Search
  • Follow NativePlanet
Share
» »హైదరాబాద్ ...ముత్యాల నగరం!

హైదరాబాద్ ...ముత్యాల నగరం!

భారత దేశ పర్యాటక రంగంలో హైదరాబాద్ నగరానికి ఒక విశిష్టత కలదు. నగరంలోకి అడుగు పెట్టీ పర్యాటకులు కొద్దిపాటి ప్రత్యేక ఉత్సాహాలు కలిగి వుంటారు. గత చారిత్రక వైభవం నిరంతరం మార్పు చెందే ప్రస్తుత ఆధునికతలకు జోడిస్తూ, రంగు రంగుల కల లు కంటారు. బయటకు కనపడే నిరాడంబరతలను లోపల కల వైభవాలతో జోడించి ఆధునిక భావాలకు జీవం పోస్తారు. అదే హైదరాబాద్ నగర గొప్పతనం. హైదరాబాద్ నగర దర్పం అంతా అక్కడి పురాతన నవాబుల కాలంనాటి స్మారకాలు, పురాతన భవనాలు, వీధులలో కనపడుతుంది. అక్కడ లభించే సామాన్య ఆహారం సైతం నోరు ఊరే వివిధ రుచుల బిర్యాని గా మారి హైదరాబాది బిర్యానిగా ప్రపంచ ఖ్యాతి గాంచినది.

హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల అపురూప చిత్రాలను అందిస్తున్నాం. పరిశీలించి, హైదరాబాద్ చూడాలనుకునే మీ తపనకు ఒక రూపం ఇవ్వండి. ముత్యాల నగరంగా పేరొందిన నగర మధురమైన పర్యటనా అనుభవాలను మీ సొంతం చేసుకోండి.

చార్మినార్

చార్మినార్

చార్మినార్ పేరు చెపితే చాలు ప్రతిఒక్కరికి హైదరాబాద్ గుర్తుకు వచ్చేస్తుంది. హైదరాబాద్ పాత బస్తీలో కల పురాతన చార్మినార్ కట్టడం నేటికీ అనేకమంది పర్యాటకులను ఆకర్షిస్తుంది. నగరానికి ఒక ప్రముఖ ఆకర్షణగా నిలిచింది.
Photo Courtesy: GoDakshin

ఉత్సాహం పుట్టించే గల్లీలు

ఉత్సాహం పుట్టించే గల్లీలు

చార్మినార్ చుట్టూ కల అనేక వీధులు చిన్నా , పెద్దా దుకాణాలు కలిగి వుంటాయి. ఇక్కడ మీరు అన్ని రకాల వస్తువులు ముత్యాల నుండి కార్పెట్ ల వరకూ సరసమైన ధరలలో షాపింగ్ చేయవచ్చు. జనాలతో కిక్కిరిసిన దుకాణాలు ఆకర్షణీయ వస్తువుల కొనుగోలుకు సిద్ధంగా వుంటాయి.

Photo Courtesy: Ryan

మక్కా మసీదు

మక్కా మసీదు

అతిపురాతనమైన మక్కా మసీదు రాత్రివేళ విద్యుత్ దీపాల వెలుగులలో ధగ దగా వెలిగి పోతూ వుంటుంది.
Photo Courtesy: Sudhakar

చారిత్రక ప్రాధాన్యత

చారిత్రక ప్రాధాన్యత

కుతుబ్ షాహి నవాబుల సమాధుల గోపురాలు హైదరాబాద్ నగర చరిత్రను తెలుపుతాయి.
Photo Courtesy: swifant

బిర్లా మందిరం

బిర్లా మందిరం

ఒక చిన్న కొండపై కల తెల్లని మార్బుల్ రాతి తో నిర్మించిన బిర్లా మందిరం పర్యాటకులను స్వాగతిస్తుంది.
Photo Courtesy: ambrett

హుస్సేన్ సాగర్ సరస్సు

హుస్సేన్ సాగర్ సరస్సు

హుస్సేన్ సాగర్ సరస్సు లో సాయంకాల బోటింగ్ ఎంతో ఆనందంగా వుంటుంది. సూర్య కాంతిలో మెరిసే నీరు ఎంతో ఆకర్షణ.
Photo Courtesy: Vijay Kalakoti

విశేష దృశ్యాలు

విశేష దృశ్యాలు

హైదరాబాద్ లోని గోల్కొండ కోట పై భాగం నుండి చూస్తె కనపడే నగరం ఇలా వుంటుంది.
Photo Courtesy: McKay Savage

బారామతి మసీదు

బారామతి మసీదు

రాతి గోడలు, పచ్చటి ప్రదేశాలు కల బారామతి మసీద్ దృశ్యం

Photo Courtesy: C/N N/G

 సీతారాం బాగ్ టెంపుల్

సీతారాం బాగ్ టెంపుల్

హైదరాబాద్ లోని సీతారాం బాగ్ దేవాలయ శిల్ప కళల సమ్మేళనం చూడ ముచ్చట
Photo Courtesy: kvs_vsp

అమీన్ పూర్ సరస్సు

అమీన్ పూర్ సరస్సు

హైదరాబాద్ లోని అమీన్ పూర్ సరస్సు వద్ద కల పక్షుల జీవనం. ఇక్కడ మీరు వివిధ రకాల పక్షులను చూడవచ్చు.

Photo Courtesy: Ranju Islam

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X