Search
  • Follow NativePlanet
Share
» »దసరాలో తప్పక పర్యటించవలసిన 25 ప్రదేశాలు !!

దసరాలో తప్పక పర్యటించవలసిన 25 ప్రదేశాలు !!

దసరా హిందువుల ఒక ముఖ్యమైన పండగ. ఇది ముఖ్యంగా ఆశ్వయుజ మాసంలో (తెలుగు క్యాలెండర్ నెలలు) శుద్ధ పాడ్యమి నుండి శుద్ధ నవమి వరకు అంటే తొమ్మిది రోజుల పాటు నిర్వహిస్తారు. ఈ తొమ్మిది రోజులను దేవి నవరాత్రులుగా మరియు పదవ రోజు విజయదశమి కలిపి దసరా గా అభివర్ణిస్తారు. ఈ పండగను నవరాత్రి అని, శరన్నవరాత్రి అని కూడా అంటుంటారు. నవరాత్రి పండగ సందర్భంగా భక్తులు మాత శక్తి ని మూడు రూపాలలో కొలుస్తారు. ఐశ్వర్యం కొరకు లక్ష్మి దేవి ని , చెడును పారద్రోలేందుకు మాత దుర్గ ను, విజ్ఞానాన్ని ప్రసాదించేందుకు సరస్వతి రూపాలుగా శక్తిని పూజిస్తారు.

విజయదశమి సందర్భంగా జరిపే దసరా ఉత్సవాలు ఒక విశేషమైన హిందువుల పండుగ ఉత్సవాలు. వీటిని మన దేశం లోని అనేక రాష్ట్రాల లోనే కాక ఇండియా కు చుట్టూ పక్కల వున్న దేశాలలో కూడా జరుపుతారు. పొరుగునే కల నేపాల్, బంగ్లాదేశ్ దేశాలలో దసరా పండుగ పదవ రోజైన విజయదశమిని ఎంతో అట్టహాసంగా నిర్వహిస్తారు. ఉత్తర భారత దేశంలో కుల్లు పట్టణం దసరా ఉత్సవాలకు ప్రసిద్ధి అట్లే దక్షిణ భారత దేశంలో కర్నాటక రాష్ట్రంలోని మైసూర్, కేరళ లోని ఎర్నాకులం, తమిళనాడు లోని కులసేఖరపట్నం మరియు ఆంధ్ర ప్రదేశ్ లోని విజయవాడ లలో కూడా దసరా ఉత్సవాలను వైభవోపేతంగా నిర్వహించి వేడుక చేసుకుంటారు. ఓడిషా, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాలు కూడా దసరా ఉత్సవాలను ఘనంగా చేసుకుంటాయి. ఇండియా లోని పశ్చిమ భాగం అయిన మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలలో దసరా పండుగ అతి వైభవంగా జరుగుతాయి.

జమ్మూ కాశ్మీర్

జమ్మూ కాశ్మీర్

జమ్మూ కాశ్మీర్ లో ప్రముఖంగా సందర్శించే ఆలయాలలో వైష్ణోదేవి ఆలయం చారిత్రక నేపథ్యం కలది. ఈ ఆలయం జమ్మూ లోని కాత్ర లో ఉన్నది. ఈ ప్రదేశాన్ని దసరా నవరాత్రుల సమయంలో సందర్శిస్తే మోక్షం లభిస్తుందని నమ్మకం. వేల సంఖ్యలో భక్తులు అమ్మవారి దర్శనం కోసం దేశం నలుమూల నుంచి వచ్చి ప్రార్థనలు చేస్తుంటారు.

Photo Courtesy: Nikhil Chandra

కుల్లు , హిమాచల్ ప్రదేశ్

కుల్లు , హిమాచల్ ప్రదేశ్

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కుల్లు లోయలో ఉన్న ధాల్పూర్ మైదానం లో దసరా పండగ ను ఘనంగా జరుపుకుంటారు. హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంటు, కుల్లు దసరా పండుగను అంతర్జాతీయ పండుగగా గుర్తించి పర్యాటకులను అధిక సంఖ్యలో ఆకర్షిస్తున్నది.

కులు పర్యటన కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Photo Courtesy: Toshali Resorts

ఢిల్లీ

ఢిల్లీ

దేశ రాజధాని ఢిల్లీలో నవరాత్రి ఉత్సవాలను హిందువులు సింహభాగం జరుపుకుంటారు. ఈ పండగ సమయంలో ఢిల్లీ యావత్తూ ఎంతో సందడిగా ఉంటుంది. ఢిల్లీ లోని కల్కాజీ ఆలయం నవరాత్రి వేడుకలకు ప్రసిద్ధి చెందినది. ఈ దేవాలయాన్ని వేడుకల సందర్భంలో రంగురంగుల విద్యుత్ దీపాలతో, అందమైన పుష్పాలతో అలంకరిస్తారు. ఇక్కడి ముఖ్య దేవత దుర్గా మాత అవతారమైన కాళికా దేవి.

ఢిల్లీ లో జరిగే నవరాత్రి ఉత్సవాల్ ఎలా ఉంటాయో చదవండి

Photo Courtesy: Ingela Persson-Rue

రాంలీలా మైదాన్ , ఢిల్లీ

రాంలీలా మైదాన్ , ఢిల్లీ

ఢిల్లీ లోని రాంలీలా మైదాన్ వంటి ప్రధాన ప్రదేశాలలో కొంతమంది కళాకారులు రామాయణ కావ్యం లోని వివిధ ఘట్టాలను ప్రదర్శిస్తారు. తొమ్మిది రోజుల పాటు వివిధ రామాయణ కండలు ప్రదర్శించి పదవ రోజున శ్రీరాముడు, రావణుడిని సంహరించే ఘట్టం ప్రదర్శిస్తారు. యువతులు, యువకులు గాగ్రా చోళీ, శేర్వాని వంటి సాంప్రదాయ దుస్తులు ధరించి ఆనందోత్సాహాలతో కోలాటం వంటి ఆటలు ఆడతారు. కోలాటం లేదా గర్బా డాన్స్ లు ఇక్కడ స్థానికులలో బాగా ప్రసిద్ధి.

ఢిల్లీ లో మెట్రో షాపింగ్ టూర్ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి

Photo Courtesy: kaniths

స్వీట్లు

స్వీట్లు

ఈ పండుగ సమయంలో ఢిల్లీ లో కుటుంబాలు అనేకం కలిసి ఆనందిస్తారు. పండుగకు తాము చేసిన స్వీట్లు, ఇతర ఆహారాలను పంచుకొంటారు. యువతీ, యువకులు వివిధ రకాల ప్రోగ్రాములతో ఆనందిస్తారు. ఢిల్లీ లో కొన్ని హోటళ్ళు కూడా ఈ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. తమ కస్టమర్లకు వారు వివిధ రకాల స్వీట్లు, హాట్లు చేసి ఆనందింప చేస్తారు.

పురాతన ఢిల్లీలో గల చారిత్రక మార్కెట్ ల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Photo Courtesy: Scott Dexter

వారణాసి

వారణాసి

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో దసరా పండుగకు భక్తులు భారీగా తరలివాస్తుంటారు. వారణాసి లోని రాంలీల నవరాత్రి ఉత్సవాలకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఇక్కడ ఉత్సవాలను 10 రోజుల పాటు నిర్వహిస్తారు. పట్టణానికి 15 కి. మీ. దూరంలో ఉన్న రాంలీల లో రామాయణ ఘట్టాలు నిర్వహిస్తుంటారు. చివరి రోజైన విజయదశమి రోజున రావణాసురుడు కటౌట్ లను తగలబెడతారు.

వారణాసి లో గల పవిత్ర పుణ్య క్షేత్రాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Photo Courtesy: Emre Engin

కలకత్తా

కలకత్తా

కలకత్తా తూర్పు భారతదేశానికి వాణిజ్య రాజధానిగా చెప్పుకోవచ్చు. ఇక్కడ దసరాను దుర్గాపూజ పర్వదినంగా జరుపుకుంటారు. బెంగాలీలు తొమ్మిదో రోజున కాళీమాత పూజ చేస్తారు మిగిలిన రోజులలో దుర్గామాత పూజలు చేస్తారు. కాళీమాతను పూజ చేసేటప్పుడు ప్రజలు లక్షల్లో పాల్గొంటుంటారు. తొమ్మిదిరోజులూ హరికథలు, బుర్రకథలు, పురాణ స్రవణం వంటివి చేసి చివరి రోజున దుర్గామాతను హూగ్లీ నదిలో నిమర్జనం చేస్తారు.

కలకత్తాలో గల ప్రముఖ పర్యాటక ఆకర్షణలు

Photo Courtesy: Nibedita

ఒరిస్సా లేదా ఓడిషా

ఒరిస్సా లేదా ఓడిషా

ఒరిస్సా ప్రజలు దసరా సమయంలో దుర్గా మాతను ఆరాధిస్తారు. ఈ సమయంలో కళాకారులు రూపొందించిన దుర్గామాత విగ్రహాలను గల్లిగల్లీలో ఏర్పాటుచేస్తారు. స్త్రీలు మానికలో వడ్లు నింపి లక్ష్మీ దేవిగా భావించి పూజలు నిర్వహిస్తారు. ఒడిషా ప్రజలు విజయదశమి నాడు విజయదుర్గ అమ్మవారిని ఆరాధిస్తే అన్నింటా విజయం వరిస్తుందని ప్రజల ప్రగాఢ నమ్మకం. చివరి రోజైన విజయదశమి రోజున 15 అడుగుల రావణ విగ్రహాన్ని బాణసంచాతో తయారు చేసి పెద్ద మైదానంలో కాలుస్తారు. ఈ రావణ కాష్టం చూడటానికి ప్రజల భారీగానే హాజరవుతారు.

ఒరిస్సా లో గల డైమండ్ ట్రైయాంగిల్

భువనేశ్వర్ పర్యాటక ఆకర్షణలు

Photo Courtesy: DreamOdisha

కోట, రాజస్థాన్

కోట, రాజస్థాన్

రాజస్థాన్ రాష్ట్రం లోని కోట పట్టణంలో దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఇక్కడ జరిగే వివిధ రకాల పండుగలలో దసరా పండుగకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది. పండగ ప్రారంభం నుంచి చివరి రోజైన విజయదశమి వరకు కళాకారులు ఎటువంటి అలసట చెందకుండా నాట్యాలు, కచేరీలు, డ్యాన్సులు మరియు ఎన్నో రకాల సాంస్కృతిక కార్యాక్రమాలలో పాల్గొని ప్రజలలో ఉత్సాహాన్ని నింపుతారు.

రాజస్థాన్ రాచరిక పట్టణం ... కోట !!

Photo Courtesy: Sameer Goyal

గుజరాత్

గుజరాత్

దసరా సమయంలో గుజరాతీయులు పార్వతిదేవీని కొలుస్తారు. ప్రతి ఇంట్లో శక్తిపూజ చేయటం ఇక్కడి వారి ఆనవాయితీ. ఇంటి గోడల మీద దుర్గా మాత ఆయుధాలైన శ్రీ చక్రం, త్రిశూలం, శక్తి ఆయుధం చిత్రాలను చిత్రించి పసుపుతో పూజిస్తారు. ఆ గుర్తుల సమీపంలో పొలాల నుంచి తీసుకొనివచ్చిన మట్టిని ఒక వేదికగా తయారు చేసి దానిపై గోధుమ, బార్లీ విత్తనాలను చల్లి దానిపై ఒక మట్టి ఉండ పెట్టి నీటితో నింపి రాగి నాణెం లేదా వెండి వేస్తారు. దీనిని వారు దేవిగా కొలిచి, అష్టమి రోజున యజ్ఞం నిర్వహించి దశమి రోజున నిమర్జనం చేస్తారు.

గుజరాత్ ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Photo Courtesy: nirmal Deka Baruah

మహారాష్ట్ర

మహారాష్ట్ర

ఇండియాలోని పశ్చిమ భాగంలోని మహారాష్ట్ర లో దసరా పండుగ వైభవంగా జరుగుతుంది. ఈ పండుగను ఇక్కడ శ్రీరాముడు రావణుడి పై సాధించిన విజయానికి చిహ్నంగా భావిస్తారు. అంతేకాక, మహిషాసుర రాక్షసుడి తో తొమ్మిది రోజుల పాటు యుద్దంచేసి విజయం పొందిన మాత దుర్గా దేవి అవతారమైన మహిషాసుర మర్దిని పేరుపై కూడా జరుపుకుంటారు. నవరాత్రి పండుగలో పూజలు నిర్వహించిన అనంతరం, మాత విగ్రహాలను పదవ రోజు నాడు నీటిలో నిమజ్జనం చేస్తారు. విజయ దశమి రోజున, ఇక్కడ ప్రజలు తమ తమ వివిధ దైనందిన పని ముట్లకు కూడా పూజలు నిర్వహిస్తారు.

ముంబై లో ఒక్కరోజులో చూసే పర్యాటక ఆకర్షణలు

Photo Courtesy: Elroy Serrao

బస్తర్, చత్తీస్ గర్హ్

బస్తర్, చత్తీస్ గర్హ్

దసరా ఉత్సవాలు చత్తీస్ గర్హ్ రాష్ట్రంలోని బస్తర్ లో ఘనంగా జరుగుతాయి. వీరు ఈ పండగను శ్రీరాముడు సుమారు 14 సంవత్సరాలు పాటు జీవనం గడిపిన దండకారణ్యంలో జరుపుకుంటారు. ఇక్కడ ప్రసిద్ధి గాంచిన మాత పవిత్ర దంతేశ్వరి ఆలయం ఉన్నది. ఈ ఆలయం అనేక దివ్య శక్తులు కలిగి ఉందని అందువల్ల దసరా పండగ సందర్భంగా వేల సంఖ్యలో గిరిజన ప్రజలు చుట్టుప్రక్కల గ్రామాల నుంచి మరియు అడవుల నుంచి తండోపతండాలుగా ఇక్కడికి వచ్చి దేవతకు మొక్కులు చెల్లించుకుంటారు.

జగ్దల్పూర్ పర్యాటక ఆకర్షణలు !!

రామాయణ ఘట్టాలు జరిగిన ప్రదేశాలు !!

Photo Courtesy: Bastar Dussehra

మైసూర్, కర్నాటక

మైసూర్, కర్నాటక

మైసూర్ దసరాకు సుమారు 400 ఏళ్ల చరిత్ర ఉన్నది అందుకే దసరా అంటే మైసూర్ ... మైసూర్ అంటే దసరాగా మైసూర్ అందరికీ గుర్తుండిపోయింది. మైసూర్ దసరా ను కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా, చివరి రోజైన విజయదశమి వరకు 10 రోజుల పాటు అంగరంగ వైభవంగా ఉత్సవాలను నిర్వహిస్తుంది.

వీకెండ్ లో మైసూర్ ట్రిప్ ఎలా ఎంజాయ్ చేయాలి ??

Photo Courtesy: Sriram Ramanathan

మైసూర్, కర్నాటక

మైసూర్, కర్నాటక

మేళ తాళాలు, డప్పు వాయిద్యాలు, అనేక కచేరీలు, రాచఠీవి కల ఏనుగుల ఊరేగింపులు, నాట్యం చేసే బొమ్మలు, దీపాలతో మిల మిల మెరిసే భవనాలు అన్నిటినీ మించి నోటి రుచులూరే మైసూరు పాక్ వంటి స్వీట్లు, ఇతర ఆహారాలు వంటివి ఎన్నో ఆనందించవచ్చు.

బెంగళూరు నుండి మైసూర్ కి రౌండ్ ట్రిప్ జర్ని !!

Photo Courtesy: Kalyan Kanuri

మడికేరి, కర్నాటక

మడికేరి, కర్నాటక

కర్నాటక రాష్ట్రంలోని కూర్గ్ జిల్లాలో ఉన్న మడికేరి ఒక ప్రధాన హిల్ స్టేషన్. ఇక్కడి దసరా మైసూర్ దసరా తర్వాత రెండవ స్థానాన్ని ఆక్రమించినది. సుమారు వంద సంవత్సరాల చరిత్ర కలిగిన మడికేరి దసరా వేడుకలు శక్తి కి సంభంధించినవి. దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిభగల కళాకారులు ఇక్కడికి వచ్చి కచేరీలు, సాంస్కృతిక కార్యాక్రమాలు నిర్వహిస్తుంటారు. పండగ ఉత్సవాలు 9 రాత్రులు జరుగుతాయి. 10 వ రోజున ఒక ఊరేగింపు జరిపి బన్ని చెట్టు కొట్టడంతో ఉత్సవం ముగుస్తుంది.

మడికేసరి లో దసరా వైభోగం !!

Photo Courtesy: Madikerimanju

మంగళూరు, కర్నాటక

మంగళూరు, కర్నాటక

మంగళూరు లో జరిగే దసరా ఉత్సవాలకు చూడటానికి దేశం నలుమూలల నుంచి భక్తులు, పర్యాటకులు భారీగా హాజరవుతూ ఉంటారు. ఇక్కడ జరిగే పులి వేషాలు మరియు ఎలుగు బంటి వేషాలు దసరా పండుగకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

మంగళూరు ఆలయాల పర్యటన !

Photo Courtesy: Karunakar Rayker

తెలంగాణ

తెలంగాణ

తెలంగాణ రాష్ట్రంలో దసరా పండుగ వైభవంగా జరుపుకుంటారు. ఈ సమయంలోనే వీరు మరో ప్రత్యేకమైన ఉత్సవాలను జరుపుకుంటారు అవే బతుకమ్మ ఉత్సవాలు. నవరాత్రి మొదటి రోజున బతుకమ్మను పూలతో అలంకరించి తొమ్మిది రోజులు స్త్రీలంతా ఒకచోటు చేరి ఆటపాటలతో ఆనందిస్తారు. చివరి రోజున బతుకమ్మను నిమర్జనం చేసిన తరువాత పండుగను నిర్వహిస్తారు.

తెలంగాణ లో గల పర్యాటక ప్రదేశాలు !

Photo Courtesy: Telangana Utsav Committee

కరీంనగర్, తెలంగాణ

కరీంనగర్, తెలంగాణ

కరీంనగర్ జిల్లాలో దసరా పండగను అకాడా లుగా నిర్వహిస్తారు. ఇక్కడి గనిలో పనిచేసే కార్మికులు పల్లెతనం ఉట్టిపడేలా ఈ పండుగను నిర్వహిస్తారు. ఈ సమయంలో వారు క్షత్రీయుల ఆయుధ విన్యాసాలను పోలిన విన్యాసాలను ప్రదర్శించడం వారి అలవాటు. ఇక్కడి స్టేడియంలో నరకాసుర వధ ఘట్టాన్ని ప్రదర్శించడంతో పండగ ప్రారంభమవుతుంది. హనుమాన్ అకాడా, దుర్గా అకాడా ల లాంటి దేవతల ప్రతిరూపాలతో ఆయుధాలను పట్టుకొని విన్యాసాలు చేస్తూ ఊరంతా తిరుగుతూ ప్రజలను ఉత్సాహపరుస్తారు. కర్రసాము ఈ ప్రదర్శనలో భాగమే.

నిజామాబాద్ పర్యాటక ప్రదేశాలు !

Photo Courtesy: Abhijeet Rane

ఆంధ్ర ప్రదేశ్

ఆంధ్ర ప్రదేశ్

ఇక మన తెలుగు రాష్ట్రాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదనుకుంటా..! మన రాష్ట్రంలో విజయవాడ ప్రముఖంగా చెప్పుకోవాలి. ఇక్కడ వెలసిన వెలసిన కనకదుర్గమ్మ అమ్మవారు నవరాత్రుల సమయంలో మూడు సార్లు తెప్పపై విహరిస్తూ దర్శనమిస్తుంది. దసరా సందర్భంగా చివరి రోజున ప్రభలు ఊరేగింపుగా వస్తాయి. ఈ ప్రభలలో భేతాళ నృత్యం ప్రదర్శించడం ఈకాక్‌ది రీవాజు. ఈ అమ్మవారికి పట్టు వస్త్రాలను ప్రభుత్వం తరుపున ముఖ్యమంత్రి కానీ లేదా క్యాబినెట్ హోదాలో ఉన్న దేవాదాయ శాఖ మంత్రి కానీ సమర్పిస్తారు. దసరా సమయంలో ఇంద్రకీలాద్రి కొండ భక్తులతో కిక్కిరిసిపోతుంది.

ఆంధ్ర ప్రదేశ్ లో ఫ్యామిలీతో కలిసి వెళ్లే పర్యాటక ప్రదేశాలు !

Photo Courtesy: Manfred Sommer

పశ్చిమ గోదావరి , ఆంధ్ర ప్రదేశ్

పశ్చిమ గోదావరి , ఆంధ్ర ప్రదేశ్

ఆంధ్ర ప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా వీర వాసరంలో దసరా సమయంలో ఏనుగు ఉత్సవాలు జపడం అలవాటు. దసరా మొదటి రోజున ఏనుగుగుడి లో భేతాళుడిని నిలబెడతారు. తొమ్మిది రోజులు భేతాళుడు అమ్మవారి పూజలు నిర్వహిస్తాడు. మొదటి రోజునుండి వెదురు కర్రలు, గడ్డి, కొబ్బరిపీచుతో చేసిన ఏనుగును అంబారీతో తయారుచేస్తారు. అలాగే చిన్న ఏనుగును తయారు చేసి అలంకరించి చివరి రోజున ఊరేగింపుగా తీసుకు వెళతారు. ఈ ఊరేగింపులో పిల్లలను ఏనుగు కింద నుండి దాటిస్తారు.

రాజమండ్రి పర్యాటక ప్రదేశాలు !

Photo Courtesy: Why Eye Photography

విజయనగరం , ఆంధ్ర ప్రదేశ్

విజయనగరం , ఆంధ్ర ప్రదేశ్

విజయనగరంలో దసరా సమయంలో పైడి తల్లి కి పూజలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవంలో భాగంగా అడవి నుండి ఒక చెట్టును నరికి తీసుకు వచ్చీ మొదలు భాగాన్ని లాగుడు బండికి కట్టి చివరి భాగంలో ఊయలకట్టి అందులో పూజారిని కూర్చో పెట్టి ఊరేగిస్తారు. ఈ ఉత్సవం చూసేందుకు చుట్టు పక్కల పల్లెటూర్ల నుండి ప్రజలు ఎడ్లబండిలో వచ్చి రోడ్డు ప్రక్కన గుడారాలు వేసుకుని ఉత్సవం చూసి ఆనందిస్తారు.

విజయనగరం పర్యాటక ప్రదేశాలు !

Photo Courtesy: vizianagaram.nic.in

వీపన గండ్ల , ఆంధ్ర ప్రదేశ్

వీపన గండ్ల , ఆంధ్ర ప్రదేశ్

కర్నూలు జిల్లాలోని వీపనగండ్లలో దసరా సమయంలో రాళ్ళ యుద్ధం చేసుకుంటారు. దసరా రోజున సాయం వేళలో ప్రజలు కాలువ ఒడ్డున అటూఇటూ చేరి కంకర రాళ్ళను పోసుకుని ఒకవైపు రామసేన ఒకవైపు రావణ సేనగా ఊహించి రాళ్ళను విసురుతూ యుద్ధం చేసుకుంటారు. దీనిని వాళ్ళు రామ రావణ యుద్ధంగా అభివర్ణిస్తారు.

కర్నూలు పర్యాటక ప్రదేశాలు !

Photo Courtesy: Ananthasubramanian Narayanan

ఒంగోలు , ఆంధ్ర ప్రదేశ్

ఒంగోలు , ఆంధ్ర ప్రదేశ్

దసరా సమయంలో ప్రకాశం జిల్లా ఒంగోలులో ఉత్సవాలలో భాగంగా కళారాలను ఊరేగిస్తారు. ఈ కళారాలను దసరా సమయానికి చక్కగా అలంకరించి సిద్ధం చేస్తారు. ఇక్కడ కాళికాదేవికి, మహిషాసుర మర్ధినికి, నరసింహ స్వామికి కళారాలున్నాయి. వీటికి ఈ తొమ్మిది రోజులు విశేషంగా పూజలు చేసి తొమ్మిది పది రోజులలో ఒక్కోరోజు కొన్ని కళారాలకు ఊరేగింపు చేస్తారు. కళారాన్ని బండి మీద ఎక్కించి కొయ్యలను అమర్చి వాటి సాయంతో కళారాన్ని ఊపుతూ డప్పుల మోతలతో ఊరేగింపు నిర్వహిస్తారు. ఇలా కళారాన్ని ఊరి నడిమధ్యకు తీసుకు వచ్చి అక్కడ రాక్షస సంహారం ఘట్టాన్ని ప్రదర్శిస్తారు.

ప్రకాశం పర్యాటక ప్రదేశాలు !

Photo Courtesy: ongole.nic.in

కర్నూలు , ఆంధ్ర ప్రదేశ్

కర్నూలు , ఆంధ్ర ప్రదేశ్

కర్నూలు జిల్లాకే ప్రసిద్ధి చెందిన దసరా ఉత్సవాలు బన్ని ఉత్సవాలు. దీనినే కర్రల సమరం అంటుంటారు. జిల్లా ప్రజలే కాక రాష్ట్ర ప్రజలు సైతం ఉత్కంతగా ఎదురుచూసే బన్ని ఉత్సవాలు రాత్రి 12 గంటల నుంచి ఉదయం 3 గంటల వరకు నిర్వహిస్తారు. ఇది కేవలం దసరా పండగ సమయంలో మాత్రమే జరుగుతుంది. కొన్ని గ్రామాల ప్రజలు ఒక వైపు, మరికొన్ని గ్రామాల ప్రజలు మరోవైపు రెండు జట్లుగా ఏర్పడి ఉత్సవ విగ్రహాలను తీసుకెళ్లేందుకు పోటీ పడతారు. నెరణికి గ్రామం నుంచి ఉత్సవ విగ్రహాలను కర్రలతో దేవరగట్టు దేవాలయం వరకు తీసుకొస్తారు. ఈ నేపథ్యంలో కర్రల తాకిడిలో చాలా మందికి గాయాలు కావటం, ఒక్కోసారి ప్రాణాలు కోల్పోవటం జరుగుతాయి. ఈ కర్రల సమరాన్ని తిలకించేందుకు కర్ణాటక, ఆంధ్రా, మహారాష్ట్ర నుంచి దాదాపు లక్షల సంఖ్యలో భక్తులు హాజరవుతారు.

రాయలసీమలో ఫ్యామిలీతో చూస్ ప్రదేశాలు !!

కర్నూలు లో వన్ డే బైక్ ట్రిప్ జర్ని !!

Photo Courtesy: kurnool.nic.in

సంగారెడ్డి, తెలంగాణ

సంగారెడ్డి, తెలంగాణ

మెదక్ జిల్లా సంగారెడ్డిలో దసరా సందర్భంలో తొమ్మిది రోజులు దేవిని ఆరాధించి చివరి రోజున రావణ కుంభకర్ణ బొమ్మలను దగ్ధం చేస్తారు. ఈ బొమ్మలను వారు బాణసంచాతో తయారు చేసి, రామ లక్ష్మణ వేషదారులు అగ్ని బాణాలతో దగ్ధం చేస్తారు. చుట్టుపక్కల గ్రామాల నుండి వేలకొలది భక్తులు హాజరై ఉత్సవాన్ని తిలకిస్తారు.

హైదరాబాద్ లో మీకు తెలియని ప్రదేశాలు !

మెదక్ పర్యాటక ప్రదేశాలు !

Photo Courtesy: telangana festivals

కేరళ

కేరళ

కేరళ రాష్ట్రం లో కూడా దసరా పండుగను వైభవంగా జరుపుతారు. పచ్చని ప్రకృతి అందాలా నడుమ సేదతీరుతూ, కాలుష్యం లేని స్వచ్ఛమైన గాలిని పీలిస్తూ కేరళ లలో దసరా పండుగను ఆస్వాదించవచ్చు. కేరళ బ్యాక్ వాటర్ ఆనందాన్ని మీరు ఈ మాసంలోనే అంభవించాలి. అంతే కాదు హాయినిగొలిపే ఆయుర్వేదిక్ మసాజ్, ఆయుర్వేద వైద్యం ఇక్కడి ప్రత్యేకతలు. 10 రోజులపాటు సాగే దసరా వేడుకలు తిలకించేందుకు దేశ విదేశాలలో స్థిరపడిన కేరళ ప్రజలు ఇక్కడికి వస్తుంటారు.

కేరళలో అన్వేషించని ప్రదేశాలు !!

Photo Courtesy: Bharatheeraj M S

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X