Search
  • Follow NativePlanet
Share
» »కామ్ షెట్ - సాహస క్రీడల నగరం !

కామ్ షెట్ - సాహస క్రీడల నగరం !

By Mohammad

హిల్ స్టేషన్ లోనావాలా కు మరియు పూణే కు మధ్యలో ఉన్న చిన్న పట్టణం కామ్ షెట్. పేరులో కామ్ ఉంది కదా అనుకోని ఈ ప్రదేశం కామ్ గా ఉంటుందిలే అనుకుంటే పొరబడినట్లే! గోల గోల గా అదీ గాల్లో తేలుతూ అరుస్తారు. నిజమండి బాబోయ్ ! ఇక్కడకు వచ్చే ప్రతి పర్యాటకుడు గాల్లోనే అరుస్తాడు. అదేంటీ అని అనుకుంటున్నారా ?

కామ్ షెట్ పారాగ్లైడింగ్ క్లబ్ లకు మరియు సుందర అందాలకు ప్రసిద్ధి చెందినది. సెలవు వచ్చిందంటే చాలు అది వీకెండ్ అయినా లేదా పబ్లిక్ హాలిడే అయినా పర్యాటకులు, సాహసికులు ఇక్కడ వాలిపోవలసిందే. వర్షాకాలం ముగిసిన వెంటనే పారాగ్లైడింగ్ సీజన్ మొదలవుతుంది. ఇదే సమయంలో సాధారణంగా గాలిపటాల సీజన్ కూడా ప్రారంభమవుతుంది. ఈ సమయంలో వాతావరణం ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది.

పారాగ్లైడింగ్, కామ్ షెట్

పారాగ్లైడింగ్, కామ్ షెట్

చిత్ర కృప : Stratovarius Follow

పారాగ్లైడింగ్ క్రీడలు ఆచరించటానికి ఇక్కడ అనేక ప్రదేశాలు ఉన్నాయి. ఎన్ని ఉన్న పర్యాటకులు ఎక్కువగా కనిపించేది టవర్ హిల్ ప్రదేశం. ఇది సముద్రమట్టానికి 2500 అడుగుల ఎత్తులో ఉంటుంది. అడ్వెంచర్ అంటే అమితంగా ఇష్టపడేవారు ఇక్కడి నుండి దూకి గాలిలో తేలుతూ అరుస్తూ ఆనందిస్తారు. చుట్టూ ఉన్న ప్రకృతి అందాలను మధ్యలో నిలబడి చూడవచ్చు.

మతేరన్ - అందమైన సైట్ సీఇంగ్ ప్రదేశాలు !మతేరన్ - అందమైన సైట్ సీఇంగ్ ప్రదేశాలు !

పారాగ్లైడింగ్ మిమ్మల్ని ఆకాశంలో తీసుకెళ్లే క్రీడ. దీనికి శిక్షణ ఇచ్చేందుకు స్కూల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. మొదటిసారి పారాగ్లైడింగ్ చేసేవారికి గైడ్ సహకారం తప్పనిసరి.

పవనా సరస్సు , కామ్ షెట్

పవనా సరస్సు , కామ్ షెట్

ఎక్కడి నుంచి ఎంతెంత దూరం ?

ఖండాలా - లోనావాలా నుండి 15 కి. మీ ల దూరంలో, ముంబై నుండి 115 కి. మీ ల దూరంలో మరియు పూణే నుండి 60 కి. మీ ల దూరంలో కామ్ షెట్ కలదు.

పారాగ్లైడింగ్ చేసేటప్పుడు చూసేవి

సాహసికులు పారాగ్లైడింగ్ చేసేటప్పుడు ఆకాశం నుండి ప్రసిద్ధి చెందిన పవనా సరస్సు మరియు మరికొన్ని దేవాలయాలను చూడవచ్చు.

సతారాలో ఈ అద్భుత ప్రదేశాలను చూసారా ?సతారాలో ఈ అద్భుత ప్రదేశాలను చూసారా ?

ఇక్కడ గల గ్లైడింగ్ క్లబ్స్ హోటళ్లతో మంచి సంబంధం కలిగి ఉండి, తక్కువ ధరకే వసతి ఏర్పాట్లను అందిస్తాయి. ఈ ప్రాంతంలో పర్యాటకులు పవనా సరస్సు, సముద్రమట్టానికి 2200 అడుగుల ఎత్తు గల విడావలి సరస్సు, కొండేశ్వర్ దేవాలయం మరియు సహజ రాతి గుహలను చూడవచ్చు.

కొండేశ్వర్ ఆలయం, కామ్ షెట్

కొండేశ్వర్ ఆలయం, కామ్ షెట్

కొండేశ్వర్ ఆలయం

కామ్ షెట్ లో ఉన్న ఆకర్షణలలో కొండేశ్వర్ ఆలయం ప్రసిద్ధి చెందినది. కామ్ షెట్ ప్రాంతాన్ని సందర్శించే వారు తప్పక కొండేశ్వర్ ఆలయంలో ఉన్న శివభగవానుడిని దర్శిస్తారు. పండుగ వేళల్లో యాత్రికులు అధికసంఖ్యలో పాల్గొని మొక్కుబడులను తీర్చుకుంటారు.

జలపాతం, కామ్ షెట్

జలపాతం, కామ్ షెట్

కామ్ షెట్ ఎలా చేరుకోవాలి ?

వాయు మార్గం : ముంబై మరియు పూణే లు కామ్ షెట్ కు సమీప విమానాశ్రయాలుగా ఉన్నాయి. క్యాబ్ లేదా టాక్సీ లో ఇక్కడికి చేరుకోవచ్చు.

రైలు మార్గం : కామ్ షెట్ కు సమీపాన లోనావాలా రైల్వే స్టేషన్ కలదు. లోనావాలా నుండి ఇది కేవలం 20 కి. మీ లు మాత్రమే!

రోడ్డు మార్గం : ముంబై మరియు పూణే హైవే నుండి కామ్ షెట్ కేవలం 30 కిలోమీటర్ల దూరంలో కలదు. లోనావాలా - పూణే సిటీ మధ్యలో ఉన్న ఈ చిన్న పట్టణమైన కామ్ షెట్ కు ముంబై - పూణే మధ్యలో తిరిగే ప్రభుత్వ/ ప్రవేట్ బస్సులు ఆగుతాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X