అనంతపద్మనాభ స్వామి ఆరవ గది తెరిస్తే మొత్తం ప్రపంచాన్ని ముంచేస్తుందా?
వెతకండి
 
వెతకండి
 

ఇండియా లోని 8 అద్భుత హనీ మూన్ ప్రదేశాలు !

Posted by:
Updated: Wednesday, June 21, 2017, 14:03 [IST]
Share this on your social network:
   Facebook Twitter Google+ Pin it  Comments

LATEST: ఒకే రాత్రిలో స్వయంగా దెయ్యాలే నిర్మించిన దేవాలయమిది.

హనీమూన్ ఎక్కడకు వెళ్లాలా అని ఆలోచిస్తున్నారా ? అయి ఉండవచ్చు. ఎందుకంటే హనీమూన్ ప్రదేశాలు ఇండియా లో అనేకం వున్నాయి. ఎంపిక చేసికొనడం కష్టమే. మీరు మీ భాగస్వామి చెట్టాపట్టాలేసుకొని, ఒక హిల్ స్టేషన్ లేదా, ప్రకృతి పచ్చదనం కల సంక్చురి లు లేదా, మరొక అద్భుత అందాలు కల జై సల్మేర్, జైపూర్ ల లాంటి ఇసుక ప్రాంతాలూ హనీ మూన్ ప్రదేశాలుగా ఎంపిక చేసి తిరిగి రావాలనుకుంటూ వుంటారు. లేదా, మీకు అడ్వెంచర్ ఆమె దానికి వ్యతిరేకం. చివరకు ప్రదేశ ఎంపిక ఒక సమస్యగా వుంటుంది. దీనికి పరిష్కారంగా, మీ అభిమాన ట్రావెల్ సైట్ నేటివ్ ప్లానెట్ మీకు రెడీగా ఇండియా లోని కొన్ని బెస్ట్ హనీమూన్ ప్రదేశాలు అందిస్తోంది. పరిశీలించండి.

బెస్ట్ హనీమూన్ ప్రదేశాలు

బహుశా, ప్రపంచం మొత్తంలో అందరి నోటి వెంటా ఒక అద్భుత హనీ మూన్ ప్రదేశంగా చెప్పబడే ఈ తాజ్ మహల్ నేటికీ దాని ఆకర్షణ కోల్పోలేదు. ప్రపంచంలోని ఏడు వింతలలో ఒకటిగా గుర్తించబడిన తాజ్ మహల్ ఎన్నో అవార్డులు పొందిన తాజ్ మహల్, హనీ మూన్ ప్రదేశంగా తప్పక ఎంపిక చేయడగినదే.

 

 

బెస్ట్ హనీమూన్ ప్రదేశాలు

మంచి సేవలు, లక్సరీ రెండూ కూడా మీకు ఆగ్రా లోని ఒబెరాయ్ అమర విలాస్ హోటల్ లో దొరుకుతాయి. ఈ హోటల్ లో బస చేస్తే, మీరు ప్రేమ చిహ్నం అయిన తాజ్ మహల్ ను మీ ప్రేయసి తో కలసి కాఫీ సిప్ చేస్తూ లేదా ఆమె ఒడిలో వాలి, హోటల్ గది నుండే చూడవచ్చు. వాస్తవానికి ఇంతకు మించిన ఆనందకర హనీమూన్ మరెక్కడ వుంటుంది.

బెస్ట్ హనీమూన్ ప్రదేశాలు

వింధ్య పర్వత శ్రేణులలో కల ఖజురాహో ప్రదేశాలు అందమైన, కామ ప్రేరిత చెక్కడాలు అనేకం కలిగి వున్నాయి. ఇక్కడి టెంపుల్స్ భాషకు మించిన కధలు చెపుతాయి. మీ ప్రేయసికి మీకు గల ఇష్టతను తెలియచేస్తాయి. మీ కొత్త జీవితాల నాందికి ఇంతకు మించిన హనీమూన్ ప్రదేశం లేదు.

బెస్ట్ హనీమూన్ ప్రదేశాలు

మధ్య ప్రదేశ్ టూరిజం శాఖ టూరిస్ట్ లకు ఒక హోటల్ వసతి ఏర్పాటు చేసింది. ఇక్కడ ఎక్కువ సమయం గడిపి ఆనందించేలా చూడండి. ఖజురాహో టెంపుల్స్ అందించే శిల్ప వైభవం మీకు, మీ ప్రియమైనవారికి జీవిత సారాంశం బోధిస్తుంది.

 

 

బెస్ట్ హనీమూన్ ప్రదేశాలు

పూర్తి గా మంచుతో నిండిన ఈ భూమిపై ఇది ఒక స్వర్గం. మీ కొత్త జీవితానికి ఆదర్శమైన ఆరంభం అందిస్తుంది. ఈ ప్రాంతాలుమీకు మీ ప్రేయసికి ప్రకృతి ప్రసాదిన్చినవిగా భావిస్తారు. ప్రపంచానికి దూరంగా ఇంతవరకూ ఎవరికీ తెలియని ఈ ప్రదేశ అందాలలో విహరించి తర్వాతి జీవితం ఆరంభిస్తారు.


 

బెస్ట్ హనీమూన్ ప్రదేశాలు

శ్రీనగర్ లో సినిమా షూటింగ్ లు అధికంగా జరుగుతాయి. మీ హనీమూన్ కూడా ఒక సినిమా షూటింగ్ వాలే సాగిపోయి, జీవితంలో మరువలేని అనుభవాలను ఇస్తుంది. సినిమాలలోని డ్యూయెట్ లను గుర్తుకు తెప్పిస్తూ వుంటుంది.

 

బెస్ట్ హనీమూన్ ప్రదేశాలు

ఇండియా లో ఉదయపూర్ ఒక మంచి రొమాంటిక్ ప్రదేశం. రాచరిక హంగుల పాలస్ లు, సరస్సులు, ఎన్నో కలవు. ఈ నగరం మిమ్ములను గత కాల రాజ విభాగాలకు తీసుకు వెళుతుంది. మీ హనీమూన్ కు రాచరికపు హంగులు అమరాలాంటే, ఉదయపూర్ ఉత్తమ హనీమూన్ ప్రదేశం కాగలదు.

 

 

బెస్ట్ హనీమూన్ ప్రదేశాలు

రాజస్థాన్ లో ఎన్నో రొమాంటిక్ హోటల్స్ కలవు. మీకు పూర్తి ఆనందాలను ఇచ్చేందుకు ఒక్క హోటల్, లీలా పాలస్ చాలు. అన్ని హోటల్స్ కి మించిన శృంగార ఆనందాలు మీకు ఇక్కడ లభిస్తాయి. ఈ హోటల్ ఎన్నో ఆఫర్ లు పాకేజ్ లు మీ ఇద్దరికీ ఇస్తుంది. మీకు ఉదయపూర్ కింగ్, క్వీన్ ల ఆతిధ్యం ఇస్తుంది.

 

బెస్ట్ హనీమూన్ ప్రదేశాలు

హనీమూన్ శృంగార వేడుకలలో నిశ్శబ్దం మించినది లేదు ? గోవా రాత్రి జీవితానికి పేరొందినది. మీ యువ జంటకు ఇది స్వర్గం. గోవా - పోర్చు గీస నృత్యాల ఆనందాలు పొందండి. మీరే నృత్యం చేయండి. ఇక్కడ ఏ బీచ్ లో తిరిగినా మీకు జీవిత కాల అనుభూతులు మిగిలి పోతాయి.

బెస్ట్ హనీమూన్ ప్రదేశాలు

మంచి ఎంపిక అంటే వివంటా బి తాజ్ హాలిడే విలేజ్ . ఈ ప్రదేశం మీకు బీచ్ లో అత్యధిక ప్రైవసీ అందిస్తుంది. మీ ప్రైవేటు సముద్ర భాగాని కియాడ మీకు ఇష్టం వచ్చిన రీతిలో ఆనందించవచ్చు.

 

 

బెస్ట్ హనీమూన్ ప్రదేశాలు

ఈ ప్రదేశం మాత్రం మీరు ఊహించిన విధంగా కధలలోని రాజ కుమారుడి విహారంగా వుండదు. హిల్ స్టేషన్ లు వుండవు, మంచుతో ఆటలు ఇక్కడ వుండవు. ఇక్కడ మీరు చేయవలసినదల్లా, అడవిలో జంట ప్రయాణం. మీ కాలి నడకలో ఒక్క టైగర్ మీకు సమీపంలో వెళితే, ఇరువురూ గుండెలు గుప్పిట పెట్టుకుని ఒక్కటవుతారు. లేదా అడవి ఎలుగు ఒక్క అరుపు అరిచిందంటే, మీకు భాయోత్సవాల వెల్లువ ఒక్కటై దగ్గరవుతారు.

 

 

బెస్ట్ హనీమూన్ ప్రదేశాలు

రణథంబోర్ లోని అటవీ దృశ్యాలు, సన్నివేశాలూ మిమ్మల్ని ఒక్కటి చేస్తాయి. ఇక్కడ కల ఖేం విల్లా లేదా అమన్ ఏ ఖాస్ లు మీకు విలాసంగా వుంటాయి. కొత్తగా వివాహం చేసుకొని ఒక్కటయ్యే సమయంలో మీరు గడిపే హనీమూన్ క్షణాలు ఎంతో విలువైనవి. ప్రకృతి నడకలు, సరస్సు పక్క చాయ్ తాగడం, జంగల్ సఫారి, వంటి వాతితో ప్రకృతికి ఎక్కువసేపు సమీపంగా వుంటారు. మరి అదే అసలైన మీ ఇరువురి రొమాన్స్.

 

 

బెస్ట్ హనీమూన్ ప్రదేశాలు

ఊటీలో కల ఆహ్లాదకర వావరణం చాలు మీ మధ్య వేడి ఎక్కించి ఆనందింప చేసేందుకు. ఊటీ మీకు ఈ క్షణాలలో అవసరమైన మూడ్ మాత్రమే కాదు, మంచి కిక్ ఇచ్చేలా చేస్తుంది. ఈ హిల్ స్టేషన్ లో అనేక గార్డెన్ లు , సరస్సులు కలవు. అలసిపోయే వరకూ తిరిగవచ్చు. నడక, ట్రెక్కింగ్, బోటు విహారం వంటివి మీ వివాహ జీవిత మొదటి దశకు ప్రారంభాలు.

బెస్ట్ హనీమూన్ ప్రదేశాలు

మీరు ఇరువురూ కోరే ఒంటరితనాన్ని ఊటీ అందిస్తుంది. అక్కడ కల టీ గార్డెన్ లు, చుట్టూ కల కొండలు మిమ్ములను మంత్రముగ్ధులను చేసి కలిసి ఆనందించేలా చేస్తాయి. తెలుగు సినిమాలోని జంటలవలె, ఒక డ్యూయెట్ సైతం పడేలా చేస్తాయి.

బెస్ట్ హనీమూన్ ప్రదేశాలు

జల విహారాలకు మించిన ఆనందం ఏముంటుంది. చిన్న అలలపై చల్ల గాలుల సాగి పోయే బోటు అంటే ఎవరికీ ఇష్టం వుండదు. కేరళలోని హౌస్ బోటు లు మీ వివాహ జీవితానికి రొమాంటిక్ టచ్ ఇస్తార్యి. మీరు ఎంపిక చేసే బోటు లకు కేరళ టూరిజం శాఖ అద్భుత సౌకర్యాలు కల్పిస్తుంది.

బెస్ట్ హనీమూన్ ప్రదేశాలు

గాడ్స్ స్వంత దేశం గా పిలువబడే కేరళ యువతీ యువకులకు అంతులేని ఆనందాలు అందిస్తుంది. బోటు ప్రయాణంలో బోటు వసతిలో మీకు ఇష్టమైన ఎన్నో ప్రకృతి రంగులు. నీలి ఆకాశం, నీలి నీరు, చుట్టూ పచ్చదనం మిమ్మల్ని వేరే ప్రపంచంలోకి అడుగు పెట్టిస్తాయి.

 

 

English summary

Top 8 Honeymoon Destinations in India!

The houseboats are romantic for the view that they offer. You'll be enveloped by the loveliest colours of nature!
Please Wait while comments are loading...