Search
  • Follow NativePlanet
Share
» »షోఘి - సహజ సౌందర్యానికి ప్రసిద్ధి !

షోఘి - సహజ సౌందర్యానికి ప్రసిద్ధి !

By Mohammad

షోఘి .. హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లా జిల్లా కు చెందిన పట్టణం. పర్వత కేంద్రాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందిన ఈ పట్టణం దాని సహజ సౌందర్యానికి, అక్కడ తయారయ్యే జ్యూస్ లకి, సిరప్పులకి పేరుగాంచినది. సముద్ర మట్టానికి 5700 అడుగుల ఎత్తులో చుట్టూ ఓక్, గన్నేరు చెట్లతో నిండి ఉంటుంది.

షోఘి చరిత్ర ఆధునిక భారతదేశం కాలం నాటిది. క్రీ.శ. 1815 అనుకుంటా ! అప్పుడు ఈ ప్రాంతం, దీనితో పాటు సిమ్లా ప్రాంతం గుర్ఖాల పాలనలో ఉండేది. తర్వాత బ్రిటీష్ వారు, అక్కడి స్థానిక రాజులతో కలసి బలవంతంగా ఒక ఒడంబడిక కుదుర్చుకుంటారు. దీనినే 'సంజౌలీ ఒడంబడిక' అంటారు. దాని ప్రకారం ఈ ప్రాంతం సహా, సిమ్లా అసలైన పాలకుల చేతికి (పాటియాలా మహారాజు) చేరింది. షోఘి ప్రధాన సందర్శనీయ స్థలాలను ఒకసారి పరిశీలిస్తే ..

ఇది కూడా చదవండి : నరహన్ : మంచుచే కప్పబడ్డ భూమి !

తారాదేవి ఆలయం

ప్రఖ్యాత తారాదేవి ఆలయం, షోఘి పట్టణానికి 11 కి. మి. ల దూరంలో కలదు. తారా అనబడే పర్వతం మీద ఉన్నది కనుక ఈ ఆలయానికి తారా దేవి ఆలయం అన్న పేరొచ్చింది . పూర్వం బెంగాల్ లోని రాజవంశం ఇక్కడి దేవతామూర్తిని తీసుకోచ్చారాని విశ్వశిస్తారు. శరన్నవరాత్రుల పండగ ఆలయ ప్రాంగణంలో ఘనంగా నిర్వహిస్తారు.

తారాదేవి ఆలయం

తారాదేవి ఆలయం

చిత్ర కృప : WCities

కాళీ ఆలయం

సముద్ర మట్టానికి 5000 ఆడుగుల ఎత్తున ఉన్న కాళీ దేవాలయం పురాతనమైనది. ఇందులో దుర్గా దేవి శక్తి స్వరూపిణులైన కాళీ మాత, శ్యామల, చండీదేవి విగ్రహాలు ఉంటాయి. పండుగల సమయాల్లో ఆలయ దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు.

హనుమాన్ ఆలయం

షోఘి లోని పురాతన ధార్మిక కేంద్రాలలో ఒకటి హనుమాన్ ఆలయం. ఈ ఆలయం లోపల హిందూ పురాణాలను సూచించే కూడ్య చిత్రాలు అనేకం ఉన్నాయి. గుడిలో ఆంజనేయస్వామి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

హనుమాన్ ఆలయం

హనుమాన్ ఆలయం

చిత్ర కృప : crystalandclinton

రవాణా సౌకర్యాలు

సమీప విమానాశ్రయం

సిమ్లా విమానాశ్రయం (21 కి.మీ) షోఘి కి సమీప విమానాశ్రయం. న్యూఢిల్లీ, డెహ్రాడూన్ నగరాల నుండి ఈ విమానాశ్రయం అంతర్గతంగా చక్కగా అనుసంధానించబడింది.

సమీప రైల్వే స్టేషన్

కల్క (7 కి.మీ), షోఘి కి సమీపాన ఉన్న రైల్వే స్టేషన్. సిమ్లా రైల్వే స్టేషన్ కూడా సమీపాన ఉన్న మరో రైల్వే స్టేషన్.

రోడ్డు / బస్సు మార్గం

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులు షోఘి కి రాష్ట్రం నలుమూల నుండి వస్తుంటాయి. ఢిల్లీ నుండి ప్రతి రోజూ సిమ్లా వరకు డీలక్స్, లగ్జరీ బస్సులు రాత్రి పూట నడుస్తుంటాయి. సిమ్లా నుండి లోకల్ బస్సులలో షోఘి సులభంగా చేరుకోవచ్చు.

షోఘి రైలు మార్గం

షోఘి రైలు మార్గం

చిత్ర కృప : Yves Locomot

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X