Search
  • Follow NativePlanet
Share
» »నేరాన్ని రుజువు చేసే శుచీంద్ర శివుడు !

నేరాన్ని రుజువు చేసే శుచీంద్ర శివుడు !

By Mohammad

తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారికి కేవలం 13 కి.మీ. దూరంలో శుచీంద్రం అనే ఊరు కలదు. ఇక్కడ లింగరూపమైన శుచీంద్రుడు త్రిమూర్తి రూపంలో కొలువుదీరి ఉంటాడు. ఇక్కడి లింగం స్వయంభూ గా వెలసినది. లింగం అడుగున బ్రహ్మ, మధ్యన విష్ణువు, పైన శివుడు ఉంటారు.

శుచీంద్రం దత్తాత్రేయ క్షేత్రం గా ప్రసిద్ధిచెందినది. శంకర భగవత్పాదులు ఈ క్షేత్రాన్ని సందర్శించినపుడు పరమశివుని తాండవ నృత్యాన్ని ప్రత్యక్షంగా చూశాడట. శివుడు ఆది శంకరుల వారికి "ప్రణవ మంత్రాన్ని" ఉపదేశించిన పవిత్ర స్థలం ఇది. ఇంద్రుడు అహల్య విషయంలో పొందిన శాపాన్ని పోగొట్టుకోవటానికి ఇక్కడి స్వామి వారిని పూజించాడట. కాగుతున్న నెయ్యిలో మునిగి శాపవిమోచనం పొందాడు. స్వామి దయ వల్ల ఒళ్లంతా వున్న కళ్ళు పోయి మళ్ళీ మామూలు రూపాన్ని ధరించాడని కధనం.

శుచీంద్ర ఆలయ కోనేరు

శుచీంద్ర ఆలయ కోనేరు

చిత్ర కృప : vsgiri

దేవేంద్రుడు శుచి అయిన ప్రదేశం కనుకే 'శుచీంద్రం' అని పేరొచ్చింది. నేరం చేసిన వారిని ఆలయానికి రప్పించి, పంచాయితీ పెట్టి, సలసల కాగుతున్న నేతిలో చేతులుంచి, బొబ్బలు రాక పొతే నిర్దోషి అని తేల్చటం మొన్నటివరకు ఆచారంగా ఉండేది.

ఇది కూడా చదవండి : తిరునల్లార్ - శనికి అంకితం చేసిన ఊరు !

థనుమలయన్ ఆలయం

దక్షిణ భారతంలో ఉన్నగొప్ప దేవాలయాలలో ఒకటి సుచింద్రంలో ఉన్న థనుమలయన్ దేవాలయం. ఎంతో దూరం నుండి ఈ ఆలయ ముఖద్వారాన్ని చూడవొచ్చు ఎందుకంటే ఈ దేవాలయ గోపురం 134 అడుగుల ఎత్తు ఉంటుంది. ఈ గోపురం హిందూ దేవుళ్ళ మరియు దేవతల బొమ్మలతో మరియు పురాణాలలో ఉన్న సంఘటనల చిత్రాలతో ఉన్నది.

ఆలయ ప్రవేశద్వారం 24 అడుగులు ఎత్తుగా, వెడల్పైన, పొడవైన, చెక్కిన తలుపును కలిగి ఉన్నది.శివుడు మరియు విష్ణువు దేవతలతో సహా 30 దేవుళ్ళకు ఈ దేవాలయం అంకితం చేయబడింది. గర్భగుడిలో ఒక పెద్ద శివలింగం ఉన్నది, దీనికి కుడి వైపున విష్ణువు విగ్రహం ఉన్నది.

థనుమలయన్ ఆలయ గోపురం

థనుమలయన్ ఆలయ గోపురం

చిత్ర కృప : Andrew Johnson

ముఖ మండపంలో ఒకే స్తంభం పై చెక్కిన పొడుగాటి వెదురు బొంగుల వంటి రాతి కర్రలలో నుంచి సంగీతం లోని సప్త స్వరాలు, వివిధ శ్రుతులతో వినిపించటం ఇక్కడి ప్రత్యేకత. ఒకే స్థంభం మీద ముందు పురుషాకృతి, వెనుక స్త్రీ రూపం వుండటం మరో వింత.

కొలచెల్

శుచీంద్రం పట్టణానికి చేరువలో, కన్యాకుమారి నగరానికి 20 KM ల దూరంలో కొలచెల్ అనే చారిత్రక ప్రదేశం కలదు. ఇక్కడ డచ్ వారికి, భారత రాజులకు మధ్య భీకర యుద్ధం జరిగింది. డచ్ సైన్యం ఈ ప్రాంతాన్ని కొల్లగొట్టాలన్న దురుద్దేశంతో ఈ నేల మీద కాలుమోపితే మార్తాండ వర్మ, ట్రావెన్కోర్ రాజులు తీవ్రంగా ప్రతిఘటించి ఓడించారు.

కొలచెల్ హార్బర్ వద్ద ఎగిసిపడుతున్న అలలు

కొలచెల్ హార్బర్ వద్ద ఎగిసిపడుతున్న అలలు

చిత్ర కృప : Risvan Mohammed S

శుచీంద్రం లో సందర్శించదగిన ఇతర ఆలయాలు

శుచీంద్రం థనుమలయన్ ఆలయానికి ప్రసిద్ధి చెందినపప్పటికీ, ఇతర దేవుళ్ళు, దేవతల ఆలయాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ద్వారకా కృష్ణన్ ఆలయం, మునుథితనంకై ఆలయం, ఆశ్రమం శాస్త ఆలయం, కరుపసామి కొఇ ఠమొఉరన్ ఠమ్పురతి దేవాలయం అక్కారై ఆలయం, ఆస్రమ్మమ్ ఆఉసుయ మరియు ఆత్రి మునివర్ హోమ కుందం హి, స్రమమరులికు శ్రీ భూతతన్మాద్ అంతంపుర మేనస్కి అమ్మాన్ కోవిల్, ముతరమ్మన్ ఆలయం మరియు ఫెరమబలమ్ నటరాజర్ ఆలయం ఉన్నాయి.

ఆలయంలోని సంగీత స్తంబాలు

ఆలయంలోని సంగీత స్తంభాలు

చిత్ర కృప : Gokul Chakrapani

శుచీంద్రం ఆలయానికి ఎలా చేరుకోవాలి ?

వాయు మార్గం ద్వారా : శుచీంద్రం పట్టణానికి 87 KM ల దూరంలో తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయం కలదు. క్యాబ్ లేదా టాక్సీ లలో ప్రయాణించి శుచీంద్రం చేరుకోవచ్చు.

రైలు మార్గం ద్వారా : శుచీంద్రం పట్టణానికి దగ్గరలో కన్యాకుమారి రైల్వే స్టేషన్ , త్రివేండ్రం రైల్వే స్టేషన్ లు కలదు. దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుండి ఇక్కడికి రైళ్లు వస్తుంటాయి.

రోడ్డు మార్గం ద్వారా : కన్యాకుమారి, త్రివేండ్రం తదితర సమీప పట్టణాల నుండి శుచీంద్రం పట్టణానికి డైరెక్ట్ గా బస్సులు కలవు. బెంగళూరు ,చెన్నై, కోయంబత్తూర్, కొచ్చిన్, కాలికట్ ప్రాంతాల నుండి కన్యాకుమారి కి, తిరువనంతపురానికి బస్సులు నడుస్తుంటాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X