Search
  • Follow NativePlanet
Share
» »తలకాడు పంచలింగేశ్వర దర్శనం !

తలకాడు పంచలింగేశ్వర దర్శనం !

భారత దేశంలో విభిన్న సంస్కృతులు, సాంప్రదాయాలు కలవు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకూ వివిధ రకాల సంస్కృతులు. ఈ వైవిధ్యం ప్రత్యేకించి వారి ప్రతి ఏటా జరిగే పండుగలు లేదా ఇతర సమయాలలో కనపడుతుంది.

కర్ణాటకలో కల హస్సన్ లో మాత హసనాంబ తన భక్తులకు సంవత్సరానికి ఒకసారే దర్శనం ఇస్తుంది. శ్రావనబెలగోల పట్టణంలోని గోమాతేస్వరుడికి ' మహా మస్తాకభిషేకం' పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఇదే రకంగా, తలకాడు లోని భగవాన్ శివుడు తన భక్తులకు దర్శనం ఇచ్చ్చేందుకు ఏడు సంవత్సరాలు కూడా తీసుకుంటాడు. దర్శనం ఇవ్వాలనుకుంటే, నిర్వహణ సాధ్యం అయ్యే రీతిలో ఎంతమంది భక్తులకైనా సరే కనపడతాడు.

తలకాడులో శివుడు అయిదు రూపాలలో కనపడతాడు. అదే, పంచలింగేస్వరుడి మహత్యం. క్రిందటి సారి పంచ లింగేస్వరుడి దర్సనం 2006 లో అయ్యింది. మరి 2013 సంవత్సరంలో అంటే ఈ సంవత్సరం నవంబర్ 28 నుండి డిసెంబర్ 2 వరకు ఉండబోతుంది. ఈ దర్శనానికి వేలాది భక్తులు వస్తారు. తలకాడు ప్రదేశం బెంగుళూరుకు నైరుతి దిశలో 130 కి. మీ. లు. మైసూరు నుండి 45 కి. మీ. లు మాత్రమే.

పంచలింగేస్వరుడి దర్శనం హిందూ కాలెండర్ మేరకు నిర్ణయిస్తారు. ఏడు సంవత్సరాల కొకసారి కలిగే ఈ దర్శనం భాగ్యం సరిగ్గా ఖచ్చితమైన సమయంలో వుంటుంది. కావేరి నది ఒడ్డున కల ఈ పంచలింగేశ్వర ఆలయాలు, శ్రీ విద్యేశ్వర, శ్రీ పాతాలేశ్వర, శ్రీ మరులేశ్వర, శ్రీ అరకేశ్వర మరియు శ్రీ ముడుకుతోరే మల్లిఖార్జున. ఈ అయిదు ఆలయాలలో ఒకేసారి పూజ మొదలవుతుంది. అయిదు విగ్రహాలను శ్రీ వైద్యేశ్వర టెంపుల్ కోలనుకు స్నానం కొరకు తీసుకు వస్తారు. తదనంతరం ఆలయ రధం పై భక్తులు స్వామిని ఊరేగిస్తారు. మూడవ రోజున, ఒక పెద్ద తెప్పోత్సవం నిర్వహిస్తారు. చివరగా 'నంది వాహనోత్సవం' చేస్తారు.

తలకాడు పంచలింగేశ్వర దర్శనం !

కావేరి నదీ ఒడ్డున కల ఈ తలకాడు ప్రదేశాన్ని కాదంబులు, చాలుక్యలు, చొళులు, రాష్ట్రకూటులు పాలించారు. ఈ దేవాలయాల పురాతన శిల్ప శైలి అద్భుతంగా వుంటుంది. ప్రత్యేకించి విద్యేశ్వర టెంపుల్ గోడలు తప్పక చూడాలి. అయిదు తలల పాముకు అలంకరణగా ఒకదానితో మరి ఒకటి కలిపిన రెండు రింగులు చూడ ముచ్చటగా వుంటాయి. వీటిని ఆనాడే అద్భుతపనితనంతో చెక్కారు. ఈ అందాలు సందర్శకులను మంత్ర ముగ్ధులను గావిస్తాయి.

తలకాడు ప్రదేశం ఒక శాపం కారణంగా ఒక ఎడారి ప్రాంతం అయ్యిన్దంటారు. 16 వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య ప్రతినిధి శ్రీ రంగ రాయ ఇక్కడ నివసించే వాడు. ఆయన భార్య శ్రీరంగపట్నం లోని దేవత రంగనాయకి కి ఆభరణాలు అలంకరించేది. అయితే, భర్త చనిపోయిన తర్వాత, మైసూరు పాలకులు ఆ ఆభారనాలను తిరిగి ఇచ్చేయమని బలవంత పెట్టగా, ఆమె అక్కడే కల మాలంగి నది నీటిలో పడి ఆత్మహత్య గావించుకొంది. ఆ నదిలో దూకేముందు ఆమె, మూడు శాపాలు ఇచ్చింది. అవి 'తలకాడు అంతా ఇసుకగా అయిపోవాలని, ' మాలంగి నది ఒక సుడిగుండం అవ్వాలని, ' మైసూరు రాజులకు వారసులు లేకుండా పోవాలని' శాపాలు ఇచ్చినట్లు చెపుతారు. ఆ కారణంగా తలకాడు నేడు ఈ పరిస్థితిలో వుందని చెపుతారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X