అనంతపద్మనాభ స్వామి ఆరవ గది తెరిస్తే మొత్తం ప్రపంచాన్ని ముంచేస్తుందా?
వెతకండి
 
వెతకండి
 

వెయ్యేండ్ల ఆ గుడిలో ఎన్నో అంతుచిక్కని రహస్యాలు !

Written by:
Updated: Wednesday, November 23, 2016, 9:51 [IST]
Share this on your social network:
   Facebook Twitter Google+ Pin it  Comments

అదోక గుడి. దానికి వెయ్యేండ్లు నిండాయి. అందులో భారతదేశంలోనే అతిపెద్ద శివలింగం ఉంది. అదే బృహదీశ్వరాలయం. ఈ ప్రాచీన హిందూ దేవాలయం మరెక్కడో కాదు తమిళనాడు లోని తంజావూరు లో ఉన్నది. దీనిని క్రీ.శ.11 వ శతాబ్దంలో చోళుల పాలకుడు మొదటి రాజరాజచోళుడు నిర్మించాడు.

తమిళనాడులో కావేరీ నదికి దక్షిణాన ఉన్న తంజావూరులో ఉంది బృహదీశ్వరాలయం. విశాలమైన ఈ ఆలయానికి చేరడానికి మూడు ద్వారాలున్నాయి. మొదటి ద్వారం అనగా ప్రవేశద్వారం 'కేరళాంతకన్‌', రెండో ద్వారం 'రాజరాజన్‌ తిరువసల్‌', మూడో ద్వారం 'తిరువానుక్కన్‌ తిరువసల్‌'. ఈ బృహదీశ్వరాలయా న్ని నిర్మించిన రాజరాజచోళుడి పేరున 'రాజరాజేశ్వరాలయం' అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం వాస్తు, శిల్ప, చిత్రలేఖన కళ లన్నిటి సంగమం అని చెప్పవచ్చు.

చోళుల అద్భుత కట్టడం - ఐరావతేశ్వర ఆలయం !

ఇవి మీకు తెలుసా ?

క్రీ.శ 1954లో మొట్టమొదటిసారిగా ఇండియాలో రూ.1000 నోటు చలామణిలోకి వచ్చింది. ఆనాడు భారత ప్రభుత్వం ఆ నోటుమీద బృహదీశ్వరాయం బొమ్మను ముద్రించింది. తరువాత 1975లో భారత ప్రభుత్వం వెయ్యి రూపాయల నోటును నిషేధించింది.

రాజరాజచోళునిచే 1010వ సంవత్సరంలో తంజా వూరులో నిర్మించిన బృహదీశ్వరాలయానికి వెయ్యి సంవత్సరాలు నిండిన సందర్భంగా, సహస్రాబ్ది ఉత్స వాలకు తపాలాశాఖ 26-9-2010 న బృహదీశ్వరాలయం బొమ్మలతో ఒక ప్రత్యేక తపాలా బిళ్లను విడుదల చేసింది. మన దేశంలో ఉన్న అతిపెద్ద గర్భగుడి, విమాన గోపురం ఉన్న దేవాలయం ఇదే. భూమినుండి స్తుపి వరకు 66మీ ఎత్తులో అద్భుత శ్పికళా సంపదతో అలరారే ఈ దేవాలయం ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది.

స్వామిమలై - 'దేవుని పర్వతం' !

కట్టడానికి సలాం ..!

మిస్టరీలకు నిలయం తంజావూరు బృహదీశ్వర ఆలయం. ఎక్కడా సిమెంట్, ఉక్కు అన్నమాటకు తావులేకుండా నిర్మించిన ఈ దేవాలయాన్ని చూస్తే అప్పటి టెక్నాలజీకి సలాం చేయకమానరు.

చిత్రకృప : Jean-Pierre Dalbéra

శివలింగం

వెయ్యేళ్ల కిందట కట్టిన ఈ ఆలయం అప్పట్లో ఇండియాలోనే అతిపెద్ద ఆకాశహర్మం. 13 అంతస్తులు కలిగిన ఈ ఆలయంలో ఇండియాలోనే అతిపెద్ద శివలింగం ఉన్నది. దీని ఎత్తు 3. 7 మీటర్లు.

చిత్రకృప : Vsvs2233

నంది

శివుని వాహనం నంది కూడా తక్కువేం కాదు. ఇదొక ఏకశిలా విగ్రహం. 20 టన్నుల బరువు, 2 మీటర్ల ఎత్తు, 6 మీటర్ల పొడవు, 2. 5 మీటర్ల పొడవు కలిగి ఉంటింది.

చిత్రకృప : MADHURANTHAKAN JAGADEESAN

గ్రానైట్ రాయి

ఈ ఆలయం నిర్మించటానికి సిమెంట్, ఉక్కు వాడలేదు. పూర్తిగా 13 అంతస్తులు గ్రానైట్ రాయితోనే కట్టించారు.

చిత్రకృప : Gmuralidharan

గోపురం

ప్రధాన ఆలయానికి గోపురం హైలెట్. 13 అంతస్తులు ఎటువంటి వాలు సహాయం లేకుండా నిలబడటం అనేది.

చిత్రకృప : Ryan

మధ్యాహ్నం

ఇక్కడ ఆశ్చర్యపరిచే మరో అంశం మిట్టమధ్యాహ్నం ఆలయం యొక్క గోపురం నీడ ఎక్కడా పడకపోవడం. గుడి నీడన్న పడుతుందేమో గానీ గోపురం నీడ అస్సలు పడదు.

చిత్రకృప : Kochapz

సువిశాలం

ఆలయ శబ్ద పరిజ్ఞానాన్ని మెచ్చుకోకతప్పదు. ఆలయ ప్రాంగణం సువిశాలంగా ఉంటుంది. ఇక్కడ మనం మాట్లాడుకొనే శబ్దాలు మళ్ళీ ప్రతిధ్వనించవు.

చిత్రకృప : simianwolverine

సొరంగాలు

ఆలయంలో అనేక సొరంగమార్గాలు ఉన్నాయి. కొన్ని తంజావూరులోని ఆలయాలకు దారితీస్తే, మరికొన్ని మరణానికి దారితీసేవిగా ఉన్నాయి. వీటిని రాజరాజచోళుడు తగుజాగ్రత్తల కోసం ఏర్పాటుచేసుకున్నాడని చెబుతారు.

చిత్రకృప : Vengolis

రాతితోరణాలు

గుడిలో ఆశ్చర్యపరిచే మరో టెక్నాలజీ అంశం గుడి చుట్టూ ఉన్నరాతి తోరణాలు. ఈ తోరణాల యొక్క రంధ్రాలు ఆరు మీ.మీ ల కన్నా తక్కువ సైజులో వంపులతో ఉంటాయి. అంత చిన్నగా ఎందుకు పెట్టారో ఎవరికీ తెలీదు.

చిత్రకృప : MADHURANTHAKAN JAGADEESAN

విశేషాలు

వందల సంవత్సరాల క్రితం నాటి గుడులు ఇప్పుడు శిధిలావస్థ దశలో ఉంటాయి. అయితే ఈ గుడి మాత్రం చెక్కుచెదరకుండా అత్యద్భుతంగా, ఇప్పుడిప్పుడే కట్టారా ? అన్న రీతిలో ఉంటుంది. ఇన్ని వింతలు, విశేషాలు నెలకొన్న ఈ గుడి ప్రపంచ వారసత్వ జాబితాలో చేరింది.

చిత్రకృప : brehadeesh kumar

మిస్టరీయే ..!

ఒకప్పుడు సువిశాల రాజ్యానికి కేంద్రబిందువువైన తంజావూరు ఇప్పుడు ఒక కుగ్రామం మాత్రమే. ఈ నగరం ఎలా అంతరించిందో చరిత్రకు సైతం అంతుపట్టలేదు.

చిత్రకృప : Mdjaveed01

శిల్పం

గుడి చుట్టుపక్క ప్రాంతాలలో ఇప్పటికీ పురావస్తుశాఖ వారు తవ్వకాలను జరుపుతున్నారు. తవ్వకాలు జరిపిన ప్రతిసారి ఎదో ఒక శిల్పమో లేదా ఆనాటి కాలానికి సంబంధించిన వస్తువో బయటపడుతూ ఉంది ... ఆనాటి వైభవాన్ని చాటుతూ ఉంది.

చిత్రకృప : Ryan

బస్సులలో

తంజావూరు కు సమీపాన ట్రిచి, చెన్నై విమానాశ్రయాలు మరియు రైల్వే జంక్షన్ ఉన్నాయి. ఇక్కడి నుండి ప్రభుత్వ లేదా ప్రవేట్ బస్సులలో తంజావూర్ చేరుకోవచ్చు.

చిత్రకృప : Mugilkmv

English summary

Thanjavur Temple Story Secrets

Brihadeshwara Temple is a Hindu temple dedicated to Shiva located in Thanjavur in the Indian state of Tamil Nadu. It is also known as RajaRajeswara Temple and Brihadeshwara Temple.
Please Wait while comments are loading...