Search
  • Follow NativePlanet
Share
» »1500 సంవత్సరాలుగా తుప్పుపట్టని ఇనుప స్థంభం.. ఎక్కడుందో మీకు తెలుసా ?

1500 సంవత్సరాలుగా తుప్పుపట్టని ఇనుప స్థంభం.. ఎక్కడుందో మీకు తెలుసా ?

కుతుబ్ మినార్ సమీపంలో ఈ ఐరన్ పిల్లర్ ఉంది. సుమారుగా 1600 సంవత్సరాల నుండి ఇది తుప్పు పట్టకుండా ఉండటంతో కొన్ని అతీత శక్తులు ఉన్నాయని చెప్పుకునేవారు. పర్యాటకులకు ఆకర్షణగా నిలిచింది ఈ ఐరన్ పిల్లర్.

By Venkatakarunasri

ఢిల్లీ లోని మెహ్రౌలీ ప్రాంతం లో ఉన్న ఈ కుతుబ్ భవనసముదాయం సుప్రసిద్ధ ఆకర్షణ కుతుబ్ మినార్ మరియు మరెన్నో ఇతర ప్రామాణిక చారిత్రక స్మారకాలకి నిలయం. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం ( వరల్డ్ హెరిటేజ్ సైట్) గా ప్రకటించబడిన ఈ ప్రాంతం లో అనేక బానిస రాజవంశానికి చెందిన కట్టడాలు ఉన్నాయి. చాలా చక్కగా నిర్వహించబడుతున్న ఈ ప్రదేశం, ఒక ప్రధాన పర్యాటక ఆకర్షణ మరియు ఢిల్లీ లోని ఒక మంచి విహార ప్రదేశం.

1500 సంవత్సరాలుగా గాలికి,వానకు,ఎండకు తడుస్తూ తుప్పుపట్టని ఇనుప స్థంభం ఒకటి మన ఇండియాలోనే వుంది. ఇది ప్రపంచంలో మరి ఎక్కడా కనీవినీ ఎరుగని వింత. కొన్ని వందల సంవత్సరాలుగా ఆ లోహం ఎందుకు తుప్పుపట్టలేదు?దాని వెనక వున్న అసలు రహస్యం ఏమిటి? ఇప్పుడు తెలుసుకుందాం.

ఇది కూడా చదవండి: వేసవి సెలవులకి ఛలో ఢిల్లీ !

టాలీవూడ్ కమెడియన్లు - పుట్టిన ప్రదేశాలు !!టాలీవూడ్ కమెడియన్లు - పుట్టిన ప్రదేశాలు !!

1500 సంవత్సరాలుగా తుప్పుపట్టని ఇనుప స్థంభం.. ఎక్కడుందో మీకు తెలుసా ?

టాప్ 5 ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి

ఇనుప స్తంభం

ఇనుప స్తంభం

సాధారణంగా ఎంత దాచినా ఇనుము అనేది తుప్పు పట్టక మానదు... అలాంటిది దాదాపు 1600 ఏళ్ల నుండి ఎండకు ఎండినా, వానకు తడిచినా, మంచులో ఉన్నా కూడా తుప్పు పట్టని ఇనుప స్థంభం గురించి తెలుసా..? ఆ ఇనుప స్తంభాన్ని చూడాలి అంటే మీరు ఢిల్లీకి వెళ్ళాల్సిందే.

ఐరన్ పిల్లర్ ఆఫ్ ఢిల్లీ

ఐరన్ పిల్లర్ ఆఫ్ ఢిల్లీ

ఢిల్లీ లోని కువాత్ ఉల్ ఇస్లాం మసీద్ లో ఉంది. 'ఐరన్ పిల్లర్ ఆఫ్ ఢిల్లీ' అని బాగా ఫేమస్.. 7.23 మీటర్ల ఎత్తు ఉన్న ఈ స్థంభం 1600 ఏళ్లైనా తుప్పు పట్టలేదు.

PC:Abhinavjha 1985

ఎందరో శాస్త్రవేత్తలు

ఎందరో శాస్త్రవేత్తలు

ప్రపంచంలోని ఎందరో శాస్త్రవేత్తలు వచ్చి పరీక్షించినా దాని రహస్యం బయటపెట్టలేకపోయారు. అయితే దీన్ని ఐరన్ హైడ్రోజన్ పాస్పేట్ హైడ్రేట్ ద్వారా రూపొందించినట్లు కొందరు భావిస్తున్నారు.

PC:Fablesindia

సజీవ సాక్ష్యం

సజీవ సాక్ష్యం

అయితే అన్ని ఏళ్ల కిందట దీన్ని ఎలా రూపొందించి ఉంటారన్నది వారు ఇప్పటికీ తల గోక్కొంటున్నారు. ఢిల్లీ నగరంలోని కుతుబ్ మినార్ ప్రాంగణంలో వున్న ఇనుప స్థంభం భారతీయ విజ్ఞాన శాస్త్ర వున్నతికి సజీవ సాక్ష్యం.

PC:wikimedia.org

ప్రపంచంలో మరెక్కడా లేదు

ప్రపంచంలో మరెక్కడా లేదు

ఇటువంటిది ప్రపంచంలో మరెక్కడా లేదు. 1500 లసంవత్సరాలుగా గాలికి, వానకు, ఎండకు తడుస్తూ తుప్పు పట్టని స్థంభం ఇది. దీని ఎత్తు 7.5మీ కాగా వ్యాసం 40 సెం.మీ వుంది. దీని బరువు 6 టన్నుల పైనే వుంది.

PC:Sivashankar96

ఐఐటి కాన్పూర్ విద్యార్ధులు

ఐఐటి కాన్పూర్ విద్యార్ధులు

ఐఐటి కాన్పూర్ విద్యార్ధులు ఈ ఐరన్ పిల్లర్ పై పరిశోధనలు కూడా జరిపారు. వారు దానిపై మిస్వైట్ అనే సన్నని పొర స్తంభాన్ని తుప్పు పట్టకుండా కాపాడుతుందని కనుగొన్నారు.

PC:Badaldutt09

గుప్తుల కాలం

గుప్తుల కాలం

మరి ఈ రసాయనం ఇనుము, ఆక్సిజన్, హైడ్రోజన్ తయారుచేయబడిందట. ఇందులో వాడబడ్డ ఇనుములో అధిక భాగం పాస్పరస్ వున్నట్లు తెలిసింది. ఇది గుప్తుల కాలంనాడు నిర్మించినట్లు తెలియవస్తుంది.

PC:Anupamg

కాంస్య బుద్ధ ప్రతిమ

కాంస్య బుద్ధ ప్రతిమ

ఇటువంటిదే బీహార్ రాష్ట్రంలో మరియొక కాంస్య బుద్ధ ప్రతిమ కూడా కలదు. ఇది కూడా వాతావరణ ప్రభావానికి ఎదురునిలచి ఇంకను ఆకర్షణీయంగానే కనపడుచున్నది. ఈ రెండు లోహ మిశ్రమముల వివరాలు రాసాయనిక ధర్మాలు ఈనాడు మనకి లభించవు.

PC:youtube

మేధోపరమైన రసాయనిక శాస్త్ర విజ్ఞానమూర్తులు

మేధోపరమైన రసాయనిక శాస్త్ర విజ్ఞానమూర్తులు

అయితే ఇటువంటి మేధోపరమైన రసాయనిక శాస్త్ర విజ్ఞానమూర్తులు ఆనాడు ఎందఱో వుండేవారు. వారిలో ఆచార్య నాగార్జునుడు రసాయన శాస్త్ర ఘని. వీరి రసాయన శాస్త్ర గ్రంథం నుంచి అరబ్బులు అల్కమీగా పిల్చుకునే ఇతర లోహాలను బంగారంగా మార్చే ప్రక్రియను సంగ్రహించారు.

PC:Badaldutt09

ప్రాచీన భారతీయ రసాయన శాస్త్రం

ప్రాచీన భారతీయ రసాయన శాస్త్రం

ప్రాచీన భారతీయ రసాయన శాస్త్ర ఘనుల్లో ఇలాటివారు ఎంతో మంది వున్నారు. లోహ నిర్మాణంలో వాడిన ఆ రసాయనిక ధర్మాల వివరాలను ఎవ్వరూ ఇంకా కనిపెట్టలేకపోయారు.

PC:Andrey

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X