Search
  • Follow NativePlanet
Share
» »హైదరాబాద్ కు సమీపంలో గల అద్భుతమైన జలపాతాలు!

హైదరాబాద్ కు సమీపంలో గల అద్భుతమైన జలపాతాలు!

హైదరాబాద్ సమీపంలో గల కొన్ని ప్రసిద్ధ జలపాతాలను సందర్శించండి.

By Venkata Karunasri Nalluru

హైదరాబాద్ :

హైదరాబాద్ దక్షిణ భారతదేశంలో ఉత్తమ పర్యాటక ప్రదేశాలలో ఒకటి. ప్రసిద్ధ చార్మినార్, రామోజీ ఫిలిం సిటీ మరియు రుచికరమైన వంటకాలకు ఈ ప్రాంతం ప్రసిద్ధిచెందినది. ఈ నగరం పర్యాటకులను మరియు ప్రయాణికులను ఆకర్షిస్తుంది. మీ పర్యటనలో హైదరాబాద్ సమీపంలోని కొంత సహజంగా అందమైన ప్రకృతి అద్భుతాలు ఉన్నాయి అన్వేషించండి. మీరునగరానికి సమీపంలో గల అందమైన జలపాతాలను సందర్శించినట్లయితే రిఫ్రెష్ అనుభూతిని పొందుతారు. ఇక్కడ హైదరాబాద్ నగరానికి సమీపంలో వున్న కొన్ని ఉత్తమ జలపాతాలను వివరిస్తున్నాం.

అద్భుతమైన జలపాతాలు

PC: Praveen120

ఎత్తిపోతల జలపాతాలు :

చంద్రవంక నది పై ఉన్న ఎత్తిపోతల జలపాతాలు హైదరాబాద్ నుండి సుమారు 175 కి.మీ దూరంగా గుంటూరు జిల్లాలో ఉంది. ఈ జలపాతం నగరానికి సమీపంలో వున్న ఉత్తమ జలపాతం. రుతుపవనాలు తరువాత ఈ జలపాతం చూడటానికి చాలా బాగుంటుంది.

పోచెర జలపాతాలు :

పోచెర జలపాతాలు ఆలస్యంగా కనుగొన్న జలపాతాలలో ఒకటి. దట్టమైన అడవుల మధ్య ఉన్న ఈ జలపాతం హైదరాబాద్ సమీపంలో గల అద్భుతమైన జలపాతాలలో ఒకటి. ఇది నగరం నుండి దూరంగా 260 కి.మీ. దూరంలో వుంది. ఇది కుంతల జలపాతాలకు దగ్గరగా ఉంది.

అద్భుతమైన జలపాతాలు

PC: Ppavan1

కుంతల జలపాతాలు :

కుంతల జలపాతాలు తెలంగాణలో గల అతి పెద్ద జలపాతం. ఇది నగరం నుండి 270 కి.మీ దూరంగా కదెం నది వద్ద వున్నది. పురాణాల ప్రకారం శకుంతల ఇక్కడ స్నానం ఆచరించేదని అందువల్ల ఈ జలపాతాలకు కుంతల జలపాతాలు అని పేరు వచ్చిందని ఇక్కడ స్థానికులు చెబుతారు.

తదిమడ జలపాతాలు :

తదిమడ జలపాతాలను అనంతగిరి నుండి ట్రెక్కింగ్ ద్వారా చేరుకోవవచ్చు. నగరానికి అనంతగిరి గ్రామం కేవలం 82కి.మీ దూరంలో ఉంది. 100 అడుగుల ఎత్తులో గల తదిమడ జలపాతాలను సందర్శించడానికి వర్షాకాలం అనువైన సమయం.

అద్భుతమైన జలపాతాలు

PC: VinothChandar

తలకోన జలపాతాలు :

చిత్తూరు జిల్లాలోని తలకోన జలపాతాలు సందర్శించగల జలపాతాలు. ఇది నగరం నుంచి 545 కి.మీ దూరం వున్నప్పటికీ, ఈ జలపాతాల చుట్టూ పచ్చదనంతో పాటు వైద్య లక్షణాలు కలిగిన అనేక వృక్షజాతులు వున్నాయి.

మల్లెల తీర్థం :

మల్లెల తీర్థం హైదరాబాద్ నగరం నుండి 185 కి.మీ ల దూరంలో వున్నది. ఇక్కడ మహబూబ్ నగర్ నల్లమల అడవులు వున్నాయి. ఈ జలపాతాన్ని అక్టోబర్ నుండి ఫిబ్రవరి నెలల మధ్యలో సందర్శించవచ్చును.

ఈ రోడ్ ట్రిప్ ద్వారా హైదరాబాద్ సమీపంలో గల అద్భుతమైన జలపాతాలను చూడవచ్చును.

హైదరాబాద్ చేరుకోవడం ఎలా తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X