Search
  • Follow NativePlanet
Share
» »దేవుడినే పరుగులెత్తించిన పందులు... బయటపడ్డ రహస్యం...

దేవుడినే పరుగులెత్తించిన పందులు... బయటపడ్డ రహస్యం...

ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలోని తూర్పు కనుమల కొండ దిగువ ప్రాంతంలో ఉన్న తిరుపతి భారతదేశంలోని సాంస్కృతికంగా అత్యంత వైభవంగా వుండే నగరాల్లో ఒకటి.

By Venkatakarunasri

ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలోని తూర్పు కనుమల కొండ దిగువ ప్రాంతంలో ఉన్న తిరుపతి భారతదేశంలోని సాంస్కృతికంగా అత్యంత వైభవంగా వుండే నగరాల్లో ఒకటి. సుప్రసిద్ధ తిరుపతి దేవాలయం సమీపంలో వుండడం వల్ల ఇది భక్తులకు, పర్యాటకులకు ఇష్టమైన నగరం అయింది. తిరుపతి అనే పదానికి మూలం ఏమిటో స్పష్టంగా తెలియకపోయినా 'తిరు', 'పతి' అనే రెండు పదాల కలయికతో ఈ పేరు ఏర్పడిందంటారు. తమిళంలో 'తిరు' అంటే గౌరవప్రదమైన అనీ, 'పతి' అంటే భర్త అనీ అర్ధం. కాబట్టి ఆ పదానికి అర్ధం 'గౌరవనీయుడైన పతి' అని అర్ధం. నగరానికి చాలా దగ్గరలో వున్న తిరుమల కొండలు ప్రపంచంలోనే రెండో అత్యంత ప్రాచీనమైన కొండలని చెప్తారు. తిరుపతి దేవాలయాన్ని ఎవరు నిర్మించారనే దానికి బలమైన సాక్ష్యాలు లేనప్పటికీ క్రీ.శ. 4వ శతాబ్దం నుంచి వివిధ రాజవంశీకులు దీన్ని నిర్వహి౦చి, పునర్నిర్మించారు. 14, 15 శతాబ్దాలలో ఈ దేవాలయం ముస్లింల దండయాత్రను విజయవంతంగా ప్రతిఘటించింది.

దేవుడినే పరుగులెత్తించిన పందులు... బయటపడ్డ రహస్యం...

దేవుడినే పరుగులెత్తించిన పందులు... బయటపడ్డ రహస్యం...

అలాగే బ్రిటిష్ దాడుల నుంచి కూడా తన్ను తాను కాపాడుకుని ఈ కట్టడం ప్రపంచంలోనే సంరక్షి౦చదగ్గ అతి ప్రాచీన కట్టడంగా నిలిచి వుంది. 1933లో మద్రాస్ ప్రభుత్వం నియమించిన కమిషనర్ ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం కమిటీ ఏర్పడి పరిపాలనా వ్యవహారాలూ చూసుకునేలా మద్రాస్ శాసనసభశాసనసభ ఒక చట్టం చేసింది.

PC:youtube

దేవుడినే పరుగులెత్తించిన పందులు... బయటపడ్డ రహస్యం...

దేవుడినే పరుగులెత్తించిన పందులు... బయటపడ్డ రహస్యం...

దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవహారాలూ నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పడింది. ధార్మిక విషయాల్లో ధార్మిక సలహా మండలి తిరుమల తిరుపతి దేవస్థానానికి సలహాలు ఇచ్చేది. తిరుపతి నగరం ఇప్పటి కే టి రోడ్ లో కొత్తూరు లో వుండేది. తరువాత అది గోవిందరాజస్వామి దేవలాయం దగ్గరికి మారింది. ఇప్పుడు నగరం చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరించింది.

PC:youtube

దేవుడినే పరుగులెత్తించిన పందులు... బయటపడ్డ రహస్యం...

దేవుడినే పరుగులెత్తించిన పందులు... బయటపడ్డ రహస్యం...

తిరుపతి కి దగ్గరగా ఉన్న తిరుమల కొండ ప్రదేశం. ఇక్కడ ప్రసిద్ధ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. ఈ కొండలు సముద్ర మట్టంపై 3200 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో, ఏడు శిఖరాలను కలిగి ఉంటుంది. నారాయణాద్రి, నీలాద్రి, శేషాద్రి, అంజనాద్రి, గరుడాద్రి, వృషభాద్రి, వేంకటాద్రి అని పిలువబడే ఏడూ శిఖరాలూ ఆదిశేషుడికి ప్రాతినిధ్యం వహిస్తాయి.

PC:youtube

దేవుడినే పరుగులెత్తించిన పందులు... బయటపడ్డ రహస్యం...

దేవుడినే పరుగులెత్తించిన పందులు... బయటపడ్డ రహస్యం...

శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం వేంకటాద్రి అని పిలువబడే ఏడవ శిఖరంపై ఉంది. తిరుమల అనే పదం ‘తిరు' (పవిత్ర), ‘మల' (రద్దీ లేదా పర్వతం) అనే రెండు పదాలను కలిగి ఉంటుంది. అందువల్ల తిరుమల పదం ద్రావిడ భాషలో అక్షరాలా ‘పవిత్ర పర్వతం' అని అనువదించబడింది.

PC:youtube

దేవుడినే పరుగులెత్తించిన పందులు... బయటపడ్డ రహస్యం...

దేవుడినే పరుగులెత్తించిన పందులు... బయటపడ్డ రహస్యం...

ప్రసిద్ధపుణ్య క్షేత్రమైన శ్రీవారి ఆలయంముందు పందులు సంచరించాయి. ఉదయం 7గంల సమయంలో వరహాలమధ్య శ్రీవారి ఆలయంముందుకు వచ్చి తమ ఇష్టానుసారం టిటిడి అధికారులు గమనించకపోవటం భక్తులు విస్తుపోయేలా చేసింది.

PC:youtube

దేవుడినే పరుగులెత్తించిన పందులు... బయటపడ్డ రహస్యం...

దేవుడినే పరుగులెత్తించిన పందులు... బయటపడ్డ రహస్యం...

7పందుల మంద ఒకటి బేడీఆంజనేయస్వామి దేవాలయం నుంచి మెట్లుదిగి కిందకువచ్చి ఆయనవరకూ వెళ్లి అక్కడనుంచి దక్షిణమాడవీధుల్లోకి పరుగులుపెట్టాయి. అత్యంతపవిత్రంగా భావించే తిరుమాడవీధుల్లో ఇవి తిరగటం భక్తులందరినీవిస్మయానికి గురిచేస్తోంది.

PC:youtube

దేవుడినే పరుగులెత్తించిన పందులు... బయటపడ్డ రహస్యం...

దేవుడినే పరుగులెత్తించిన పందులు... బయటపడ్డ రహస్యం...

సాధారణంగా భక్తులను ఇక్కడ చెప్పులతో తిరగనివ్వరు. అలాంటి చోట్ల పందులు తిరగటంపై అందరూ ఆశ్చర్యానికి గురౌతున్నారు.టిటిడినిఘా విభాగం ఏం చేస్తుందని ప్రశ్నిస్తున్నారు. బేడిఆంజనేయస్వామిఆలయం ముందు నుంచి దక్షిణమాడవీధుల్లోకి వచ్చినట్లుచెబుతున్నారు.భక్తులు. తిరుమలలో పందులను నియంత్రించాలని గతంలో పిర్యాధుచేసినా ఫలితంలేకపోవటం గమనార్హం.

PC:youtube

దేవుడినే పరుగులెత్తించిన పందులు... బయటపడ్డ రహస్యం...

దేవుడినే పరుగులెత్తించిన పందులు... బయటపడ్డ రహస్యం...

ఎలా చేరాలి?

రోడ్డు ద్వారా

తిరుపతి రాష్ట్రంలో అతిపెద్ద బస్సు టర్మినల్స్ కలిగి ఉంది. అన్ని ప్రధాన పట్టణాలూ, నగరాలూ లేదా దక్షిణ భారతదేశం నుండి నేరుగా బస్సులు ఉన్నాయి. అలిపిరి బస్ స్టాప్ నుండి తిరుపతికి ప్రతి రెండు నిమిషాలకు బస్సులు నడుస్తాయి. ఈ నగరం అంతర్గతరవాణా వ్యవస్థ బాగా అభివృద్ది చెందడం వల్ల ప్రయాణం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.

దేవుడినే పరుగులెత్తించిన పందులు... బయటపడ్డ రహస్యం...

దేవుడినే పరుగులెత్తించిన పందులు... బయటపడ్డ రహస్యం...

రైలు మార్గం ద్వారా

దేశవ్యాప్తంగా నడుపుతున్న రైళ్లకు తిరుపతి ఒక ప్రధాన రైల్వే స్టేషన్. తిరుపతి నుండి రేణిగుంట జంక్షన్ కి ప్రయాణం 10 నిమిషాల దూరంలో ఉంది. తిరుపతి నుండి 84 కిలోమీటర్ల దూరంలో ఉన్న గూడూర్ జంక్షన్ కూడా యాత్రీకుల అవసరాలు తీరుస్తుంది.

దేవుడినే పరుగులెత్తించిన పందులు... బయటపడ్డ రహస్యం...

దేవుడినే పరుగులెత్తించిన పందులు... బయటపడ్డ రహస్యం...

వాయు మార్గం ద్వారా

తిరుపతి విమానాశ్రయం అంతర్జాతీయ విమానాశ్రయంగా ప్రకటించబడింది, కానీ ఇప్పటికీ అంతర్జాతీయ విమానాలు నడవడం లేదు. ప్రస్తుతం హైదరాబాద్, ఢిల్లీ, వైజాగ్, కోయంబత్తూర్, కోలకతా, ముంబైకి విమానాలు ఉన్నాయి. ఈ విమానాశ్రయం నగరానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. చెన్నై దీనికి సమీప విమానాశ్రయం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X