అనంతపద్మనాభ స్వామి ఆరవ గది తెరిస్తే మొత్తం ప్రపంచాన్ని ముంచేస్తుందా?
వెతకండి
 
వెతకండి
 

పరమేశ్వరుడు నూటొక్క శివలింగముల రూపములో దర్శనమిచ్చే ఆలయం ఎక్కడుందో మీకు తెలుసా ?

Written by: Venkatakarunasri
Updated: Thursday, June 8, 2017, 9:33 [IST]
Share this on your social network:
   Facebook Twitter Google+ Pin it  Comments

LATEST: గోదావరి తీరాన ఆదిమానవుల జాడలు !

గుడి మధ్యలో స్తంభం దానంతట అదే తిరిగే దేవాలయం ఎక్కడ ఉందో తెలుసా?

ఉదయంపూట బాలికగా సాయంత్రం సమయంలో వృద్ధ స్త్రీ రూపంలోనూ మారుతూవుండే దేవీ విగ్రహం ఎక్కడ వుందో తెలుసా?

సరగుట్ట లేదా కేసరిగిరి తెలంగాణ రాష్ట్రములోని రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక మండలము. కీసర, రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 25 కి.మీ దూరములో ఉంది. కీసర ఇక్కడ ఉన్న అతి పురాతన కీసరగుట్ట శివుని ఆలయమునకు ప్రసిద్ధి. "మహాశివరాత్రి" పండుగ రోజు ఆలయమును దర్శించుటకు రాష్ట్రము నలుమూలలనుండి భక్తులు విచ్చేయుదురు.

త్రేతాయుగంలో అయోధ్య నగరాన్ని పాలించిన శ్రీరాముడు,సీతాదేవి హనుమంతులతో వనవిహారమునకై వచ్చి ఇక్కడ ప్రకృతి సౌందర్యానికి ఆనందభరితుడై ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్టించడానికి నిశ్చయించారు. ఈ విషయమై అరణ్యప్రాంతంలోని మహర్షులను సంప్రదించగా వారు సంతోషించి శివలింగ ప్రతిష్టాపన కోసం శుభాముహుర్తాన్ని నిర్ణయించారు.

కీసర గుట్టపై వరుసలుగా స్థాపించిన శివలింగాలు అప్పుడు శ్రీరామచంద్రుడు హనుమంతుని కాశీక్షేత్రమునకు వెళ్లి గొప్ప శివలింగాన్ని తెచ్చి తీసుకుని రావలసిందని ఆజ్ఞాపిస్తాడు. ఆంజనేయుడు ఆకాశమార్గాన కాశీ క్షేత్రానికి వెళ్ళగా ఈశ్వర్డు 101 శివలింగాల రూపములలో దర్శనమిచ్చాడు.

అతడు పరమేశ్వరుని ప్రార్ధించి 101 శివలింగములను తీసుకుని బయలుదేరాడు. ఇక్కడ మహర్షులు నిర్ణయించిన సుముహుర్తములు సమీపించగా శ్రీరాముడు పరమేశ్వరుణ్ణి ప్రార్ధింపగా ముహుర్త సమయమునకు ఈశ్వరుడు ప్రత్యక్షమై శివలింగ రూపమును ధరించాడు.

హైదరాబాద్ లో ఉన్న ప్రసిద్ధ శివాలయం కీసర గుట్ట చరిత్ర తెలుసుకోండి.

1. సుముహూర్తం

త్రేతాయుగంలో అయోధ్యా నగరాన్ని పాలించిన శ్రీరాముడు సీతాదేవి, హనుమంతులతో వనవిహారమునకై వచ్చి, ఇక్కడి ప్రకృతి సౌందర్యానికి ఆనందభరితుడై ఇక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించడానికి నిశ్చయించారు. ఈ విషయమై అరణ్య ప్రాంతములోని మహర్షులను సంప్రదించగా వారు సంతోషించి శివలింగ ప్రతిష్ఠాపన కోసం సుముహూర్తాన్ని నిర్ణయించారు.

pc: J.M.Garg

 

2. నూటొక్క శివలింగములు

అప్పుడు శ్రీరామచంద్రుడు హనుమంతుని కాశీ క్షేత్రమునకు వెళ్ళి గొప్ప శివలింగమును తీసుకొని రావలసినదని ఆజ్ఞాపిస్తారు. ఆంజనేయుడు ఆకాశమార్గాన కాశీక్షేత్రానికి వెళ్ళగా, ఈశ్వరుడు నూటొక్క శివలింగముల రూపములో దర్శనమిచ్చాడు. అతడు పరమేశ్వరుని ప్రార్థించి నూటొక్క శివలింగములను తీసుకొని బయలుదేరాడు.

pc: Bhaskaranaidu

 

3. శ్రీరామలింగేశ్వరస్వామి

ఇక్కడ మహర్షులు నిర్ణయించిన సుముహూర్తము సమీపిస్తుండగా శ్రీరాముడి పరమేశ్వరుని ప్రార్థింపగా ముహూర్త సమయమునకు ఈశ్వరుడు ప్రత్యక్షమై శివలింగ రూపమును ధరించాడు. శ్రీసీతారామచంద్రులు ఆ శివలింగమును ప్రతిష్ఠించి అభిషేకించారు. అందువలన ఈ స్వామికి "శ్రీరామలింగేశ్వరస్వామి" అని పేరు వచ్చింది.

pc:SINGH.GAURAV85

 

4. కేసరి గిరి

తరువాత హనుమంతుడు 101 శివలింగములను తీసుకువచ్చి, అప్పటికే ప్రతిష్ఠ జరగడంతో ఆవేశముతో తాను తెచ్చిన శివలింగములను తోకతో విసిరివేసెను. ఆ శివలింగాలన్నీ పరిసర ప్రాంతములలో అక్కడక్కడా పడినవి. హనుమంతుని శాంతింపజేయుటకు ఈ క్షేత్రము ఆచంద్రతారార్కం అతని పేరుమీద 'కేసరి గిరి'గా ప్రసిద్ధిచెందుతుందని ఆశీర్వదించెను.

pc:Aditya Siva

 

5. కీసరగుట్ట'

హనుమంతుడు శాంతించి తాను తెచ్చిన శివలింగములలో ఒకదానిని స్వామివారి వామభాగములో ప్రతిష్ఠించాడు. అదే మారుతీ కాశీ విశ్వేశ్వరాలయము. కాలక్రమేణా కేసరిగిరి క్షేత్రము కీసరగుట్ట'గా రూపాంతరం చెందింది. ఇక్కడ స్వామివారు పశ్చిమ ముఖముగా ఉండుట విశేషము.

pc:Aditya Siva

 

6. స్థలపురాణం

శ్రీ రాముడు రావణ వధ తర్వాత ఈ ప్రాంతాన్ని సందర్శించాడు, రావణ వధ తర్వాత బ్రహ్మ హత్యా పాతకం తొలగి పోవడానికి ఇక్కడ శివ లింగాన్ని ప్రతిష్ఠించి పూజించాలనుకున్నారు, హనుమంతున్నీ వారణాసికి వెళ్లి శివ లింగాన్ని తీసుకురమ్మని పంపించాడు, అయితే హనుమంతుడు ఆలస్యం చెయ్యడంతో రాముడు శివున్ని ప్రార్ధిస్తాడు, అప్పుడు ప్రత్యక్షం ఐన శివుడు లింగరూపంలో ఇక్కడ వెలిసాడు.

pc:Aditya Siva

 

7. 101 లింగాలు

ఇక్కడ వెలిసిన లింగం స్వయంభు: లింగం, ఆ లింగాన్ని రాముడు పూజించాడు, ఆలస్యంగా చేరుకున్న ఆంజనేయుడు రాముడు వేరే లింగాన్ని ప్రతిష్ఠించడంతో తాను వెంట తెచ్చిన 101 లింగాలని ఆ ప్రాంతంలో విసిరి పారేసాడు, అందుకే ఈ గుట్టపై అనేక శివలింగాలు దర్శనమిస్తాయి. కేసరి సుతుడైన ఆంజనేయుడి పేరు మీదిగా కేసరి గుట్ట అనే పేరు వచ్చింది, కేసరి గుట్టె నేడు కీసర గుట్టగా పిలవబడుతుంది.

pc: keesara

 

8. శ్రీ సీతారాముల ఆలయాలు

ఇక్కడ ఆలయంలో కొలువైన స్వామిని రాముడు ప్రతిష్ఠించాడు కావున రామలింగేశ్వర స్వామిగా పిలుస్తారు, భవాన్ని అమ్మవారు, శివ దుర్గా అమ్మవార్లు ఇక్కడ కొలువై భక్తుల కోర్కెలను తీరుస్తున్నారు, ఈ దేవాలయంలో లక్ష్మి నరసింహ స్వామి, శ్రీ సీతారాముల ఆలయాలు కూడా కొలువై ఉన్నాయి. శివ రాత్రి రోజు ఇక్కడ నిర్వహించే ప్రత్యేక పూజలలో వేలాదిగా భక్తజనం పాల్గొంటారు.

pc: J.M.Garg

 

9. ప్రకృతి రమణీయ ప్రాంతం

ఈ గుట్ట కింది భాగంలో ఆశ్రమాలు, యోగ కేంద్రాలను ఏర్పాటు చేసారు, ప్రశాంత మైన వాతావరణంతో పాటు కొండ సువిశాలంగా ఉండటం, కాలుష్యానికి దూరంగా ఉండడం మూలంగా గుట్టపైకి చేరుకోగానే భక్తులు అలౌకిక ఆనందానికి లోనవుతారు, ఇది ఆధ్యాత్మిక కేంద్రం గానే కాకుండా మంచి ప్రకృతి రమణీయ ప్రాంతం కూడా, ఇక్కడ ఉన్న సహజ అందాలకు తోడు దేవాలయ శాఖ వారు మరిన్ని సోగబులను తీర్చిదిద్దారు.

pc:Adityamadhav83

 

10. భారీ ఆంజనేయ విగ్రహం

గుట్టపైన పర్యాటకులను ఆకర్షించడానికి భారి ఆంజనేయ విగ్రహాన్ని ఏర్పాటుచేసారు, వానాకాలంలో లేదా చలికాలంలో ఈ కొండపై నుండి చూస్తే పచ్చని ప్రకృతి ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. కొండపైన విశాలమైన కాలి స్థలం ఉండడం వల్ల దీనిని విస్తరించడానికి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి.

pc: Aditya Siva

 

11. ఇక్కడ జరిగే ఉత్సవములు

బ్రహ్మోత్సవాలు : మాఘ బహుళ త్రయోదశి మొదలు ఫాల్గుణ శుద్ధ విదియ వరకు మహాశివరాత్రి పర్వదినాన ఐదు రోజులు పరమశివునికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఇక్కడ ప్రతిరోజు అభిషేకములు, బిల్వార్చనలు, అమ్మవారికి కుంకుమార్చనలు జరుపబడును.

12. ప్రత్యేక మాసోత్సవములు

దేవీ నవరాత్రులు, ఆరుద్ర నక్షత్రముతో కూడిన సోమవారములలో విశేష పూజలు జరుపబడును. ప్రతి మాసమునందు కృష్ణ చతుర్దశి నాటి మాస శివరాత్రి రోజు ప్రత్యేక పూజలు జరుపబడును.

13. వసతులు

తిరుమల... తిరుపతి దేవస్థానం వారు నిర్మించిన 26 గదుల ధర్మశాల ఉంది. ఆలయ కార్యాలయంలో సంప్రదించి అద్దెకు తీసుకోవచ్చు. పర్యాటకాభివృద్ధి సంస్థ వారు నిర్మించిన నిర్మించిన హరిత హోటల్ ఉంది. ఇందులో భోజనం మరియు వసతి సదుపాయం ఉంది.

14. వసతులు

జిల్లా పరిషత్ వారు, ఆర్ అండ్ బి వారు నిర్మించిన గదులు కూడా ఉన్నాయి. ఆర్య వైశ్య నిత్యాన్నదాన సత్రం ఉంది. బ్రాహ్మణులకు నిత్యాన్నదాన పథకం కూడా ఉంది.

15. ఆలయ దర్శన వేళలు

కీసరగుట్ట ఆలయం ఉదయం 6:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంట వరకు, తిరిగి మధ్యాహ్నం 3:00 గంటల నుండి రాత్రి 7:30 వరకు తెరిచే ఉంటుంది. వారంలో ప్రతి రోజూ గుడిని దర్శించుకోవచ్చు. వసతికి టిటిడి వారి ధర్మశాల ఉన్నది.

16. కీసరగుట్ట ఎలా చేరుకోవాలి ?

ఈక్షేత్రం జంట నగరాలకు అతి సమీపంలో ఉంది. జంట నగరాలలోని సికింద్రాబాద్, ఇ.సి.ఐ.ఎల్., అఫ్జల్ గంజ్ నుండి చాల బస్సులు ఉన్నాయి. ప్రవేటు వాహనాలు కూడా ఉన్నాయి. ఈ ఊరిలో వైద్య సౌకర్యాలు లేవు.

కీసరగుట్ట ఆలయం హైదరాబాద్ నుండి 35 కిలోమీటర్ల దూరంలో, ECIL X రోడ్ నుండి 18 కిలోమీటర్ల దూరంలో కలదు. జూబ్లీ హిల్స్ బస్ స్టాండ్ నుండి కోఠి నుండి దేవాలయానికి బస్సులు కలవు.

pc: google maps

 

English summary

The History Of The Famous Shiva Temple Keesaragutta In Hyderabad !

Keesaragutta Temple is dedicated to Lord Siva and his consorts Bhavani and Sivadurga at Keesaragutta in Rangareddy district. It is about 40 km from Hyderabad and 10 km from ECIL. It is located on a small hillock. The temple draws thousands of devotees on Shivaratri.
Please Wait while comments are loading...