Search
  • Follow NativePlanet
Share
» »ప్రకృతి అందాల .. దేవచర్ల !

ప్రకృతి అందాల .. దేవచర్ల !

By Mohammad

చుట్టూ కొండలు.. దుర్భేద్యమైన అడవులు.. పై నుండి జాలువారే అద్భుత నీటి పరవళ్లు.. ఆ పరవళ్లు శివలింగాన్ని అభిషేకించే అద్భుత దృశ్యాలు.. ఎప్పుడు చూడగలం చెప్పండీ.. ! మనసును కట్టిపడేసే ఇటువంటి ప్రకృతి అందాలు చూడాలంటే నల్లగొండ జిల్లా కు వెళ్ళవలసిందే ..!

నల్గొండ జిల్లా, చందంపేట మండలం దేవరచర్లకు సమీపాన ఉన్న గ్రామంలో ఇటువంటి అద్భుత దృశ్యాలు కళ్ళను కట్టిపడేస్తాయి. గ్రామానికి సమీపంలోని ముని స్వామి గుట్టలు రమణీయ దృశ్యాలకు కేంద్రబిందువుగా ఉన్నాయి. దేవరకొండ నుంచి కేవలం 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామం దేవరచర్ల. అక్కడి నుంచి 5 కి.మీ. ఓ నడక వేస్తే మునుస్వామిగుట్ట చేరుకోవచ్చు. ఇక్కడ జలపాతం జాలువారే చోట శివలింగం, వందల ఏళ్ల నాటి పురాతన ఆలయం కనువిందు చేస్తున్నాయి.

ఇది కూడా చదవండి:పరమ రహస్యం ... శ్రీ శ్రీ ఛాయా సోమేశ్వరాలయం !

గుట్టల నడుమ ఆలయం, ఆ పక్కనే పెద్ద సొరంగ మార్గం ఉంది. ఈ మార్గం ఎప్పటిదో, అక్కడ ఎప్పటినుంచి ఉందో ఎవరికీ తెలియదు. ఈ ప్రాంతం చుట్టు ప్రక్కల ఉండే గిరిజనులు మాత్రం.. మూడు తరాల నుంచి సొరంగాన్ని, శివాలయాన్ని, జలపాతాన్ని చూస్తున్నామని చెబుతున్నారు. ఏటా శివరాత్రి, ఏకాదశి పర్వదినాల్లో ఏడాదికి రెండుసార్లు ఇక్కడ శివలింగానికి పూజలు జరుగుతుంటాయి. ఈ పర్వదినాల్లో గుట్టపై నిర్వహించే జాతరకు అధిక సంఖ్యలో భక్తులు వచ్చి పూజలు నిర్వహిస్తారు. వాస్తవంగా దేవరకొండ ఖిల్లా దుర్గాన్ని 13వ శతాబ్దంలో రేచర్ల పద్మనాయక వంశానికి చెందిన రాజులు పాలించారు. ఆలయంలోని స్తంభాలపై చెక్కిన పద్మాలను (పుప్పాలు) బట్టి ఈ నిర్మాణాలు పద్మనాయక కాలం నాటివని తెలుస్తోంది.

ప్రకృతి అందాల .. దేవచర్ల !
మునుస్వామిగుట్ట వద్ద గల శివలింగం

ఎన్నెన్నో విశేషాలు

కొండపై కొలువైన శివలింగం పై ఎల్లప్పుడూ గుట్టల నుంచి జాలువారే నీటిధారలు అభిషేకిస్తూనే ఉంటాయి. మునుస్వామి ఆలయాన్ని గుట్ట కింది భాగంలో నిర్మించారు. గుట్ట ముందు తొలుత స్తంభాలను నిర్మించి, ఆతర్వాత వెనుకభాగంలో ఆలయాన్ని నిర్మించారు.

కధనం

ఈ ఆలయానికి అపవిత్రంగా వెళ్తే అక్కడి కందిరీగలు, గబ్బిలాలు ప్రమాదాన్ని చేకూరుస్తాయని ఇక్కడి గిరిజనులు నమ్ముతారు. కేవలం ఈగుడి మాత్రమే కాకుండా పాడుబడ్డ మరో ఆలయాన్ని, దాని ఆనవాళ్లను ఇక్కడ గమనించవచ్చు. శివలింగం చుట్టూ మరో 18 చిన్న చిన్న శివలింగాలు ఉన్నాయి. ఆలయం పక్కనే ఒక గుహ లాంటి నిర్మాణం ఉంది. ఇక్కడి నుంచి శ్రీశైలం వరకు రహస్య సొరంగ మార్గం ఉందని స్థానికుల అభిప్రాయం.

ప్రకృతి అందాల .. దేవచర్ల !

మునుస్వామిగుట్ట వద్ద గల శివాలయం

దేవరచర్ల.. తెలంగాణ అరకులోయ

మునుస్వామి గుట్ట నుండి 5 కి. మీ ల దూరంలో ఉన్న దేవచర్ల ప్రకృతి అందాలు అరుకులోయను తలపిస్తాయి. ఇక్కడ మంచి మంచి మంచి కమనీయ దృశ్యాలతో పాటు, దృష్టిని మళ్లించే అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి.

దేవరచర్లలో ఉన్న శివాలయం ముందు మండపం 18 స్తంభాలతో నిర్మించారని, గర్భగుడికి రెండు వైపులా ఉన్న పూర్ణకుంభం ఆధారంగా ఈ ఆలయం 14వ శతాబ్ధం రేచర్ల పద్మనాయక వంశస్థులు నిర్మించినట్లు, దేవరకొండ ఖిల్లాకు ఆలయానికి సంబంధమున్నట్లు చెబుతారు. దేవరచర్లలో విష్ణు, నంది, వల్లి సుబ్రమణ్యస్వామి, భైరవ, సప్తమాత్రిక విగ్రహాలను పురాతత్వ శాస్త్రవేత్తలు మొన్నీమధ్యనే వెలికితీశారు.

దేవరకొండ కోట పై భాగం నుండి దృశ్యాలు

దేవరకొండ కోట పై భాగం నుండి దృశ్యాలు
చిత్ర కృప : Rajib Ghosh

దేవచర్ల ఎలా చేరుకోవాలి ?

వాయు మార్గం : రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్ట్ దేవచర్ల కు సమీపాన కలదు.
రైలు మార్గం : దేవచర్ల సమీపాన నల్గొండ రైల్వే స్టేషన్ కలదు.
రోడ్డు మార్గం : నల్గొండ, దేవరకొండ మరియు చుట్టుపక్కల ప్రాంతాల నుండి దేవరకొండ కు బస్సులు నడుస్తాయి. అక్కడి నుండి షేర్ ఆటోలలో మునుస్వామి గుట్ట చేరుకోవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X