Search
  • Follow NativePlanet
Share
» »భారతదేశంలో పది ఎత్తైన విగ్రహాలు !

భారతదేశంలో పది ఎత్తైన విగ్రహాలు !

ఈ నిర్మాణాలు ఎంత పెద్దవి అయితే, అంత ఖ్యాతి గడిస్తాయని, అంత ప్రశంసించ బడతాయని భావిస్తున్నారు.

మీరు కళలు లేదా శిల్ప కళ మొదలైనవాటి పట్ల ఆసక్తి కలిగిన వారైతే, పూర్వ కాలంలో మన భారత దేశ శిల్పుల నైపుణ్యం అంతా వారు చెక్కిన శిల్పాలలో సైజు కు ప్రాధాన్యం ఇవ్వకుండా పురాణ, చరిత్ర, ఇతర అంశాల పట్ల వివరణలు ఇవ్వడం జరిగిందని తెలుసుకుంటారు. పూర్వ కాలంలో గ్రీకులు మొదలైన వారు విగ్రహ సైజు లకు ప్రాధాన్యత ఇచ్చేవారు. తర్వాత కాలంలో మనదేశాన్ని పాలించిన విదేశీయులు కూడా పెద్ద పెద్ద ఆకర్షణీయ విగ్రహాలు చెక్కి పేరు గడించారు. ఇక ప్రస్తుతంలో మన భారతీయ శిల్పులు సైతం అతి పెద్ద విగ్రహాలను నిర్మించి తమ గొప్పదనాన్ని చాటుకొన చూస్తున్నారు. ఈ నిర్మాణాలు ఎంత పెద్దవి అయితే, అంత ఖ్యాతి గడిస్తాయని, అంత ప్రశంసించ బడతాయని భావిస్తున్నారు.

ఎత్తైన విగ్రహాలు, ఇతర నిర్మాణాలు దేశం యొక్క గొప్ప తనాన్ని కూడా చాటుతాయి. ఇటీవలి మనదేశం లోని గుజరాత్ లో అత్యధిక ఎత్తుతో మరొక విగ్రహం కూడా నిర్మించ దలిచారు. ఈ విగ్రహాన్ని ఐక్యమత్య విగ్రహం అని పిలుస్తారు. ఈ విగ్రహం ఎవరిదో కాదు 'ది ఐరన్ మాన్ అఫ్ ఇండియా ' లేదా ఉక్కు మనిషి గా మన దేశంలో ఖ్యాతి గాంచిన మహనీయుడు సర్దార్ వల్లభాయి పటేల్ ది మాత్రమే. మరి మన దేశంలో అతి ఎత్తైన పది విగ్రహాల గురించి కొంత తెలుసుకుందాం.

పది ఎత్తైన విగ్రహాలు

పది ఎత్తైన విగ్రహాలు

135 అడుగుల ఎత్తైన ఈ వీర అభయ ఆంజనేయ స్వామి విగ్రహం 2003 లో ప్రతిష్టించారు. ఇది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ నగరానికి 30 కి. మీ. ల దూరంలో కలదు. ఇండియాలో ప్రస్తుతానికి ఇది ఒక అతి ఎత్తైన విగ్రహం.

PC: Psrdotcom

పది ఎత్తైన విగ్రహాలు

పది ఎత్తైన విగ్రహాలు

133 అడుగులు ఎత్తైన శ్రీ తిరువల్లువార్ విగ్రహాన్ని 2000 సంవత్సరంలో నిర్మించారు. ఈ విగ్రహం కన్యాకుమారి వద్ద ఒక చిన్న ద్వీపంలో కలదు. తిరుక్కురాల్ కావ్యం రచించిన తమిళ్ కవి శ్రీ తిరువల్లువార్. ఆయన జ్ఞాపకార్ధం ఈ విగ్రహం నిర్మించారు.


PC: mehul.antani

పది ఎత్తైన విగ్రహాలు

పది ఎత్తైన విగ్రహాలు

పద్మ సంభావ అంటే పద్మంలో పుట్టినవాడని అర్ధం. ఆకర్షణీయమైన ఈ విగ్రహం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని రేవాల్సార్ సరస్సు వద్ద కలదు. దీని ఎత్తు 123 అడుగులు. ఇక్కడి ప్రజలు ఈ మహనీయుడిని రెండవ బుద్ధుడి గా పేర్కొంటారు.

PC: John Hill

పది ఎత్తైన విగ్రహాలు

పది ఎత్తైన విగ్రహాలు

కర్నాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లాలో కల మురుడేశ్వర శివ విగ్రహ ప్రదేశం ప్రసిద్ధ హిందువుల పుణ్య క్షేత్రం. ఇక్కడి విగ్రహం ఎత్తు 122 అడుగుల ఎత్తు కలిగి వుంటుంది. అరేబియా సముద్ర ఒడ్డున కల ఈ విగ్రహం దేశంలోనే కాక విదేశీయులకు కూడా ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
PC: Lucky vivs

పది ఎత్తైన విగ్రహాలు

పది ఎత్తైన విగ్రహాలు

గురు పద్మసంభవ్ విగ్రహం 118 అడుగుల ఎత్తు కలది. ఇది సిక్కిం లోని నాంచి ప్రదేశంలో కలదు. సిక్కిం పర్యటనలో పర్యాటకులు ఈ విగ్రహాన్ని తప్పక చూసి ఆనందిస్తారు.

PC: Chitta.crb

పది ఎత్తైన విగ్రహాలు

పది ఎత్తైన విగ్రహాలు

కర్నాటక లోని బీదర్ జిల్లాలో కల బసవ విగ్రహం 108 అడుగుల ఎత్తు వుంది, పర్యాటకులను దూరం నుండే ఆకర్షిస్తుంది. బసవ కళ్యాణ ప్రదేశంలోని ఈ విగ్రహం, అత్యధిక ఎత్తుకల బసవ విగ్రహం.

PC: Sscheral

పది ఎత్తైన విగ్రహాలు

పది ఎత్తైన విగ్రహాలు

ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ నగరం లో ఈ గౌతమ బుద్ధుడి విగ్రహం కలదు. దీని ఎత్తు 107 అడుగులు. ఉత్తరా ఖండ్ పర్యటనలో బౌద్ధులు ఈ బుద్ధుడి విగ్రహాన్ని తప్పక సందర్సించు కుంటారు.


PC: ramesh Iyanswamy

పది ఎత్తైన విగ్రహాలు

పది ఎత్తైన విగ్రహాలు

105 అడుగులు ఎత్తు కల ఈ జై హనుమాన్ విగ్రహం మహారాష్ట్ర లోని నందూరా పట్టణంలో కలదు. సుందరమైన ఈ విగ్రహం పర్యాటకులను, స్థానికులను అమితంగా ఆకర్షిస్తుంది.

PC: Surabhi Dhake

పది ఎత్తైన విగ్రహాలు

పది ఎత్తైన విగ్రహాలు

అద్భుత ఆకర్షణ కల భగవాన్ శివుడి విగ్రహం ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ లో కల హర కి పౌరి ఘాట్ లో కలదు. ఈ విగ్రహం ఎత్తు 100 అడుగులు. ప్రపంచంలోని ఎత్తైన శివుడి విగ్రహాలలో ఇది మూడవదిగా చెపుతారు. శివ భక్తులు తమ ఉత్తరాఖండ్ పర్యటనలో ఈ విగ్రహ దర్శన తప్పక చేస్తారు.

పది ఎత్తైన విగ్రహాలు

పది ఎత్తైన విగ్రహాలు

ఈ గణేశ విగ్రహాన్ని చిన్మయ మిషన్ ఆధ్యాత్మిక సంస్థ ప్రతిష్టించినది. దీని ఎత్తు 85 అడుగులు ఎత్తున్ వుంటుంది. ఆకర్షణీయమైన ఈ గానేషుడి విగ్రహం మహారాష్ట్ర లోని కొల్లాపూర్ లో కలదు.


PC: Chinmaya Ganadish

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X