అనంతపద్మనాభ స్వామి ఆరవ గది తెరిస్తే మొత్తం ప్రపంచాన్ని ముంచేస్తుందా?
వెతకండి
 
వెతకండి
 

వెనక్కి తిరిగి చుస్తే ఆ ఆలయ గోపురం మీ వెనకాలే వస్తుంది ఎక్కడో తెలుసా?

Updated: Friday, June 16, 2017, 14:24 [IST]
Share this on your social network:
   Facebook Twitter Google+ Pin it  Comments

LATEST: ఈ వినాయకుడి చెవిలో మీ కోరికలు చెబితే ఖచ్చితంగా నెరవేరుస్తాడు !

ఈ కోటలోకి వెళ్ళిన వారు మాయం అయిపోతున్నారు తిరిగి రారు!

తమిళనాడులోని కడలూరు జిల్లాలోని చిదంబరం గురించి చెప్పగానే నటరాజస్వామి గుర్తుకువస్తారు. చిదంబరం అంటే ఆకాశ లింగం. ఈ ఆలయంలో స్వామి ఇది అని చెప్పలేని చంద్రమౌళీశ్వర స్వామి స్పటికలింగ రూపం ఏ రూపంలేని దైవసాన్నిత్యం అనే 3రూపాలలో దర్శనమిస్తారు స్వామి. మూడో రూపమే చిదంబర రహస్యం. గర్భాలయంలో వెనక గోడ మీద ఒక చక్రం గీసి వుంటుందట. దాని మీద బంగారు బిల్వఆకులు వేలాడుతూవుంటాయి. అవేమీ కనిపించకుండ ఒక తెర కట్టి వుంటుంది. అర్చకులు ఆ తెరను నామమాత్రంగా తొలగించి చూపిస్తారు. ఆ ప్రదేశాన్నే శిరోహంభవ అంటారు.

చిదంబరం ఫొటోల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

చిదంబరం తమిళనాడులోని కడలూరు జిల్లాకు చెందిన మునిసిపాలిటీ మరియు తాలూకా కేంద్రం. ఇది తీరానికి 11 కి.మీ మరియు చెన్నైకి రైలు ద్వారా 240 కి.మీ దక్షిణంగా ఉంది.

పరమ శివుడు శివతాండవం చేస్తూ నటరాజుగా వెలసిన చిదంబరం దేవాలయం 40 ఎకరాల సముదాయంలో ఉంది. శైవులకు దేవాలయం లేదా తమిళంలో కోయిల్‌ అంటే చిదంబరం ఉన్న ఈ నటరాజ దేవాలయం. చిదంబరం అంటే శివుడు తాండవమాడే స్థలం అని అర్థం.

ఎలా చేరాలి? చిదంబరం రోడ్డు ప్రయాణం

వెనక్కి తిరిగి చుస్తే ఆ ఆలయ గోపురం మీ వెనకాలే వస్తుంది ఎక్కడో తెలుసా?

టాప్ 3 ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి

1. ఆనంద తాండవం

చిదంబరంలో శివుడు నిరాకారుడిగా కొలువబడుతున్నాడు. స్వామి తన దేవేరి శక్తి లేదా శివగామితో అనంతంగా తన దివ్యమైన 'ఆనంద తాండవం' చేస్తుంటారని ప్రతీతి.

PC: youtube

 

2. గర్భగుడి

దీన్ని గర్భగుడిలోని ఖాళీ స్థలంలో ఉన్న ఒక గోడపై 'యంత్ర' అనే చిత్రం ప్రతిబింబిస్తుంది. ఆ స్థలాన్ని ఒక తెర కప్పి ఉంచుతుంది.

PC: youtube

 

3. బంగారు 'విల్వ' (బిల్వ) పత్రాలు

ఈ తెరను తీసినప్పుడు భగవంతుడి ఉనికిని తెలిపే బంగారు 'విల్వ' (బిల్వ) పత్రాలు వ్రేలాడుతూ కనిపిస్తాయి. ఈ తెర బయటి వైపు అజ్ఞానాన్ని సూచించే నలుపు రంగులోనూ, లోపలి వైపు జ్ఞానాన్నీ ముక్తినీ సూచించే ఎరుపు రంగులోనూ ఉంటుంది.

PC: youtube

 

4. భగవంతుడి ఉనికి

దైనందిన పూజా కార్యక్రమంలో భాగంగా తానే దైవత్వంతో ఉట్టి పడుతున్న ప్రధాన పూజారి (శివోహంభవ - శివ - భగవంతుడు, అహం - నేను/మేము, భవ - మన స్థితి) తెరను తొలగిస్తాడు. ఇది అజ్ఞానాన్ని తుడిచి పెట్టి నిరాకారుడైన భగవంతుడి ఉనికిని తెలియ జెప్పే ప్రక్రియ.

PC: youtube

 

5. చిదంబర రహస్యం

అందువల్ల చిదంబర రహస్యం ఏమిటంటే తనను తాను పరిపూర్ణంగా అర్పించుకున్నప్పుడు భక్తుడు భగవంతుడిని తన అజ్ఞానాన్ని తొలగించనిచ్చి ఆయనను దర్శించుకుని ఆయన ఉనికిని, ముక్తిని అనుభవించగలడు.

PC: youtube

 

6. దైవసాన్నిధ్యం

శివ అంటే దైవం.అహం అంటే మనం. భవ అంటే మనస్సు.ఆ దైవలో మనస్సు ఐక్యమయ్యే ప్రదేశం అంటే అక్కడ ఏ రూపం లేకుండానే అజ్ఞానాన్ని తొలగించుకుంటూ దైవసాన్నిధ్యాన్ని అనుభూతి చెందటమే ఈ క్షేత్ర ప్రాశస్త్యం.

PC: youtube

 

7. ఆలయగోపురం

ఈ ఆలయానికి వున్న మరో ప్రత్యేకత ఏంటంటే నటరాజస్వామిని దర్శించుకుని బయటకు వచ్చి వెనుదిరిగి చూస్తే ఆలయగోపురం మన వెనకనే వస్తున్న అనుభూతి కలుగుతుంది. ఈ దేవాలయానికి 9 ద్వారాలు ఉన్నాయి. ఈ తొమ్మిదిలో 4 పెద్ద గాలి గోపురాలు ( తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ దిక్కులలో). ఈ నాలుగు గాలి గోపురాలు చాల పురాతనమైనవి.

PC: youtube

 

8. ఆలయ సముదాయము

తూర్పు గాలి గోపురము మీద 108 ముద్రలతో భరత నాట్యం చేస్తున్న శిల్పాలు చెక్కబడ్డాయి. ఆలయ సముదాయం 40 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ ఆలయ సముదాయములోనే ఒక పెద్ద తటాకము (శివ గంగ) మరియు చిన్న ఇళ్ళు ఉన్నాయి.

PC: youtube

 

9. పంచమూర్తులు

ఇవి కాక ఐదు సభలు లేదా వేదికలు ఉన్నాయి. అవి - గర్భగుడిగా వెలుగొందుతున్న చిత్సబై, చిత్సబైకి ఎదురుగానే ఉన్న నిత్యపూజలు జరిగే కనకసబై, గర్భగుడికి ఎదురుగానే శివుడు 'కాళి' తో నాట్యమాడినట్లుగా చెప్పబడుతున్న నృత్యసబై లేదా నాట్యసబై - ఇది శక్తి స్వరూపం, భగవంతుడి ఆధిపత్యాన్ని చాటి చెప్పిన ప్రాంతం, రాజ్యసబై లేదా 1000 స్తంభాల మంటపం (నిజానికి ఉన్నది 999 స్తంభాలే, భగవంతుడు దర్శనమిచ్చినప్పుడు ఆయనే 1000వ స్తంభం) మరియు పంచమూర్తులు కొలువైన దేవసబై (పంచ - ఐదు, మూర్తులు - భగవంతుడి విగ్రహాలు.

PC: youtube

 

10. శివానందనాయకి

ఆ ఐదు ఏవంటే గణేశుడు - విఘ్నాలు తొలగించే స్వామి, తన భార్య 'శివానందనాయకి'తో కూడి కూర్చున్న భంగిమలో దర్శనమిచ్చే సోమస్కందర్ స్వామి, మురుగా స్వామి మరియు భక్తముఖ్యుడు, ప్రధాన భక్తుడు ఐన చండికేశ్వరర్).

PC: youtube

 

11. పాండియనాయకం ఆలయం

ఇవి కాక పతంజలి, వ్యాఘ్రపాదర్ పూజించిన తిరుమూలతనేశ్వరర్ మరియు ఆయన దేవేరి ఉమయ్య పార్వతి ఆలయం, 63 ప్రధాన భక్తులు లేదా అరుబత్తుమూవర్ ల ఆలయాలు, 'జ్ఞాన శక్తి'కి నిలయమైన శివగామి ఆలయం, విఘ్నాలు పోగొట్టే గణేశాలయం, మూడు విధాలైన శక్తులు - ఇచ్ఛై లేదా కోరిక అవతారమైన భార్య వల్లి, క్రియకు ప్రతిరూపమైన భార్య దేవయాని, అజ్ఞానాన్ని నాశనం చేసేందుకు స్వామి వాడే జ్ఞానానికి ప్రతిరూపమైన బల్లెం - వీటిని కలిగిన మురుగా లేక పాండియనాయకం ఆలయం కూడా ఉన్నాయి.

PC: youtube

 

12. 108 వైష్ణవ దివ్యదేశాలులో ఒకటి

ఆలయ ప్రాంగణంలో గోవిందరాజ పెరుమాళ్, ఆయన దేవేరి పుండరీగవల్లి తాయర్ దేవాలయం కూడా ఉంది. ఈ దేవాలయాన్ని తిల్లై తిరుచిత్రకూడమ్ అంటారు. ఇది 108 వైష్ణవ దివ్యదేశాలులో ఒకటి. దివ్యదేశాలంటే ప్రముఖ భక్తులైన ఆళ్వార్లు మంత్రాలు (నాలయిర దివ్యప్రబంధం) చదివి శుద్ధి (మంగళాశాసనం) చేసిన విష్ణ్వాలయాలు.

PC: youtube

 

13. చిన్న ఆలయాలు

ఆలయ ప్రాంగణంలో ఇంకా చాలా చిన్న ఆలయాలు ఉన్నాయి. ఆలయపు రూపకల్పనలోనూ, స్థాపత్యంలోనూ (స్థాపత్యం - ఆర్కిటెక్చర్) వేదాంతార్థాలు కోకొల్లలు.

PC: youtube

 

14. పంచాచ్ఛరపది

ఉన్న తొమ్మిది ద్వారాలు మానవ శరీరంలోని నవరంధ్రాలను సూచిస్తాయి. గర్భగుడిని ఒక ప్రక్కనున్న కనకసబై అనే వేదిక పైనుంచి పంచాచ్ఛరపది అనే ఐదు మెట్లు ఎక్కి చేరుకోవాలి.

PC: youtube

 

15. పంచాచ్ఛరపది అంటే

పంచ - ఐదు, అ-చ్ఛర - నాశము లేని శబ్దాలు శి వా య న మ . పొన్నాంబళం హృదయానికి ప్రతీక కనుక వేదిక పక్క నుంచి వెళ్ళడం (మిగతా దేవాలయాల్లో మాదిరి ముందు నుంచి కాకుండా).

PC: youtube

 

16. 28 స్తంభాలు

పొన్నాంబళం లేదా గర్భగుడిని 28 స్తంభాలు మోస్తున్నాయి. ఇవి 28 ఆగమాలను (ఆగమాలు శివుడిని అర్చించే వైదిక విధానాలు) సూచిస్తాయి.

PC: youtube

 

17. 64 దూలాలు

ఇక ఆలయం పైకప్పుని 64 కళలకు ప్రతీకలైన 64 దూలాలు, అంతు లేని రక్తనాళాలకు ప్రతీకలైన ఎన్నో అడ్డ దూలాలు మోస్తున్నాయి.

PC: youtube

 

18. 9 పవిత్ర కుంభాలు

పైకప్పుని 21600 శివయనమ అని రాసిన బంగారు పలకలతో కప్పారు. ఇవి 21600 శ్వాసలను సూచిస్తాయి. కప్పుపై 9 రకాలైన శక్తిని సూచించే 9 పవిత్ర కుంభాలు లేదా కలశాలతో తీర్చిదిద్దారు.

PC: youtube

 

19. సింహ భాగం

చిదంబరం ఆలయపు అసలు మూలాలు తెలియవు. పురాణాల ప్రకారం పులికాల్మునివర్ స్వామి సిమ్మవర్మన్ ద్వారా పవిత్రమైన ఆలయ పనుల్లో సింహ భాగాన్ని జరిపించినట్లు తెలుస్తోంది.

PC: youtube

 

20. సిమ్మవర్మన్

పల్లవ రాజుల్లో సిమ్మవర్మన్ పేరుగల రాజూలు ముగ్గురున్నారు. భక్త కవి ఐన తిరునావుక్కరసర్ సమయానికే ఆలయం ప్రశస్తి పొందినందువల్ల సిమ్మవర్మన్ దాదాపు క్రీ.శ. 430-458 మధ్య కాలంలో జీవించి ఉండాలి.

PC: youtube

 

21. పట్టాయం లేదా రాగిరేకులు

కొట్రావన్ కుడి లోని 'పట్టాయం' లేదా రాగిరేకులతో చేసిన శాసనం ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తుంది. కానీ తండన్ తొట్ట పట్టాయం ఇంకా ఇతర పల్లవ కాలపు పట్టాయాలలో ఈయన ప్రసక్తి లేదు.

PC: youtube

 

22. చిదంబరం

అందువల్ల ఆయన తన హక్కులను త్యజించి చిదంబరానికి వచ్చి జీవించి ఉండవచ్చని నమ్మకం. పులికాల్మునివర్, సిమ్మవర్మన్ సమకాలికులని తెలుస్తుండడం వల్ల ఆలయం ఆ సమయంలో ఉనికిని పొందిందని భావిస్తారు.

శివుడు తాండవం ఆడే స్థలం : చిదంబరం !

PC: youtube

 

23. నటరాజ స్వామి విగ్రహం

కానీ భక్త కవి మాణిక్కవసాగర్ భక్త కవి తిరునావుక్కరసర్ కన్నా ఎంతో ముందే చిదంబరంలో జీవించి ముక్తిని పొందినట్లు తెలుస్తుండడం వల్ల, అంతే కాక నటరాజ స్వామి విగ్రహం, దాని భంగిమ, దాని స్వరూపం అదే కాలపు ఇతర పల్లవ శిల్పరీతులతో సరిపోలనందువల్ల ఈ ఆలయం సిమ్మవర్మన్ కన్నా చాలాకాలం ముందు నుంచే ఉనికిలో ఉండేదని విశ్వసిస్తున్నారు.

PC: youtube

 

24. వసతి సౌకర్యాలు

వసతి విషయానికి వస్తే, ఆలయానికి సమీపంలో చాలానే హోటళ్లు ఉన్నాయి. అయితే రూం సర్వీస్ లు అంతగా బాగుండవు. భోజనానికి గుడి సమీపంలోని హోటళ్ళలోకి వెళితే లభిస్తుంది.

pc : meg williams2009

 

 

25. చిదంబరం ఎలా చేరుకోవాలి ?

సమీప విమానాశ్రయం - చెన్నై (250 కి. మీ)

PC: youtube

 

26. రైలు మార్గం

చిదంబరంలో రైల్వే స్టేషన్ ఉన్నది. ఇది తిరుచ్చి - చెన్నై మార్గంలో కలదు.

pc : Amol.Gaitonde

 

27. రోడ్డు మార్గం

చెన్నై - పాండిచ్చేరి మార్గం లో చిదంబరం కలదు. ప్రవేట్, ప్రభుత్వ బస్సులు తరచూ ఈ మార్గం గుండా వెళుతుంటాయి.

pc : Christian Lagat

 

28. రైళ్ళ రాకపోకలు

చెన్నై నుండి ఇక్కడికి ప్రతి రోజూ రైళ్ళు రాకపోకలు సాగిస్తుంటాయి.

శివుడు మూడో కన్ను తెరిచిన ప్రదేశం !

PC: youtube

 

English summary

The Secrets Behind Nataraja Swami Temple !

Chidambaram is a temple town in the district of Cuddalore in Tamil Nadu. Many things come to mind when one thinks of this town. But the first would be the imposing Chidambaram Natarajar temple that the town is famous for.
Please Wait while comments are loading...