Search
  • Follow NativePlanet
Share
» »అభయారణ్యంలో ... వేంకటేశ్వరుని దర్శనం !!

అభయారణ్యంలో ... వేంకటేశ్వరుని దర్శనం !!

తిరుపతి ఆంధ్ర ప్రదేశ్ లోని చిత్తూర్ జిల్లాలో కలదు. ఇక్కడ ఏడు కొండలపై కల శ్రీ వెంకటేశ్వర దేవాలయం ప్రపంచ ప్రసిద్ధి.

తిరు అంటే పవిత్ర అని మల అంటే కొండ అని అర్ధం. అందుకనే దీనిని స్వామీ నెలకొన్న ఈ ప్రదేశాన్ని తిరుమల అంటారు. ఈ ఏడు కొండలు శ్రీ మహా విష్ణువు శయనించే ఆది శేషుడి ఏడు పడగలుగా భావిస్తారు.

వేసవి సెలవులు, ప్రత్యేకించి విద్యార్ధులు పరీక్షలు పాస్ అయిన రోజులలో పవిత్ర తిరుపతి లక్షలాది భక్తుల సందడి తో పరవళ్ళు తొక్కే ఒక నదీ ప్రవాహంగా వుండి కన్నులకు విందు చేస్తుంది. మరి ఈ వేసవిలోనే శ్రీనివాసుడి దర్శనానికి బయలు దేరండి, మీ కోర్కెలు తీర్చుకోండి.

గోవిందా...గోవింద...అంటే చాలు పలికే దేవుడు!

గోవిందా...గోవింద...అంటే చాలు పలికే దేవుడు!

ఎలా చేరాలి ?

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు ఈ పట్టణం 551 కి. మీ. లు. చెన్నై నగరానికి 248 కి. మీ. ల దూరంలో కలదు. ఇండియా లోని ప్రధాన నగరాల నుండి విమాన సర్వీస్ లు మరియు ట్రైన్ సర్వీస్ కలవు. చెన్నై , బెంగుళూరు, హైదరాబాద్ ల నుండి తరచుగా ప్రభుత్వ, ప్రైవేటు వాహనాలు నడుస్తాయి.

Photo Courtesy: Ashok Prabhakaran

గోవిందా...గోవింద...అంటే చాలు పలికే దేవుడు!

గోవిందా...గోవింద...అంటే చాలు పలికే దేవుడు!

తిరుమల వెంకటేశ్వర ఆలయం

ఈ దేవాలయాన్ని ఏడు కొండల గుడి అని కూడా అంటారు. దీనిలో దైవం విష్ణుమూర్తి కలియుగ అవతారమైన శ్రీ వెంకటేశ్వర స్వామీ. తిరువనంత పురం లోని పద్మనాభ స్వామీ ఆలయం తరవాత ఇది అత్యంత ధనిక ఆలయంగా చెపుతారు. ప్రతి రోజూ సుమారు ఒక లక్ష మంది భక్తులకు పైగా ఈ దేవాలయ సందర్శన చేస్తారు. తిరుపతి ఆకర్షణలకు ఇక్కడ చూడండి. Photo Courtesy: Adityamadhav83

తిరుపతి హోటల్ వసతులు

గోవిందా...గోవింద...అంటే చాలు పలికే దేవుడు!

గోవిందా...గోవింద...అంటే చాలు పలికే దేవుడు!

ఎంట్రీ టికెట్ లు

దేవాలయ దర్షణకు ఎంట్రీ టికెట్ లు కలవు. వీటిలో ఉచితం లేదా సర్వ దర్శనం, ఆర్డినరీ మరియు శ్రీఘ్ర దర్శనం టికెట్ లు కూడా కలవు. పసి పిల్లల తల్లులకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు కలవు. ఈ ఎంట్రీ టికెట్ లను ఆన్ లైన్ లో కూడా బుక్ చేసికొనవచ్చు.

Photo Courtesy: Satish Krishnamurthy

గోవిందా...గోవింద...అంటే చాలు పలికే దేవుడు!

గోవిందా...గోవింద...అంటే చాలు పలికే దేవుడు!

ఆలయ దేవుడు

ఆలయంలో ప్రధాన దైవం విష్ణుమూర్తి అవతారమైన శ్రీ వెంకటేశ్వర స్వామీ. ఇక్కడ కల మూల విరాట్ ఈ దేవాలయ దివ్యత్వానికి ప్రధాన కారణం. ఈ స్వామికి ప్రతి రోజూ వివిధ సేవలు, అలంకరణలు చేసి భక్తులు ఆనందిస్తారు. ప్రతి రోజూ కళ్యాణాలు కూడా చేస్తారు.

Photo Courtesy: Vimalkalyan

గోవిందా...గోవింద...అంటే చాలు పలికే దేవుడు!

గోవిందా...గోవింద...అంటే చాలు పలికే దేవుడు!

గుండు చేయించుట

సాధారణంగా ఇక్కడ కు వచ్చిన భక్తులలో చాలామంది తమ తల వెంట్రుకలను స్వామికి సమర్పించి ఆయన ఆశీస్సులు పొందుతారు. స్వామీ ప్రసాదంగా ఇవ్వబడే లడ్డూలు 'తిరుపతి లడ్డు ' అనే పేరుతో ఎంతో ప్రసిద్ధి. ఉచిత వసతులు, ఉచిత ప్రసాదాలు, నిత్యా అన్నదానం వంటి కార్యక్రమాలు ఈ అత్యధిక సంఖ్యా లో వచ్చే భక్తులకు నిర్విఘ్నంగా ఎంతో క్రమశిక్షణతో జరుగుతూ వుంటాయి.

Photo Courtesy: Jamdirt631

గోవిందా...గోవింద...అంటే చాలు పలికే దేవుడు!

గోవిందా...గోవింద...అంటే చాలు పలికే దేవుడు!

ఏడు కొండల మహత్యం

ఇక్కడ కల ఏడు కొండలను సప్తగిరి అని అంటారు. వీటి పేర్లు వరుసగా వృషభాద్రి, అంజనాద్రి, నీలాద్రి, గరుడాద్రి, శేషాద్రి, నారాయణాద్రి మరియు చివరిడిగా స్వామీ నివాసంగా వెంకటాద్రి లు గా కలవు.

Photo Courtesy: Satyam555

గోవిందా...గోవింద...అంటే చాలు పలికే దేవుడు!

గోవిందా...గోవింద...అంటే చాలు పలికే దేవుడు!

నిబంధనలు

తిరుపతి సందర్శనలో...తగిన దుస్తులు ధరించాలి. ఆల్కహాల్, మాంశం, చేప, గుడ్డు మొదలైన మామ్సాహారాలు భుజించారాడు. స్త్రీలు పూవులు ధరించరాదు. ఇక్కడి పూవులు అన్నీ స్వామీ కే చెందుతాయి. ఉమ్మి, చెత్త వంటివి వేయరాదు. మొబైల్ ఫోన్, కేమెర పేజేర్ లేదా వీడియో కెమెరా వంటి వస్తువులను టెంపుల్ ఆవరణలోకి అనుమతించరు.మహిళలు సాంప్రదాయక చీరలు ధరించాలి.

Photo Courtesy: Claude Renault

గోవిందా...గోవింద...అంటే చాలు పలికే దేవుడు!

గోవిందా...గోవింద...అంటే చాలు పలికే దేవుడు!

సమీప దేవాలయాలు

సమీపంలో చూడదగిన దేవాలయాలు అనేకం కలవు. శ్రీ కాళహస్తి దేవాలయం, శ్రీనివాస మంగాపురం, శ్రీ గోవిందరాజ టెంపుల్, శ్రీ కపిలేశ్వర స్వామీ దేవాలయం మొదలైనవి కలవు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X