Search
  • Follow NativePlanet
Share
» »జైపూర్ లో తప్పక చూడవలసిన పర్యాటక ప్రదేశాలు !

జైపూర్ లో తప్పక చూడవలసిన పర్యాటక ప్రదేశాలు !

రాజస్థాన్ లోని జైపూర్ నగరం ఆకర్షణీయ పింక్ సిటీ గా పేరొందినది. ఒక్కసారి చూస్తె చాలు రాజస్థాన్ రాష్ట్ర గత రాచరికపు వైభవాలు జీవితాంతం మంచి టూర్ అనుభవాలుగా మిగిలిపోతాయి. జైపూర్ నగరం రాజస్తాన్ రాష్ట్ర రాజధాని. రాష్ట్రంలో అతి పెద్ద నగరం. ఈ నగరం లో ఒళ్ళు గగుర్పొడిచే ఎన్నో చారిత్రక స్మారకాలు, శిల్ప అద్భుతాలు విదేశీ పర్యాటకులను సైతం ఆకర్షిస్తున్నాయి. ఇక్కడ అనేక పర్యాటక ఆకర్షణలు ఉన్నప్పటికీ మీరు తప్పక చూడవలసిన కొన్ని ప్రదేశాలను పేర్కొంటున్నాం, తప్పక చూసి ఆనందించండి.

జైపూర్ లో తప్పక చూడవలసిన 10 ప్రదేశాలు

 సిటీ పాలస్

సిటీ పాలస్

జైపూర్ లో కల సిటీ పాలస్ అతి పెద్ద భవనం. ఇది నగరం మధ్యలో వుంది పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తుంది. ఈ పాలస్ నిర్మాణంలో మొఘల్ మరియు రాజపుత్ర శిల్ప శైలి కనపడుతుంది. ఫోటో క్రెడిట్ : Poco

హవా మహల్

హవా మహల్

హవా మహల్ అంటే 'గాలులు కల రాజ భవనం' అని అర్ధం చెపుతారు. ఈ రాజ భవనం శిల్ప శైలి పూర్తిగా రాజ కవి అయిన రాజు సవాయ్ ప్రతాప్ సింగ్ అభి రుచి మేరకు జరిగింది. ఎర్ర రాతి తో కట్టిన ఈ నిర్మాణం మీరు జైపూర్ వెళితే తప్పక చూడ దగినది.

 గల్తాజి టెంపుల్ లేదా మంకీ టెంపుల్

గల్తాజి టెంపుల్ లేదా మంకీ టెంపుల్

జైపూర్ లో గల్తాజి టెంపుల్ ఒక మణి రత్నం. ఈ టెంపుల్ లో సూర్య భగవానుడు దైవం. ఈ దేవాలయంలో కోతులు అధిక సంఖ్యలో వుండటంచే, ఈ టెంపుల్ కు మంకీ టెంపుల్ అనే పేరు వచ్చింది. ఈ టెంపుల్ పరిసరాలనుండి , జైపూర్ నగర సుందర దృశ్యాలు చూడవచ్చు.

 అంబర్ ఫోర్ట్

అంబర్ ఫోర్ట్

అంబర్ కోటకు సుమారు 200 సంవత్సరాల చరిత్ర కలదు. ఈ కోటను జైపూర్ సిటీ నిర్మాణానికి ఏడు సంవత్సరాల ముందు నిర్మించారు. జైపూర్ లో ఇది అత్యంత ఆకర్షనగల టూరిస్ట్ ప్రదేశం.

ఫోటో క్రెడిట్ : Prasoonmaheshwari

నహర్ ఘర్ ఫోర్ట్

నహర్ ఘర్ ఫోర్ట్

నహార్ ఘర్ ఫోర్ట్ నిర్మాణంలో భారతీయ మరియు యూరప్ శిల్ప శైలుల మిశ్రమం కనపడుతుంది. అందమైన ఆరావళి మౌంటెన్ శ్రేణు లలో కల ఈ కోట జైపూర్ నగరం లో ఒక విశేష టూరిస్ట్ ఆకర్షణ.

 ఆల్బర్ట్ హాల్

ఆల్బర్ట్ హాల్

అతి వైభవంగా కనపడే ఈ భవన నిర్మాణం మిమ్మల్ని ఆశ్చర్య చకితులను చేస్తుంది. ఈ ఆల్బర్ట్ హాల్ ను ఒక కరువు బాధిత పధకం కింద నిర్మించి నప్పటికీ, నేడు ఇది ఒక గొప్ప మ్యూజియం గా సందర్శించ బడు తోంది. ఇక్కడ మీరు రంగు రంగుల క్రిస్ట ల్స్, మెటల్ శిల్పాలు, పెయింటింగ్ లు, జైపూర్ హస్త కళల గొప్పదనం, చూడ గలరు.

జంతర్ మంతర్

జంతర్ మంతర్

ఇండియా లో కల అయిదు ఖగోళ పరిశోధనా శాలల లోను జైపూర్ లోని జంతర్ మంతర్ ఖగోళ పరిశోధనా శాల పెద్దదిగా చెప్పబడుతుంది. యునెస్కో సంస్థ చే 'ప్రపంచ వారసత్వ ప్రదేశం' గా గుర్తించ బడిన ఈ జంతర్ మంతర్ తప్పక చూడ దగిన పర్యాటక ప్రదేశం.

 జైఘర్ ఫోర్ట్

జైఘర్ ఫోర్ట్

జై ఘర్ ఫోర్ట్ ను విజయాల కోట అని కూడా పేరవారినిఈ కోటను ఒకప్పుడు మిలిటరీ అవసరాలకు, సైనికులను రక్షించే ఉద్దేశ్యం తో నిర్మించారు. ఇపుడు ఈ కోట జైపూర్ లో ఒక ప్రసిద్ధ ఆకర్షణ గా మారింది.

ఫోటో క్రెడిట్ : Abhinavmnnit

 జల మహల్

జల మహల్

అందమైన ఈ జల్ మహల్ పాలస్ ను జైపూర్ రాచ కుటుంబం తమ వేట వసతి గా నిర్మించుకోంది . ఒక సరస్సు ఒడ్డున కల ఈ భవనం అందాలు వర్ణించ నలవి కాదు.

ఫోటో క్రెడిట్ : Ritesh Salian

 బిర్లా మందిర్

బిర్లా మందిర్

ఎంతో అందమైన ఈ బిర్లా మందిర్ ను లక్ష్మి నారాయణ్ టెంపుల్ అని కూడా అంటారు. ఈ టెంపుల్ లో శ్రీ మహా విష్ణువు, మరియు మాత లక్ష్మి దేవి ప్రధాన దైవాలు. విష్ణువు యొక్క విగ్రహం ఒకే మార్బుల్ రాతితో చెక్కబడింది. జైపూర్ నగరంలో బిర్లా మందిర్ ఒక గొప్ప పర్యాటక ఆకర్షణ గా చెప్పవచ్చు.

ఫోటో క్రెడిట్ : Photo Courtesy: Arjuncm3

Read more about: jaipur జైపూర్
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X