Search
  • Follow NativePlanet
Share
» »అనంత పద్మనాభస్వామి మిస్టరీ వింటే దిమ్మతిరుగుతుంది !!

అనంత పద్మనాభస్వామి మిస్టరీ వింటే దిమ్మతిరుగుతుంది !!

పద్మనాభస్వామి దేవాలయం సముద్రతీరంలోనే వుంది.దేవాలయగోపురం బంగారంతో నిర్మించబడింది.గుడిలో లక్షలు విలువ చేసే అనంతసంపద వుంది. అందులోనూ విష్ణుమూర్తి విగ్రహం అనంతునిపై పవళించివుంటుంది.

By Venkatakarunasri

హిందూ దేవాలయాలపై టిప్పుసుల్తాన్ విచ్చల విడిగా దాడి చేస్తూ దేవాలయాల సంపదను కొల్లగొడుతుండడంతో ట్రావెన్ కో రాజులు తమ రాజ్యంలోని సంపదనంతటిని భద్రపరచటానికి దేవాలయం కింద నేలమాళిగలు కట్టించి అందులో భద్రపరచారని ఆ సంపదే మనం చూస్తున్న ఈ అనంతసంపద అని చెబుతుంటారు.అయితే ప్రఖ్యాత చరిత్రకారుడు ఎం.జి.శశిభూషణ్ ఇవన్నీ గాలిలో మాటలని కొట్టిపారేస్తున్నారు.

అనంత పద్మనాభ స్వామి తలుపుల కిటుకు తెలిసింది ఈ ఒక్కడికే...

అనంత పద్మనాభ స్వామి తలుపుల కిటుకు తెలిసింది ఈ ఒక్కడికే...

ఈ దేవాలయం ప్రస్తావన శిలప్పదికారం అనే తమిళ గ్రంథంలో 5వ శతాబ్దంలోనే వుందని శశిభూషణ్ చెప్పాడు.అందులో కవి వర్ణించిన సముద్రతీరంలో గల అడగామడం అనే గోల్డెన్ టెంపుల్ లో విష్ణుమూర్తి విగ్రహం పడుకుని వుంటుందని రాయబడింది.

PC: youtube

అనంత పద్మనాభ స్వామి తలుపుల కిటుకు తెలిసింది ఈ ఒక్కడికే...

అనంత పద్మనాభ స్వామి తలుపుల కిటుకు తెలిసింది ఈ ఒక్కడికే...

పద్మనాభస్వామి దేవాలయం సముద్రతీరంలోనే వుంది.దేవాలయగోపురం బంగారంతో నిర్మించబడింది.గుడిలో లక్షలు విలువ చేసే అనంతసంపద వుంది.అందులోనూ విష్ణుమూర్తి విగ్రహం అనంతునిపై పవళించివుంటుంది.

PC: youtube

అనంత పద్మనాభ స్వామి తలుపుల కిటుకు తెలిసింది ఈ ఒక్కడికే...

అనంత పద్మనాభ స్వామి తలుపుల కిటుకు తెలిసింది ఈ ఒక్కడికే...

ఇవన్నీ చూసినట్లయితే ముమ్మాటికీ కవి వర్ణించిన గోల్డెన్ టెంపుల్ పద్మనాభస్వామి దేవాలయమే అయివుంటుందని శశి భూషణ్ వాదన. అలాగే 9వ శతాబ్దంలో రచించబడిన కీర్తనలలో పద్మనాభస్వామిపై కూడా పాడారు.

PC: youtube

అనంత పద్మనాభ స్వామి తలుపుల కిటుకు తెలిసింది ఈ ఒక్కడికే...

అనంత పద్మనాభ స్వామి తలుపుల కిటుకు తెలిసింది ఈ ఒక్కడికే...

అంటే పద్మనాభస్వామి దేవాలయం అప్పట్లోనే వుందని రుజువైంది. అనంత సంపద కూడా దేవాలయం కట్టినప్పటినుండి వుందని శశిభూషణ్ చెప్పారు. అనంతపద్మనాభస్వామి లేక్ టెంపుల్ లోని కోనేరులో బబియా అనే ఒక మొసలి వుంది.ఈ మొసలి పద్మనాభస్వామి దేవాలయానికి కాపలాకాస్తూవుంటుందని చెబుతుంటారు.

PC: youtube

అనంత పద్మనాభ స్వామి తలుపుల కిటుకు తెలిసింది ఈ ఒక్కడికే...

అనంత పద్మనాభ స్వామి తలుపుల కిటుకు తెలిసింది ఈ ఒక్కడికే...

బబియా ప్రపంచంలోనే వెజిటేరియన్ తినే ఒకేఒక క్రోకోడైల్.ఈ సరస్సులో చాలా చేపలు వున్నప్పటికీ బబియ వాటి జోలికిపోకుండా కేవలం అన్నంతో స్వామివారికి పెట్టే నైవేద్యం మాత్రమే తింటుంది.ఇంకా విచిత్రంఏంటంటే భక్తులు బబియా వున్న ఆ కోనేరులోనే స్నానంచేస్తూ వుంటారు. ఇంతవరకూ బబియా ఒక్కరిపైకూడా దాడి చేసిన దాఖలాలు లేవు.

PC: youtube

అనంత పద్మనాభ స్వామి తలుపుల కిటుకు తెలిసింది ఈ ఒక్కడికే...

అనంత పద్మనాభ స్వామి తలుపుల కిటుకు తెలిసింది ఈ ఒక్కడికే...

సాధారణంగానైతే క్రోకోడైల్ దరిదాపుల్లోగనక మనం వెళ్ళినట్లయితే ఇక అంతేసంగతులు. కానీ బబియామాత్రం అలా కాదు.అయితే 1945లో ఒక బ్రిటీష్ సైనికుడు బబియాను తన తుపాకీతో కాల్చిచంపాడు. ఆశ్చర్యంగా కొద్దిరోజుల్లోనే ఆ బ్రిటీష్ సైనికుడు పాముకాటుతో మరణించాడు.

PC: youtube

అనంత పద్మనాభ స్వామి తలుపుల కిటుకు తెలిసింది ఈ ఒక్కడికే...

అనంత పద్మనాభ స్వామి తలుపుల కిటుకు తెలిసింది ఈ ఒక్కడికే...

దాంతో ఆ అనంతశేషుడే ఆ బ్రిటీష్ సైనికుడిపై పగ తీర్చుకున్నాడని చెబుతుంటారు.ఇంకా ఆశ్చర్యంఏంటంటే కొద్దిరోజుల్లోనే బబియా మళ్ళీ కోనేరులో ప్రత్యక్షమయ్యింది.ఇక అప్పట్నుండి కోనేరులో ఎప్పుడూ ఒక క్రోకోడైల్ ఖచ్చితంగా వుంటుంది. ఒక క్రోకోడైల్ గనక మరణించిన వెంటనే ఆశ్చర్యంగా మరో క్రోకోడైల్ ఆ కోనేరులో ప్రత్యక్షమౌతుంది.

PC: youtube

అనంత పద్మనాభ స్వామి తలుపుల కిటుకు తెలిసింది ఈ ఒక్కడికే...

అనంత పద్మనాభ స్వామి తలుపుల కిటుకు తెలిసింది ఈ ఒక్కడికే...

భక్తులంతా ఇదంతా ఆ పద్మనాభస్వామిలీలగానే పరిగణిస్తుంటారు. మరి దేవాలయంలో అనంతసంపద ఎలా పోగైంది?దేవాలయంలో అంత ఆదాయం ఎలా వచ్చిందిఅంటే భక్తులు మరియు ఆ తర్వాతి కాలంలో ట్రావెన్కో రాజులు మనస్పూర్తిగా భారీ మొత్తంలో కానుకలు సమర్పించుకునే వారు.ఇప్పుడెలాగైతే మనం తిరుమలలో కానుకలు సమర్పించుకుంటామో అలాగనమాట.

PC: youtube

అనంత పద్మనాభ స్వామి తలుపుల కిటుకు తెలిసింది ఈ ఒక్కడికే...

అనంత పద్మనాభ స్వామి తలుపుల కిటుకు తెలిసింది ఈ ఒక్కడికే...

చివరికి 1750 జనవరి 17 వ తేదీన ట్రావెన్కోర్ సామ్రాజ్యాన్ని పద్మనాభస్వామి పాదాలచెంత సమర్పించి తమకుతాము పద్మనాభ దాసులుగా ప్రకటించుకున్నారు. అయితే ట్రావెన్కో రాజులతో పాటు ఇరుగుపొరుగు రాజ్యాలరాజులు కూడా తిరువనంతపురానికి వచ్చి భారీగా కానుకలు సమర్పించుకునే వారట.

PC: youtube

అనంత పద్మనాభ స్వామి తలుపుల కిటుకు తెలిసింది ఈ ఒక్కడికే...

అనంత పద్మనాభ స్వామి తలుపుల కిటుకు తెలిసింది ఈ ఒక్కడికే...

శ్రీకృష్ణ దేవరాయలకాలం నాటి నాణేలు అనంతసంపద లెక్కింపులో కానరావటం ఇందుకు నిదర్శనం.అయితే ట్రావెన్కో రాజులు తమ సంపదను 3భాగాలుగా విభజించారు. మొదటిది దేవాలయాలనుండి వచ్చే సంపదను నేలమాళిగలలోనిగదుల్లో దాచేవారు.

PC: youtube

అనంత పద్మనాభ స్వామి తలుపుల కిటుకు తెలిసింది ఈ ఒక్కడికే...

అనంత పద్మనాభ స్వామి తలుపుల కిటుకు తెలిసింది ఈ ఒక్కడికే...

ఇక రెండవది,రాజ్యంలో పన్నుల రూపంలో వచ్చే భాండాగారాన్ని నేలమాళిగల్లో గదుల బయట ప్రాంతంలో దాచేవారు.మూడవది ఇక ట్రావెన్కో రాజులు తమ ఆదాయాన్ని ప్యాలెస్ లలో వుంచేవారు. అయితే నియమం ప్రకారం ట్రావెన్కో రాజులకు పన్నుల రూపంలో తమ సామ్రాజ్యానికి వచ్చే ఆదాయంలో ఆరింటఒకటవ వంతు వాడుకునే అధికారం వుందికానీ మొదట్నుండి కూడ ట్రావెన్కో రాజులు చాలా సింపుల్ గా వుండేవారు.

PC: youtube

అనంత పద్మనాభ స్వామి తలుపుల కిటుకు తెలిసింది ఈ ఒక్కడికే...

అనంత పద్మనాభ స్వామి తలుపుల కిటుకు తెలిసింది ఈ ఒక్కడికే...

వాళ్ళు ఆ సొమ్ము వాడకుండా దాన్నికూడా దేవస్థాన ఆదాయంలోనే వేసేవారట. ఇక ట్రావెన్కో రాజుల అతి ముఖ్య ఆదాయం పెప్పర్ (మిరియాల) ద్వారా వచ్చేది. అవును నిజం.ఆ రోజుల్లో విదేశాలలో పెప్పర్ కు విపరీతమైన డిమాండ్ వుండేది.దాంతో పెప్పర్ కు బదులుగా అంతే మొత్తంలో బంగారాన్ని స్వీకరించేవారట.

PC: youtube

అనంత పద్మనాభ స్వామి తలుపుల కిటుకు తెలిసింది ఈ ఒక్కడికే...

అనంత పద్మనాభ స్వామి తలుపుల కిటుకు తెలిసింది ఈ ఒక్కడికే...

అలా రాజకుటుంబీకుల కోశాగారంలో కుప్పలుతెప్పలుగా బంగారం పోగైంది.అయితే అదే సమయంలో టిప్పుసుల్తాన్ దేవాలయాలపై దండయాత్రలు చేస్తూ విచ్చలవిడిగా సంపదను దోచుకుని శ్రీరంగ పట్టణానికి తరలించేవాడు.అలా శ్రీరంగ పట్టణం కోశాగారంలో ఇప్పుడున్న అనంతసంపాదకు ఎన్నో రెట్లు బంగారం వుండేదట.

PC: youtube

అనంత పద్మనాభ స్వామి తలుపుల కిటుకు తెలిసింది ఈ ఒక్కడికే...

అనంత పద్మనాభ స్వామి తలుపుల కిటుకు తెలిసింది ఈ ఒక్కడికే...

టిప్పుసుల్తాన్ తో ప్రమాదం పొంచివుందని భావించిన ఇరుగుపొరుగురాజ్యాల రాజులు అనంత సంపదను పద్మనాభస్వామి నేలమాళిగలలో దాచారు. ట్రావెన్కో రాజులు సైతం తమ సమస్త సిరిసంపదలను
ఆ నేలమాళిగలలోకి తరలించారు.దాంతో అప్పటికే నేలమాళిగల్లో కుప్పలుతెప్పలుగా పడి వున్న సంపదకాస్త అంతకు పదింతలు పెరిగి అనంతసంపదగా మారింది.

PC: youtube

అనంత పద్మనాభ స్వామి తలుపుల కిటుకు తెలిసింది ఈ ఒక్కడికే...

అనంత పద్మనాభ స్వామి తలుపుల కిటుకు తెలిసింది ఈ ఒక్కడికే...

అయితే టిప్పుసుల్తాన్ సామ్రాజ్యంపై 1599లో ఈస్టిండియా దళాలు, హైదరాబాద్ నుండి నిజాం సైనికులు, మహారాష్ట్ర నుండి మరాటాదళాలు మూకుమ్మడిగా దాడి చేసి యుద్ధభూమిలో టిప్పూను చంపేసారు.దాంతో అనంత పద్మనాభస్వామి అనంత సంపదకు పొంచివున్న ప్రమాదం పటాపంచలైంది.

PC: youtube

అనంత పద్మనాభ స్వామి తలుపుల కిటుకు తెలిసింది ఈ ఒక్కడికే...

అనంత పద్మనాభ స్వామి తలుపుల కిటుకు తెలిసింది ఈ ఒక్కడికే...

అయితే ఇదంతా ఆ పద్మనాభ స్వామి లీలే అని నమ్మి నేలమాళిగలో దాచి వుంచిన సంపదను తిరిగి తీసుకోలేదు.అలా ఆ సంపద అలానే వుండిపోయింది.అయితే దురదృష్టవశాత్తు కొన్ని వేల దేవాలయాలనుండి టిప్పుసుల్తాన్ దోచుకున్న అంతులేని సంపదను ఈస్ట్ ఇండియాకంపెనీ షిప్స్ లో యూరప్ కు తరలించింది.

PC: youtube

అనంత పద్మనాభ స్వామి తలుపుల కిటుకు తెలిసింది ఈ ఒక్కడికే...

అనంత పద్మనాభ స్వామి తలుపుల కిటుకు తెలిసింది ఈ ఒక్కడికే...

2011లో పద్మనాభస్వామి నేలమాళిగలో దొరికిన సుమారు లక్షలకోట్లవిలువ చేసే అనంతసంపదను చూసి యావత్ ప్రపంచం ఉలిక్కిపడింది.మరి అంతకువంద రెట్లు శ్రీరంగపట్నంలో వేల దేవాలయాలనుండి దోచుకున్న సంపదే గనుక ఇప్పటికే మన దగ్గర వుండివున్నట్లయితే ఇండియా ప్రపంచంలోనే అగ్రస్థానంలో వుండేది.అలా అంచెలంచలుగా అనంతసంపద అనంత పద్మనాభస్వామి దేవాలయంలో పోగైంది.

PC: youtube

తిరువనంతపురం ఎలా చేరుకోవాలి ?

తిరువనంతపురం ఎలా చేరుకోవాలి ?

వాయు మార్గం

తిరువనంతపురం నగరానికి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నది. ఈ విమానాశ్రయం దేశంలోని అన్ని ప్రధాన నగరాలతో అనుసంధానించబడింది. క్యాబ్ లేదా సిటీ బస్సుల్లో ప్రయాణించి నగరం లోకి ప్రవేశించవచ్చు.

తిరువనంతపురం ఎలా చేరుకోవాలి ?

తిరువనంతపురం ఎలా చేరుకోవాలి ?

రైలు మార్గం

తిరువనంతపురం ప్రధాన రైల్వే జంక్షన్ గా ఉన్నది. ఇక్కడి నుండి దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు ప్రయాణించవచ్చు. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, ముంబై, కలకత్తా, ఢిల్లీ వంటి నగరాలకు నిత్యం రైళ్లు అందుబాటులో ఉంటాయి.

తిరువనంతపురం ఎలా చేరుకోవాలి ?

తిరువనంతపురం ఎలా చేరుకోవాలి ?

రోడ్డు మార్గం

తిరువనంతపురం నుండి సమీప నగరాలకు, పట్టణాలకు ప్రభుత్వ, ప్రవేట్ బస్సులు లభిస్తాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X