అనంతపద్మనాభ స్వామి ఆరవ గది తెరిస్తే మొత్తం ప్రపంచాన్ని ముంచేస్తుందా?
వెతకండి
 
వెతకండి
 

కర్ణాటకలోని ఆకర్షణీయ ప్రదేశం - తలకాడు

Written by: Venkatakarunasri
Published: Friday, August 11, 2017, 14:13 [IST]
Share this on your social network:
   Facebook Twitter Google+ Pin it  Comments

తలకాడు పట్టణం క్రీ.శ. 16 వ శతాబ్దానికి ముందు ఎంతో ఆకర్షణీయ ప్రదేశంగా ఉండేది.

సుమారుగా 30 పైచిలుకు ఆలయాలు ఉండేవి.

అందులో ఐదు ప్రఖ్యాత శివాలయాలు ప్రత్యేకమైనవి.

మైసూర్ ఒడయార్ల పాలనలో ఈ ప్రదేశం నాశనం చెందిందని చరిత్రకారుల అభిప్రాయం.

తలకాడు ప్రారంభంలో గంగ వంశస్థులు, ఆ తర్వాత చోళులు పరిపాలించారు.

చోళులను ఓడించి హోయసుల రాజు విష్ణు వర్ధనుడు రాజ్యాధికారం చేపట్టి పరిపాలన ను గాడిలో పెట్టెను.

కర్ణాటకలోని ఆకర్షణీయ ప్రదేశం - తలకాడు. కర్ణాటకలోని ఆకర్షణీయ ప్రదేశం

కర్ణాటకలోని ఆకర్షణీయ ప్రదేశం

ఆతర్వాత వచ్చిన విజయనగర రాజులు కూడా చక్కటి పాలనను అందించారు. చివరగా మైసూర్ ఒడయార్ల పాలనలో ఈ ప్రాంతం చివరి దశ కు చేరుకొంది.

కర్ణాటకలోని ఆకర్షణీయ ప్రదేశం

చిన్న కథ ఈ ప్రాంత దేవత అయిన ఆలమేరు అమ్మవారి నగలపై కన్నేసిన మైసూర్ రాజు తలకాడు పై తన సైన్యంతో దాడి చేస్తాడు.

కర్ణాటకలోని ఆకర్షణీయ ప్రదేశం

అమ్మవారు తన నగను కావేరి నదిలో పడవేసి మునిగిందని, పోతా పోతా తలకాడును ఇసుక దిబ్బలా మారిపోవాలని, మైసూర్ రాజులకు వారసుడు లేకుండా పోతాడని శపించిందని స్థానిక కధనం.

కర్ణాటకలోని ఆకర్షణీయ ప్రదేశం

400 ఏళ్ల క్రితం మైసూరు రాజ్యాన్ని విజయనగర రాజులు పాలించేవారు. వారిలో ‘శ్రీ రంగరాయ' ఒకరు. ఆయన ఏదో అంతుచిక్కని వ్యాధితో బాధపడుతూ ఉండేవారట.

కర్ణాటకలోని ఆకర్షణీయ ప్రదేశం

ఆ వ్యాధి ఎలాంటి చికిత్సలకీ లొంగకపోవడంతో... శ్రీరంగరాయ, తలకాడుకి వెళ్లి అక్కడ వైద్యానాథుని ఆలయంలో ప్రార్థనలు నిర్వహించసాగారు. కానీ విధిలిఖితం! ఆయన వ్యాధి ఉపశమించకపోగా, ఆఖరి క్షణాలు దగ్గరపడ్డాయి.

కర్ణాటకలోని ఆకర్షణీయ ప్రదేశం

ఈ విషయం తెలిసిన ఆయన భార్య అలమేలమ్మ తను ఉంటున్న ‘శ్రీరంగపట్నం'ని వీడి, తలకాడుకి బయల్దేరింది. వెళ్తూ వెళ్తూ శ్రీరంగపట్నాన్ని ‘రాజా ఒడయార్‌' అనే నమ్మకస్తునికి అప్పగించింది.

కర్ణాటకలోని ఆకర్షణీయ ప్రదేశం

రాణిగారి దుస్థిని గమనించిని ‘రాజాఒడయార్', శ్రీరంగపట్నాన్ని తన గుప్పిట్లోకి తెచ్చుకున్నాడు. అంతేకాదు! రాణిగారి వద్ద ఉన్న బంగారం మొత్తాన్నీ తీసుకురమ్మంటూ తన సైన్యాన్ని పంపాడు.

కర్ణాటకలోని ఆకర్షణీయ ప్రదేశం

రాజాఒడయార్‌ సైన్యం తన వెంటపడటం చూసిన రాణికి పట్టరాని ఆవేశం వచ్చింది. అటు భర్తనీ, ఇటు రాజ్యాన్నీ దక్కించుకోలేని దైన్యంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. కావేరీ నదిలోని ‘మాలంగి' అనే ప్రాంతంలో దూకుతూ... తన దుగ్ధనంతా ఒక శాపంగా మార్చిందని చెబుతారు.

కర్ణాటకలోని ఆకర్షణీయ ప్రదేశం

‘ఇక మీదట తలకాడు క్షేత్రం ఇసుకలో మునిగిపోతుంది, నేను చనిపోయే మాళంగి ప్రదేశం ఒక సుడిగుండంగా మారిపోతుంది, రాజా ఒడయార్‌ వంశం నిర్వంశంగా మారిపోతుంది,' అన్నదే ఆ రాణి పెట్టిన శాపం.

కర్ణాటకలోని ఆకర్షణీయ ప్రదేశం

ఆశ్చర్యకరంగా రాణి అలమేలమ్మ శాపం అని చెప్పే ఆ మూడు ఘటనలూ జరిగితీరాయి. చరిత్రలో ఓ వెలుగు వెలిగిన తలకాడు, ఇసుకతో మునిగిపోయి ఎడారిని తలపించసాగింది. పక్కనే కావేరీ నది ప్రవహిస్తున్నా, తలకాడులో ఉష్ణోగ్రతలు భరించలేనంతగా ఉంటాయి.

కర్ణాటకలోని ఆకర్షణీయ ప్రదేశం

ఇక మాలంగి అనే ప్రాంతంలో విపరీతంగా సుడిగుండాలు కనిపిస్తాయట. అన్నిటికంటే ఆశ్చర్యకరమైన అంశం... ఒడయార్‌ రాజవంశం నిర్వీర్యం కావడం.

కర్ణాటకలోని ఆకర్షణీయ ప్రదేశం

దాదాపు 400 ఏళ్లుగా ఒడయార్ రాజవంశం సంతానలేమితో బాధపడుతూనే ఉంటోంది. ప్రతి రెండు తరాలకి ఒక తరంలో పిల్లలు కలగకపోవడం విభ్రాంతిని కలిగిస్తుంది.

కర్ణాటకలోని ఆకర్షణీయ ప్రదేశం

ఎప్పటికప్పుడు మైసూరు మహారాజులు తమ బంధువుల బిడ్డలను దత్తతు తెచ్చుకోవాల్సిన పరిస్థితి!

కర్ణాటకలోని ఆకర్షణీయ ప్రదేశం

ఒక పక్క వేల ఏళ్ల చరిత్ర, మరోపక్క రాణి అలమేలమ్మ గాథ... ఈ రెండింటినీ ప్రత్యక్షంగా చూసేందుకు భక్తులు తలకాడుకి చేరుకుంటూ ఉంటారు. అక్కడ ఇసుకమేటల మధ్య ఠీవిగా నిలబడిన వైద్యనాథుని ఆలయాన్ని దర్శిస్తారు.

కర్ణాటకలోని ఆకర్షణీయ ప్రదేశం

వైద్యనాథ ఆలయంతో పాటుగా తలకాడులో మరో నాలుగు శివాలయాలనీ కలిపి పంచలింగాలని పిలుస్తారు. వీటిలో పాతాళేశ్వర లింగానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ లింగం ఉదయం వేళల్లో ఎరుపు రంగులో, మధ్యాహ్నం నల్లగా, సాయంవేళల తెల్లగా కనిపించడం విశేషం!

కర్ణాటకలోని ఆకర్షణీయ ప్రదేశం

తలకాడులోని ఐదు లింగాలనీ పూజించేందుకు ‘పంచలింగ దర్శనం' పేరుతో ఘనంగా ఉత్సవాలని నిర్వహిస్తారు. కార్తీకసోమవారం, వైశాఖ నక్షత్రం రెండూ కలిసి వచ్చే సందర్భంలో పండితులు ఈ పంచలింగ దర్శనాన్ని ప్రకటిస్తారు.

కర్ణాటకలోని ఆకర్షణీయ ప్రదేశం

7 నుంచి 13 ఏళ్ల వరకూ ఎప్పుడైనా ఇలాంటి సందర్భం రావచ్చునట! తలకాడు చుట్టూ ఇన్ని విశేషాలు ఉన్నాయి కనుక... మైసూరుకి వెళ్లేవారు కాస్త ఓపికచేసుకుని ఈ పంచలింగ క్షేత్రం వరకూ వెళ్లివస్తుంటారు.

కర్ణాటకలోని ఆకర్షణీయ ప్రదేశం

మన దేశంలో ఎన్నో గొప్పగొప్ప ఆలయాలు, ఆ ఆలయాలకు గొప్ప చరిత్ర ఇప్పటికీ కొన్ని దేవాలయాల గురించి ఎన్నో అంతుపట్టని రహస్యాలు.అటువంటి వాటిలో కర్ణాటకలోని తలకాడు పుణ్యక్షేత్రం ఒకటి.రాణి శాపం కారణంగా ఆ ప్రాంతం ఎడారిగా మారింది.

కర్ణాటకలోని ఆకర్షణీయ ప్రదేశం

ఆమె ఇచ్చిన శాపం మైసూరురాజ్యానికి సంబంధం వుంది.కొన్ని ప్రదేశాలలో దేవుడు కొన్ని సంవత్సరాలతర్వాత భక్తులకు దర్శనంఇస్తూవుంటాడు.తలకాడులోని శివుని ప్రతి రూపమైన వైద్యనాథుడు 7ఏళ్ళసమయం తీసుకుంటాడని స్థల పురాణం చెబుతుంది.

కర్ణాటకలోని ఆకర్షణీయ ప్రదేశం

కర్ణాటకలోని మైసూరుకు 45కి.మీ ల దూరంలో వున్న తలకాడు పుణ్యక్షేత్రం వుంది.కావేరీనది ఒడ్డున ఈ ఆలయం కలదు.ఇక్కడ పంచలింగేశ్వర ఆలయాలు కలవు.ఈ ప్రదేశాన్ని కాదంబులు, చాళుక్యులు, చోళులు, రాష్ట్రకూటులు పాలించారని చరిత్ర చెబుతుంది.

కర్ణాటకలోని ఆకర్షణీయ ప్రదేశం

ఆలయ పురాణం ప్రకారం సోమదత్తుడు అనే మహా రుషి తన శిష్యులతో కలిసి కావేరీనదీ తీరం వెంబడి తీర్ధయాత్రలకు వెళుతుండగా అక్కడ ఏనుగులు దాడి చేసి చంపివేస్తాయి.శివభక్తుడైన సోమ దత్తుడు తన శిష్యులు వచ్చే జన్మలో ఆ అడవిలోని ఏనుగులుగా జన్మించి బూరుగు చెట్టులో శివుడిని చూసుకుని పూజలు చేస్తారు

కర్ణాటకలోని ఆకర్షణీయ ప్రదేశం

ఆ తర్వాత కొన్ని రోజులకు తల, కాడు అనే ఇద్దరు వ్యక్తులు అడవిలోకివచ్చి ఏనుగులు పూజలుచేసుకుంటున్న బూరుగుచెట్టును నరికివేయటానికి గొడ్డలిని చెట్టుపైకి వేయగానే చెట్టు నుండి రక్తం బయటకు వస్తుంది.అది చూసి తల, కాడు ఇద్దరూ భయపడిపోతారు.

కర్ణాటకలోని ఆకర్షణీయ ప్రదేశం

నేను పరమేశ్వరుడినని నన్ను ఈ చెట్టులో సోమదత్తుడు పూజలు చేసుకుంటున్నాడని చెబుతారు.తనకు తగిలిన గాయాన్ని తనే నయం చేసుకునేవాడు గనుక వైద్యనాధుడు అని పిలుస్తున్నారు.ఆ తర్వాత తలకాడుగా ఈ పుణ్యక్షేత్రాన్ని పిలుస్తున్నారు.

కర్ణాటకలోని ఆకర్షణీయ ప్రదేశం

ప్రస్తుతం ఇక్కడ ఎన్నో ఆలయాలు వున్నా ఇసుకదిబ్బలలో కూరుకు పోయాయి.ఎందుకంటే16వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యాధిపతి అయిన శ్రీ రంగారాయి ఇక్కడ నివసించేవారు.ఆయన భార్య శ్రీ రంగపట్నంలోని రంగనాయకికి ఆభరణాలు అలంకరించేది.

కర్ణాటకలోని ఆకర్షణీయ ప్రదేశం

అయితే తన భర్త చనిపోయిన తర్వాతమైసూరుపాలకులు ఆ ఆభరణాలను తిరిగిఇచ్చేయాలని బలవంతం చేయగా ఆమె అక్కడే వున్నటువంటి మాలంగీనదిలో పడి ఆత్మహత్యచేసుకుంది.
ఆ నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకునేముందు 3 శాపాలు ఇచ్చింది.

కర్ణాటకలోని ఆకర్షణీయ ప్రదేశం

తలకాడు అంతా ఇసకగా అయి పోవాలని,మాలంగీనది ఒక సుడి గుండం కావాలని,మైసూరురాజులకు వారసులు లేకుండా పోవాలని శాపాలు విధించింది.ఆ కారణంగానే తలకాడు నేడు ఇలా ఎడారిగా మారింది అని చెబుతారు.

తలకాడు ఎలా చేరుకోవాలి ?

తలకాడు కు సమీపాన 140 కి. మీ ల దూరంలో బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం కలదు. బెంగళూరు నుండి మైసూర్ చేరుకొని అక్కడి నుండి ప్రభుత్వ / ప్రవేట్ వాహనాల్లో తలకాడు చేరుకోవచ్చు. తలకాడు కు సమీపాన 50 కి. మీ ల దూరంలో మైసూర్ రైల్వే స్టేషన్ కలదు. క్యాబ్ లేదా టాక్సీ వంటివి మైసూర్ లో అదీకు దొరుకుతాయి.

English summary

Talakadu In Karnataka

Talakadu on the banks of river Kaveri is a mysterious spot in Mysore district of Karnataka. It is an ideal spot for weekend trips from Bangalore as it is around 140KM and from Mysore it is around 50KM.
Please Wait while comments are loading...