అనంతపద్మనాభ స్వామి ఆరవ గది తెరిస్తే మొత్తం ప్రపంచాన్ని ముంచేస్తుందా?
వెతకండి
 
వెతకండి
 

హిమాచలప్రదేశ్ లో సంవత్సరంలో ఐదు రోజులు వస్త్రాలు ధరించరంట

Updated: Wednesday, June 21, 2017, 14:43 [IST]
Share this on your social network:
   Facebook Twitter Google+ Pin it  Comments

LATEST: ఒకే రాత్రిలో స్వయంగా దెయ్యాలే నిర్మించిన దేవాలయమిది.

ఆ ఊరిలో తల లేని మొండెం అర్ధరాత్రి తిరుగుతుంది !

ఎ.ఆర్.రహమాన్ కుటుంబ సభ్యులతో తరచూ వచ్చే దర్గా ఎక్కడుందో తెలుసా?

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం ఉత్తర భారత దేశం లో కలదు. ఇది ఒక గొప్ప పర్యాటక ప్రదేశం కాగా ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఇక్కడ పర్యాటక రంగం బాగా అభివృద్ధి చెందుతోంది. జాతీయ ఆదాయానికి ఈ రంగం నుండి అధిక భాగం లభిస్తోంది. టూరిజం రంగం లోని ఈ అభివృద్ధి హిమాచల్ ప్రదేశ్ లో అనేక హోటళ్ళ మరియు రిసార్ట్ ల స్థాపనకు దోహదం చేసింది. పర్యాటకులకు మరింత ఆనందం మరియు చక్కని అనుభూతులను పంచుతోంది.

దేశంలోని కొన్ని ప్రాంతాలలో వింతవింత ఆచారాలు, సాంప్రదాయాలు కొనసాగిస్తుంటారు. అయితే ఈ ఆచారాలను కొనసాగించడం వెనక ప్రత్యేక కారణాలు వున్నాయని చెబుతుంటారు.

హిమాచల్ ప్రదేశ్ లోని 12 జిల్లాలలోని ప్రతి జిల్లాలోను అనేక ఆకర్షణా ప్రాంతాలు కలవు. సైట్ సీఇంగ్, మతపర ప్రదేశాలు, ట్రెక్కింగ్, పర్వతారోహణ, ఫిషింగ్, రివర్ రాఫ్టింగ్, స్కీయింగ్, పారా గ్లైడింగ్, ఐస్ స్కేటింగ్, గోల్ఫ్ వంటివి ఎన్నో కలవు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర టూరిజం శాఖ ఈ జిల్లాలను నాలుగు సర్కిల్స్ గా విభజించినది. అవి సట్లేజ్ , బియాస్ , దౌలాధస్ర్ మరియు ట్రైబల్ సర్కిల్స్. బియాస్ నది ప్రఖ్యాత మనాలి, కులు వాలీ ల గుండా ప్రవహిస్తుంది.

ఈ సర్కిల్ పర్యాటకులకు దేవదారు అడవులు, పైన్ చెట్లు, ఆల్పైన్ పొలాలు, పర్వత వాలులు, పచ్చటి మైదానాలు , పూవుల తోటలు, పండ్ల తోటలు మొదలైనవి చూపుతుంది. గిరిజనుల వలయ ప్రదేశాలలో, మంచు కొండలు, మంచుతో గడ్డకట్టిన సరస్సులు, కనుమలు, అందమైన ఆరామాలు, లామాలు, జడల బర్రెలు కనపడతాయి. గొప్ప సాంప్రదాయక విలువలతో కూడిన ఈ ప్రదేశం అతి గొప్ప సాహస క్రీడలకు ప్రసిద్ధి.

వింతవింత ఆచారాలు, సాంప్రదాయాలు

టాప్ 3 ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి

1. పర్యాటకులు

హిమాచలప్రదేశ్ రాష్ట్రానికి పర్యాటకులు ఎక్కువగా వుంటారు.

pc: youtube

 

2. సుందరప్రదేశాలు

ఈ ప్రాంతంలో సుందరప్రదేశాలకు పర్యాటకులు ఎక్కువగా వస్తూవుంటారు.

pc: youtube

 

3. ఆదాయం

అయితే ఈ రాష్ట్రానికి పర్యాటకుల ద్వారానే ఎక్కువగా ఆదాయం సమకూరుతోంది.

pc: youtube

 

4. ప్రజల జీవన శైలి

అయితే ఈ రాష్ట్రంలోని వీణ అనే ప్రాంతంలోని ప్రజల జీవన శైలి వింతగా వుంటుంది.

pc: youtube

 

5. ఆచారాలు

ఇప్పటికీ కూడా ఆ గ్రామస్థులు పురాతన కాలం నుండి వస్తున్న ఈ ఆచారాలను కొనసాగిస్తున్నారు.

pc: youtube

 

6. 5 రోజులపాటు భర్తలు

ఏడాదిలో 5 రోజులపాటు భర్తలు తమ భార్యలతో అస్సలు మాట్లాడరు.

pc: youtube

 

7. గ్రామస్తులు

అంతేకాదు 5 రోజులపాటు ఈ గ్రామస్తులు ఎవరూ కూడా మద్యం జోలికి వెళ్ళరు.

pc: youtube

 

8. దుస్తులు

అంతేకాకుండా మరో వింతైన ఆచారం ఏంటంటే 5 రోజులపాటు మహిళలు ప్రతిపనిని దుస్తులు లేకుండానే చేస్తారు.

pc: youtube

 

9. గ్రామస్థులు

ఒకవేళ అలా చేయకపోతే ఆశుభమని భావిస్తారు. పురాతన కాలం నుండి వస్తున్న ఈ ఆచారాలను కొనసాగించకపోతే గ్రామానికి కీడు వాటిల్లుతుందని గ్రామస్థులు నమ్ముతారు.

pc: youtube

 

10. ఆచారాలు

అందుకే ఈ ఆచారాలను విశ్వసిస్తారు. గతంలో ఈ ప్రాంతానికి రాక్షసులు ప్రవేశించి ప్రజలను భయబ్రాంతులకు గురిచేసేవారని స్థానికుల నమ్మకం.అయితే ఆ సమయంలో దేవతలు వచ్చి ఆ రాక్షసులను మట్టుబెట్టారు.

pc: youtube

 

11. శివాలిక్ పర్వతాలు

హిమాలయాల వెలుపలి భాగంగా చెప్పబడే ధౌళాధర్ సర్క్యూట్ డల్హౌసీ తో మొదలై బద్రినాథ్ తో ముగుస్తుంది. ఈ సర్క్యూట్ కాంగ్రా వాలీ నుండి బాగా కనబడుతుంది. సట్లేజ్ సర్క్యూట్ శివాలిక్ పర్వతాల దిగువ భాగ కొండలను చూపుతుంది.

pc: youtube

 

12. హిందూ దేవాలయాలు

ఈ సర్క్యూట్ లో అందమైన పచ్చని ఆపిల్ తోటలు, పైన్ మరియు దేవదార్ అడవులు , సట్లేజ్ నది వంటివి పర్యాటకులకు ఆనందం కలిగిస్తాయి. 'దేవతల నివాసం ' గా చెప్పబడే ఈ రాష్ట్రం లో అనేక హిందూ దేవాలయాలు కలవు.

pc: youtube

 

13. ప్రధాన సిక్కుల మత కేంద్రాలు

జ్వాలాముఖి, చాముండా, వజ్రేశ్వరి, చిన్తపుర్ని, వైద్యనాధ్, లక్ష్మినారయన్, చౌరాసి దేవాలయాలు వాటిలో కొన్ని. అనేక గురుద్వారాలు మరియు చర్చి లు కూడా రాష్ట్రం లోని వివిధ భాగాలలో కలవు. పవొంతా సాహిబ్, రేవల్సార్ మరియు మనికారాన్ ప్రదేశాలు ప్రధాన సిక్కుల మత కేంద్రాలు.

pc: youtube

 

14. రాచరిక వైభవం

క్రిస్ట్ చర్చి కసౌలి, క్రిస్ట్ చర్చి సిమ్లా మరియు సైట్ జాన్స్ చర్చి వంటివి ప్రధాన క్రైస్తవ మత చర్చి లు. ప్రకృతి ప్రేమికులకు గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్, పిన్ వాలీ నేషనల్ పార్క్, రేణుక సంక్చురి , పాంగ్ డం సంక్చురి, గోపాల్పూర్ జూ, కుఫ్రి వంటివి ప్రసిద్ధ ప్రదేశాలు. కాంగ్రా ఫోర్ట్, జుబ్బల్ పాలస్, నగ్గర్ కేజల్, కమరు ఫోర్ట్, గోండ్లా ఫోర్ట్, క్రిస్ట్ చర్చి, చాప్స్లీ, వుడ్ విల్లా పాలస్, చైల్ పాలస్ వంటి ప్రదేశాలలో రాచరిక వైభవం చూడవచ్చు.

pc: youtube

 

15. మ్యూజియంలు మరియు గేలరీలు

పురాతన రాజుల కాలం నాటి చరిత్రకు సంబంధించిన అనేక మ్యూజియంలు మరియు గేలరీలు కూడా కలవు. వాటిలో స్టేట్ మ్యూజియం, కాంగ్రా ఆర్ట్ గేలరీ, భూరి సింగ్ మ్యూజియం, రోరిచ్ ఆర్ట్ గేలరీ మరియు శోభా సింగ్ ఆర్ట్ గేలరీ లు ప్రధానమైనవి. ప్రశాంతంగా సమయం గడపాలనుకునే వారికి అందమైన అనేక సరస్సులు కలవు. వాటిలో ప్రశార్ లేక్, ఖజ్జాయర్ లేక్, రేణుక లేక్, గోవింద్ సాగర్ లేక్, దళ్ లేక్, పాంగ్ డాం లేక్, పండో లేక్, మని మహేష్ లేక్ మరియు బ్రిఘు లేక్ వంటివి కొన్ని.

pc: youtube

 

16. పర్యాటకులు

హిమాచల్ ప్రదేశ్ అనేక ఉత్సవ వేడుకలుకు కూడా ప్రసిద్ధి చెందినది. ప్రతి ఏటా వింటర్ కార్నివాల్ శివరాత్రి, లాదర్చా ఫెయిర్, మిన్జార్ ఫెయిర్, మని మహేష్ ఫెయిర్, ఫులేచ్, కులు దసరా లావి ఫెయిర్, రేణుక ఫెయిర్ , ఐస్ స్కేటింగ్ కార్నివాల్, వంటివి ప్రసిద్ధి. బీర్, మనాలి, బిలాస్పూర్, రోహ్రు వంటి ప్రదేశాలు పర్యాటకులు అభిలషించే సాహస క్రీడలైన ఏరో క్రీడలు...పారా గ్లైడింగ్ మరియు హాంగ్ గ్లైడింగ్ లకు ప్రసిద్ధి.

pc: youtube

 

English summary

Strange Rituals In This Town !

Himachal Pradesh is a state of India located in Northern India. It is bordered by Jammu and Kashmir on the north, Punjab and Chandigarh on the west, Haryana on the south-west, Uttarakhand on the south-east and by the Tibet Autonomous Region on the east.
Please Wait while comments are loading...