అనంతపద్మనాభ స్వామి ఆరవ గది తెరిస్తే మొత్తం ప్రపంచాన్ని ముంచేస్తుందా?
వెతకండి
 
వెతకండి
 

నీటిలో తేలియాడే 15 కిలోల బరువు వున్న మహిమ గల రాయి ఎక్కడుందో మీకు తెలుసా?

Written by: Venkata Karunasri Nalluru
Updated: Wednesday, April 12, 2017, 17:59 [IST]
Share this on your social network:
   Facebook Twitter Google+ Pin it  Comments

కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలోనే కాకుండా మనకు దగ్గరగా గల రాష్ట్రాలలో కూడా శ్రీరాముని క్షేత్రాలు మనం దర్శించవచ్చును. అదే తమిళనాడులోని రామేశ్వరం పుణ్యక్షేత్రం. రామేశ్వరము శైవులకు, వైష్ణవులకు అత్యంత పవిత్ర స్థలము. రామేశ్వరము తమిళనాడులోని రామనాథపురం అనే జిల్లాలో కలదు. ఈ పట్టణం చెన్నైకి 572 కి.మీ దూరంలో కలదు. పురాణాల ప్రకారం శ్రీరాముడు లంకకు చేరుటకు రామేశ్వరంలోనే సేతువును నిర్మించాడు. ఇక్కడ రాముడు నిర్మించిన సేతువుని రామసేతువు అని పిలుస్తారు. రావణాసురిడిని సంహరించిన తర్వాత తనకి అంటిన బ్రహ్మ హత్యాపాతకం నిర్మూలించుకొనుటకు రామేశ్వరములో రామనాథేశ్వరస్వామిని ప్రతిష్ఠించాడు.

రామేశ్వరము తీర్థ స్థలమే కాక ఇక్కడ ఉన్న బీచ్ ల వల్ల పర్యాటక స్థలము కూడా ప్రాముఖ్యకత సంపాదించుకొంది. సముద్రమట్టానికి 10 మీటర్ల ఎత్తులో వున్నది. రామేశ్వరంలో ద్రవిడ శిల్పకళా నిర్మాణంను చూడవచ్చును. రామేశ్వరం నుండి శ్రీలంక దేశము కనిపిస్తుంది.

గొలగమూడి శ్రీ వెంకయ్య స్వామి గురించిన ఈ నిజాలు మీకు తెలుసా ?

రామేశ్వరం గురించి

1. చరిత్ర

పుణ్యక్షేత్రం కాశీలోని గంగా తీర్థం తీసుకు వచ్చి రామేశ్వరం సముద్రంలో కలిపితేనే కాశీయాత్ర పూర్తవుతుందని భారతీయులలో అనేకమంది హిందువులు నమ్ముతారు. కాశీయాత్ర రామేశ్వరం చూసిన తరువాతకాని పూర్తికాదని విశ్వాసం.

చిత్రకృప:Jaisudhan.j

2. కళావైభవం

భారతీయ నిర్మాణకళా వైభవాన్ని చాటిచెప్పే కట్టడాలలో రామేశ్వరం ఒకటి. 12వ శతాబ్దం నుండి ఈ ఆలయం వివిధ రాజుల చేత నిర్మించబడింది.

చిత్రకృప:Vishnukiran L.S

3. ఇసుకలింగం

రామేశ్వరంలోని ఇసుకలింగం శ్రీరాముని చేత ప్రతిష్ఠించబడింది. రావణుడు బ్రహ్మ యొక్క మనుమడు కనుక బ్రాహ్మణుడు కనుక అతడిని రణరంగమున సంహరించడం చేత తనకు బ్రహ్మహత్యా పాతకం వస్తుందని అందుకు పరిహారంగా మహామునుల అదేశానుసారం శ్రీరామచంద్రుడు సీతాదేవితో కలిసి శివలింగ ప్రతిష్ఠ చేసి ఆరాధించాడని పురాణ కథనాలు వివరిస్తున్నాయి.

చిత్రకృప:Sukigreen

4. సీతాదేవి స్వహస్థాలతో చేసిన ఇసుకలింగం

ఇక్కడ లింగప్రతిష్ఠ చేయడానికి కైలాసం నుండి లింగం తీసుకురమ్మని శ్రీరాముడు హనుమంతుడిని పంపాడు. హనుమంతుడు నిర్ణీతముహూర్తానికి లింగం తీసుకురాని కారణంగా ఋషులు సీతాదేవి స్వహస్థాలతో చేసిన ఇసుకలింగమును శ్రీరాముడి చేత ప్రతిష్ఠ చేయించాడు. ముహూర్తం దాటిన తరువాత కైలాసగిరి నుండి తాను తీసుకు వచ్చిన లింగంతో హనుమంతుడు తాను తీసుకువచ్చిన లింగం ప్రతిష్ఠ చేయలేకపోయినందుకు మిక్కిలి ఆగ్రహించాడు. అది చూసిన శ్రీరాముడు హనుమ తీసుకువచ్చిన లింగాన్ని కూడా ప్రతిష్ఠింపజేసి ముందుగా హనుమ తీసుకు వచ్చిన లింగానికి పూజలు చేసి తరువాత తాను ప్రతిష్ఠించిన లింగానికి పూజలు చేయాలని ఆదేశించాడు అని పురాణ కథనాలు వివరిస్తున్నాయి.

చిత్రకృప:Ryan

5. ప్రాతఃకాల మణిదర్శనం

ప్రాతఃకాల మణిదర్శనకాలంలో పవిత్రమైన స్పటిక లింగదర్శనం చేయవచ్చు. ఈ లింగాన్ని చేసిన మణి ఆదిశేషుని చేత ఇవ్వబడినదని పురాణకథనాలు వివరిస్తున్నాయి. రామాయణంలో వర్ణించబడిన ఈ సేతువును రామేశ్వరం సమీపంలో ఉన్న ధనుష్కోటి నుండి శ్రీలంకలో ఉన్న తలైమన్నార్ వరకు నిర్మించబడిందని పురాణ కథనాలు వర్ణిస్తున్నాయి.

చిత్రకృప:Ssriram mt

6. రామనాథేశ్వర దేవాలయం

రామనాథేశ్వరస్వామి దేవాలయ ప్రాకరము నాలుగు వైపుల పెద్ద ప్రహారి గోడలతో నిర్మితమై ఉంది. తూర్పు నుండి పశ్చిమ ప్రాకార గోడల మధ్య దూరము 865 అడుగులు, దక్షిణం నుండి ఉత్తర ప్రాకార గోడల మధ్య దూరము 657 అడుగులు. దేవాలయానికి నాలుగు దిక్కుల పెద్ద పెద్ద గాలి గోపురాలు ఉన్నాయి.

చిత్రకృప:Ssriram mt

7. పంబన్ రైలు వంతెన

రామేశ్వరం దీవిలో సముద్ర కెరటాలు, పక్షులు, బంగారు రంగులో మెరిసిపోయే ఇసుకతిన్నెలు, బంగారం లాంటి మనసులు, యాత్రికులు, రామనాథస్వామి గుడి, చిన్న చిన్న అంగళ్ళు, గవ్వలతో చేసిన వస్తువులు, గుర్రపు బళ్ళు, నీలి రంగులో మైమరపించే సముద్రం ఎన్నాళ్ళు చూసినా తనివి తీరదు. రామేశ్వరం ఒక అధ్యాత్మిక ప్రదేశమే కాదు అంతకంటే అద్భుతమైనది. తమిళనాడులో వున్న ఒక దీవి.

చిత్రకృప:S N Barid

8. రామేశ్వరంలోని ప్రదేశాలు

రామేశ్వరంలో చూడటానికి గాని చాలా ప్రదేశాలు ఉన్నాయి. రామనాథస్వామి గుడి, కోటి తీర్థాలు, రామపాదాలు, ధనుష్కోడి, విభీషణాలయం, ఇంకా చాలా ఉన్నాయి.

చిత్రకృప:M.Mutta

9. చేరుకొనే విధానం

దీవి లోనికి వెళ్ళటానికి వీలుగా సముద్రం పై రైలు వంతెన, బస్ లు ఇతర వాహనాల కోసం వేరే వంతెన ఉన్నాయి. ఈ వంతెనలు సుమారు రెండున్నర కిలోమీటర్లు సముద్రంపై నిర్మించబడ్డాయి. రైలు వంతెన షిప్ లు వచ్చినప్పుడు రెండుగ విడిపోతుంది.

చిత్రకృప:Raj

10. సుర్యోదయం మరియు సుర్యాస్తమయం

ఇక్కడ బీచ్ లో కుర్చుని సుర్యోదయం, సుర్యాస్తమయం చూస్తూ ఆ అనుభూతి అనుభవిస్తే మనసుకు ఏంతో ప్రశాంతంగా ఉంటుంది.

చిత్రకృప: Raj

11. ఇతరవిశేషాలు

రామేశ్వరం ప్రసిద్ధ శైవ క్షేత్రము. ఇచట శ్రీ కృత కృత్య రామలింగేశ్వర స్వామి వారు ఉన్నారు. కాలక్రమేణ ఈ గుడి ఉన్న ప్రాంతం గుడిమూల ఖండ్రిక గ్రామంలో కలుపబడింది. ఈ గ్రామంలో రంగనాథ, శ్రీ రామ, ఎల్లమ్మ, గంటలమ్మ, ఆలయాలు ఉన్నాయి.

చిత్రకృప:Ssriram mt

12. ఇచ్చట ప్రధాన పంటలు

వరి, రొయ్యలు, ఇచట ప్రధాన పంటలు. హిందు, క్రైస్తవ ఇచట ముఖ్య మతములు. జిల్లా పరిషత్ వారి పాఠశాల శ్రీ బళ్ల శ్రీరాములు మరియు గ్రామస్తుల సహకారంతో నిర్మించబడింది. బైర్రాజు ఫౌండేషన్ వారు మంచి అభివృద్ధి కార్యక్రమములు చేపడుతున్నారు.

చిత్రకృప:Vijay Kumar Yerra

13. గంధమాదన పర్వతము

రామాయణ యుద్ధకాండంలో దీనికి విశిష్ట ప్రాధాన్యత ఉంది. హనుమంతుడు లంకకు వెళ్ళటానికి, శ్రీరాములవారు తన వానర సైన్యమును నడిపించినది కూడ ఇక్కడి నుండే. శ్రీరాముల వారు రావణున్ని సంహరించిన తర్వాత లింగప్రతిష్ఠను గూర్చి అలోచించినదిక్కడేనట. రెండస్థుల ఈ దేవాలయం ఎక్కితే రామేశ్వర ద్వీపం కనబడుతుంది.

చిత్రకృప:Ssriram mt

14. ఇక్కడ ఇంకా దర్శించదగినవి

ఏకాంత రామేశ్వరాలయం, నంబినాయకి అమ్మన్, సీతాగుండం, విల్లోరినీ తీర్ధము, భైరవతీర్ధం కోదండరాముని కోవెల మొదలగునవి దర్శించతగినవి.

చిత్రకృప:M.Mutta

15. ధనుష్కోటి

1964లో వచ్చిన తుఫానులో మిగిలింది కోదండరామస్వామి ఆలయం మాత్రమేనట. ఇది ఒక ద్వీపం. ఇక్కడే రావణుని తమ్ముడు విభీషణుడు శరణుజొచ్చినచోటు. యుద్ధానంతరం వానరులు నిర్మించిన సేతువును పగుల గొట్టారట ఇక్కడ. శ్రీరాములవారు బాణముతో కొట్టగా వంతెన విచ్చిపోయి రత్నాకరము, మహొదధి, రెండున్నూ కలిసిపోయాయట. ధనుస్సుచే పగులగొట్టటంచేత ధనుష్కోటి అనే పేరు సార్ధకమయిందంటారు.

చిత్రకృప:Ssriram mt

16. సముద్రస్నానాలు

ఇక్కడ 108గాని, 36గాని సముద్రస్నానాలు చేస్తే మంచిదని అంటారు. భరద్వాజ మహర్షి పిర్ణయానుసారంగా చాంద్రాయణ వ్రతఫలం గలుగుతుందని నమ్మిక.

చిత్రకృప:M.Mutta

17. త్రివేణి సంగమం

రెండు సముద్రాలు కలిసేచోట యిసుకను తీసికొని రామేశ్వరంలో 3భాగాలు చేసి పూజించాలట. 2 భాగాలు దానంచేసి 3వభాగం జాగ్రత్తగా పదిలంగా పట్టుకువెళ్ళి ప్రయాగలో త్రివేణి సంగమంలో సమర్పించాలట. ఇక్కడ చేసిన దానం కోటి రెట్లధిక ఫలమట.

చిత్రకృప:M.Mutta

18. 15 కిలోలు ఉన్న ఈ రాయి

తమిళనాడులోని రామేశ్వరం గుడిలో 15 కిలోలు ఉన్న ఈ రాయి నీటిపైన తేలాడుతూ ఉంటుంది. ఇది మహిమ గల రాయి.

 

19. భక్తులు

భక్తులందరూ దీనిని చేతితో పైకి ఎత్తి మళ్లీ నీళ్ళలో వదిలి దానికి దండం పెట్టుకుంటుంటారు. అయితే ఇటువంటి రాళ్ళతోనే లంకకు రాముడు వానరుల సహాయంతో వారధి నిర్మించినట్టు పురాణాలు చెబుతున్నాయి.

చిత్రకృప:Ryan

 

20. సముద్ర స్నానాలు

ఇక్కడి నీటిలో యాత్రికులు స్నానాలు చేస్తారు. చాలామంది కాశీ వెళ్ళే వారు ధనుష్కోడిలో తప్పక స్నానం ఆచరించాలని చెపుతారు.

చిత్రకృప:எஸ். பி. கிருஷ்ணமூர்த்தி

 

21. రామేశ్వరం ఎలా చేరుకోవాలి ?

వాయు మార్గం: రామేశ్వరము సమీపాన మదురై దేశీయ విమానాశ్రయం కలదు. టాక్సీ లేదా క్యాబ్ ఎక్కి రామేశ్వరం సులభంగా చేరుకోవచ్చు.

చిత్రకృప:DRUID1962

 

22. రైలు మార్గం

చెన్నై నుండి రామేశ్వరానికి ప్రతి రోజూ రెండు, మంగళ, శని వారాలలో ఒక్కొక్కటి చొప్పున మొత్తం నాలుగు రైళ్ళు తిరుగుతుంటాయి. యాత్రికులు ముందుగానే టికెట్ రిజర్వ్ చేసుకోవటం సూచించదగినది.

చిత్రకృప: Belur Ashok

23. రోడ్డు మార్గం

చెన్నై మరియు రాష్ట్రంలోని ఇతర ప్రధాన పట్టణాల నుండి రామేశ్వరం కు ప్రతి రోజూ ప్రభుత్వ/ప్రవేట్ బస్సులు నడుస్తాయి.

చిత్రకృప:On the road

 

24. రామేశ్వరంలో వసతులు

రామేశ్వరంలో వసతి సదుపాయాలూ చక్కగా అందుబాటులో ఉన్నాయి. అన్ని తరగతులవారికి గదులు దొరుకుతాయి.

చిత్రకృప:M.Mutta

25.గవర్నమెంట్ గెస్ట్ హౌస్

ఏసీ, నాన్ - ఏసీ గదులతో పాటు గవర్నమెంట్ గెస్ట్ హౌస్ లు కలవు. స్థానిక ఆహారాలు రుచించదగ్గవి.

చిత్రకృప:Ramnathswamy2007

26. ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ పుట్టిన ప్రదేశం

రామేశ్వరంలోని ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ పుట్టిన ఇల్లు చూడవచ్చును.

చిత్రకృప: எஸ். பி. கிருஷ்ணமூர்த்தி

English summary

The Mystery Of Floating Stone In Rameshwaram

Ramanathaswamy Temple is one of the twelve Jyotirlinga temples. It is located on Rameswaram island in the state of Tamil Nadu.
Please Wait while comments are loading...