Search
  • Follow NativePlanet
Share
» »బెల్గాం నగరం - చరిత్ర మరియు సంస్కృతుల సంగమం !!

బెల్గాం నగరం - చరిత్ర మరియు సంస్కృతుల సంగమం !!

బెల్గాం కర్నాటక రాష్ట్రంలోని వాయువ్య దిక్కులో గల ముఖ్య నగరం.ఈ నగరం రెండు రాష్ట్రాల సరిహద్దులను పంచుకుంటుంది.ఒకటి గోవా మరొకటి మహారాష్ట్ర. ఈ నగరం పురాతనమైనది, క్రీ.శ. 12 వ శతాబ్దంలో ఈ పట్టణాన్ని రత్న వంశీయులు నిర్మించారు.ఈ నగరం చరిత్ర మరియు సంస్కృతుల సంగమం. ఈ ప్రాంతం యదవులు, ఖిల్‌జీలు, హొయసులు, మహారాష్ట్రులు, సుల్తానులు మొదలగు రాజవంశీయులు పరిపాలించారు.ఈ ప్రాంతాన్ని వివిధ పేర్లతో పిలుస్తారు, ఇప్పుడు దీని అధికారిక నామం బెలగవి. దీనిని కర్నాటక రాష్ట్రం యొక్క " షుగర్ బౌల్ " అని పిలుస్తారు.

సాహ్యద్రి పర్వతాల చేరువలో మరియు అరేబియా సముద్రానికి 100 కి.మీ. దూరంలో ఉన్న బెల్గాం పట్టణంలో వ్యవసాయానికి అనుకూలమైన సాగు భూమి ఉంది. జలపాతాలు, పచ్చిక బయళ్లు మరియు ఇతర ఆకర్షణలు బెల్గంకే సొంతం. ఇక్కడున్న ప్రముఖ ఆకర్సనల గురించి తెలుసుకుందాం!!..

కమల్ బాసడి

కమల్ బాసడి

ఈ జైన దేవాలయం బెల్గాం కోటలో ఉన్న కమల్ బాసడి అనేది తప్పక చూడవలసిన ప్రదేశం. ఇక్కడ ఒక జైన దేవాలయం ఉన్నది. ఈ ఆలయం క్రీ.శ. 1204 వ సం. లో కట్టించినారు మరియు దీని కట్టడం చాళుక్యుల నిర్మాణ శైలిని పోలి ఉంటుంది. ఇక్కడ మనము అందమైన కలువ పువ్వు ఆకారంలో ఉన్న పైకప్పు, అంతే కాకుండా పిరమిడ్ ఆకారంలో ఉన్న దేవాలయం పైభాగం గమనించవచ్చు. ఆ 72 పద్మ పువ్వు రేకుల మీద 24 మంది జైన తీర్ధాంకుల పేర్లు ఉన్నాయి మిగితా భాగం రాబోయే తరాల తీర్ధాంకుల కొరకు కొంత స్థలం రాయడానికి వదిలిపెట్టారు. ఇక్కడున్న స్థంబాలు చాలా వరకు పాలిష్ చేయబడిన నల్లని రాళ్లతో కట్టించినారు. దీనిని చరిత్రకారులు మరియు అన్వేషకులు ఎక్కువ సంఖ్యలో సందర్శిస్తారు.

Photo Courtesy: Manjunath Doddamani Gajendragad

జంబోటి

జంబోటి

జంబోటి కొండలు బెల్గాం నగరానికి 25 కి. మీ. దూరంలో ఉన్న పర్యాటక ప్రదేశం. ఇక్కడున్న పచ్చని వృక్ష సంపద పర్యాటకులను ఆకర్షిస్తున్నది. ఇక్కడ ట్రెక్కింగ్ వంటి సాహసాలు కూడా చేయవచ్చు. ఇక్కడున్న మరొక ప్రధాన ఆకర్షణ మండోవీ నది, ఇది గోవా రాష్ట్రంలో ప్రవహిస్తున్నది దీని జన్మస్థానం ఇక్కడే.

Photo Courtesy: Milindpk

వజ్రపోహ జలపాతం

వజ్రపోహ జలపాతం

జంబోటి ప్రాంతానికి కూతవేటు దూరంలో మరియు బెల్గాం పట్టణానికి 25 కి. మీ. దూరంలో ఉన్నది ఈ ప్రఖ్యాత జలపాతం వజ్రపోహ జలపాతం. మండోవి నది జలపాతంగా మారి సుమారు 660 అడుగుల ఎత్తు పైనుంచి పడుతుంటే.. ఆ సుందర దృశ్యాన్ని చూడటం కోసం పర్యాటకులు ఇక్కడకు వస్తుంటారు. ఇటువంటి సన్నివేశాలు వర్షాకాలంలో జరుగుతాయి.

Photo Courtesy: Pradeep Kumbhashi

గొడ్చినమాలకి జలపాతం

గొడ్చినమాలకి జలపాతం

బెల్గాం నుంచి 40 కి. మీ. దూరంలో, లష్ లోయ ప్రాంతంలో ఉన్న మరొక జలపాతం గొడ్చినమాలకి జలపాతం. ఈ జలపాతానికి గల మరొక పేరే మార్కండేయ జలపాతం. ఇక్కడకు కాలినడకన కానీ, వాహనాల ద్వారా కానీ చేరుకోవచ్చు. ఇక్కడ ఉన్న ప్రకృతి సోయగాలు మనసుని ఉత్తెజపరుస్తాయి. దీనికి దగ్గరలో రెండు డ్యాములు ఉన్నాయి అవి హిడ్కల్,శిరూర్.

Photo Courtesy: Pradeep Kumbhashi

గోకక్ జలపాతం

గోకక్ జలపాతం

బెల్గాం పట్టణానికి 62 కి. మీ. దూరం లో ఉన్న ప్రధాన ఆకర్షణ కల జలపాతం గోకక్ జలపాతం. ఘటప్రభ నది ఈ ఇరుకు దారిగుండా ప్రవహిస్తూ 171 అడుగులో ఉన్నది. అందమైన ఈ జలపాతం బ్రిడ్జ్ కి రెండువైపులా ఒక వంతెనతో బిగించబడినది. ఇతర ఆకర్షణలు చాళుక్యుల కాలంలోని స్మారకాలు. ఒడ్డున ఉన్న మహాలింగేశ్వర ఆలయం సందర్శించకపోతే మంచి అనుభూతి కోల్పోతారు.

Photo Courtesy: RameshSharma1

బెల్గాం కోట

బెల్గాం కోట

బెల్గాం కోటని క్రీ. శ. 104 వ సం. రత్న వంశీయులలో ఒకరైన జయరాజ రాజు కాలంలో కట్టించినారు. చరిత్ర పరంగా చూసుకుంటే ఈ కోట ఎన్నో రకాల పునర్నిర్మాణాలకు నోచుకుంది. ఇక్కడ ఒక ప్రధానమైన సంఘటన జరిగినది ఏమిటంటే ఇక్కడ స్వాతంత్య్ర ఉద్యమ కాలంలో గాంధీజీ ఖైదీగా ఉన్నాడు. ఈ కట్టడం హిందూ, జైన మరియు ఇస్లాం నిర్మాణ శైలిలో ఉంటుంది, ఇది ఒక పురాతన కట్టడం.

Photo Courtesy: Burgess, James

చిక్క బాసడి

చిక్క బాసడి

బెంగాల్ కోటలో రెండు హిందూ దేవాలయాలు మరియు రెండు జైన దేవాలయాలు ఉన్నాయి. ఇక్కడున్న చిక్క బాసడి ఈ కోటలో ఉన్న రెండవ జైన దేవాలయం. ఇక్కడున్న అద్భుత కళా ఖండాలు, కుడ్యాలు జైన సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. ఈ కళా ఖండాల మీద, కుడ్యాల మీద నృత్యకళాకారులు, సంగీత విద్వాంసులు మరియు ఇక్కడి సంస్కృతి సాంప్రదాయాలు చెక్కించినారు.

Photo Courtesy: Manjunath Doddamani Gajendragad

ఎలా వెళ్ళాలి?

ఎలా వెళ్ళాలి?

రోడ్డు మార్గం
బెల్గాం నగరం గుండా రాష్ట్ర,జాతీయ రహదారులు పోతున్నాయి.ఈ ప్రాంతానికి అన్ని ప్రాంతాలనుంచి బస్సు సదుపాయం ఉన్నది.

రైలు మార్గం
బెల్గాం నుంచి ప్రతిరోజు గోవా,బొంబాయ్ మరియు బెంగళూరుకి రైళ్లు వెళుతుంటాయి.

విమాన మార్గం

బెల్గాంకి దేశీయ విమానాశ్రయం కలదు.ఇక్కడ నుంచి దేశంలోని అన్ని ప్రధాన ప్రాంతాలకు విమాన సదుపాయం ఉంది.గోవాలో అంతర్జాతీయ విమానాశ్రయం అయిన వాస్కో 148 కి. మీ. దూరంలో ఉన్నది.

Photo Courtesy: Prasad Kholkute

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X