Search
  • Follow NativePlanet
Share
» »రాణి రుద్రమ్మ దేవి స్నానమాడిన శృంగార బావి ఇది...

రాణి రుద్రమ్మ దేవి స్నానమాడిన శృంగార బావి ఇది...

బావులను మనం పురాతన కాలం నుంచి చూస్తూనే వున్నాము. బావుల గురించి మన పురాణాలలో కావలసినంత ఉల్లేఖనలు వున్నాయి. హిందూ ధర్మం ప్రకారం బావులు కూడా దైవంగా పూజించే ఆచారం వున్నది.

By Venkatakarunasri

బావులను మనం పురాతన కాలం నుంచి చూస్తూనే వున్నాము. బావుల గురించి మన పురాణాలలో కావలసినంత ఉల్లేఖనలు వున్నాయి.
హిందూ ధర్మం ప్రకారం బావులు కూడా దైవంగా పూజించే ఆచారం వున్నది. భారతదేశంలో ఇటువంటి బావుల మహత్యమూ తక్కువవుతూ వున్నది.అక్కడక్కడా బావులు ప్రస్తుతం కనపడుతూ వున్నాయి.

పురాతన కాలంలో రాజులు తాము నిర్మించిన బావులు కూడా విశేషంగా వుండాలని భావించేవారు. వివిధ బావుల గురించి మీరు సామాన్యంగా వినుంటారు. అయితే శృంగార బావి గురించి వినటం ఇదే మొదటి సారి అని అనుకుంటాను. కాబట్టి

ఈ బావిలో మీరు ఎప్పటికీ వూహించని విశేషాలను చూడవచ్చును. ఈ బావి గురించి అనేక రహస్యాలు దాగున్నాయి, దాని గురించి ఈ వ్యాసం మూలంగా తెలుసుకోండి....

1. ఎక్కడుంది?

1. ఎక్కడుంది?

తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్లోవున్న అందమైన శృంగార బావి. శృంగార బావిని నిర్మించినదెవరు అంటే కాకతీయ సామ్రాజ్యంలోని రాజులు. వీరు కేవలం దేవాలయాలు, గోపురాలు, అపురూప శిల్పాలు మాత్రమే కాదు రహస్యాలను దాచుకున్న బావి కూడా నిర్మించారు.

2. బాహ్య ప్రపంచానికి తెలియని బావి

2. బాహ్య ప్రపంచానికి తెలియని బావి

తెలంగాణాలోని వరంగల్ జిల్లాలోని శృంగార బావి గురించి అంతగా ఎవరికీ తెలియదు. ఇది కాకతీయుల కాలంలో నిర్మించిన శృంగార బావి. ఈ శృంగార బావిలో బాహ్య ప్రపంచానికి తెలియని ఎన్నో రహస్యాలను తనలో దాచుకున్నది.

PC: ShashiBellamkonda

3. మూడు అంతస్తులు

3. మూడు అంతస్తులు

ఈ శృంగార బావిని మూడు అంతస్తులలో నిర్మించారు. శృంగార బావి లోనికి దిగి చూస్తే టైం మిషన్ లో వెళుతున్న ఫీలింగ్ కలుగుతుంది.

PC:ShashiBellamkonda

4. రాణి రుద్రమ్మ దేవి

4. రాణి రుద్రమ్మ దేవి

కాకతీయ సామ్రాజ్యంలోని రాణి రుద్రమ దేవి మరియు ఈ వంశంలోని అనేకమంది రాజులు, రాణులు ఈ శృంగార బావిలో స్నానం చేసారు.

5. బావి యొక్క విశిష్టత

5. బావి యొక్క విశిష్టత

శృంగార బావి యొక్క విశేషమేమంటే, రుద్రమ్మ దేవి ఈ బావిలో స్నానం చేసింది కాబట్టి. ఈ బావి రుద్రమ్మ దేవి స్నానం చేసిన శృంగార బావి అని ప్రసిద్ధిచెందింది.

PC:ShashiBellamkonda

6. సొరంగ మార్గం

6. సొరంగ మార్గం

ఆశ్చర్యం ఏమంటే శృంగార బావి నుండి నేరుగా వేయిస్థంభాల గుడికి సొరంగ మార్గం కూడా వుండేది. కాకతీయులు 360 బావులు నిర్మించారని ప్రతీతి. అందులో ఈ అంతస్థుల బావి ఒకటి.

7. బావి విశిష్టత

7. బావి విశిష్టత

ఈ బావి విశిష్టత ఏమిటంటే ఈ బావిలో ఒక సొరంగ మార్గం వుండుట. అయితే వేయిస్థంభాల గుడిలో వున్న నీరు స్నానమాచరించుటకు నిషిద్ధం.

PC:ShashiBellamkonda

8. శివునికి అభిషేకం

8. శివునికి అభిషేకం

ఈ పవిత్రమైన నీటిని కేవలం శివునికి అభిషేకం చేయటానికి మాత్రమే వాడాలి అందువలన ఇక్కడ స్నానం చేసి సొరంగ మార్గం ద్వారా వేయిస్థంభాల గుడికి వెళ్లి అక్కడ అర్చన చేసుకుని వచ్చేవారని చెప్తారు.

PC:ShashiBellamkonda

9. శృంగార బావి నిర్మాణం

9. శృంగార బావి నిర్మాణం

శృంగార బావి నిర్మాణం చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఇక్కడి శిల్పకళా శైలి, నాట్యభంగిమలు అందర్నీ ఆకట్టుకుంటాయి.

PC:ShashiBellamkonda

10. శత్రువులు

10. శత్రువులు

మూడంతస్థులుగా నిర్మించిన ఈ బావిలోకి శత్రువులు ప్రవేశిస్తే క్రింది అంతస్తులో వున్నవారు వెంటనే పసిగట్టవచ్చును. శత్రువుల జాడ వెంటనే తెలుస్తుంది.

PC:ShashiBellamkonda

11.కాకతీయ రాజులు

11.కాకతీయ రాజులు

కాకతీయులు కేవలం స్నానమాచరించుకొనుటకు ఉపయోగించిన బావి ఇది. ఇందులో 3 అంతస్తులు వున్నాయి. మొదటి అంతస్తులో 9 పిల్లర్లు, రెండవ అంతస్తులో 4 పిల్లర్లు, మూడవ అంతస్తులో 2 పిల్లర్ల తోటి ఈ బావి నిర్మించబడినది.

PC:ShashiBellamkonda

12. స్త్రీలు

12. స్త్రీలు

ఈ బావి యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇందులో రాచరికపు స్త్రీలు స్నానం చేస్తున్నప్పుడు ఎవరైనా వేరే వ్యక్తులు వచ్చినప్పుడు పైన రాగానే వాళ్ళ యొక్క నీడ క్రింద నీళ్ళల్లో వారి ప్రతిబింబం కనపడేది. అలా వారు ఏ అంతస్తులో వున్నా కూడా వారి ప్రతిబింబం నీటిలో కనపడేది.

pc:ShashiBellamkonda

13. అద్భుత కట్టడం

13. అద్భుత కట్టడం

ఈ కట్టడం భౌతికశాస్త్రానికి సంబంధించిన అద్భుత కట్టడం. ఈ బావి ఎంత ఎండాకాలమైనా కూడా ఏ రోజూ ఎండిపోలేదు.

PC:ShashiBellamkonda

14. వర్షాకాలం

14. వర్షాకాలం

వర్షాభావ పరిస్థితులు కరువురోజుల్లో కూడా శృంగార బావిలో నీరు ఎండిపోకుండా, ఇంకిపోకుండా వుండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇక్కడ గల మూడు అంతస్తుల్లో 20 గదులు వుంటాయి.

15. సమీప రైల్వే స్టేషన్

15. సమీప రైల్వే స్టేషన్

ఆంధ్రప్రదేశ్ లోని వరంగల్ లో వున్న ఈ అందమైన శృంగార బావికి వెళ్ళే సమీపంలో వున్న రైల్వేస్టేషన్ వరంగల్ రైల్వేస్టేషన్.

16. ఎలా వెళ్ళాలి?

16. ఎలా వెళ్ళాలి?

ఎలా వెళ్ళాలి

PC: google maps

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X