Search
  • Follow NativePlanet
Share
» »పూరి రధయాత్ర ...జగన్నాధుడి కదిలే రధచక్రాలు !

పూరి రధయాత్ర ...జగన్నాధుడి కదిలే రధచక్రాలు !

తూర్పు భారద దేశంలోని ఓడిశా రాష్ట్రం లో కల పూరి నగరం అక్కడ కల జగన్నాధ దేవాలయ రదోత్సవానికి ప్రసిద్ధి. ప్రతి ఏటా ఈ దేవాలయం నిర్వహించే రదోత్సవానికి భక్తులు దేశవ్యాప్తంగా లక్షల సంఖ్యలో వచ్చి స్వామి జగన్నాధుడి ఆశీస్సులు పొందుతారు. ఈ నగరం అక్కడ కల అందమైన బీచ్ లకు కూడా ప్రసిద్ధి చెందినది. పూరి ఇండియా లోని ఏడు పవిత్ర ప్రదేశాలలో ఒకటిగా హిందువులు పరిగనిస్తారు. ఈ దేవాలయంలో జరిగే అనేక ఉత్సవాలలో రధోత్సవం అన్నిటికంటే పేరు గాంచినది. 'దీనిని ఆంగ్లంలో 'చారియోట్ ఫెస్టివల్ ' అని అంటారు.


Photo Courtesy: BrewingColors

జగన్నాథ దేవాలయ సముదాయం సుమారు నాలుగు లక్షల చదరపు అడుగులలో నిర్మించారు. దేవాలయం సుమారు 20 అడుగుల ఎత్తైన గోడలు కలిగి బలమైన నిర్మాణంగా వుంటుంది. ఇక్కడ జరిగే ఉత్సవాల కొరకే కాక, దేవాలయ సౌందర్యం, నిర్మాణం చూసి ఆనందించేందుకు కూడా యాత్రికులు, ఇతర పర్యాటకులు వస్తారు. ఓడిశా శిల్ప శైలి కల ఈ దేవాలయం అనేక అందమైన శిల్పాలు కలిగి వుంది. ఈ ప్రదేశంలో సుమారు 120 పుణ్యక్షేత్రాలు కలవు. ఈ దేవాలయం ప్రధాన ఆలయ భాగం లేదా గర్భ గుడి, ముందు మండపం, భక్తుల మండపం వంటి వాటితో సువిశాలంగా వుంటుంది. ఓడిశాలోని దేవాలయాలలో ఇది అతి ఎత్తైన గోపురం కలిగి వుంటుంది. టెంపుల్ ఒక్క రూఫ్ భాగంలో ఎనిమిది చువ్వల విష్ణు చక్రం ప్రతి బిమ్బిస్తూ ' ఒక శ్రీ చక్రం' వుంటుంది.

Photo Courtesy: somewhereintheworldtoday

ప్రతి సంవత్సరం వర్ష రుతువులోని ఆషాఢ శుద్ధ విదియ నాడు ఈ రధోత్సవం నిర్వహిస్తారు. ఈ ఊరేగింపులో ప్రధాన దేవతలైన శ్రీ కృష్ణుడు, బలరాముడు, సుభద్ర లు ప్రత్యేకించి కలపతో తయారు చేయబడిన అతి పెద్ద రధాలలో, ప్రజలచే అతి పొడవైన తాళ్ళతో వీధులలో ఈ రధాలను లాగుతూ ఊరేగిన్చబడతారు. ఈ రధాలను సుమారు 45 అడుగుల ఎత్తు వరకు తయారు చేస్తారు.

ప్రధాన ప్రవేశ ద్వారం ను సింహ ద్వారం అంటారు. ఇక్కడ రెండు పెద్ద సింహాపు విగ్రహాలు ద్వారం ఇరువైపులా హాథి ద్వారం లేదా ఎలిఫెంట్ గెట్ అని పులి బొమ్మలు కల గెట్ ను వ్యాఘ్రద్వార లేదా టైగర్ గెట్ అని, గుర్రం బొమ్మలు కల గెట్ ను అశ్వద్వార లేదా హార్స్ గెట్ అని అంటారు.

పూరి రధయాత్ర

Photo Courtesy: Sourav Das

జగన్నాధుడి దేవాలయం రాతి తో నిర్మించిన ఇతర దేవాలయాలవలే కాక, కొయ్య చే తయారు చేయబడి వుంటుంది. ప్రతి పన్నెండు సంవత్సరాలకొకసారి ఈ కొయ్య లేదా కలప నిర్మాణాన్నిమరల అదే నమూనాలో పునరుద్దరిస్తారు. ఈ ఆలయం సమీపంలో ఇంకనూ అనేక ఇతర దేవాలయాలు కలవు. వాటిలో శక్తి పీఠం గా చెప్పబడే విమలా దేవాలయం కూడా ప్రసిద్ధి. ఈ ప్రదేశంలో మాత సతి పాదాలు పదినవని చెపుతారు.

దేవాలయం ఉదయం 5 గం. నుండి మ. 12 గం వరకు తెరచి వుంటుంది. ఎంట్రీ రుసుము లేదు. పూజలకు ప్రత్యేక రుసుము కలదు. టెంపుల్ పరిసరాలలో భద్రత ప్రత్యేకించి ఈ వేడుకల సమయంలో అధికంగా వుంటుంది. ఈ పండుగ వేడుకలలో హిందువులు కాని వారిని దేవాలయ ప్రవేశానికి అనుమతి ఇవ్వరు.

ఇది కూడా చదవండి : అంబు బాచి మేళ

పూరి ఎలా చేరాలి ?

రోడ్డు మార్గం

కటక్ లేదా భువనేశ్వర్ ల నుండి పూరి కి ప్రతి 10 - 15 నిమిషాలకు ఒక బస్సు కలదు. ఇక్కడ నుండి కోణార్క్, కోల్కతా మరియు విశాఖపట్నం లకు నేరు బస్సు లు కలవు.

రైలు ప్రయాణం

పూరి నగరం దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు రైలు మార్గంలో కలుపబడి వుంది. ఢిల్లీ, ముంబై, తిరుపతి, కోల్కతా, చెన్నై, మొదలైన పట్టణాలకు రైళ్ళు కలవు.

విమాన ప్రయాణం
భువనేశ్వర్ ఎయిర్ పోర్ట్ పూరి కి 60 కి. మీ. ల దూరంలో కలదు. ఎయిర్ పోర్ట్ నుండి టాక్సీ లేదా బస్సు లలో పూరి తేలికగా చేరవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X