అనంతపద్మనాభ స్వామి ఆరవ గది తెరిస్తే మొత్తం ప్రపంచాన్ని ముంచేస్తుందా?
వెతకండి
 
వెతకండి
 

గంగైకొండ చోళపురం బృహదీశ్వరాలయం !

Written by:
Published: Tuesday, March 29, 2016, 16:32 [IST]
Share this on your social network:
   Facebook Twitter Google+ Pin it  Comments

తమిళనాడు ... అంటే ముందుగా గుర్తొచ్చేది ఆలయాలు. అప్పట్లో ఈ రాజ్యాన్ని పాలించిన చోళులు, పాండ్యులు మరియు ఇంకా అనేక రాజ వంశీయులు ఒకరిని మించి మరొకరు ఆలయాల్ని నిర్మించారు. అప్పుడు ఈ ప్రాంతంలో శైవ మతం బాగా ప్రాచూర్యంలో ఉండేది కనుక చాలా వరకు ఆలయాలు శివునికి అంకితం చేయబడ్డాయి.

తమిళనాడు ఆలయాలన్నింటిలో కెల్లా పెద్దది తంజావూర్ బృహదీశ్వరాలయం. ఇది శివునికి అంకితం చేయబడ్డది. ఈ ఆలయాన్ని పోలిన మరో ఆలయం 'గంగైకొండ చోళపురం'. తంజావూర్ పట్టణానికి 73 కి.మీ. దూరంలో ఉన్న గంగైకొండ చోళపురం అనే కుగ్రామం ఆసక్తి కలిగించే విషయాలతో, కట్టడాలతో మరియు శిల్ప సౌందర్యాలతో పర్యాటకులను ఆకర్షిస్తున్నది.

ఇది కూడా చదవండి : తంజావూర్ - మిస్టరీల ఆలయం !

పాల వంశం మీద సాధించిన విజయానికి గుర్తుగా రాజ రాజ చోళుని కుమారుడైన మొదటి రాజేంద్ర చోళుడు 'గంగైకొండ చోళపురం' స్థాపించాడు. ఇతను ఉత్తరాది వరకు రాజ్యాన్ని విస్తరించిన మొట్టమొదటి దక్షిణ రాజు గా ఖ్యాతిగాంచాడు మరియు తంజావూరులో తన తండ్రి నిర్మించిన బృహదీశ్వరాలయాన్ని పోలిన మరో బృహదీశ్వరాలయాన్ని గంగైకొండ చోళపురం లో నిర్మించాడు. విస్తీర్ణపరంగా ఈ ఆలయం తంజావూర్ ఆలయం కంటే పెద్దది.

గంగైకొండ చోళపురం ఆలయ ప్రత్యేకతలు

గంగైకొండ చోళపురం దాదాపు 250 ఏళ్ల పాటు చోళ రాజధాని గా ఉండేది. ఉత్తర భారతదేశం వరకు విస్తరించిన చోళ సామ్రాజ్యానికి రాజధాని గా సేవలందించిన ఈ ప్రదేశం నగరం నుండి కుగ్రామం స్థాయికి ఎలా దిగజారిందో అంతుపట్టని విషయం.

చిత్ర కృప : Nithi Anand

గంగైకొండ చోళపురం ఆలయ ప్రత్యేకతలు

గంగైకొండ చోళపురం లో ప్రధాన ఆకర్షణ బృహదీశ్వరాలయాన్ని పోలిన ఆలయం. ఎత్తైన రాజగోపురం, ప్రహారీలు మరియు అందాలొలికే శిల్ప సంపద ఈ ఆలయ సొంతం.

చిత్ర కృప : Thamizhpparithi Maari

గంగైకొండ చోళపురం ఆలయ ప్రత్యేకతలు

ఆలయాన్ని నిర్మించటానికి తొమ్మిదేళ్ల పట్టింది. వందల మంది కూలీలు శ్రమించి ఈ శివాలయాన్ని నిర్మించారు. మరో విషయం .! నిర్మాణంలో పాల్గొన్నది చాలా వరకు భక్తులే. రాళ్ళను లేపటానికి, మోసుకెళ్లటానికి అశ్వాలను, ఏనుగులను ఉపయోగించేవారు.

చిత్ర కృప : Santhosh Subramanian

గంగైకొండ చోళపురం ఆలయ ప్రత్యేకతలు

తండ్రి మీద గౌరవంతో ఆలయ శిఖర ఎత్తును తగ్గించాడు రాజేంద్ర చోళుడు. విస్తీర్ణ పరంగా మాత్రం ఈ ఆలయం తంజావూర్ లోని బృహదీశ్వరాలయం కంటే పెద్దది మరియు విశాలమైనది.

చిత్ర కృప : Flavio Fantini

గంగైకొండ చోళపురం ఆలయ ప్రత్యేకతలు

గంగైకొండ ఆలయం లో శివుడు ప్రధాన దైవం. విశాలమైన ఆలయ ప్రాంగణంలో ఇతర దేవుళ్ళ ఆలయాలు కూడా ఉన్నాయి.

చిత్ర కృప : Jay Radhakrishnan

గంగైకొండ చోళపురం ఆలయ ప్రత్యేకతలు

ఆలయ నిర్మాణాన్ని అప్పటి రాజులు తమ దైవ భక్తి తో పాటు అర్థిక, సైనిక శక్తి సామార్థ్యాన్ని తెలియ జేయటం కొరకు చేసిన ప్రయత్నంగా చరిత్ర కారులు అభిప్రాయపడుతున్నారు.

చిత్ర కృప : chandrasekaran arumugam

గంగైకొండ చోళపురం ఆలయ ప్రత్యేకతలు

ఆలయం లోని శిల్ప కళా రూపాలు చోళుల శిల్ప కళా రీతికి నిలువెత్తు దర్పణాలు. ఏదేమైనా చోళుల సంస్కృతి, సాంప్రదాయాలు తెలుసుకోవటానికి ఈ చిత్రాలు ఉపయోగపడతాయి.

చిత్ర కృప : Vijayanand K

గంగైకొండ చోళపురం ఆలయ ప్రత్యేకతలు

చోళులు నిర్మించిన ఆలయంగానే కాక దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద శివలింగం కలిగి ఉన్న ఆలయంగా గంగైకొండ చోళపురం ఆలయం ప్రసిద్ధి చెందినది. గర్భాలయంలో మూలవిరాట్టు నాలుగు మీటర్ల ఎత్తు కలిగి ఉంటుంది.

చిత్ర కృప : Joelsuganth

గంగైకొండ చోళపురం ఆలయ ప్రత్యేకతలు

ఆలయ గోడలపై చోళుల చరిత్రకు సంబంధించిన సూక్ష్మమైన వివరాలతో కూడిన ఇత్తడి శాసనాలు వున్నాయి. ఇవి ఏ చరిత్ర పుస్తకం చెప్పనటువంటి ఆసక్తికర వివరాలను తెలియచేస్తాయి.

చిత్ర కృప : Balaji Sreenivas

గంగైకొండ చోళపురం ఆలయ ప్రత్యేకతలు

ఆలయ గోపురంపై రాజేంద్ర చోళుడు శివ పార్వతుల ఆధ్వర్యంలో పట్టాభిషిక్తుడవుతున్నట్లున్న శిల్పం, భూదేవి సహిత విష్ణుమూర్తి శిల్పం, పార్వతీ సమేత శివుని శిల్పం ,మార్కండే యుని చరిత్రను తెలిపే శిల్పాలు ... ఇలా అనేక శిల్ప కళా కృతులు గమనించవచ్చు.

చిత్ర కృప : Vijayanand K

గంగైకొండ చోళపురం ఆలయ ప్రత్యేకతలు

అందమైన చెక్కుళ్ళు, అచ్చేరువొందించే నిర్మాణాలు వీటి గురించి పుస్తకాల్లో చదవడం కంటే ఒకసారి ఈ గంగైకొండ చోళపురాన్ని చూస్తే తెలుస్తుంది.

చిత్ర కృప : Nithi Anand

గంగైకొండ చోళపురం ఎలా వెళ్ళాలి?

గంగైకొండ చోళపురం చేరుకోవటానికి రైలు, రోడ్డు మరియు విమాన మార్గాలు అందుబాటులో ఉన్నాయి.విమాన మార్గం

'నైవేలి' గంగైకొండ చోళపురం ఆలయానికి సమీపాన ఉన్న ఏర్ పోర్ట్. ఇది 43 కి. మీ. దూరంలో ఉంటుంది. క్యాబ్ లేదా ప్రవేట్ ట్యాక్సీ లలో ప్రయాణించి గంగైకొండ చోళపురం ఆలయానికి చేరుకోవచ్చు.

రైలు మార్గం

'మైలదుత్తురై' రైల్వే స్టేషన్ గంగైకొండ చోళపురం ఆలయానికి సమీపాన ఉన్న రైల్వే స్టేషన్. ఇది 26 కి. మీ. దూరంలో ఉంటుంది.

రోడ్డు / బస్సు మార్గం

చెన్నై, చిదంబరం, తంజావూర్, మైలదుత్తురై ప్రాంతాల నుండి గంగైకొండ చోళపురం ఆలయానికి ప్రతి రోజూ ప్రభుత్వ/ ప్రవేట్ బస్సులు నడుస్తుంటాయి.

చిత్ర కృప : Bigumacku

English summary

gangaikonda cholapuram temple : awe inspiring architecture

GangaiKonda Cholapuram was established by Rajendra Chola to memorialize his conquest of the Pala dynasty. The city served as the capital of the Chola dynasty for nearly 250 years.
Please Wait while comments are loading...