Search
  • Follow NativePlanet
Share
» » కర్ణాటక నృత్యాలు ...కావ్య రసాలు!

కర్ణాటక నృత్యాలు ...కావ్య రసాలు!

కర్నాటక రాష్ట్రంలో నేటికీ, అనేక శతాబ్దాల కిందటి నృత్య రీతులు ప్రదర్శిస్తున్నారు. ఇక్కడి కళా ప్రదర్శన వినోదం కొరకు కాదు. అట్లే ఆ డాన్సు లు అభివృద్ధి చెందటం కాదు. కళ అనేది సమాజంలోని అన్ని రకాల ప్రజలను ఒక తాటి పైకి తీసుకు వచ్చి వారి వారి సంస్కృతులను రాష్ట్ర స్థాయిలో ప్రదర్సించేందుకు వీరు ప్రయత్నిస్తారు.

ఈ సాంస్కృతిక కార్యక్రమాలలో సౌండ్, మ్యూజిక్, మేక్ అప్, దుస్తులు, ప్రదర్సించేందుకు ఒక కధ అన్నిటిని మించి చక్కగా వినేందుకు చెవులు, చూసేందుకు కళ్ళు ఈ అనాదిగా వస్తున్న కళా ప్రదర్శనలను విజయవంతం చేస్తున్నాయి. ఎన్నో రకాల నృత్య కార్యక్రమాలను వీరు నిర్వహిస్తూ సమాజంలోని అన్ని తరగతుల ప్రజల సంస్కృతిని వీరు కాపాడు తున్నారు. మరి వీరి నృత్య తీరు తెన్నులు పరిశీలిస్తే ...

యక్షగాన

యక్షగాన

కర్నాటక రాష్ట్రంలో యక్షగానం నృత్యం అతి సాధారణమైనది. దీనిలో డ్రామా, డాన్స్, మ్యూజిక్, డైలాగ్ లు అన్నీ వుంటాయి. యక్ష అంటే ఇతర లోకాల వారు అని, గాన అంటే పాట అని చెపుతారు. ఈ నృత్య రూపకం సుమారు 400 సంవత్సరాల నుండి ప్రదర్శించ బడుతోంది. ప్రధానంగా ఇది మల్నాడ్ ప్రాంతంలో కలదు. దీనిని పంటలు పండే వర్షాకాలంలో అధికంగా ప్రదర్శిస్తారు.

యక్షగాన - తెల్లవార్లూ

యక్షగాన - తెల్లవార్లూ

వివిధ పురాణ కధలను వివరించే యక్షగాన తెల్లవార్లూ కూడా నిర్వహిస్తారు. ఎక్కువగా భాగవతం ప్రదర్శిస్తారు. ఈ ప్రోగ్రాం లో సంగీతకారులు, తబలా, మద్దెల, ఇతర వాయిద్యాలు కూడా ఉపయోగిస్తారు. యక్షగాన రూపొందించటంలో కవి ముద్దన్న ఖ్యాతి గాంచారు. వీరి రత్నావతి కల్యాణం చాలా ప్రసిద్ధి.

గోరవర కుణిత

గోరవర కుణిత

మానవులకు కొంత జంతు ప్రవర్తన కూడా వుంటుంది. కాని అది బయటకు కనుపించనీయారు. గోరవులు భయంకరమైన, ఆకర్షణీయ దుస్తులు ధరించి నృత్యాలు చేస్తారు. వీరు మైలార లింగ భక్తులు.

డొల్లు కుణిత

డొల్లు కుణిత

డొల్లు కుణిత అనేక ప్రధాన నగరాలలో ప్రదర్శించ బడుతున్నప్పటికి, కర్నాటక లో దీనిని కురుబ తెగ వారు ప్రదర్శిస్తారు. కళాకారులు డ్రమ్ములు వాయిస్తూ నృత్యం చేస్తారు. ఈ డాన్స్ వీరు బీరేశ్వర అనే దేముడి కొరకు చేస్తారు. కనుక దీనిని బీరప్పన డొల్లు అని కూడా అంటారు. ఇపుడు దీనిని పట్టణాలలో ఒక వినోద ప్రోగ్రాం గా కూడా చేస్తున్నారు.

సోమన కుణిత

సోమన కుణిత

ఇది ఒక మతపర నృత్యం. దీనిలో చెడు శక్తులను తరిమి వేయటానికి తమ గ్రామ దేవతలను పూజిస్తూ వుంటారు. దేవతకు తమ గ్రామం కాపాడమని వేడుకుంటూ ప్రార్త్ధనలు నిర్వహిస్తారు.

కృష్ణ పారిజాత

కృష్ణ పారిజాత

ఈ నృత్యం హాస్యంగా వుంటుంది. దీనిని సాంప్రదాయకంగా దియేటర్ లలో నిర్వహిస్తారు. దీని కధా అంశం శ్రీ కృష్ణుడు, పారిజాతం చెట్టు కొరకు ఇంద్రుడితో పోరాటం చేయటం. ఈ ప్రోగ్రాం చాలా వరకు ఓపెన్ ఎయిర్ దియేటర్ లలో నిర్వహిస్తారు.

జగ్గలిగే కుణిత

జగ్గలిగే కుణిత

జగ్గలిగే కుణిత నృత్య రూపకంలో ఒక ఎద్దు బండి చక్రాన్ని దున్నపోతు చర్మంలో కప్పి ప్రధాన వాయిద్యంగా వాయిస్తారు. ఈ డాన్సు ను ఉగాది పండుగ సందర్భంగా రాష్ట్రం అంతా నిర్వహిస్తారు.

బీసు కంసాలే

బీసు కంసాలే

బీసు కంసాలే అనేది ఒక బ్రాస్ డిస్క్ దీనిని నృత్యంలో ఒక వాయిద్యం గా ఉపయోగిస్తారు. కర్నాటక లో ఇది ప్రసిద్ధ జానపద నృత్యం. ప్రధానంగా మహాదేశ్వర గుడ్డ ప్రజలు దీనిని చేస్తారు. ఈ నృత్యానికి నేర్పు మాత్రమే కాదు, ఎంతో సాధన కూడా కావాలి.

చౌదికే మేళా

చౌదికే మేళా

ఈ నృత్యాన్ని ఎల్లమ్మ దేవత భక్తులు చేస్తారు. ఈ నృత్యం తో ఎల్లమ్మ దేవత అనుగ్రహిస్తుందని నమ్ముతారు. ఈ పాటలు పాడే వారు నుదుటన కుంకుమ, పసుపు, విభూతి ధరించి పూజ నిర్వహిస్తారు. చౌదికే అనేది ఈ డాన్స్ లో ఉపయోగించే ఒక సంగీత సాధనం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X