Search
  • Follow NativePlanet
Share
» »హైదరాబాద్ రోడ్ సైడ్ బండి టిఫిన్ సెంటర్లు !

హైదరాబాద్ రోడ్ సైడ్ బండి టిఫిన్ సెంటర్లు !

హైదరాబాద్ లో ఇలాంటి వారికోసమే కొన్ని రోడ్ సైడ్ బండీలు ఉన్నాయి. మీరు గనక అటువైపు ఒకసారి వెళితే రుచి చూడటం మరవద్దు.

హైదరాబాద్ ఒక మహా నగరం. ఇక్కడ వివిధ రాష్ట్రాల ప్రజలు జీవనం సాగిస్తుంటారు. తన, మన అనే తేడా లేకుండా ఒకరినొకరు పరస్పరం పలకరించుకుంటూ హాయిగా, ప్రశాంతంగా ఉంటుంటారు. హైదరాబాద్ సిటీ లైఫ్ కనుక ఉదయాన్నే లేవటం, రాత్రి పొద్దు పోయేవరకు పనులు చేసుకోవడం ఇది షరా మామూలే. మరి పనిచేయాలంటే శక్తి కావాలి. శక్తి అనేది తింటే వస్తుంది. డబ్బున్నొళ్ళు పెద్ద పెద్ద హోటళ్ళలో మంచి మంచి ఫుడ్ లు తింటారు. మరి మామూలు జీతగాడు, రోజు కూలీ చేసుకునేవాడు, సుదూర ప్రాంతాల నుంచి చదువుకోవటానికి వచ్చిన విద్యార్థులు అంత డబ్బులు పెట్టి తినలేరు కదా !!

హైదరాబాద్ లో మరి ఇలాంటి వారికోసమే కొన్ని రోడ్ సైడ్ చిరు తిండి స్టాల్స్ (బండీలు) ఉన్నాయి. నేను హైదరాబాద్ రాష్ట్రంలో 2 సంవత్సరాల పాటు ఉన్నాను. అక్కడ నేను కొన్ని ప్రదేశాలలో తిన్న రోడ్ సైడ్ బండీల ఫుడ్ రుచి హైదరాబాద్ లో నేను మరెక్కడా చూడలేదు. మీరు గనక అటువైపు ఒకసారి వెళితే రుచి చూడటం మరవద్దు.

లక్ష్మణ్ బండి

నాంపల్లి వెనక గోషా మహల్ దగ్గర లక్ష్మణ్ బండి ఉంది. ఇక్కడ సహజంగానే ఎక్కువ మంది జనం ఉంటారు. టోకెన్ పద్ధతి లేదు కనుక డబ్బులిచ్చి మీకిష్టమైన టిఫిన్ ఆరగించవచ్చు. బండి యజమాని మీరు ఏమీ తింటున్నారో చూడడు కనుక మీరు ఏమీ తిన్నారో చెబితే దానికే బిల్లు వేస్తాడు. ఇక ఇక్కడ ఏమీ తినాలి అనే విషయానికొస్తే, ఇడ్లీ, దోశె మరియు ఉప్మా లభిస్తాయి. వీటిలోకి వేసే గ్రీన్ చట్నీ హైదరాబాద్ మొత్తంలో నేను తిన్న ఏ ప్రదేశాలలో కనిపించలేదు. కావాలని ఇంకా వేయించుకొని .. వేయించుకొని దండిగా అంటించుకొని తిన్నాను.

ఇడ్లీ చాలా మెత్తగా ఉంటాయి. ఇక్కడ మీరు కారం కూడా అంటించుకొని తినవచ్చు గుంటూరు ఇడ్లీలా. దోశ ఇక్కడ స్పెషల్. దీనిని చట్పట్ దోష అంటారు. ఈ దోశె మీద ఉప్మా, టమాటాలు, ఉల్లిగడ్డలు, కారం ఇంకా కాసింత నెయ్యి వేసి కాల్చి ఇస్తాడు. ఇంక ఆలస్యం చేయకుండా ఆరగించడమే తరువాయి. తక్కువ ధరకే టిఫిన్ లు అందుబాటులో ఉంటాయి.

హైదరాబాద్ లో రోడ్ సైడ్ బండీ ల ఫుడ్ !!

Photo Courtesy: pradeep

పూర్ణ టిఫిన్ సెంటర్

ఈ టిఫిన్ సెంటర్ కృష్ణా నగర్ ( శ్రీనగర్ కాలనీ వద్ద) ఉంది. ఇక్కడ కూడా జనం బాగానే వస్తుంటారు. ఇక్కడైతే టోకెన్ పద్ధతి ఉంది. కనుక మీరు టోకెన్ తీసుకొనే వెళ్ళాలి. ఇక్కడ మీకు పార్కింగ్ సదుపాయం కూడా ఉంది. మీరు కారు, బైకులు పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇడ్లీ, దోశె, పూరీ, పెసరట్టు, మైసూరు బొండా మొదలగునవి లభిస్తాయి. ఇక్కడున్న ఇడ్లీ రుచి ఆదరహోనే మరి. దీనిలోకి వేసే ఎర్ర చట్నీ రుచి అమోఘం .ఇడ్లీలు వెన్న పూస వలె నోట్లో వేసుకుంటే ఇట్లే కరిగిపోతుంది. ఇక పూరీ విషయానికి వస్తే పూరీ లోకి వేసే సాబ్జీ రుచి చెప్పనక్కర్లేదు !! తక్కువ ధరకే టిఫిన్ లు అందుబాటులో ఉంటాయి.

హైదరాబాద్ లో రోడ్ సైడ్ బండీ ల ఫుడ్ !!

Photo Courtesy: pradeep

గోవిందు బండి

గోవిందు బండి హైదరాబాద్ లో మంచి పేరున్న బండి మరియు ఇది పాత బస్తీ లోని చార్మినార్ దగ్గర ఉంది. నేను ఇక్కడ మొదటిసారి వెళ్ళినప్పుడు అక్కడి జనం చూసి ఔరా!.. అనిపించింది. ఇక్కడున్న మిగితా బండీలకన్న ఇదే ఫెమస్ అనిపించింది నాకు. ఇక్కడ దోశని వెన్నతో కాలుస్తారు. ఈ దోశ మీద ఉప్మా, టమాటాలు, ఉల్లిగడ్డలు మరియు అమూల్ వెన్న తో కాల్చి ఇస్తాడు. ఇడ్లీలైతే నేమి ,తవా ఇడ్లీలైతేనేమి ఒక్కక్కటి ఒక్కో రుచి. ఈ బండి దోశ కే ఫెమస్ అని చెప్పాలి. ఇక్కడ చుట్టు ప్రక్కల ఉన్న ఏ బండి దగ్గర దోశ తిన్న గోవిందు బండి రుచి రాదు.తక్కువ ధరకే టిఫిన్ లు అందుబాటులో ఉంటాయి.

హైదరాబాద్ లో రోడ్ సైడ్ బండీ ల ఫుడ్ !!

Photo Courtesy: pradeep

అయ్యర్ టిఫిన్

డికె రోడ్, అమీర్ పేట్ వద్ద ఉన్న ఒక హోటల్ ఈ అయ్యర్ టిఫిన్ . ఇది పూర్తిగా తమిళనాడు వాళ్ళు రన్ చేస్తున్నారు, టిఫిన్ కూడా తమిళ్ స్టైల్ లో ఉంటుంది. ఈ హోటల్ ఒక రూమ్ మాదిరి ఉంటుంది. ఇక్కడ జనాలు ఎక్కువగా ఉంటారు. అమీర్ పేట్ ఏరియా కనుక చెప్పనక్కర్లేదు. ఇక్కడ టిఫిన్ లన్ని అరటి ఆకులలో ఇస్తారు. అంతే కాదు ఇడ్లీ లలో, వడ లలో వేసే కొబ్బరి చట్నీ జుర్రుకొని తినాలనిపిస్తుంది. ఇక్కడ వీటితో పాటుగా ఉప్మా, పొంగల్ వంటివి అందుబాటులో ఉంటాయి.తక్కువ ధరకే టిఫిన్ లు అందుబాటులో ఉంటాయి.

హైదరాబాద్ లో రోడ్ సైడ్ బండీ ల ఫుడ్ !!

Photo Courtesy: pradeep

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X