అనంతపద్మనాభ స్వామి ఆరవ గది తెరిస్తే మొత్తం ప్రపంచాన్ని ముంచేస్తుందా?
వెతకండి
 
వెతకండి
 

సిక్కిం ఆకర్షణలు...బౌద్ధ ఆరామాలు!

Posted by:
Published: Monday, April 14, 2014, 13:57 [IST]
Share this on your social network:
   Facebook Twitter Google+ Pin it  Comments

హిమాలయ పర్వత శ్రేణులలోని రాష్ట్రాలలో సిక్కిం ఒక అందమైన ఆకర్షణలు గల పర్యాటక ప్రదేశం. దీని చుట్టూ నేపాల్, చైనా, భూటాన్ దేశాలు కలవు. దేశానికి చిట్టచివరి ప్రదేశం లో వుండటం వలన మరియు ఇక్కడకు వెళ్ళాలంటే ప్రభుత్వ అనుమతులు అవసరం అయినందున చాలామందికి ఈ రాష్ట్ర పర్యటన అందుబాటులో వుండదు. అయినప్పటికీ సిక్కిం రాష్ట్ర పర్యటన మీకు మరపురాని అనుభూతులు అందిస్తుంది. మనసు ఒక్కసారి ఉల్లాసం అయిపోతుంది. అక్కడ కల పర్వత శ్రేణుల అందాలు, పురాతన టిబెట్ బౌద్ధ సంస్కృతి మిమ్ములను మరో ప్రపంచంలోకి తీసుకు వెళతాయి. సిక్కిం లో మీరు పర్యటించేందుకు క్లుప్తంగా అయిదు ఆకర్షణలు అందిస్తున్నాం.

ధ్యానానికి బెస్ట్ ,,,ఆకర్షణకు ఫస్ట్ !

సిక్కిం ప్రదేశం ధ్యాన కార్యక్రమాలకు అనువైన ప్రదేశం. ఇక్కడ సుమారు 200 వరకు బౌద్దా ఆరామాలు వివిధ కొండలపై కలవు. ప్రతి ఆరామం మీకు ఎంతో నిశ్శబ్దంగా వుంది ధ్యానానికి అనుకూలంగా వుంటుంది. పర్యాటకులు అధికంగా రూమ్ టెక్, పెమయాన్గాత్సే, తాషి డింగ్ ప్రదేశాలలోని ఆరామాలు సందర్శిస్తారు. కర్మ కాగ్యు అనే ఆరామం సుమారు 200 సంవత్సరాల ప్రాచీనమైనది. దీనిలో అనేక కుడ్య చిత్రాలు కలవు. ఎంచీ మరియు సంగ కోయలింగ్ ఆరామాలు కూడా దర్సిన్చదగినవే.

Pic Credit: Dhilan Chandramowli

ధ్యానానికి బెస్ట్ ,,,ట్రెక్కింగ్ లో ఫస్ట్ !

జొన్గ్రి శిఖరం పై ట్రెక్కింగ్

సిక్కిం రాష్ట్ర పర్యటన ట్రెక్కింగ్ కు ప్రసిద్ధి. యుక్సం నుండి జాంగ్రీ శిఖరానికి అక్కడ నుండి గోఎచా శిఖరానికి ట్రెక్కింగ్ ప్రసిద్ధి. ఈ ట్రెక్కింగ్ లో అనేక అడవులు, అందమైన రోడెన్ దరాన్ వృక్ష తోటలు కంచన్ జున్గా యొక్క పెద్ద నదులు, నేషనల్ పార్క్ వంటివి మార్గంలో చూడవచ్చు. విదేశీయులకు అదనపు ట్రెక్కింగ్ పర్మిట్ లు కావాలి.

Pic Credit: ks_ bluechip

 

ధ్యానానికి బెస్ట్ ,,,ట్రెక్కింగ్ లో ఫస్ట్ !

తీస్తా నది
సిక్కిం రాష్ట్రానికి తీస్తా నది జీవం కలిగిస్తుంది. ఈ నది రాష్ట్రంలో చాలాభాగం ప్రవహిస్తుంది. ఈ నది సిక్కిం మరియు వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల మధ్య ప్రవహిస్తూ సరిహద్దు గా వుంటుంది. చివరకు బంగ్లాదేశ్ లో ని బ్రహ్మపుత్ర లో కలసిపోతుంది. సిక్కిం లోని తీఅస్తా నదిలో రివర్ రాఫ్టింగ్ ఒక ఆకర్శనీయ క్రీడ. రివర్ రాఫ్టింగ్ లో మఖా - సిర్వాని- బార్దాంగ్ - రోన్గ్పో మార్గం ప్రసిద్ధి చెందినది.

 

ధ్యానానికి బెస్ట్ ,,,ట్రెక్కింగ్ లో ఫస్ట్ !

నాథు లా పాస్
నాథు లా పాస్ మార్గ పర్యటన చైనీస్ బోర్డర్ లో సుమారు మూడు గంటలు ప్రయాణించాలి. ఈ సరిహద్దు బార్బ్ వైర్ ఫెన్సింగ్ తో వుండి సరిహద్దు అవతల చైనీస్ సైనికులు కవాతులు చేయటం మీకు ఎంతో థ్రిల్లింగ్ గా వుంటుంది. విదేశీయులు సోమ గో సరస్సు దీనినే చాంగు సరస్సు అని కూడా అంటారు, వరకూ ప్రయాణించవచ్చు.

Pic Credit: sudeep1106

ధ్యానానికి బెస్ట్ ,,,ట్రెక్కింగ్ లో ఫస్ట్ !

ప్రకృతి మరియు వన్య జంతువులు
సిక్కిం అక్కడ కల వివిధ రకాల అరుదైన పక్షులకు, వన్య జంతువులకు, రకాల పూవులకు ప్రసిద్ధి. పక్షులు సుమారు 450 రకాల వరకూ, సీతాకోక చిలుకలు 400 రకాలూ, వివిధ రకాల రోడెన్ డ్రాన్ వృక్షాలు వుంటాయి. వీటిని మీరు దక్షిణ గాంగ్ టక్ లోని దేవోరాలి ఆర్కిడ్ సాన్క్చుఅరి మరియు యంగో నోసియా ఆల్పైన్ సాన్క్చురి లలో చూడవచ్చు. ఇక్కడ మీరు సిక్కిం రాష్ట్ర జంతువు పండా ని చూడవచ్చు. ఈ పండా అంతరించి పోయే జంతువుల జాబితా లో కలదు. సిక్కిం ఇతర ఆకర్షణల కు ఇక్కడ చూడండి

Pic Credit: Shayon Ghosh

 

 

ధ్యానానికి బెస్ట్ ,,,ట్రెక్కింగ్ లో ఫస్ట్ !

మంచుతో గడ్డ కట్టిన సాంగ్ మో సరస్సు

ధ్యానానికి బెస్ట్ ,,,ట్రెక్కింగ్ లో ఫస్ట్ !

చుట్టూ మంచు పర్వతాల మధ్య అందమైన  సాంగ్ మో సరస్సు

ధ్యానానికి బెస్ట్ ,,,ట్రెక్కింగ్ లో ఫస్ట్ !

సాంగ్ మో సరస్సు మరొక దృశ్యం

ధ్యానానికి బెస్ట్ ,,,ట్రెక్కింగ్ లో ఫస్ట్ !

బౌద్ధ ఆరామ శిఖరం

ధ్యానానికి బెస్ట్ ,,,ట్రెక్కింగ్ లో ఫస్ట్ !

నాదు లా మౌంటెన్ పాస్ చైనా సరిహద్దు

ధ్యానానికి బెస్ట్ ,,,ట్రెక్కింగ్ లో ఫస్ట్ !

తీస్తా నది అందమైన దృశ్యం

ధ్యానానికి బెస్ట్ ,,,ట్రెక్కింగ్ లో ఫస్ట్ !

తీస్తా నది మరొక దృశ్యం

English summary

Top 5 Place to Visit In Sikkim

Surrounded by Nepal, China and Bhutan, Sikkim is regarded as one of the last Himalayan Shangri-las. Due to its remoteness and the fact that permits are required, Sikkim isn't the most accessible area to visit in India. However, it certainly is the most energetic and refreshing.
Please Wait while comments are loading...