Search
  • Follow NativePlanet
Share
» »హైదరాబాద్ లో శక్తివంతమైన చిలుకూరు బాలాజీ ఆలయం!

హైదరాబాద్ లో శక్తివంతమైన చిలుకూరు బాలాజీ ఆలయం!

హైదరాబాద్ వీసా బాలాజీ టెంపుల్ గా ఉన్న చిలుకూరు బాలాజీ ఆలయంను సందర్శించండి!

నమ్మకం అనేది చాలా ఆసక్తికరమైన విషయం మరియు దానిని ఎవరూ పూర్తిగా విశ్లేషించలేరు. హైదరాబాద్ లోని

చిలుకూరు బాలాజీ ఆలయ కథ విశ్వాసం మరియు శక్తి యొక్క కలయికతో కూడుకున్నది. ఎవరాకూ అర్థం కాదు. కానీ

నిజంగా సహాయం కోరి వచ్చిన భక్తులకు ఆ భగవంతుడు సహాయం చేస్తాడు.

ఇక్కడ వేంకటేశ్వరస్వామి విగ్రహం ఒక స్వయంభు (స్వీయ వ్యక్తం) అని చెబుతారు. ఈ ఆలయంనకు ఆసక్తికరమైన పురాణం కూడా ఉంది.

chilkur balaji temple history

Chilkur Balaji Temple

PC: Adityamadhav83

చిలుకూరు బాలాజీ ఆలయ పురాణం:
పురాణాల ప్రకారం తిరుపతి వెంకటేశ్వరస్వామికి ఒక గొప్ప భక్తుడు ఉండేవాడు. ఇతను ప్రతి సంవత్సరం తిరుపతికి వెళ్లి స్వామిని దర్శించుకొనేవాడు. ఒక సమయంలో అతను అనారోగ్యం కారణంగా యాత్ర చేయలేదు. తనకు ఎంతో ఇష్టమైన దేవుని సందర్శించడానికి కుదరలేదని కలత చెందాడు. ఆ రాత్రి వెంకటేశ్వరస్వామి తన కలలో కనిపించి "నా భక్తులు ఎక్కడ వుంటే నేను అక్కడ వుంటాను. నా భక్తుల హృదయాలలోనే నేను కొలువై వుంటాను. నన్ను దర్శించుటకు తిరుపతికి వెళ్ళవలసినవసరం లేదని చెప్పాడు.

మరుసటి రోజు భక్తుడు అతను కలలో చూసిన స్థానానికి వెళ్లి ఒక పెద్ద రంధ్రం త్రవ్వడం మొదలుపెట్టాడు. అకస్మాత్తుగా, అక్కడ రక్తం బయటకు కారడం మొదలయ్యింది. అది చూడగానే భక్తుడు భయపడ్డాడు. వెంటనే, ఒక స్వరం వినిపించింది. వెంకటేశ్వరస్వామి ఈ విధంగా భక్తునికి ఆవు పాలతో ఆ స్థలాన్ని పూరించమని అతనికి చెబుతాడు. ఆ భక్తుడు అదేవిధంగా చేస్తాడు. వెంటనే ఆశ్చర్యంగా శ్రీదేవి, భూదేవిలతో కొలువున్న బాలాజీ విగ్రహం అతనికి లభిస్తుంది.

ఆ తర్వాత లార్డ్ వెంకటేశ్వర విగ్రహాన్ని "చిలుకూరు" అనే గ్రామంలో ప్రతిష్టాపించారు. ఇప్పుడు హైదరాబాద్ అతిపురాతన ఆలయాల్లో "చిలుకూరు" ఒకటిగా నిలిచింది.

chilkur balaji temple history

Coconut and Flower Vendors at Temple premises

PC: Manu Manohar

తిరుపతిలో గల లార్డ్ వెంకటేశ్వర స్వామి యొక్క మరొక రూపం "చిలుకూరు బాలాజీ" అని ప్రజలు గట్టిగా నమ్ముతారు.

చిలుకూరు బాలాజీ గురించిన ఆసక్తికరమైన వాస్తవాలు:

1. భక్తులు భక్తితో "చిలుకూరు బాలాజీ" కి తమ కోరికలు విన్నవించుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుంది.

2. భక్తులు గర్భగుడి చుట్టూ 11 ప్రదక్షిణలు చేస్తూ తమ కోరికలు చెప్పుకోవాలి. తమ కోరికలు తీరిన తర్వాత 108 ప్రదక్షిణలు చేయాలి. అందువల్ల చాలా మంది ప్రజలు చిలుకూరు ఆలయంలో భక్తితో ప్రదక్షిణలు చేస్తారు. ఇక్కడ భక్తులు ఈ పురాతన ఆచారాన్ని అలాగే ఆచరిస్తున్నారు.

చిలుకూరు బాలాజీ ఆలయం ఎలా చేరాలి?

రోడ్డు మార్గం ద్వారా చిలుకూరు హైదరాబాద్ నుండి సుమారు 33కి.మీ ఉంది.

బస్సు మార్గం: మొదట హైదరాబాద్ నుండి మెహదీపట్నం చేరుకోవాలి. అక్కడనుండి చిలుకూర్ చేరుకోవచ్చు. బస్సు నెం. 288 డి ఈ మార్గంలో తరచుగా వెళ్తూ వుంటుంది.

ప్రసిద్ధ చిలుకూరు బాలాజీ ఆలయం హైదరాబాద్ లో గల ఒక ప్రముఖ పవిత్ర ప్రదేశం. తిరుపతికి వెళ్ళడానికి కుదరని వారు ఇక్కడ "చిలుకూరు బాలాజీ టెంపుల్" ని దర్శించుకోవచ్చు.

ఇటీవలి కాలంలో విదేశాల్లో గల ఇతర భక్తులు కూడా ఇక్కడకు వచ్చి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకొని వెళ్తున్నారు. అందువల్ల ఇక్కడ 'వీసా బాలాజీ' అనే పేరు బాగా ప్రాచుర్యం పొందింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X