Search
  • Follow NativePlanet
Share
» »సముద్రపు ఒడ్డున గల అద్భుత ఆలయాలు

సముద్రపు ఒడ్డున గల అద్భుత ఆలయాలు

మీ ఆధ్యాత్మికతకు ఎటువంటి భంగం వాటిల్లకుండా దానికి తోడు కాస్త ఉత్సాహాన్ని పెంపొందించే ప్రదేశాలు దక్షిణ భారత దేశంలో ఉన్నాయి. అక్కడ ఆలయాలను దర్శిస్తే ఫ్రీ గా బీచ్ కూడా దర్శించినవారవుతారు.

By Venkatakarunasri

మీ ఆధ్యాత్మికతకు ఎటువంటి భంగం వాటిల్లకుండా దానికి తోడు కాస్త ఉత్సాహాన్ని పెంపొందించే ప్రదేశాలు దక్షిణ భారత దేశంలో ఉన్నాయి. అక్కడ ఆలయాలను దర్శిస్తే ఫ్రీ గా బీచ్ కూడా దర్శించినవారవుతారు.

ఆ మీరు ఊహించింది నిజమే ... ఇప్పుడు మీకు చెప్పబోతున్న ప్రదేశాలు బీచ్ ఒడ్డున ఉన్న ప్రముఖ ఆలయాలు గురించి. పర్యాటకులు ఇక్కడున్న ఆలయాలను దర్శించి పక్కనే ఉన్న బీచ్ లో విశ్రాంతి తీసుకోవచ్చు. బీచ్ లో కూర్చొని పొట్లాలలో పల్లీలు, బురుగులు, మురుకులు తింటూ బీచ్ వాతావరణాన్ని ఆస్వాదించవచ్చు.

సముద్రపు ఒడ్డున గల అద్భుత ఆలయాలు

మురుడేశ్వర్ ఎలా వెళ్ళాలి ?

మురుడేశ్వర్ ఎలా వెళ్ళాలి ?

మురుడేశ్వర్ వెళ్ళటానికి రోడ్డు, రైలు మరియు విమాన మార్గాలు అందుబాటులో ఉన్నాయి.

విమానమార్గం

మురుడేశ్వర్ కు సమీపాన ఉన్న విమానాశ్రయం మంగళూరు విమానాశ్రయం. ఇది 153 కి. మీ. దూరంలో ఉంటుంది. ఏర్ పోర్ట్ నుండి క్యాబ్ లేదా ప్రవేట్ ట్యాక్సీ లను ఆద్దెకు తీసుకొని మురుడేశ్వర్ చేరుకోవచ్చు.

రైలు మార్గం

మురుడేశ్వర్ లో రైల్వే స్టేషన్ ఉన్నది కానీ కొన్ని రైళ్లు మాత్రమే ఆగుతాయి. సమీపాన ఉన్న ప్రధాన రైల్వే జంక్షన్ మంగళూరు స్టేషన్. ఇక్కడి నుండి దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు ప్రయాణించవచ్చు. ట్యాక్సీ లేదా ప్రభుత్వ బస్సుల్లో ప్రయాణించి మురుడేశ్వర్ చేరుకోవచ్చు.

రోడ్డు మార్గం

మురుడేశ్వర్ కు సమీప నగరాల నుండి, పట్టణాల నుండి ప్రభుత్వ మరియు ప్రవేట్ బస్సులు తిరుగుతుంటాయి. బెంగళూరు నుండి హోనావార్ కు నేరుగా బస్సులు అందుబాటులో ఉన్నాయి. హోనావార్ నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న మురుడేశ్వర్ కు క్యాబ్ లేదా ట్యాక్సీ లలో చేరుకోవచ్చు.

శివుని విగ్రహం

శివుని విగ్రహం

మురుడేశ్వర్ లో శివుని విగ్రహం ప్రధాన ఆకర్షణ. చుట్టూ అరేబియా సముద్రం పక్కనే 123 అడుగుల ఎత్తులో భారీ శివుని విగ్రహం మరియు శివలింగాలతో కూడిన అనేక ఆలయాలు దర్శనమిస్తాయి. సమీపంలోని రాజగోపురం 20 అంతస్తులు కలిగి ఉండి గ్రానైట్ రాయితో నిర్మించబడింది.

బీచ్

బీచ్

మురుడేశ్వర్ లో ఆలయాలు చూసిన తర్వాత పక్కనే ఉన్న బీచ్ తప్పక సందర్శించాలి. బీచ్ లో పర్యాటకులు సేదతీరుతూ పొడవైన శివుని విగ్రహాన్ని చూసి ఆనందిస్తారు. యాత్రికులు నీటి సంబంధిత ఆటలు అంటే బోటింగ్, స్విమ్మింగ్ వంటివి చేయవచ్చు. సాయంత్రంవేళ బీచ్ లో కూర్చొని సూర్యాస్తమ ఘట్టాన్ని తిలకించవచ్చు.

మహాబలిపురం

మహాబలిపురం

మహాబలిపురం చేరుకోవటానికి రోడ్డు, రైలు మరియు విమాన మార్గాలు అందుబాటులో ఉన్నాయి

విమాన మార్గం

మహాబలిపురానికి సమీపంలో ఉన్న విమానాశ్రయం చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. ఇది సుమారు 54 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. క్యాబ్ లేదా ట్యాక్సీ వంటి ప్రవేట్ వాహనాలు అద్దెకు తీసుకొని మహాబలిపురం చేరుకోవచ్చు.

రైలు మార్గం

మహాబలిపురం లో ఎటువంటి రైల్వే స్టేషన్ లేదు కానీ సమీపంలో చెంగల్పట్టూ రైల్వే స్టేషన్ కలదు. ఇది 29 కిలోమీటర్ల దూరంలో కలదు. ట్యాక్సీ లేదా బస్సుుల్లో ప్రయాణించి మహాబలిపురం చేరుకోవచ్చు.

రోడ్డు మార్గం

చెన్నై మరియు సమీప ఇతర పట్టణాల నుండి , నగరాల నుండి మహాబలిపురం కు ప్రభుత్వ బస్సులు తిరుగుతుంటాయి. చెన్నై నుండి ప్రభుత్వ మరియు ప్రవేట్ బస్సులు మహాబలిపురానికి నిత్యం తిరుగుతుంటాయి.

మహాబలిపురం

మహాబలిపురం

మహాబలిపురం లో చూడవలసినది సముద్ర ఒడ్డున ఉన్న షోర్ టెంపుల్. గ్రానైట్ రాళ్లతో నిర్మించిన ఈ ఆలయం మహాబలిపురానికి స్మారకం లాంటిది. ఈ ఆలయం లో శివుడు, విష్ణువు మరియు దుర్గ అమ్మవారి విగ్రహాలు దర్శనం ఇస్తాయి. దీనితో పాటు పంచ రథాల నిర్మాణం మరియు టైగర్ గుహలు మొదలగునవి చూడవచ్చు.

మహాబలిపురం

మహాబలిపురం

మహాబలిపురం లో షోర్ టెంపుల్ చూసిన తర్వాత పక్కనే ఉన్న బీచ్ తప్పక సందర్శించాలి. ఈ బీచ్ లో సాయంత్రం పూట చల్లని గాలులను ఆస్వాదించవచ్చు. బీచ్ లోతు ఎక్కువగా ఉంటుంది కాబట్టి లోనికి పోకపోవడం ఉత్తమం. ఇక్కడ గవ్వల తో చేసిన వస్తువులు కొనుక్కోవటం, మంచి రుచికరమైన సీ ఫుడ్ లను తినటం చేయవచ్చు.

విజింజమ్ ఎలా చేరుకోవాలి ?

విజింజమ్ ఎలా చేరుకోవాలి ?

విజింజమ్ గ్రామం చేరుకోవాలంటే ముందుగా 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరువనంతపురం నగరానికి చేరుకోవాలి. ఇదే ఈ గ్రామానికి పెద్ద రవాణా వ్యవస్థ కలిగి ఉంది. కనుక ముందు తిరువనంతపురం ఎలా చేరుకోవాలో చూద్దాం ..!

విమాన మార్గం

తిరువనంతపురం నగరంలో అంతర్జాతీయ విమానాశ్రయం కలదు. అక్కడి నుండి రోడ్డు మార్గం గుండా 17 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే విజింజమ్ చేరుకోవచ్చు.

రైలు మార్గం

తిరువనంతపురం లో రైల్వే స్టేషన్ కలదు. అక్కడి నుండి ట్యాక్సీ లేదా బస్సు లో ప్రయాణించి విజింజమ్ సులభంగా చేరుకోవచ్చు.

రోడ్డు మార్గం

విజింజమ్ చేరుకోవటానికి తిరువనంతపురం నుండి ప్రభుత్వ బస్సులు అందుబాటులో ఉన్నాయి. అలాగే కోవాలం నుండి కూడా బస్సులు విజింజమ్ తిరుగుతుంటాయి. కాబట్టి ఎటు చూసిన తిరువనంతపురం నుండి రోడ్డు మార్గం గుండా మాత్రమే విజింజమ్ చేరుకోవటానికి సౌకర్యాలు అధికంగా ఉన్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X