Search
  • Follow NativePlanet
Share
» »తెలంగాణ పర్యాటక ప్రదేశాలు - మెదక్ నగరంలో ఆచరించే పండుగ

తెలంగాణ పర్యాటక ప్రదేశాలు - మెదక్ నగరంలో ఆచరించే పండుగ

మెదక్ తెలంగాణ రాష్ట్రంలో గల ఒక పురపాలక పట్టణం. హైదరాబాద్ రాజధాని నగరం నుండి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీనికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన చరిత్ర ఉంది.

By Venkata Karunasri Nalluru

మెదక్ తెలంగాణ రాష్ట్రంలో గల ఒక పురపాలక పట్టణం. హైదరాబాద్ రాజధాని నగరం నుండి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీనికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన చరిత్ర ఉంది.

ఈ పట్టణం కాకతీయ పాలనలో ఎక్కువ పురోగతిని సాధించింది. ఒకానొక కాకతీయ రాజు మెదక్ ను శత్రువుల దాడి నుండి రక్షించడానికి పట్టణం చుట్టూ ఒక షెల్టరును నిర్మించారు.

ఈ షెల్టరు (కోట) ను ఒక కొండ పై నిర్మించారు. దీనిని "మెతుకు దుర్గం" అని పిలిచేవారు. దీనిని అక్కడ ఉన్న స్థానికులు ప్రముఖంగా "మెతుకు సీమ" గా పిలిచేవారు. "మెతుకు" అనేది ఒక తెలుగు పదం. వండిన బియ్యం గింజలు అని దీని అర్థం.

మెదక్ లో అనేక పండుగలు చాలా ఉత్సాహముతో ప్రదర్శనలతో జరుపుకుంటారు. నిజానికి, తెలంగాణాలోని అన్ని పండుగలు ఈ ప్రాంతంలో జరుపుకుంటారు. ఇక్కడ జరిగే ఉత్సవాలలో పాల్గొనేందుకు ప్రజలు సుదూర ప్రాంతాల నుండి తరలి వస్తారు.

మెదక్ జిల్లాలో అత్యంత ప్రసిద్ధ చెందిన పండుగ ఒకటి ఉంది. అదే "బతుకమ్మ పండుగ". దీనిని పెద్ద ఎత్తున ఇక్కడ జరుపుకుంటారు.

ఆలయ సందర్శనం:

మెదక్ జిల్లాలో పండుగలు

Photo Courtesy: Msurender

ఏడుపాయల దుర్గా భవాని గుడి:

ఏడుపాయల దుర్గా భవాని గుడిలో "దేవత దుర్గా భవాని" వెలసిన ఒక పుణ్యక్షేత్రం. ఈ ఉత్తమ స్థలం అందరికీ తెలిసిన దేవత దుర్గ యొక్క పుణ్యక్షేత్రం మాత్రమే కాదు ఇక్కడ సహజసిద్ధంగా ఏర్పడిన రాళ్ళకు కూడా చరిత్ర ఉంది. ఇక్కడ ప్రవహించే "మంజీరా నది" ఏడు పాయలుగా చీలి ప్రవహిస్తుంది. మరాలా ఈ నదులు మరొక ప్రదేశంలో తిరిగి కలుస్తాయి.

ఒక చిరుతపులి విశ్రాంతి:

మెదక్ జిల్లాలో పండుగలు

Photo Courtesy: Bruce McAdam

పాపికొండలు:

"పాపికొండలు లేదా పాపీ హిల్స్" మెదక్ లో చూడదగిన ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. ఇక్కడ గోదావరి నది యొక్క పాయ ప్రవహిస్తూ వుంది. ఇక్కడ గల జలపాతం పర్యాటకులను మరియు ప్రకృతి ప్రేమికులను ఎంతగానో ఆకర్షిస్తుంది. ఈ ప్రదేశం ప్రకృతి శాంతమూర్తులయిన గిరిజన తెగకు సంబంధించింది. ఇక్కడ ఒక వన్యప్రాణి అభయారణ్యం ఉంది. ఈ అభయారణ్యంలో వివిధ రకాలైన పక్షులు మరియు జంతువులు ఉన్నాయి. ఇక్కడ పులులు, చిరుత పులులు, లేడి, మచ్చల జింకలు, హైనాలు, నక్కలు మొదలైన జంతువులను ఉండవచ్చు.

ఒక తోడేలు కుటుంబం:

మెదక్ జిల్లాలో పండుగలు

Photo Courtesy: Golo

పోచారం అభయారణ్యం:

ఒకప్పుడు హైదరాబాద్ నిజాములు ఈ పోచారం అభయారణ్యంలో జంతువులను వేటాడటానికి వచ్చేవారు. అల్లైర్ డ్యామ్ నిర్మాణం జరిగిన తరువాత ఇక్కడ పోచారం సరస్సు ఉన్నందువల్ల ఈ అభయారణ్యంనకు "పోచారం అభయారణ్యం" అనే పేరు వచ్చింది. ఇక్కడ ఎన్నో వన్యప్రాణులు అడవి కుక్కలు, తోడేలు, చిరుత, అడవి పిల్లి, దుప్పి మొదలైనవాటికి ఆవాసయోగ్యంగా వున్నాయి. ఇక్కడ వలస పక్షుల సందర్శనం చాలా బాగుంటుంది. ఈ వలస పక్షులు ప్రతి సంవత్సరం వలస వస్తాయి. వాటిలో బాహ్యమైన బిల్ కొంగ, బార్ తలల గూస్ మరియు బ్రాహ్మినే బాతులు వంటి కొన్ని వలస పక్షులను సందర్శించవచ్చు.

చర్చి యొక్క సుందర దృశ్యం:

మెదక్ జిల్లాలో పండుగలు

Photo Courtesy: David Marchant

మెదక్ చర్చి:

మెదక్ చర్చి భారతదేశం యొక్క మెథడిస్ట్ క్రైస్తవులు నిర్మించారు. ఈ చర్చి 1924 సం.లో స్థాపించబడింది. చర్చి యొక్క నిర్మాణ రూపకల్పన "గోతిక్ రివైవల్" శైలిలో ఉంది. దాదాపు ఇక్కడ 5,000 మందికి వసతికి ఆవాసయోగ్యంగా ఉంది. ఇక్కడకు వచ్చినవారికి చర్చి యొక్క అద్దాల కిటికీలలో యేసు క్రీస్తు జీవితంలో ముఖ్య ఘట్టాలైన జననం, శిలువ వేయడం మొదలైన చిత్రాలు సందర్శకులకు విస్మయం కలిగిస్తాయి.

మెదక్ కోట యొక్క మెట్ల దారి:

మెదక్ జిల్లాలో పండుగలు

Photo Courtesy: Varshabhargavi

మెదక్ కోట: మెదక్ కోట ఆక్రమణదారుల నుండి నగరాన్ని రక్షించడానికి కాకతీయ పాలకులు నిర్మించిన ఒక పురాతన కోట. కోటను మహారాజా ప్రతాప్ రుద్ర 12 వ శతాబ్దంలో నిర్మించారు. దీనిని "మెతుకు దుర్గం" అని తరచుగా పిలిచేవారు.

మెదక్ ఎలా చేరాలి?

మెదక్ జిల్లాలో పండుగలు

Photo Courtesy: ShashiBellamkonda

విమాన మార్గం: మెదక్ కు చేరుకోవటానికి సమీప విమానాశ్రయంహైదరాబాద్ వద్ద ఉన్నది. ఈ విమానాశ్రయం మెదక్ పట్టణానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ఇతర ప్రధాన నగరాలకు అనుసంధానించబడి ఉంది.

రైలు మార్గం: మెదక్ లో అస్సలు రైల్వే స్టేషన్ లేదు. సమీప రైల్వే స్టేషన్ కామారెడ్డి పట్టణంలో 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ రైల్వే స్టేషన్ హైదరాబాద్, వైజాగ్, కరీంనగర్, సికింద్రాబాద్ సహా ఆంధ్రప్రదేశ్ లోని ప్రధాన నగరాలకు బాగా అనుసంధానించబడి ఉంది.

రోడ్డు మార్గం: రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన పట్టణాలు మరియు నగరాల నుంచి మెదక్ కు బస్సులు నడుపుతుంది. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుండి కూడా బస్సులు మెదక్ కు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ మరియు వైజాగ్ నగరాలు కూడా డీలక్స్ మరియు వోల్వో బస్సులు మెదక్ కు నడపబడుతున్నాయి. కానీ ఇది కొద్దిగా ఖరీదైనది కావచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X