార్శ్వనాథ్ జైన్ దేరసర్ ఆలయము ఇక్కడ ప్రధాన ఆలయాల్లో ఒకటి. సంప్రదాయం ప్రకారం ఇక్కడ ఈ జైన్ అలయాల్ని తెల్ల పాలరాతి తో నిర్మితమై ఉన్నాయి. గతంలో జైన్ ఆలయాల్ని కలపతో నిర్మించేవారు.

జైన్ టెంపుల్స్, పటాన్

జైన్ టెంపుల్స్, పటాన్

అయితే ఈ ఆలయాలు కలప నుండి పాలరాతి కి మారటానికి ఒక ఆసక్తి కరమైన కధ ఉన్నది. ఉడా మెహతా అనే ప్రముఖ నిర్మాణకర్త,ఒకసారి ఒక ఎలుక వెలిగే కొవ్వొత్తిని నోటితో పట్టుకొని ఆలయంలోకి పరెగెత్తుకొని వెళ్ళటం చూసాడు. అప్పుడు ఈ అంశాన్ని ప్రాదిప్రదిక గా చేసుకొని జైన్ ఆలయాలను కలపతో కాకుండా పాలరాయితో నిర్మించటం ప్రారంభించారని నమ్మిక.

PC: Daderot

పటాన్ సహస్రలింగ తలవ్, పటాన్

పటాన్ సహస్రలింగ తలవ్, పటాన్

పటాన్ సహస్రలింగ తలవ్ అనే ఒక రిజర్వాయర్ దుర్లభ్ సరోవర్ అని పిలువబడే ఒక సరస్సు మీద సిద్ధ్రాజ్ జయసిన్ 1084 వ సంవత్సరంలో నిర్మించారు. సహస్రలింగ తలవ్ కి సాహిత్యపరంగా 'వెయ్యి లింగాల సరస్సు' అని అర్దము. గుజరాత్ రాష్ట్రంలో పటాన్ కు ఉత్తర దిశగా రాణి కి వావ్ ఉంది. సరస్సు మీద మూడు సార్లు దాడి చేశారు మరియు ఇంకా దాని భాగాలు కొన్ని చెక్కుచెదరకుండా ఉన్నాయి.

పటాన్ సహస్రలింగ తలవ్, పటాన్

పటాన్ సహస్రలింగ తలవ్, పటాన్

సరస్వతి నది నుండి ఒక నీటి కాలువ ద్వారా ఈ రిజర్వాయర్ కు నీరు అందుతుంది. సహజసిద్ద వడపోత కలిగి ఉండటం ఈ రిజర్వాయర్ విసిస్టత. అక్కడ ఉన్న ఫ్లాట్ ఫాం మీదుగా ఆ రిజర్వాయర్ ను వీక్షించవచ్చు. అక్కడ అనేక శిల్పాలు,దేవతా విగ్రహాలు ఉన్నాయి.

 పటోల నేతవారు, పటాన్

పటోల నేతవారు, పటాన్

పటాన్ వద్ద పటోల నేతవారు అల్లిన పట్టును పటోల అని పిలుస్తారు. పటోల పట్టును నేసె పద్దతి అన్ని నేత పద్ధతులు కన్నా చాలా కష్టంగా ఉంటుంది. వారు పట్టు నేత పనికి 'డబుల్ ఇక్కాట్ శైలి' ని ఉపయోగిస్తారు. ఈ ప్రత్యేక శైలి పటోల చేనేతకారులే కాకుండా ఇండోనేషియాలో కూడా ఈ పద్దతిని ఉపయోగిస్తారు.

పటోల నేతవారు, పటాన్

పటోల నేతవారు, పటాన్

చీరలు తయారు చేయటానికి నెలల సమయం పడుతుంది, అందుకే వారు అధిక ధరల టాగ్లు వేస్తారు. పటోల చీరల నేత హస్తకళను ప్రస్తుతం సాల్వి కమ్యూనిటీ వారు మాత్రమే నిర్వహిస్తున్నారు.

ఎలా వెళ్ళాలి

ఎలా వెళ్ళాలి

రూట్ 1:

హైదరాబాద్ నుండి రాణీ కి వావ్ చేరటానికి ఈ రూట్ లో 24 గంటల సమయం పడుతుంది. ముంబై, సూరత్ మీదుగా వెళ్ళవలసి వుంటుంది.

pc: google maps

రూట్ 2:

రూట్ 2:

ఈ మార్గంలో నాశిక్ ను కూడా దర్శిమ్చుకోవచ్చును. ఈ రూట్ లో 24 గంటల సమయం పడుతుంది.

pc:google maps

రూట్ 3:

రూట్ 3:

ఈ రూట్ లో కూడా 24 గంటల సమయం పడుతుంది.

pc:google maps

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X