Search
  • Follow NativePlanet
Share
» »ఇండియా లో వింత ప్రదేశాలు !

ఇండియా లో వింత ప్రదేశాలు !

లక్ష్మీ నృసింహ క్షేత్రంలో రక్తం ప్రవహించిన నది ఎక్కడో తెలుసా?లక్ష్మీ నృసింహ క్షేత్రంలో రక్తం ప్రవహించిన నది ఎక్కడో తెలుసా?

ఇండియా లో సంస్కృతి, సాంప్రదాయం, వారసత్వం పుష్కలంగా లభిస్తుంది. అలాగీ మన దేశంలో నమ్మ శక్యం కాని ఎన్నో మూఢ నమ్మకాలు కూడా కలవు. ఈ మూఢ నమ్మకాలు ఎంతో కాలంగా కోన సాగుతున్నాయి. శాస్త్రీయ రుజువులు లేనప్పటికీ వీటిని కన్నులారా చూసే నమ్మవలసినదే. గతంలో కూడా మేము ఇటువంటి మూఢ నమ్మకాలపై కొంత సమాచారం ఇవ్వటం జరిగింది. ఇపుడు మరికొన్ని వింత అయిన, రుజువు లేని అయినా నమ్మి తీరాల్సిన కొన్ని అంశాలు కల ప్రదేశాలు చూడండి. మీ పర్యటనలో ఈ అంశాలను గమనించి నిజా నిజాలు తెలుసుకొనేందుకు ప్రయత్నించండి. వున్నది వున్నట్లు మీ ముందు ఉంచుతున్నాము. అవి వాస్తవాలో లేక అభూత కల్పనలో నిర్ణయం చేసుకోండి.

అంతు పట్టని రహస్యాలు !

అంతు పట్టని రహస్యాలు !

జతింగా అనే ఈ ప్రదేశంలో పక్షులు ఆత్మా హత్యలు చేసుకుంటాయి. ఖచ్చితంగా జరుగుతోంది. అదెలా ? చూడండి. వర్ష రుతువులు వచ్చాయంటే చాలు ఈ పక్షులు రాత్రులలో పొగ మంచు వేళలలో ఎగురుకుంటూ వచ్చేస్తాయి. చెట్ల పై కూర్చుని వున్నా పక్షులు అత్యధిక వెలుగు ప్రసరించే లైట్ ల వేలుగులలోకి ఎగిరి అంతు చిక్కని రీతిలో కిందపడి మరణిస్తాయి. స్థానికులు వీటిని ఆపటానికి ప్రయత్నించారు. కాని ఫలితం సున్నా ! ఏమిటీ విచిత్రం ?

అంతు పట్టని రహస్యాలు !

అంతు పట్టని రహస్యాలు !

యాగంటి ప్రదేశం, ఆంధ్ర ప్రదేశ్ లోని కర్నూల్ జిల్లా లో కలదు. ఇక్కడ కల నంది విగ్రహం ఒకటి నేటికీ పెరుగుతూ వుంటుంది. (అయితే, ఇటువంటి విగ్రహమే, బెంగుళూరు లో కూడా కలదు. కాని ఇది పెరగటం బలవంతంగా ఆగింది).ఈ నంది విగ్రహం జీవం పోసుకున్న రోజున జీవం పోసుకుని పరుగెత్తటం మొదలు పెట్టిన రోజున ప్రళయం సంభవిస్తుందని, కాలం ఆగి పోతుందని చెపుతారు. మరి దాని పరుగు కంటే ముందే మనం పరుగు పెట్టి ప్రళయం నుండి తప్పించుకుంటే మంచిదేమో.

అంతు పట్టని రహస్యాలు !

అంతు పట్టని రహస్యాలు !

ఈ వేలాడే స్థంభం క్రి. శ. 16 వ శతాబ్దం నాటి శిల్పం ఇది అని చెపుతారు. ఈ వేలాడే స్థంభం ఆనాటి శిల్పకారుల నైపుణ్యం అయితే, నేడు 21 వ శతాబ్దంలో అది ఒక మిస్టరీ అయ్యింది. ఈ వేలాడే స్థంభం, ఆంధ్ర ప్రదేశ్ లోని లేపాక్షి లో కల వీర భాద్రేస్వరుడి టెంపుల్ లో వుంది. ఇది రూఫ్ నుండి వేలాడుతుంది. భూమిపై అతక కుండ వుంటుంది. ఇంత పెద్ద స్థంభం వేలాడటం ఎలా సాధ్యం ? ఏమిటీ వింత ? పరిశీలించండి.

అంతు పట్టని రహస్యాలు !

అంతు పట్టని రహస్యాలు !

పేరు చెపితేనే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. కాని ఇది నిజం. ఈ సరస్సు ఉత్తరాఖండ్ లోని రూప కుండ్ ప్రదేశంలో కలదు. ఈ మానవ ఆస్థి పంజరాలు సైంటిఫిక్ గానే కాక పురాణ పరంగా కూడా వివరణ కలిగి వున్నాయి. ఈ సరస్సు, సముద్ర మట్టానికి అధిక ఎత్తులో కలదు. కయినా సరే, ధైర్యం కలవారు దాని వద్దకు వెళతారు. కొంతమంది ఈ సరస్సు క్రి.శ 850 లేదా క్రి.శ900 నాటిదని చెపుతారు. అయితే, ఇక్కడ అస్థిపంజరాలు ఎలా వచ్చాయనే మిస్టరీ నేటికీ అంతు పట్టనిదిగా వుంటుంది.

అంతు పట్టని రహస్యాలు !

అంతు పట్టని రహస్యాలు !

బహుశా, మనం ఇద్దరం...మనకు ఇద్దరు అనే ఫ్యామిలీ ప్లానింగ్ నినాదం మీరు ఒకప్పుడు వినే వుంటారు. మరి ఈ విచిత్రం చూడండి. కేరళ రాష్ట్రంలో కల కోడినిహి అనే విలేజ్ లో గ్రామస్తులు ఈ విషయాన్ని మరి కొంచెం సీరియస్ గా తీసుకున్నట్లు కనపడుతోంది. ఇక్కడ జంటలకు పిల్లలు ఎపుడూ కవలలుగానే పుడతారు. ఒన్ షాట్ టు బర్డ్స్ ...అంటే ఇదేనేమో మరి. ఇదే విధంగా జరుగుతోందట నైజీరియా లోని ఇగ్బో - ఆరా ప్రదేశంలో కూడాను. అయితే కోడినిహి గ్రామస్తుల మరియు ఇగ్బో - ఆరా ప్రజల మధ్య ఏ రకమైన తిండి అలవాట్లు కామన్ గా లేవని కూడా తెలుసుకున్నారట.

అంతు పట్టని రహస్యాలు !

అంతు పట్టని రహస్యాలు !

ద్యూమాస్ బీచ్ అరేబియా సముద్రానిది. ఇది గుజరాత్ తీరంలో ఒక ప్రసిద్ధ బీచ్. ఇక్కడ కొంతమంది వారి రాత్రి శికారులలో మిస్ అయ్యారని, లేదా గాలిలోకి కలసిపోయారని చెపుతారు. ఈ బీచ్ లో మానవాతీత చర్యలు అనేకం జరుగుతాయని కూడా స్థానికుల కధనంగా వుంటుంది. మరి ఎంతో కాలంగా ఈ ప్రదేశంలో వినపడుతున్న ఈ నిజాన్ని లేదా అభూత కల్పనను ఎవరు చేదించ గలరు.

Photo courtesy : Marwada

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X