Search
  • Follow NativePlanet
Share
» »ఇండియాలో అదృశ్యశక్తుల ఆగడాలు !!

ఇండియాలో అదృశ్యశక్తుల ఆగడాలు !!

దయ్యాలు వుండే ప్రదేశాలను మీరు ఎపుడైనా సందర్శించారా? ఆ ప్రదేశంలో మీరు తినేటపుడు, తాగేటపుడు, నడిచేటపుడు, లేదా నిద్రించేటపుడు, మీ చుట్టూ గల ప్రేతాత్మల ఉనికిని గమనించారా ? బహుశా...ఇటువంటి దయ్యాలూ, ప్రేతాత్మల కధలు మీరు నమ్మక పోవచ్చు. కాని కొన్ని ప్రదేశాలలో ఇప్పటికీ ఎన్నో మిస్టరీ లు జరుగుతున్నాయి. ఇండియాలో గల అటువంటి కొన్ని ప్రదేశాలను పరిశీలిద్దాం. దీనిని చదవి, మీ తదుపరి పర్యటనా ప్రణాళికలో ఈ ప్రదేశాలను చేర్చండి. మీ ధైర్య సాహసాలకు పరీక్ష పెట్టండి.

సరిస్కా లో భాన్ ఘర్ ఫోర్ట్

ఇండియా లో భాన్ ఘర్ కోట ఈ రకమైన అదృశ్య శక్తుల వేటలో ప్రసిద్ధి గాంచింది. సరిస్కా రాజస్థాన్లోని ఆళ్వార్ జిల్లాలో కలదు. ఈ ప్రదేశానికి కొద్ది దూరంలో భారత ప్రభుత్వ అర్కేయోలాజికల్ సర్వేయ్ అఫ్ ఇండియా ఒక బోర్డు కూడా పెట్టింది.

"సూర్యాస్తమయం తర్వాత, సూర్యోదయానికి ముందు ఈ ప్రదేశంలోనికి ప్రవేశం నిషేధించబడినది. ఆదేశాలు పాటించకపోతే, చట్టపర చర్యలు తీసుకోనబడును " అని ఆ బోర్డు పై వ్రాసి వుంటుంది.

ఈ పట్టణం ఒక ప్రసిద్ధ టూరిస్ట్ ఆకర్షణ. కాని నేటికీ నిర్మానుష్యమైణ ఒక మిస్టరీ. దీనిపై రెండు కధలు చెపుతారు. వాటిలో ఒకటి, ఈ పట్టణంలో టెంపుల్స్ తప్ప ప్రజలు ఉండరని ఒక గురువు శాపం ఇచ్చాడని చెపుతారు. రెండవ కధనం మేరకు ఒక తాంత్రికుడు, భాన్ ఘర్ రాజ కుమార్తె తో వివాహంలో పడ్డాడని, కాని ఆమె అతని ప్రేమను తిరస్కరించడంతో ఆ మాంత్రికుడు ఆ ప్రదేశం అంతా స్మశానంగా మారాలని శాపం ఇచ్చాడని చెపుతారు.

గుజరాత్ లోని దుమాస్ బీచ్

గుజరాత్ లోని దుమాస్ బీచ్ ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం.ఇక్కడి ప్రజలు బీచ్ ఒడ్డున శవాలను దగ్ధం చేస్తారని చెపుతారు. అయితే, ఇది తెలియని టూరిస్ట్ లు అక్కడ తిరుగుతారు. కాని అక్కడ కాల్చిన శవాల్ ఆత్మలు వారి చెవులలో గుస గుసలు చెప్పటం, వింత ధ్వనులు చేయడం వంటివి చేస్తాయని చెపుతారు. రాత్రులందు బీచ్ ఒడ్డుకు వెళ్ళిన వారు తిరిగి రారని కూడా స్థానికులు చెపుతారు. ఈ బీచ్ లోని ఇసుక నల్లగా ఉండటంతో ఇక దయ్యాలు వున్నాయంటూ అక్కడకు వెళ్ళే వారి పరిస్థితి భయానకంగా వుంటుంది.

పూనాలోని శనివార్ వాడా

పూనా లోని ఈ కోట అక్కడ కల అందమైన శిల్పాలకు, మొగల్ శిల్ప సంపాదకు ప్రసిద్ధి. కాని స్థానికులు ఇది ఒక దెయ్యాల కోట అని నమ్ముతారు. ఇక్కడ నారాయణ రావు అనే ఒక 13 సంవత్సరాల పీష్వా వారసుడు హత్య గావించబడ్డాడు.

హంతకులు అతనిని తరుముతూ వుంటే, ఆ చిన్న బాలుడు కోట అంతా పరుగెడుతూ "కాకా , మాలా వచ్వా " అని కేకలు పెట్టాడట. అంటే "అంకుల్, నన్ను రక్షించండి" అని అర్ధం చెపుతారు. నేటికి రాత్రులందు ఇక్కడ ఆ కేకలు కోటలో వినపదతాయని స్థానికులు చెపుతారు.

పిల్లవాడు అతి క్రూరంగా హత్యగావించ బడ్డాడు. అతని ఆత్మా నేటికీ ఆకోతలో వుందని చెపుతారు. ప్రత్యేకించి ప్రతి పౌర్ణమి నాడు అర్ధ రాత్రిలో ఆ కేకలు వినపదతాయని చెపుతారు.

హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీ

హైదరాబాద్ లో రామోజీ ఫిలిం సిటీ ఒక గొప్ప పర్యాటక ఆకర్షణ. కాని దీనిని కూడా ప్రేతాత్మల నిలయం అంటారు. విశాలంగా నిర్మించబడిన ఈ గొప్ప ఆకర్షణ ఒకప్పుడు నిజాం సుల్తానుల యుద్ధ భూమి. అక్కడ మరణించిన సైనికుల ఆర్త నాదాలు నేటికీ అక్కడ ప్రతిధ్వనిస్తూ ఉంటాయని చెపుతారు.

అదృశ్య శక్తుల ఆగడాలు

ఇక్కడి హోటల్స్ లో ఎన్నో వింత సంఘటనలు జరుగుతూ వుంటాయి. షూటింగ్ లు జరిగేటపుడు మిస్టరీ గా వాటి అంతట అవే లైట్ లు ఆరిపోతాయి. అక్కడ ఉన్నవారిని ఎవరో తోసినట్లు అనిపిస్తుందని కొందరు చెపుతారు.

మరి ఈ గొప్ప పర్యాటక ఆకర్షణల వెనుక కల దెయ్యాల గాధలు తెలిసిన తర్వాత కూడా ఈ ప్రదేశాలు సందర్సిస్తారా ? లేక ఆ ఏముందిలే ...అంటూ ఒక నవ్వు నవ్వి కొట్టి పారేస్తారా...?

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X