Search
  • Follow NativePlanet
Share
» »భారతదేశంలోని 10 దేవాలయాలలోని విభిన్న రకాల ఆచారాలు

భారతదేశంలోని 10 దేవాలయాలలోని విభిన్న రకాల ఆచారాలు

వేల సంవత్సరాల చరిత్ర కలిగిన భారతదేశ దేవాలయాలలో ప్రతి ఒక్క దేవాలయానికి దానికదే ఒక విశిష్టత కలిగి వుంది.

కుక్కల దేవాలయం ఎక్కడుందో తెలుసా?కుక్కల దేవాలయం ఎక్కడుందో తెలుసా?

వేల సంవత్సరాల చరిత్ర కలిగిన భారతదేశ దేవాలయాలలో ప్రతి ఒక్క దేవాలయానికి దానికదే ఒక విశిష్టత కలిగి వుంది. పూర్వకాలంలో ఆలయాలు నిర్మించే సమయంలో ఆ ఆలయానికంటూ ఒక ప్రత్యేకత వుండాలనే ఉద్దేశ్యంతో కొన్ని అద్భుతాలు అక్కడ సృష్టించారు.

వాటిలో కొన్నింటిని ఎలా చేసారో తెలిసినా చాలా అద్భుతాలకు ఇంకా సమాధానం దొరకలేదనే చెప్పాలి. అయితే కొన్ని ఆలయాలు మాత్రం ప్రత్యేకమైన ఆచారాలకు కూడా ప్రసిద్ధి చెందాయి.అలాంటి 10 ఆలయాల గురించి అక్కడ వున్న వింతల గురించి తెలుసుకుందాం.

ప్రస్తుత వ్యాసంలో 10 విభిన్న దేవాలయాల గురించి తెలుసుకుందాం

1. చిదంబరం నటరాజ దేవాలయం

1. చిదంబరం నటరాజ దేవాలయం

సాధారణంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఉత్సవాలు నిర్వహించే సమయంలో అక్కడి ప్రధాన దేవుళ్ళను మాడ వీధుల్లో ఊరేగించటానికి వుత్సవమూర్తులను ఉపయోగిస్తారు.

PC:youtube

2. విశిష్టత

2. విశిష్టత

చిదంబరంలోని నటరాజస్వామి దేవాలయంలో మాత్రం ఉత్సవ విగ్రహాలు వుండవు.ఆ ఆలయంలో వుత్సవవిగ్రహాలకు బదులు మూల విరాట్టునే బైటకు తీసుకువచ్చి మాడవీధులలో ఊరేగిస్తారు.

PC:youtube

3. కుంభకోణం ఐరావతేశ్వర స్వామి

3. కుంభకోణం ఐరావతేశ్వర స్వామి

కుంభకోణం దగ్గర దారాసురం అనే గ్రామంలో ఐరావతేశ్వర స్వామి ఆలయం శిల్పకళా చాతుర్యానికి ప్రసిద్ధి. ఆ ఆలయంలోని రెండు స్తంభాలలో వాలిసుగ్రీవుల యుద్ధం, రాముడు వాలిని చంపే సన్నివేశాలనూ చిత్రించారు.

PC:youtube

4. విశిష్టత

4. విశిష్టత

అయితే వాటిలో ఒక స్తంభం నుంచి చూస్తే వాలీసుగ్రీవుల యుద్ధం కనపడుతుంది.మరో స్తంభం నుంచి చూస్తే వాలీసుగ్రీవులు యుద్ధం చేస్తుండగా చెట్టు చాటు నుండి బాణం ఎక్కుపెట్టిన రాముని చిత్రం వుంటుంది.అయితే ఇక్కడ వున్న వింతేమిటంటే ఆ స్తంభాలలోని మొదటి స్తంభం నుంచి చోస్తే రాముడు కనపడడు. కానీ రెండవ స్థంభం నుంచి చూస్తే వాలీసుగ్రీవులతో పాటు రాముడు చాలా స్పష్టంగా కనిపిస్తాడు.ఈ వింత అప్పటి కళాకారుల కళా కౌశలానికి ప్రసిద్ధి.

PC:youtube

5. కోయంబత్తూర్ వననాథ స్వామి

5. కోయంబత్తూర్ వననాథ స్వామి

సాధారణంగా చాలా దేవాలయాలలో ప్రధాన దైవం వుండే గర్భగుడిలో ఒకే మూల విరాట్టును ప్రతిష్టించి ఆ విగ్రహాన్ని పూజించటం చూసాం. అయితే కోయంబత్తూర్ సమీపంలోని కుళిత్తలై అనే ఊరిలో కదంబ వననాధస్వామి ఆలయం వుంది.

PC:youtube

6. విశిష్టత

6. విశిష్టత

విశిష్టత ఏమంటే ఆ ఆలయంలోని గర్భగుడిలో రెండు నటరాజస్వామి విగ్రహాలు ప్రతిష్టించి వున్నాయి.ఈ ఆలయంలో జరిగే పూజాదికాలన్నీ ఆ రెండు మూర్తులకు ఏకకాలంలో చేస్తారు.

PC:youtube

7. చెన్నైలోని శ్రీ పెరుంబుదూర్

7. చెన్నైలోని శ్రీ పెరుంబుదూర్

సాధారణంగా చాలా ఆలయాలలోని మూల విగ్రహాలు రాతితో గానీ, పంచలోహాలతో గానీ వుంటాయి. కాని చెన్నై సమీపంలోని శ్రీ పెరుంబుదూర్ అనే చోట శ్రీ రామానుజుల వారి గుడి వుంది.

PC:youtube

8. విశిష్టత

8. విశిష్టత

ఆ ఆలయంలోని మూల విగ్రహం మాత్రం రాతితోనో,పంచలోహాలతోనో గాకుండా పచ్చకర్పూరం,కుంకుమ పువ్వు,వనమూలికలతో చేసారు.

PC:youtube

9. నిత్య కళ్యాణీ సమేత విశ్వనాథస్వామి ఆలయం

9. నిత్య కళ్యాణీ సమేత విశ్వనాథస్వామి ఆలయం

తమిళనాడులోని తిరునల్వేలి అనే వూరికి కడయం అనే వూరికి మార్గమధ్యంలో వున్నదే ఈ నిత్య కళ్యాణీ సమేత విశ్వనాథస్వామి ఆలయం. ఈ ఆలయ ప్రాంగణంలో ఒక మహా బిల్వ వృక్షం వుంది.

PC:youtube

10. విశిష్టత

10. విశిష్టత

ఆ బిల్వ వృక్షానికి కాచే బిల్వకాయలు సాధారణ బిల్వకాయలలా కాకుండా లింగాకారంలో కాస్తాయి.అందువల్ల భక్తులు ఈ వృక్షాన్ని సాక్షాత్తూ శివస్వరూపంగా కొలుస్తారు.

PC:youtube

11. సామర్లకోట ఆంజనేయస్వామి

11. సామర్లకోట ఆంజనేయస్వామి

మన ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లాలో సామర్లకోట అనే వీధిలో మూడు వీధుల కూడలిలో ఆంజనేయస్వామి ఆలయం ఒకటి వుంది.ఈ ఆలయంలోని విగ్రహం చాలా పెద్దగా ఉంటుంది.

PC:youtube

12. విశిష్టత

12. విశిష్టత

అయితే ఈ విగ్రహంలోని వింతేమిటంటే ఆ స్వామి వారి కళ్ళు భద్రాచలంలోని రాములవారి పాదాలకు సమానంగా ఒకే ఎత్తులో వుంటాయి.

PC:youtube

13. ధర్మపురి అభీష్ట వరదస్వామి

13. ధర్మపురి అభీష్ట వరదస్వామి

తమిళనాడులోని ధర్మపురి అనే వూరికి 10మైళ్ళ దూరంలో అభీష్ట వరదస్వామి అనే విష్ణుమూర్తి ఆలయం వుంది. ఇదే ఆలయంలో నవగ్రహాల మండపం వుంది.

PC:youtube

14. విశిష్టత

14. విశిష్టత

ఆ నవగ్రహ మండపంలోని నవగ్రహాలన్నీ స్త్రీ రూపంలో వుండటం ఒక విశేషం. ఈ విధమైన నవగ్రహాలు మరే ఇతర ఆలయాల్లో లేవు.

PC:youtube

15. ధన్ పుదూర్ శివాలయం

15. ధన్ పుదూర్ శివాలయం

శివాలయం అంటే శివునితో పాటు ఆయన ఎదురుగా వున్న నందికి కూడా మన వేదాలలో ఎంతో ప్రాముఖ్యతనిచ్చారు. అందుకనే ప్రతి శివాలయంలో నందీశ్వరుడు ఖచ్చితంగా వుంటాడు.నంది అనగానే అందంగా రెండు పదునైన కొమ్ములతో నిక్కబొడుచుకుని వుండే చెవులతో కూర్చునివుండే విగ్రహాన్ని అందరూ చూస్తారు.

PC:youtube

16. విశిష్టత

16. విశిష్టత

అయితే మదురై జిల్లాలోని విరుదునగర్ సమీపంలో వున్న ధన్ పుదూర్ అనే గ్రామంలోని శివాలయంలోని నందీశ్వరునికి మాత్రం కొమ్ములు,చెవులు లేకుండా వుంటాడు. ఈ విధమైన నందీశ్వరుడు ప్రపంచంలోని మరేఇతర శివాలయంలోనూ లేదు.

PC:youtube

17. వేలూర్ ఆలయం

17. వేలూర్ ఆలయం

తమిళనాడులోని వేలూర్ అనే వూరిలో ఒక దేవాలయం వుంది. ఈ ఆలయంలో ఒక ప్రత్యేకమైన సన్ డయల్ వుంది. ఈ సన్ డయల్ ఆ ఆలయంలోని ఒక స్థంభంలో అర్ధచంద్రాకారం ఒకటి వుండి అందులో 1 నుంచి 6 వరకు, 6 నుంచి 12 వరకు అంకెలుంటాయి.ఈ అర్ధచంద్రాకారం పైన ఒక పళ్ళెం వుంటుంది. అందులో ఒక పువ్వును వుంచితే దాని నీడ అక్కడ వుండే ఏదో ఒక అంకెపై స్పష్టంగా పడుతుంది.

PC:youtube

18. విశిష్టత

18. విశిష్టత

ఆ నీడ ఏ అంకెపై పడుతుందో సరిగ్గా అదే అప్పటి సమయం. అంటే మీరు ఉదయం 7 గంటలకు ఒక పువ్వు అక్కడ వుండే పళ్ళెంలో పెడితే దాని నీడ సరిగ్గా 7 మీద పడి మీ గడియారం ఏ సమయం చూపిస్తుందో అదే సమయం సన్ డయల్ లో చూపిస్తుంది.

PC:youtube

19. కుంభకోణం విష్ణు మూర్తి ఆలయం

19. కుంభకోణం విష్ణు మూర్తి ఆలయం

కుంభకోణంలో నాచ్చియార్ కోవెల్ అనే ప్రదేశంలో విష్ణుమూర్తి ఆలయం ఒకటి వుంది. ఆ గుడిలోని ఉత్సవ సమయంలో స్వామి వారి వుత్సవ విగ్రహాలను రాతితో చేసిన గరుడవాహనంపై వూరేగిస్తారు.అయితే ఈ రాతి వాహనం ప్రధాన ఆలయంలో వున్నప్పుడు కేవలం 4 గురు మాత్రమే మోయగల బరువులో వుంటుంది. అయితే ఊరేగింపు మొదలై ఆ వాహనం మొదటి ప్రాకారం దాటుకుని బయటకు వచ్చేసరికి అది 8 మంది మోయాల్సిన బరువుకు చేరుతుంది. ఆ తరువాత ప్రాకారం వద్ద 16 మంది ఆ పై 32 మంది ఇక ఆఖరి ప్రాకారం దాటి మాడవీధులలో వచ్చేసరికి 64 మంది మోసే బరువుకి మారుతుంది.

విశిష్టత

ఆ వాహనం గుడిలోంచి బయటకువచ్చేటప్పటికి దాని బరువు రెండితలైతూ వస్తుంది. మళ్ళీ తిరిగి లోపలి వెళ్ళేటప్పటికి దాని బరువు కొద్దిగా తగ్గి సాధారణ స్థితికి వచ్చేస్తుంది.ఈ వింత ఇప్పటికీ ఒక అంతుచిక్కని మిస్టరీగానే ఉండిపోయింది.అంతేకాదు ఆ గరుడ వాహనం బయటకు వచ్చేసరికి ఆ వాహనానికి వున్న గరుడ విగ్రహానికి చెమటలు పట్టడం మరో పెద్ద వింత.

PC:youtube

Read more about: temple india travel
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X