Search
  • Follow NativePlanet
Share
» »టాలీవూడ్ ప్రస్తుత హీరోలు - జన్మస్థానాలు !!

టాలీవూడ్ ప్రస్తుత హీరోలు - జన్మస్థానాలు !!

సమకాలీన సమాజంలో సినిమా ఒక అత్యంత ప్రాముఖ్యత గల అంశంగా అభివృద్ధి చెందింది. ప్రపంచంలో అత్యధిక సంఖ్య సినిమాలు భారత దేశంలో తయారవుతున్నాయి. సినిమా ప్రభావం భారతీయులపైన, ప్రత్యేకించి తెలుగువారిపైన బాగా ఎక్కువ. సినిమా తెలుగు వారి సంస్కృతిలో, జీవితంలో భాగమైపోయింది. ఏ ఇద్దరు కలుసుకున్నా, ఏ నెట్ గ్రూప్ చూసినా తెలుగు వాళ్ళు సినిమాల గురించి మాట్లాడకుండా ఉండలేరు. తెలుగు వారికి ఇతర సైటుల కంటే సినిమా సైటులే ఎక్కువగా ఉన్నాయి. భారతీయ సినిమాలో సంఖ్యాపరంగా అత్యధికంగానూ, వాణిజ్య పరంగా రెండవ స్థానంలోనూ తెలుగు సినిమా వర్ధిల్లుతోంది. ప్రతీ ఏటా దాదాపు 100 నుండి 150 వరకు తెలుగు చిత్రాలు టాలీవుడ్ ద్వారా విడుదలవుతున్నాయి. భారతదేశంలోనే అత్యధిక చిత్రాలని నిర్మించే పరిశ్రమలలో తెలుగు కూడా ఒకటి.

మెక్మైట్రిప్ కూపన్లు : డొమెస్టిక్ హోటళ్ళ బుకింగ్ ల మీద రూ. 4000 అద్భుతమైన క్యాష్ బ్యాక్ ఆఫర్ త్వరపడండి *

ఇంతటి ఘనకీర్తి గల తెలుగు సినిమా పరిశ్రమలో ఎందరో నటీనటులు ఉన్నారు. వారిలో పాతతరం నటీనటులు, కొత్తతరం నటీనటులు ఉన్నారు. వీరందరు తమ నటనలతో ప్రేక్షకులను రంజింపజేస్తున్నారు. ఇదివరకే కొంతమంది నటుల, నటీమణుల జన్మస్థానాల గురించి తెలుసుకున్నాం. మరి ఇప్పుడు యంగ్ జనరేషన్ లో ఉన్న నటుల వారందరి గురించి కాకపోయినా కొంతమంది గురించి వారు ఎక్కడ పుట్టారో, ఎలా వచ్చారో తెలుసుకుందాం !!

టాలీవూడ్ హీరోల జన్మస్థానాలు పార్ట్ - 1 కొరకు ఇక్కడ క్లిక్ చేయండిటాలీవూడ్ హీరోల జన్మస్థానాలు పార్ట్ - 1 కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

మహేశ్ బాబు

మహేశ్ బాబు

నటుడి పేరు: ఘట్టమనేని మహేశ్ బాబు
తల్లితండ్రులు : ఘట్టమనేని కృష్ణ , ఇందిరాదేవి
భార్య : నమ్రతా శిరోద్కర్ని
పిల్లలు : గౌతమ్ కృష్ణ, సితార

ఘట్టమనేని మహేశ్ బాబు తెలుగు సినీ నటుడు మరియు ప్రఖ్యాత తెలుగు సినీనటుడు ఘట్టమనేని కృష్ణ మరియు ఇందిరాదేవిలకు కుమారుడు. ఈయన ఆగష్టు 9, 1975 లో చెన్నై నగరంలో జన్మించాడు. మహేష్ బాబు తన నాలుగవ ఏట ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణ రావు తీసిన నీడ చిత్రం ద్వారా తెలుగు వెండితెరకు పరిచయం అయాడు. హీరోగా నటించిన తొలిచిత్రం రాజ కుమారుడు(1999) . ఒక్కడు(2003) చిత్రం మంచి బ్రేక్ ఇచ్చింది.

Photo Courtesy: cinemababu dotcom / Thangaraj Kumaravel

ప్రభాస్

ప్రభాస్

నటుడి పేరు: ఉప్పలపాటి ప్రభాస్ రాజు
తల్లితండ్రులు : సూర్యనారాయణరాజు, శివ కుమారి

ప్రభాస్ ఉప్పలపాటి సూర్యనారాయణరాజు మరియు శివ కుమారి దంపతులకు అక్టోబర్ 23, 1979 తేదీన చెన్నైలో జన్మించాడు. ఇతను ప్రముఖ నటుడు కృష్ణంరాజు సోదరుని కుమారుడు. 2001లో ఈశ్వర్ సినిమాతో ప్రభాస్ తెరంగేట్రం చేసాడు.2004లో త్రిష సరసన నటించిన వర్షం సినిమా ప్రభాస్ కు మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించింది. ప్రస్తుతం ప్రభాస్ ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో అనుష్క, రానా దగ్గుబాటి లతొ కలసి బాహుబలి సినిమాలో నటిస్తున్నాడు. ఇతను తెలుగు సినీ నటులలో ఒకడైన పొడుగువానిగా చెప్పుకోవచ్చు. ప్రముఖ నటులు గొపిచంద్, అల్లు అర్జున్, రానా దగ్గుబాటి, మంచు మనోజ్ కుమార్ ప్రభాస్ కు మంచి స్నేహితులు.

Photo Courtesy: cine ssiren / PlaneMad

జూనియర్ ఎన్టీయార్

జూనియర్ ఎన్టీయార్

నటుడి పేరు: జూనియర్ నందమూరి తారక రామారావు
తల్లితండ్రులు : నందమూరి హరికృష్ణ , షాలిని
భార్య : లక్ష్మి ప్రణతి
పిల్లలు : అభయ్ రామ్

జూనియర్ నందమూరి తారక రామారావు 20 మే 1983 వ సంవత్సరంలో ప్రముఖ సినీనటుడు, రాజకీయ నాయకుడు హరికృష్ణ మరియు షాలిని దంపతులకు హైదరాబాద్ లో జన్మించినాడు. ఈయన ప్రపంచ విఖ్యాత తెలుగు నటుడు, స్వర్గీయ మాజీ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు మనవడు. 1996 వ సంవత్సరంలో విడుదలైన రామాయణం చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా రంగప్రవేశం చేసినాడు. ఈ చిత్రం పిల్లల చిత్రానికి గాను జాతీయ అవార్డ్ కైవసం చేసుకుంది. ఈయన నటుడిగా తొలిసారి కనిపించిన సినిమా స్టూడెంట్ నం.1.

Photo Courtesy: Andhra News / Rajesh_India

అల్లు అర్జున్

అల్లు అర్జున్

నటుడి పేరు: అల్లు అర్జున్
తల్లితండ్రులు : అల్లు అరవింద్ , నిర్మల
భార్య : స్నేహారెడ్డి
పిల్లలు : అయాన్

అల్లు అర్జున్ ఒక దక్షిణాది నటుడు. ఇతడు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుమారుడు మరియు ప్రముఖ హాస్య నటుడు పద్మశ్రీ అల్లు రామలింగయ్య మనవడు. మరియు చిరంజీవి మేనల్లుడు. అల్లు అర్జున్ ఏప్రిల్ 8, 1983 వ సంవత్సరంలో చెన్నై మహానగరంలో జన్మించినాడు. చిరంజీవి నటించిన డాడీ సినిమాలో కొద్దిగా కనిపించినప్పటికీ అల్లు అర్జున్ మొదటి చిత్రం కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన గంగోత్రి అని చెప్పాలి. అల్లు అర్జున్ చిత్రాలన్నీ మలయాళం లోకి అనువదించబడ్డాయి. కేరళలో మమ్ముట్టి, మోహన్ లాల్ తర్వాత అల్లు అర్జున్ కే ఎక్కువ అభిమానులు ఉన్నారు. అల్లు అర్జున్ కేరళ లో మల్లు అర్జున్ అని పిలుస్తారు.

Photo Courtesy: TheTimes ofcity / Joel Suganth

రామ్ చరణ్

రామ్ చరణ్

నటుడి పేరు: కొణిదల రామ్ చరణ్ తేజ
తల్లితండ్రులు : మెగా స్టార్ చిరంజీవి, సురేఖ

మెగాస్టార్, పవర్ స్టార్ తరవాత మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన రామ్ చరణ్ మద్రాసులో 27 మార్చి 1985 వ సంవత్సరంలో మద్రాస్ లో జన్మించినాడు. 2007 లో పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన 'చిరుత' సినిమాతో తెలుగు చలన చిత్ర పరిశ్రమ లోకి అట్టహాసంగా అడుగుపెట్టాడు. 2009 లో తన మేనమామ అల్లు అరవింద్ నిర్మాతగా టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'మగధీర' తో స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. ఆరంజ్, ఎవడు, రచ్చ వంటి నటించినాడు.

Photo Courtesy: tollywood / Vinoth Chandar

రానా

రానా

నటుడి పేరు: దగ్గుబాటి రామానాయుడు
తల్లితండ్రులు : దగ్గుబాటి సురేష్ బాబు, లక్ష్మి

దగ్గుబాటి రామానాయుడు అలియాస్ దగ్గుబాటి రానా ఒక ప్రముఖ భారతీయ బహుభాషా నటుడు. ఇతను ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు మనవడు. డిసెంబర్ 14 ,1983 వ సంవత్సరంలో చెన్నై మహానగరంలో దగ్గుబాటి సురేష్ బాబు, లక్ష్మి దంపతులకు జన్మించినాడు. సినీ నటుడు వెంకటేష్ స్వయాన బాబాయ్ అవుతాడు. ఇతను తెలుగులో మొదటగా నటించిన చిత్రం లీడర్ (2010). కృష్ణం వందే జగద్గురుం (2012) చిత్రానికి గాను విమర్శకుల ప్రశాంశాలు అందుకున్నాడు.

Photo Courtesy: tollywood / Senthilvel T

నాగ చైతన్య

నాగ చైతన్య

నటుడి పేరు: అక్కినేని నాగ చైతన్య
తల్లితండ్రులు : అక్కినేని నాగార్జున,లక్ష్మి

నాగ చైతన్య నవంబర్ 23, 1986 వ సంవత్సరంలో హైదరాబాద్ లో ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున, లక్ష్మి లకు జన్మించినాడు. జోష్ (2009) సినిమా ద్వారా రంగా ప్రవేశం చేసినా, ఏ మాయ చేసావే(2010) గుర్తింపు తెచ్చింది. ఇతను నటించిన చివరి చిత్రం ఒక లైలా కోసం(2014).

Photo Courtesy: Saradaga.com / Ranju Islam

కళ్యాణ్ రామ్

కళ్యాణ్ రామ్

నటుడి పేరు: నందమూరు కళ్యాణ్ రామ్
తల్లితండ్రులు : నందమూరి హరికృష్ణ, లక్ష్మికుమారి
భార్యపేరు: శ్రీమతి స్వాతి
కుమారుడు: సౌర్య రామ్

శ్రీ నందమూరి తారక రామారావు కుటుంబం నుండి బాలకృష్ణ , జూనియర్ యన్.టి.ఆర్, తరవాత నటుడిగా వచ్చిన హరికృష్ణ తనయుడు కళ్యాణ్ రామ్ 5 జూలై 1980 వ సంవత్సరంలో చెన్నై లో పుట్టి అక్కడే చదువుకున్నాడు. 1989 లో బాలకృష్ణ హీరోగా చేసిన 'బాలగోపాలుడు' లో బాల్య నటుడిగా నటించి నటనలో తోలి అడుగులు వేసాడు. 2003 లో ఉషాకిరణ్ మూవీస్ నిర్మించిన 'తోలి చుపూలోనే' చిత్రం ద్వార హీరోగా పరిచయం అయ్యాడు. నిర్మాతగా మారి తాతగారి పేరు పై యన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్ స్థాపించి సురేందర్ రెడ్డి ని దర్శకుడిగా పరిచయం చేస్తూ 'అతనొక్కడే' సినిమా తీసి హీరో గా హిట్టు కొట్టాడు.

Photo Courtesy: tollywood / Vinoth Chandar

అల్లరి నరేష్

అల్లరి నరేష్

అల్లరి నరేష్ 30 జూన్ 1982 వ సంవత్సరంలో కామెడీ చిత్రాల దర్శకుడు ఇ.వి.వి. సత్యనారాయణ ఇంట చెన్నై లో జన్మించినాడు. 2002 లో రవి బాబు దర్శకత్వంలో వచ్చిన 'అల్లరి' సినిమాతో హీరోగా పరిచయం అయిన నరేష్ ఎత్తుగా గడకర్రలాగా, నవ్వుతెప్పించే ముఖంతో, కొంటె డైలాగులతో, హాస్యాన్ని పండించటానికి అవసరమైన టైమింగ్ తో తెలుగు సినీపరిశ్రమలో రాజేంద్రప్రసాద్ తరవాత పూర్తి స్థాయి హాస్య కథానాయకుడిగా కొనసాగుతున్నాడు. ముఖ్యంగా 'గమ్యం' సినిమాలో 'గాలి శీను' పాత్రతో ప్రేక్షకులను కట్టిపడేసి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు.

Photo Courtesy: tollywood / Sajeesh Kumar

 గోపీచంద్

గోపీచంద్

గోపీచంద్ ప్రముఖ తెలుగు నటుడు మరియు సుప్రసిద్ద తెలుగు చలన చిత్ర దర్శకుడు టి. కృష్ణ కుమారుడు. ఇతను జూన్ 12, 1975 వ సంవత్సరంలో హైదరాబాద్ జన్మించినాడు. ఇతను తొలి వలపు చిత్రము తో తన నట ప్రస్థానమును ప్రారంభించి తరువాత జయం, వర్షం వంటి విజయవంతమైన చిత్రాలలో ప్రతినాయక పాత్రలను పోషించాడు. ఇతని బాల్యమంతా ఒంగోలు మరియు హైదరాబాదు లలో గడిచింది. ఇతను రష్యా లో వైద్య విద్యను అభ్యసించాడు.ఇతని భార్య పేరు రేష్మా.

Photo Courtesy: Just Tollywood / Ratnakar Naidu Y

తరుణ్

తరుణ్

నటుడి పేరు: భట్టి తరుణ్ కుమార్
తల్లితండ్రులు : చక్రపాణి, రోజారమణి (ప్రముఖ సినీనటి)

తరుణ్ 1983 జనవరి 8 న హైదరాబాద్ లో భట్టి చక్రపాణి, రోజారమణి దంపతులకు జన్మించినాడు.ఇతడు మాస్టర్ తరుణ్ పేరు మీద బాలనటుడిగా చాలా సినిమాలలో నటించాడు. ఇతను బాల నటుడుగా నటించిన మొదటి సినిమా అంజలి(1990). అంజలి సినిమాలో తన నటనకు జాతీయ స్థాయిలో ఉత్తమ బాల నటుడిగా అవార్డు అందుకున్నాడు. హీరోగా మొదటి సినిమా అంకుల్ (2000). చివరి చిత్రం చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి (2011). బ్రేక్ తీసుకొచ్చిన సినిమా నువ్వేకావాలి( 2000), నువ్వే నువ్వే (2002).

Photo Courtesy: tollywood / vinod

నానీ

నానీ

నటుడి పేరు: నవీన్ బాబు ఘంటా
తల్లితండ్రులు : రాంబాబు, విజయలక్ష్మి
భార్య : యలవర్తి ఆంజనా

ఘంటా నవీన్‍బాబు ఫిబ్రవరి 24, 1981 వ సంవత్సరంలో చల్లపల్లి (హైదరాబాద్) లో రాంబాబు, విజయలక్ష్మి దంపతులకు జన్మించినాడు. శ్రీను వైట్ల మరియు బాపు వద్ద సహాయదర్శకుడిగా పని చేసాడు.తరువాత హైదరాబాదు లో కొన్ని రోజులు రేడియో జాకీగా కూడా పని చేసాడు. అష్టా చమ్మా(2008) అనే తెలుగు సినిమాలో మొదటి సారి నటించాడు.

Photo Courtesy: citizen / Venkataramesh Kommoju

నితిన్

నితిన్

నటుడి పేరు: నల్లా నితిన్ రెడ్డి
తండ్రిపేరు: నల్లా సుధాకర్ రెడ్డి

ప్రముఖ సినిమా డిస్ట్రీబ్యూటర్ సుధాకర్ రెడ్డి తనయుడిగా సిని పరిశ్రమలోకి అడుగిడిన నితిన్ నిజామాబాదు లో 30 మార్చ్ 1983 వ సంవత్సరంలో జన్మించాడు. తేజ దర్శకత్వంలో విడుదలైన జయం(2002) సినిమాతో తెరంగేట్రం చేసి దిల్, సై, ఇష్క్, గుండె జారి గల్లంతయ్యిందే వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించాడు.

Photo Courtesy: tollywood / La Priz

రామ్

రామ్

నటుడి పేరు: పోతినేని సీతారామ్ చౌదరి

సినిమాలు తీయడంలో మంచి అభిరుచి గల నిర్మాతగా పేరున్న స్రవంతి రవికిషోర్ కుటుంబం నుండి వచ్చిన హీరో రామ్ 15 మే 1988 వ సంవత్సరంలో హైదరాబాద్ లో పుట్టాడు. 11 సంవత్సరాల వయసులోనే 'ఐడి' అనే తమిళ షార్ట్ ఫిలింలోనటించి, స్విట్జెర్లాండ్ లో జరిగిన యూరోపియన్ ఫిలిం ఫెస్టివల్ లో ఉత్తమ నటుడిగా ఎంపిక అయ్యాడు. వై.వి.యస్ చౌదరి 'దేవదాసు' సినిమాతో తెలుగు వెండి తెరకు రామ్ ను పరిచయం చేసాడు. 17 సంవత్సరాల చిన్న వయసులోనే హీరోగా తెరంగేట్రం చేసిన తోలి దక్షిణ భారత నటుడిగా రికార్డు సృష్టించాడు.

Photo Courtesy: tollywood / Cephas 405

సుమంత్

సుమంత్

నటుడు పేరు :వై.సుమంత్ కుమార్
తల్లితండ్రులు : వై.సురేంద్ర,సత్యవతి

అక్కినేని కుటుంబం నుండి నాగార్జున తరవాత తెలుగు తెరకు పరిచయం అయిన సుమంత్ 19 ఫిబ్రవరి 1975 వ సంవత్సరంలో హైదరాబాద్ లో జన్మించాడు. సుమంత్ 1999 లో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన 'ప్రేమ కధ' చిత్రం తో నటుడిగా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఆ సినిమా విమర్శకుల ప్రశంసలు, అవార్డులు దక్కించుకోవటం తో పాటు మంచి విజయాన్ని నమోదు చేయటంతో సుమంత్ కు నటుడిగా గుర్తింపు లబించింది. 'సత్యం'(2003) ,గోదావరి (2006) సినిమాలు మంచి గుర్తింపునిచ్చాయి.

Photo Courtesy: tollywood / Jamin Gray

రాజా

రాజా

నటుడి పేరు: : రాజా కృష్ణ మూర్తి
తల్లితండ్రులు : స్వర్గీయ శ్రీ కె.యన్.కె. మూర్తి , స్వర్గీయ షీలా కె మూర్తి

నటన మీద ఆసక్తి తో విమానయానంలో ఉద్యోగాన్ని వదులుకుని నటుడిగా స్థిరపడ్డ రాజా వైజాగ్ లో 7 నవంబర్ 1978 వ సంవత్సరంలో పుట్టి పెరిగాడు. 2001 లో 'ఓ చిన్నదానా' సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. 2004 లో శేఖర్ కమ్ముల రూపొందించిన 'ఆనంద్' ఘనవిజయం సాదించటం తో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 2005 లో వచ్చిన 'వెన్నెల' సినిమాతో హీరోగా స్థిరపడ్డాడు. ఇక అక్కడి నుండి హీరోగానే కాకుండా సహాయ నటుడిగా దాదాపు 30 చిత్రాలలో నటించాడు.

Photo Courtesy: tollywood / Pulkit Sinha

నవదీప్

నవదీప్

నటుడి పేరు: నవదీప్ పల్లపోలు
తల్లితండ్రులు : రామారావు, మాధవి

నవదీప్ నల్గొండ జిల్లా , పాలెం గ్రామంలో జనవరి 26, 1985 వ సంవత్సరంలో రామారావు, మాధవి దంపతులకు జన్మించాడు. పలు తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలో నటించాడు. జై (2004) సినిమా ద్వారా చిత్రరంగ ప్రవేశం చేసినాడు.కొన్ని తెలుగు సినిమాలలో సహాయ నటుడిగా కూడా నటించినాడు.

Photo Courtesy: raghu / prasad

నాగ శౌర్య

నాగ శౌర్య

నటుడి పేరు : ముల్పురి
తల్లితండ్రులు : శంకర్ ప్రసాద్ మరియు ఉషా ప్రసాద్

నాగ శౌర్య జనవరి 14, 1989 వ సంవత్సరం ఏలూరులో శంకర్ ప్రసాద్ మరియు ఉషా ప్రసాద్ దంపతులకు జన్మించినాడు. ఇతను మంచి క్రీడాకారుడు. చిత్ర సీమలోకి రాక ముందు ఇతను టెన్నిస్ ఆడేవాడు. 2011 వ సంవత్సరంలో క్రికెట్ గర్ల్స్ అండ్ బీర్ చిత్రంలో కాస్త కనిపించినా, 2014 వ సంవత్సరంలో చందమామ కథలు మొదట రిలీజైనా, ఊహలూగుసగూసలాడే చిత్రం ద్వారా మంచి గుర్తింపు వచ్చింది.

Photo Courtesy: filmibeat / Elias Lopez

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X