Search
  • Follow NativePlanet
Share
» » కేరళ లో 10 ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణలు !

కేరళ లో 10 ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణలు !

కేరళ పేరు చెపితే చాలు కళ్ళ ముందు అనేక ప్రకృతి దృశ్యాలు, వాటర్ ఫాల్స్ బోటు షికార్లు కదులుతూ వుంటాయి. అందుకనే, దీనిని గాడ్స్ ఓన్ కంట్రీ, లేదా దేముని స్వంత దేశం అన్నారు. కేరళ రాష్టం ప్రపంచ వ్యాప్తంగా టూరిస్టులను సంవత్సరం పొడవునా ఆకర్షించటంలో విజయవంతం అయ్యింది. వేసవి, వింటర్, లేదా వర్ష రుతువు అయినా సరే పర్యాటకులు ఈ రాష్ట్రానికి వస్తూనే వుంటారు. టూరిస్ట్ లు వర్షాకాలంలో కూడా వర్షాలు అనుభవించటానికి వస్తారంటే, అతిశయోక్తి గా వుంటుంది. అందుకని మనం జీవిత కాలంలో ఒక్కసారైనా సరే అందమైన ఈ రాష్ట్రాన్ని చూసి తీరాల్సిందే.
కేరళ లో 10 ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలు

 మున్నార్

మున్నార్

ఇటీవలి కాలం వరకూ కేరళలోని మున్నార్ హిల్ స్టేషన్ ఒక ఉత్తమమైన హిల్ స్టేషన్ గా పేరుపొందినది. సౌత్ ఇండియా కు ఇది కాశ్మీర్ అంటారు. పొగ మంచు కల కొండలు కల ఈ ప్రాంతం తప్పక చూడవలసినది.

అల్లెప్పి

అల్లెప్పి

అల్లెప్పి బ్యాక్ వాటర్స్ లేదా అలప్పుజ్హ అనేది అక్కడ కల ముగ్ధ మనోహర బ్యాక్ వాటర్స్ కు ప్రసిద్ధి. ఇక్కడ టూరిజం బాగా అభివ్రుద్ధి చెంది, ప్రతి సంవత్సరం ఈ ప్రదేశానికి వచ్చే విదేశీ పర్యాటకులు అధికం అవుతున్నారు. ఈ బ్యాక్ వాటర్స్ లో ఒక హౌస్ బోటు లో ఒక పగలు / రాత్రి మరువలేని అనుభవం గా వుంటుంది.

 వయనాడ్

వయనాడ్

ఒక సారి వయనాడ్ వెళ్ళిన వారు మరో మారు వయనాడ్ వెళ్లి తీరాల్సిందే. దాని అందాలు, ప్రశాంత వాతావరణం మంత్ర ముగ్ధులను చేస్తాయి. ఈ ప్రదేశంలో కల ఆకర్షనలైన బాణాసుర సాగర్ డాం, చేమ్బ్రా పీక్ , ఇతర ప్రదేశాలు చూడాలంటే, కల్పెట్టలో దిగాలి.

 కోవలామ్

కోవలామ్

కోవలం లో విశ్రాంతి నిస్సందేహంగా అద్భుతం. సముద్రపు బీచ్ అలలు, సూర్యకాంతిలో మెరిసే, బీచ్ ఇసుకలుతో కోవలం ప్రకృతి ప్రియులకు ఒక ఆదర్శవంతమైన ప్రదేశంగా వుంటుంది. ఈ బీచ్ టవున్ కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురానికి 16 కి. మీ. ల దూరంలో వుంటుంది.

 తేక్కడి

తేక్కడి

తేక్కడి ప్రదేశం అడ్వెంచర్ పర్యాటకులకు. దట్టమైన అడవులు కల తేక్కడి అడవిలో ట్రెక్కింగ్ కు అద్భుత అవకాశాలు కల్పిస్తుంది. ప్రకృతిలో లీనం అయ్యేలా చేస్తుంది. అడవులలో జంతువులను చూసేందుకు ఈ ప్రదేశం అనువైనది. కనుక, సాహిసికులూ, ప్రకృతి ప్రియులూ, త్రేక్కర్లూ తేక్కడి ప్రదేశం ఎప్పటికి మిస్ చేయకండి.

 కోచి

కోచి

కోచి పట్టణాన్ని కేరళ ప్రవేశ ద్వారం అంటారు. ఇక్కడ ఎన్నో చారిత్రక ప్రదేశాలు, ఇతర నిర్మాణాలు అంటే బ్రిటిష్, పోర్చుగీస్, డచ్, అరబ్ మరియు చైనీస్ ల శిల్ప శైలి ప్రభావం కలిగి వుంటాయి. నగరం అంతా ఆకర్షణీయంగా వుండి విదేశాలను తలపించేలా చేస్తుంది. కోచి లో మీరు తప్పక చూడవలసినది కొచ్చి కోట.

Picture Courtesy: Prasanth Gulfu

 తేన్మల

తేన్మల

తేన్మల అంటే తేనె కొండ అని అర్ధం చెపుతారు. ఎందుకంటే ఇక్కడ తేనె చాలా ప్రసిద్ధి. ఈ తేనెలో ఔషధ గునాలుగూడా ఉంటాయని చెపుతారు. ఈ కొండ ఇండియా లో మొట్ట మొదటి పర్యావరణ టూరిజం ప్రదేశంగా ప్రణాళిక చేసారు. కేరళకు ఒక ట్రెజర్ గా చెప్పబడే దీనిని మిస్ కాకండి.

కుమరకోమ్

కుమరకోమ్

కేరళ లోని బ్యాక్ వాటర్స్ అల్లెప్పి కి మాత్రమే పరిమితం కాదు. కుమరకోమ్ కూడా దాని బ్యాక్ వాటర్స్ తో మిమ్మల్ని మంత్ర ముగ్ధులను చేస్తుంది. ఇతర ఆకర్షనలైన వెంబనాడ్ లేక్, అరువిక్కుజ్హి జలపాతాలు కూడా ఇక్కడ చూసి ఆనందించ దగినవే.

 బెకాల్

బెకాల్

సూపెర్ హిట్ సినిమా బొంబాయి మీరు తప్పక చూసే వుంటారు. దానిని చూస్తె, మీరు బెకాల్ చూసినట్లే. ఫోర్ట్ కూడా చూసినట్లే. బెకల్ దానికి గల అందాలతో ప్రపంచ వ్యాప్త పర్యాటకులను కేరళ కు ఆకర్షిస్తుంది.

 త్రిస్సూర్

త్రిస్సూర్

చివరగా మీరు కేరళలో చూడవలసిన ప్రదేశం త్రిస్సూర్. దీనిని పండుగల భూమి అంటారు. త్రిస్సూర్ ప్రసిద్ధ త్రిస్సూర్ పూరం అనే కేరళ లోని ఒక పండుగకు ప్రసిద్ధి. ఈ ఫెస్టివల్ సాధారణంగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ - మే నెలలో జరుగుతుంది. దీనికి ప్రపంచ వ్యాప్త పర్యాటకులు వస్తారు. త్రిస్సూర్ లో అతిరాపల్లీ వాటర్ ఫాల్స్, వాడక్కుమ్నాతాన్ టెంపుల్ తప్పక చూడదగినవి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X