Search
  • Follow NativePlanet
Share
» » కర్నాటక కోస్తా తీరంలో ఆహ్లాదకర బీచ్ లు

కర్నాటక కోస్తా తీరంలో ఆహ్లాదకర బీచ్ లు

కర్నాటక రాష్ట్రం దేశంలోనే అత్యుత్తమ పర్యాటక ప్రదేశం గా గుర్తింపు పొందింది. ఇక్కడ అన్ని వర్గాల పర్యాటకులకు అవసరమైన అనేక ఆకర్షణలు కలవు. యాత్రికులకు, చరిత్ర ప్రియులు లేదా విశ్రాంతి సెలవులు కోరే వారు ఎవరైనా సరే ఈ రాష్ట్రం లో ఆనందించాల్సిందే. కర్నాటక లో అనేక స్మారకాలు, రాజ భవనాలు, టెంపుల్స్, నదులు, పర్వత ప్రదేశాలు మొదలైనవి కలవు. ఇవే కాక, కర్నాటక లోని బీచ్ లు సుదూర ప్రాంతాల పర్యాటకులకు సైతం ప్రధాన ఆకర్షనలే. అరేబియా సముద్ర తీరం లో కల ఈ 320 కి. మీ. ల పొడవైన కోస్తా తీరం అద్భుత బీచ్ లను కలిగి వుంది. గోవా, కార్వార్, మంగళూరు, మొదలైన కోస్తా నగరాలు, పట్టణాలు కలిగి వుంది. మీ ప్రియమైన వారితో ఈ బీచ్ ల సూర్య కాంతి స్నానాలు ఆచరించి ఆనందించవచ్చు. ఇక్కడ కల ప్రధాన అయిదు బీచ్ ల గురించి క్లుప్తంగా తెలుసుకోండి.

 కర్నాటక కోస్తా తీరంలో ఆహ్లాదకర బీచ్ లు
కర్నాటక కోస్తా తీరంలో ఆహ్లాదకర బీచ్ లు

కర్నాటక కోస్తా తీరంలో ఆహ్లాదకర బీచ్ లు

మాల్పే బీచ్ మంగళూరు లోని ఉడుపి జిల్లా లో కలదు. ఇది ఒక సహజ రేవు. పర్యాటకులకు ఎన్నో అందమైన ప్రకృతి దృశ్యాలు అందిస్తుంది. మీ సెలవులకు, పిక్నిక్ లకు చక్కని ప్రదేశం. ఈ బీచ్ అగ్ని శిలల పేలుడు తో ఏర్పడి శాస్త్ర వేత్తలకు ఆసక్తి కలిగిస్తోంది. మాల్పే బీచ్ లో ఫిషింగ్, స్విమ్మింగ్, బోటింగ్ చేయవచ్చు.

కర్నాటక కోస్తా తీరంలో ఆహ్లాదకర బీచ్ లు

కర్నాటక కోస్తా తీరంలో ఆహ్లాదకర బీచ్ లు

మరావంతే బీచ్ ఉడుపి సమీపంలో కలదు. పర్యాటకులకు గొప్ప ఆకర్షణ. ఈ బీచ్ లో సూర్యాస్తమయం, ఫిషింగ్ బోటు లో ఐలాండ్ ట్రిప్, వంటివి ప్రత్యేకం. విశ్రాంతి సెలవులకు మరావంతే బీచ్ సరైనది. దీని సమీపం లో మర స్వామి టెంపుల్, వరాహ స్వామి టెంపుల్ కూడా కలవు.

 కర్నాటక కోస్తా తీరంలో ఆహ్లాదకర బీచ్ లు

కర్నాటక కోస్తా తీరంలో ఆహ్లాదకర బీచ్ లు

కౌప్ బీచ్ మరొక ప్రధాన బీచ్. ఇది ఉడుపి జిల్లాలో కలదు. చల్లటి గాలులు, పచ్చటి ప్రదేశాలు కల కౌప్ బీచ్ కుటుంబ సభ్యులు, లేదా స్నేహితులతో కలసి విహరించేందుకు అనువుగా వుంటుంది. ఈ బీచ్ లో వాటర్ స్పోర్ట్స్ ఏర్పాటు కలదు. ఇక్కడ కల లైట్ హౌస్ మరొక ప్రధాన ఆకర్షణ. కౌప్ బీచ్ లో అనేక సినిమా షూటింగ్ లు కూడా జరుగుతూంటాయి

కర్నాటక కోస్తా తీరంలో ఆహ్లాదకర బీచ్ లు

కర్నాటక కోస్తా తీరంలో ఆహ్లాదకర బీచ్ లు

సుదూర గోకర్ణ పట్టణం వద్ద కల ఓం బీచ్ కర్నాటక బీచ్ లలో మరొక ప్రధానమైన బీచ్. ఈ బీచ్ ప్రదేశం హిందువుల పవిత్ర గుర్తు అయిన ‘ ఓం ‘ ఆకారంలో వుండటం చే ఈ బీచ్ కు ఓం బీచ్ అని పేరు వచ్చింది. గోకర్ణ వచ్చే పర్యాటకులు ఈ బీచ్ ని తప్పక చూసి ఆనందిస్తారు. ఇక్కడ కల అద్భుత దృశ్యాలే కాక, ఓం బీచ్ మీకు వాటర్ స్పోర్ట్స్ అంటే, స్క్యింగ్, బనానా రైడ్స్ వంటివి కూడా అందిస్తుంది.

 కర్నాటక కోస్తా తీరంలో ఆహ్లాదకర బీచ్ లు

కర్నాటక కోస్తా తీరంలో ఆహ్లాదకర బీచ్ లు

మురుడేశ్వర్ బీచ్ కర్ణాటక లోని ఉత్తర కర్ణాటక జిల్లాలో కలదు. విశ్రాంతి సెలవులు కోరే వారు ఈ బీచ్ ని పిక్నిక్ మరియు పర్యాటక ప్రదేశంగా ప్లాన్ చేయవచ్చు. ఇక్కడ అతి పెద్దదైన శివుడి విగ్రహం కలదు. బంగారు వన్నె ఇసుక, మెరిసి పోయే సముద్రపు నీరు మురుడేశ్వర్ బీచ్ ని ఒక ప్రత్యేక బీచ్ గా చేసాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X