Search
  • Follow NativePlanet
Share
» »ఇండియా లో అయిదు ప్రసిద్ధ బౌద్ద ఆరామాలు !

ఇండియా లో అయిదు ప్రసిద్ధ బౌద్ద ఆరామాలు !

భారత దేశ చరిత్రలో బౌద్ధ మతం కొంత కాలం ఎంతో ఉన్నతంగానూ, మరి కొంత కాలం చాలా తక్కువ స్థాయి లోను కొనసాగింది. బుద్ధుడి కాలం నుండి నేటి లామాల కాలం వరకు బౌద్ధ మతం భారత దేశీయులకు ఒక ప్రధాన మతంగానే వుంది. బుద్ధుడి బోధనలు ప్రపంచ వ్యాప్తంగా అంగీకరించబడి ఆచరిన్చబడుతున్నాయి. మనదేశ గొప్ప నేతలైన, ఇందిరా గాంధీ లేదా డా. బి ఆర్ అంబేద్కర్ వంటి వారు కూడా ఈ మత ఔన్నత్యం గ్రహించి బుద్ధుడిని అనుసరించారు.

బౌద్ధమతం, ఇండియా లో పుట్టినప్పటికీ, దాని విధానాలు సరళీకృతం కనుక గ్లోబల్ గా వ్యాప్తి చెందినది. నేడు బౌద్ధమతం అనేక మంది యువతకు ప్రపంచవ్యాప్తంగా ఒక మార్గదర్శి గా వుంది. ప్రపంచానికి ఇండియా ఒక ఆధ్యాత్మిక ప్రదేశం అయ్యింది. బౌద్ధ ఆరామాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు మూలం అయ్యాయి. బౌద్ధులు భారత దేశంలో ఉత్తరం నుండి దక్షిణం లోని చివరి ప్రదేశం వరకు తమ ఆరామాలు అనేక చోట్ల నిర్మించారు. ఇంత ఘనమైన సిద్ధాంతాలు కల ప్రధాన బౌద్ధ ఆరామాలు ఇండియాలో ఎక్కడ కలవో పరిశీలిద్దాం.
అయిదు ప్రధాన బౌద్ధ ఆరామాలు !

అయిదు ప్రధాన బౌద్ధ ఆరామాలు !

అయిదు ప్రధాన బౌద్ధ ఆరామాలు !

ప్రసిద్ధి చెందిన ఈ బౌద్ధ ఆరామం హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాల లో కలదు. నామ్గ్యాల్ ఆరామం సుగ్లఖాంగ్ కాంప్లెక్స్ లో ఒక భాగం గా వుంది. పూజ్యుడైన 14 వ దలై లామా కు నివాసం గా వుంటుంది. ఈ ప్రదేశాన్ని ఇండియా లో టిబెట్ బౌద్ధ మత ప్రధాన కార్యాలయం అని కూడా చెపుతారు. ఈ ప్రదేశ సందర్శనలో ఇక్కడ దొరికే అతి రుచికర బటర్ చాయ్ తాగటం మరువకండి.


Lisa Tully

అయిదు ప్రధాన బౌద్ధ ఆరామాలు !

అయిదు ప్రధాన బౌద్ధ ఆరామాలు !

లెహ్ - మనాలి హై వే లో హేమిస్ గ్రామం లో సుమారు 11 వ శతాబ్దం లేదా మరింత ప్రాచీనమైన బౌద్ధ ఆరామం కలదు. ఇది లడఖ్ ప్రాంతంలో అతి పెద్దదైనది. ఈ బౌద్ధ ఆరామాన్ని లడఖ్ ప్రాంతంలో ప్రజలు చేసుకునే లడఖ్ ఫెస్టివల్ లేదా హేమీస్ ఫెస్టివల్ సందర్భం లో చూడండి. ప్రసిద్ధి గాంచిన ఈ పండుగను ఇక్కడి ప్రజలు ముఖాలకు ముసుగులు ధరించి డాన్స్ లు చేస్తారు.
madpai

అయిదు ప్రధాన బౌద్ధ ఆరామాలు !

అయిదు ప్రధాన బౌద్ధ ఆరామాలు !

కి, కొమిక్, తాబో, దానకర్, కుంగ్రి అనే పేర్లతో స్పితి లో అయిదు బౌద్ధ ఆరామాలు కలవు. ఈ ఆరామాలు ఎంతో పురాతన సంప్రదాయాలు కలిగి వున్నాయి. మట్టి పర్వతాలపై హుందా గా నిలబడిన ఈ ఆరామాలు మీలోని అధ్యాత్మికతలను వెలికి తీస్తాయి.

Ajith U

అయిదు ప్రధాన బౌద్ధ ఆరామాలు !

అయిదు ప్రధాన బౌద్ధ ఆరామాలు !

గల గల పారే ప్రవాహాలు, మంచుతో నిండిన పర్వతం సమీపంలో కల ఒక నది ఒడ్డున పచ్చటి పర్వతాలు నేపధ్యంగా కల పరిసరాలలో రాంటెక్ ఆరామం కలదు. సిక్కిం లోని అన్ని ఆరామాల కంటే కూడా రాంటెక్ ఆరామం పెద్దది. సిక్కిం లో 200 వరకూ బౌద్ధ ఆరామాలు కలవు. రాష్ట్రం అంతా బౌద్ధ మత సంస్కృతి, బౌద్ధ మత ఆచరనలే.


dhillan chandramowli

అయిదు ప్రధాన బౌద్ధ ఆరామాలు !

అయిదు ప్రధాన బౌద్ధ ఆరామాలు !

నాం ద్రోల్లింగ్ మొనాస్టరీ మరియు ఒక గోల్డెన్ టెంపుల్ దక్షిణ భారత దేశంలోని కూర్గ్ లో కలవు. టిబెట్ లో బహిష్క రించబడిన ఈ ప్రజలు కుశాల్ నగర్ సమీపంలోని బైలకుప్పే లో స్థావరాలు ఏర్పరచుకొని జీవిస్తున్నారు. ఈప్రదేశం చూసే వారికి టిబెట్ దేశం ఇక్కడకు దిగి వచ్చిందా అనిపించేలా వుంటుంది.

Premnath Thirumalaisamy

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X